Saturday, February 28, 2026

శ్రీ విశ్వావసు 2026 శ్రీత్యాగరాయ ఆరాధనోత్సవాల్లో భాగంగా, భానువాసర మాఘ శుద్ధ సప్తమి జనవరి-25 నాడు హైటెక్ సిటి శిల్పకళారామంలో విజ్ఞ్యులచే నిర్వహింపబడిన శ్రీత్యాగరాయ పంచరత్నగోష్టిగానవైభవంలో ఎందరో కర్ణాటక శాస్త్రీయసంగీతవిద్యార్ధుల్లో ఒకరిగా పాల్గొని, సద్గురు శ్రీత్యాగరాయులవారిని సేవించుకున్న సుమధుర ఘట్ట స్మృతిమంజరులను ఇతర విజ్ఞ్యులతో ఈశ్వరానుగ్రహంగా ఇలా పంచుకుంటున్నాను...🙂💐

శ్రీ విశ్వావసు 2026 శ్రీత్యాగరాయ ఆరాధనోత్సవాల్లో భాగంగా, భానువాసర మాఘ శుద్ధ సప్తమి జనవరి-25 నాడు హైటెక్ సిటి శిల్పకళారామంలో విజ్ఞ్యులచే నిర్వహింపబడిన శ్రీత్యాగరాయ పంచరత్నగోష్టిగానవైభవంలో ఎందరో కర్ణాటక శాస్త్రీయసంగీతవిద్యార్ధుల్లో ఒకరిగా పాల్గొని, సద్గురు శ్రీత్యాగరాయులవారిని సేవించుకున్న సుమధుర ఘట్ట స్మృతిమంజరులను ఇతర విజ్ఞ్యులతో ఈశ్వరానుగ్రహంగా ఇలా పంచుకుంటున్నాను...🙂💐

అధమం
మధ్యమం
ఉన్నతం

అనే అనివార్యమైన స్థాయిబేధం అనేది ఈ లోకంలో అన్ని రకాల ఆహారాలకు, ఆహార్యాలకు, వస్తువులకు, వ్యక్తిత్వాలకు, తత్వాలకు, విలాసవిద్యలకు (హాబీస్), వివేకవిజ్ఞ్యతలకు, వ్యాపకాలకు, పరిశ్రమకు, పదవులకు, పదములకు, ఇతరత్రా అన్నిటికీ కూడా వర్తించే లౌకిక అంశం...

హె రోడ్డుమీద ఉన్న ఆ బండిపై ఓ ప్లేట్ ఇడ్లి తిందామా....(అధమ స్థాయి)
హె ఉడిపి రెస్టారంట్లో ఓ ప్లేట్ ఇడ్లి తిందామా....
(మధ్యమ స్థాయి)
హె ఒక 5 స్టార్ హొటెల్ లో ఓ ప్లేట్ ఇడ్లి తిందామా....
(ఉన్నత స్థాయి)

హె ఆ 120 రూపాయల టీ షర్ట్ కొందామా...
(అధమ స్థాయి)
హె ఆ 240 రూపాయల టీ షర్ట్ కొందామా...
(మధ్యమ స్థాయి)
హె ఆ 360 రూపాయల టీ షర్ట్ కొందామా...
(ఉన్నత స్థాయి)

హె 20 రూపాయల చిన్న సైజ్ కొబ్బరికాయ్ కొందామా...
(అధమ స్థాయి)
హె 30 రూపాయల మీడియం సైజ్ కొబ్బరికాయ్ కొందామా...
(మధ్యమ స్థాయి)
హె 40 రూపాయల బిగ్ సైజ్ కొబ్బరికాయ్ కొందామా...
(ఉన్నత స్థాయి)

అనగా,
ఆయా ప్రదేశాల్లో, ఆయా విధివిధానాల్లో, ఆయా నాణ్యతలో,
ఆయా రుచిలో, ఆయా ఆస్వాదనలో, ఆయా లభ్యతా వైవిధ్యంలో, ఉండే స్థాయిని బట్టి భేదాన్ని అలా మూడువిధాలుగా నిర్వచించడమే కాని,
ఒకటిని / ఒకరిని తక్కువ, ఇంకొకటిని / ఇంకొకరిని ఎక్కువ చేసి చెప్పడం అని కాదు అర్ధం...
అని విజ్ఞ్యులకు ఎరుకే....

ఆనాడు శ్రీరామకృష్ణపరమహంస గారిగా ఎందరో స్వామి వివేకానందుల వంటి ఉన్నతస్థాయి శిష్యులకు వేదవేదాంత అధ్యాత్మసారాన్ని ఎంతో సరళమైన రీతిలో అరటిపండి ఒలిచి అరచేతిలో పెట్టిన విధంగా అనుగ్రహించిన సద్గురువులే....,
ఈనాడు శ్రీచాగంటి గారిగా అవతరించి అదే అనుగ్రహాన్ని అదే రీతిలో తెలుగునాట వర్షించడం...

ఆనాడు శ్రీశారదామాయి గా ఎందరో స్వామి వివేకానందుల వంటి ఉన్నతస్థాయి శిష్యులకు కూడా అన్నపూర్ణమ్మ గా వర్ధిల్లిన పూజ్య శ్రీగురుపత్ని గారే...,
ఈనాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి గారిగా తెలుగునాట వర్ధిల్లడం...
అనే ఉన్నతస్థాయి అధ్యాత్మ అంశం కొందరు విజ్ఞ్యులకు ఎరుకలో ఉన్న సత్యమే....

కావాలంటే ఈ సత్యాన్ని "యూనివర్సల్ టెంపుల్ ఆఫ్ లర్నింగ్", శ్రీరామకృష్ణమఠం, (లోయర్ టాంక్ బండ్) ప్రార్ధనా మందిరంలో, మరియు అక్కడ కొలువై ఉన్న పేద్ద నాగమల్లి వృక్షాలు కొలువైన  ఉద్యానవనంలో, ధ్యానసిద్ధి గల విజ్ఞ్యులు దర్శించి తెలుసుకోండి....

అటువంటి ఉన్నతస్థాయి బ్రహ్మవేత్తలు, బ్రహ్మవిద్యాపారంగతులు, పరమాత్మతత్త్వ విశ్లేషకులు, గా వర్ధిల్లే శ్రీ చాగంటి సద్గురువులు ఎన్నెన్నో ఉన్నతస్థాయి ప్రవచనాలను విజ్ఞ్యులకు అనుగ్రహించడం ఎల్లరికీ ఎరుకే...

వాటిలో ఒకానొక ప్రవచనంలో,
శ్రీశైల ఆలయ అనుబంధంగా అలరారే సామవేద ఘనాపాటీల వైభవాన్ని ఎంతో విశేషంగా ప్రస్తుతించిన శ్రీచాగంటిసద్గురువాణి కొందరు విజ్ఞ్యులకైనా గుర్తుండే ఉంటుంది....

"వేదానాం సామవేదోస్మి" అని పరమాత్మ వచనం...
అట్టి సామవేదానికి ఉపవేదంగా అలరారే గంధర్వశాస్త్రం
యొక్క సారమైన,
శ్రీ హంసారూఢ సరస్వతీదేవి అలంకృత కచ్ఛపి గమకిత స్వరరాశి వైభవసారమైన,
"స్వరార్ణవం" అనే సంగీత విద్యను, సాక్షాత్తు త్రిలోకసంచారులైన శ్రీనారదమహర్షి వారి నుండి అందుకొని తరించిన నిరుపమాన మహనీయులు, అనన్యసామాన్యమైన కర్ణాటకశాస్త్రీయసంగీత విద్యారాధనా సంప్రదాయానికి ఆద్యులు, తెలుంగుసీమలో మకుటం లేని మహారాజులుగా వర్ధిల్లే చిరస్మరణీయ రాజత్రయంలో ఒకరిగా,
[
శ్రీపోతరాజు గారు (శ్రీ బమ్మెర పోతనామాత్యులు గారు),
శ్రీత్యాగరాజు గారు (శ్రీ కాకర్ల త్యాగబ్రహ్మం గారు),
శ్రీగోపరాజు గారు (శ్రీ కంచర్ల గోపన్న / భద్రాచల శ్రీరామదాసు గారు)
]

వినుతికెక్కిన అమరసంగీతసారస్వతప్రదాయక వరిష్ట వాగ్గేయకార కోవిదులు సద్గురు శ్రీ త్యాగరాయుల వారు....

HTAMF ఉత్సవ నిర్వహణ గురించిన క్రింది మొన్న రాసిన ఇంగ్లీష్ పోస్ట్ లో వివరింపబడిన సద్యోజాతాది పంచవక్త్రజమై వర్ధిల్లే [ 5 + 2 = 7 ] స్వరాలకు, పరమేశ్వర పంచాస్య వైభవానికి గల సామ్యమును వివరించాను కద....
ఇప్పుడు ఇవే సప్తస్వరాలను మనం రివర్స్ ఆర్డర్ లో మన సూక్ష్మ శరీరంలో పరివ్యాప్తమై వర్ధిల్లే షట్చక్రాలు మరియు సహస్రార చక్రం కూడా కలుపుకుంటే, 7 చక్రాలకు 7 సప్తస్వరస్థానాల సామ్యమును ఆపాదించి కొంత తత్త్వాన్ని దర్శించగలిగితే....

స : షడ్జమం : జీవాత్మ స్వరం
రి : రిషభం : తత్పురుష వదన జనిత స్వరం
గ : గాంధారం : అఘోర వదన జనిత స్వరం
మ : మధ్యమం : వామదేవ వదన జనిత స్వరం
ప : పంచమం : పరమాత్మ స్వరం
ద : దైవతం : సద్యోజాత వదన జనిత స్వరం
ని : నిషాదం : ఈశాన వదన జనిత స్వరం

విజ్ఞ్యుల వచనానుసారంగా,
షట్చక్రాలు అంటే శరీరంలోని ఆరు ప్రధాన శక్తి కేంద్రాలు.
వాటి పేర్లు, స్థానాలు మరియు అధిదేవతలు.

షట్చక్రాలు - పేర్లు, స్థానాలు, దేవతలు :

1. మూలాధార (భూమి : గణపతి), 
2. స్వాధిష్ఠాన (జలం, బ్రహ్మ-సరస్వతి), 
3. మణిపూరక (అగ్ని, విష్ణు-లక్ష్మి), 
4. అనాహత (వాయువు, శివ-పార్వతి), 
5. విశుద్ధి (ఆకాశం, అమృతేశ్వరుడు)
6. ఆజ్ఞా (మనస్సు, శివ-శక్తి)
మరియు 
7. సహస్రార (ప్రజ్ఞ, శివ-శక్తి/పరబ్రహ్మం). 

1. మూలాధార చక్రం.
స్థానం: వెన్నెముక దిగువన.
అధిదేవత: గణపతి (గణేశుడు), వాహనం ఏనుగు.
అంశం: భూమి.
రి : రిషభం : తత్పురుష వదన జనిత స్వరం.

2. స్వాధిష్ఠాన చక్రం.
స్థానం: వెన్నెముకలో.
అధిదేవతలు: బ్రహ్మ, సరస్వతి.
అంశం: జలం (నీరు).
గ : గాంధారం : అఘోర వదన జనిత స్వరం.

3. మణిపూరక చక్రం.
స్థానం: నాభి దగ్గర .
అధిదేవతలు: విష్ణువు, లక్ష్మి.
అంశం: అగ్ని.
మ : మధ్యమం : వామదేవ వదన జనిత స్వరం.

4. అనాహత చక్రం.
స్థానం: గుండె దగ్గర.
అధిదేవతలు: శివుడు, పార్వతి.
అంశం: వాయువు (గాలి).
ప : పంచమం : పరమాత్మ స్వరం

5.విశుద్ధి చక్రం.
స్థానం: గొంతు ప్రాంతం.
అధిదేవత: అమృతేశ్వరుడు (శివరూపం).
అంశం: ఆకాశం.
ద : దైవతం : సద్యోజాత వదన జనిత స్వరం

6. ఆజ్ఞా చక్రం
స్థానం: నుదిటి మధ్యలో (మూడవ కన్ను).
అధిదేవతలు: శివ-శక్తి (అర్ధనారీశ్వరుడు).
అంశం: మనస్సు, అంతర్ దృష్టి. 
ని : నిషాదం : ఈశాన వదన జనిత స్వరం

7. సహస్రార చక్రం. 
షట్చక్రాల తర్వాత అత్యున్నతమైనది.
అధిపతి శివుడు.
స : షడ్జమం : జీవాత్మ స్వరం

సహస్రారంలో జీవుడు : షడ్జమం :  : జీవాత్మ స్వరం
మనం గాఢనిద్రలో ఉన్నామనుకోండి...
అనగా....
ఎవ్వరు పిలిచినా వినపడని స్థితిలో,
ఎవ్వరికీ పలకని స్థితిలో,
ఉలుకు పలుకు లేని సుషుప్తి అవస్థలో,
ఉన్నామనుకోండి...
"హుమ్మ్...
మనం ఉన్న శరీరంలో ఉండే జీవుడు ఆదమరచి బాగా నిద్రపోతున్నాడు కద....
మనం కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నిద్రపోతే బావుణ్ణు కద...."
అని అనుకోకుండా...
ఎల్లప్పుడూ కూడా మన గుండె ఎవ్వరూ అడగకున్నా సరే విహితకర్తవ్యంగా తన పని తాను చేసుకుంటూనే ఉంటుంది....
అనగా తన హృదయలయలను నిరాటంకంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది....
కావాలంటే ఇతరులు స్టెతోస్కోప్ తో వినొచ్చు....

అందుకే అనాహతచక్రాన్ని శాసించే స్వరం 
ప : పంచమం : పరమాత్మ స్వరం 
అని గంధర్వశాస్త్రం నిర్వచిస్తున్నది....


ప॒ద్మ॒కో॒శ-ప్ర॑తీకా॒శ॒గ్ం॒ హృ॒దయం॑ చాప్య॒ధోము॑ఖమ్ ।
అధో॑ ని॒ష్ట్యా వి॑తస్యాం॒తే॒ నా॒భ్యాము॑పరి॒ తిష్ఠ॑తి ।

జ్వా॒ల॒మా॒లాకు॑లం భా॒తీ॒ వి॒శ్వస్యా॑యత॒నం మ॑హత్ ।
సంత॑తగ్ం శి॒లాభి॑స్తు॒ లంబ॑త్యాకోశ॒సన్ని॑భమ్ ।

తస్యాంతే॑ సుషి॒రగ్ం సూ॒క్ష్మం తస్మిన్᳚ స॒ర్వం ప్రతి॑ష్ఠితమ్ ।
తస్య॒ మధ్యే॑ మ॒హాన॑గ్ని-ర్వి॒శ్వార్చి॑-ర్వి॒శ్వతో॑ముఖః ।

-- నారాయణ సూక్తం

]

హృదయకోశంలో అధోముఖస్తమై ఉండే అనేకసూర్యబింబసదృశకాంతిపుంజమై యోగపద్మకింజిల్కభాసతో వెలుగొందే పరమాత్మకు....

ఏనాడైతే....
"ఈ దేహంలో వర్ధిల్లుతున్న జీవుడి ఆయుః ప్రమాణం ఫలాన ఊపిరి సంఖ్యలో, ఫలాన ఉఛ్వాస లో, ఫలాన నిశ్వాసలో
పూర్తికాబోతున్నది...
కావున మీరు ఈ పంచేంద్రియ సంఘాతమైన పాంచభౌతిక
తిత్తి నుండి నిష్క్రమించి చిదాకాశంలో లయించవలసినదిగా మనవి....
అని సమవర్తి నుండి సందేశం అందునో...
అప్పుడు అనాహత చక్రం నుండి నిత్యం ప్రతిధ్వనించే పంచమ స్వరం లయించును....

అనగా...,
శ్రీచాగంటి సద్గురువుల వచనాల్లో "పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ..." అనే సందర్భంలో పంచమ స్వరం మూగబోవును...
ఆ తదుపరి ఇతర అన్ని స్వరాలు కూడా వాటివాటి స్వస్థానాలను విడిచి దివికేగును.....
అప్పుడు పంచేంద్రియ సంఘాతమై ఉండే దేహంలోని పంచభూత తత్త్వాలు, బ్రహ్మాండంలోని పంచభూతాల్లోకి లయించిపోవును.....

అప్పుడు మీరు స్టెతోస్కోప్ వాడినా ఏ స్వరం వినిపించదు...
టెలిస్కోప్ వాడినా ఏ కాంతి కనిపించదు...
మైక్రోస్కోప్ వాడినా జీవకణాల్లో ఏ చలనం కనిపించదు.....

అనగా ఆ శరీరంలో ఆయా స్థానాల్లో నిత్యం ప్రతిధ్వనించే సప్తస్వరాలు...
పంచమం మూగబోయిన వెంటనే...
ఒక్కొక్కటిగా అన్నీ మూగబోయినై....
ఇప్పుడు అది అన్నిస్వరాలు అంతరించిపోయిన ఆరడుగుల ఒక మట్టి బొమ్మ మాత్రమే...
మట్టిలో మట్టిగా మారడమే దాని యొక్క ఆఖరి మజిలి...

అందుకే సంగీత శాస్త్రం యొక్క అనన్యసమాన్యమైన ఆశ్చర్యకరమైన అతిశయభరిత తత్త్వాన్ని ఒక్కో వాగ్గేయకారులు వారికి జ్యోతకమైన వాగ్దేవి అనుగ్రహానికి అనుగుణంగా ఒక్కోలా ఆలపించి ఆనందించి అమరులై చిరస్మరణీయులైనారు.....
[
ప. సంగీత జ్ఞానము భక్తి వినా
సన్మార్గము కలదే మనసా

అ. భృంగి నటేశ సమీరజ ఘటజ
మతంగ నారదాదులుపాసించే (సం)

చ. న్యాయాన్యాయము తెలుసును జగములు
మాయామయమని తెలుసును దుర్గుణ
కాయజాది షడ్రిపుల జయించు
కార్యము తెలుసును త్యాగరాజునికి (సం)
]
అని సద్గురు శ్రీ త్యాగరాయుల వారు 
ధన్యాసి రాగంలో ఆలపించి ధన్యులైయ్యారు...

[
ప|| చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనం ||
చ|| సంతోష కరమైన సంకీర్తనం | సంతాప మణగించు సంకీర్తనం |
జంతువుల రక్షించు సంకీర్తనం | సంతతము దలచుడీ సంకీర్తనం ||
చ|| సామజము గాంచినది సంకీర్తనం | సామమున కెక్కుడీ సంకీర్తనం |
సామీప్య మిందరికి సంకీర్తనం | సామాన్యమా విష్ణు సంకీర్తనం ||
చ|| జముబారి విడిపించు సంకీర్తనం | సమ బుద్ధి వొడమించు సంకీర్తనం |
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం | శమదమాదుల జేయు సంకీర్తనం ||
చ|| జలజాసనుని నోరి సంకీర్తనం | చలిగొండ సుతదలచు సంకీర్తనం |
చలువ గడు నాలుకకు సంకీర్తనం | చలపట్టి తలచుడీ సంకీర్తనం ||
చ|| సరవి సంపదలిచ్చు సంకీర్తనం | సరిలేని దిదియపో సంకీర్తనం |
సరుస వేంకట విభుని సంకీర్తనం | సరుగనను దలచుడీ సంకీర్తనం ||
]
అని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు అనుగ్రహించి అమరులైనారు....

"పఞ్చమీ, పఞ్చభూతేశీ, పఞ్చ సఙ్ఖ్యోపచారిణీ ।
శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, శర్మదా, శమ్భుమోహినీ ॥ 175 ॥"

అని అమ్మవారిని శ్రీలలితాసహస్రనామావళిలో వాగ్దేవతలు ఎంతోశక్తివంతమైన నామాలతో కీర్తిస్తూ ఉంటారు...

మీరు దర్శించగలిగితే పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఈ నామావళిలో ఎంతో గంభీరమైన తత్త్వం దాగి ఉన్నది....

1. పంచమి
2. పంచభూతేశి
3. పంచసంఖ్యోపచారిణి

1. పంచమి : పంచమి అనే తిథిగా వర్ధిల్లే అమ్మవారు.

2. పంచభూతేశి : అన్ని లోకాల్లోనూ ఉండే పంచభూతములకు ఈశిత్వాన్ని వహించే ఈశ్వరి.

3. పంచసంఖ్యోపచారిణి : దీప ధూప పుష్ప గంధ నైవేద్యమనబడే పంచోపచారములతో నిత్యం విజ్ఞ్యులచే ఆరాధింపబడే పరమేశ్వరి.

అని ఒక సమన్వయం....

1. మన శరీరం అనే కోవెలలో అనాహతచక్ర స్థానంలో పంచమం అనే స్వరస్థానంగా కొలువై,

2. మన శరీరం అనే వ్యవస్థకు కారణమై ఉండే ఆంతర పంచభూతములకు ఈశ్వరిగా అలరారుతూ, 

3. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, అనబడే పంచ ప్రాణముల వాయుతత్త్వంతో....
(నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనబడే పంచ ఉపప్రాణముల వాయుతత్త్వంతో....)
నిత్యం సేవింపబడుతూ ఉండే పరమేశ్వరి...

అనేది మరొక సమన్వయం....

ఈ సమన్వయాన్ని అవగతం చేసుకోవాలన్నా, దర్శించి, తరించాలన్నా, సంగీతమాధ్యమం చాలా విశేషమైన సాధనం...

పరమాత్మ స్వరమైన పంచమం
జీవాత్మ స్వరమైన షడ్జమం
కాకుండా

మిగతా 5 స్వరాల ఆరోహణలో, అవరోహణలో, మీరు ఈ పంచప్రాణ, పంచ ఉపప్రాణ వాయుతత్త్వాలను దర్శించి తరించగలరని గంధర్వశాస్త్రం నిర్వచిస్తున్నది....

నిత్యం సిద్ధ, చారణ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, విద్యాధరుల సంచారంతో బిజిబిజి గా ఉండే అరుణాచల అభయారణ్యాల్లో కొన్ని సమున్నతమైన పర్వత ప్రాంతాల్లో గంధర్వులు ప్రత్యేకంగా ఆలపించే స్వరఝరులను రికార్డింగ్ చేసుకున్న వారి గురించి కూడా శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో కొందరు విజ్ఞ్యులైనా వినే ఉంటారు కద...

ఇరుగు పొరుగు న నివసించే స్నేహితులలా పక్క పక్కనే ఉండే ఈ రెండు శక్తిప్రకటన స్థానాలను / చక్రాలను ఒకసారి తత్త్వః గమించండి....

3. మణిపూరక చక్రం.
స్థానం: నాభి దగ్గర .
అధిదేవతలు: విష్ణువు, లక్ష్మి.
అంశం: అగ్ని.
మ : మధ్యమం : వామదేవ వదన జనిత స్వరం.

4. అనాహత చక్రం.
స్థానం: గుండె దగ్గర.
అధిదేవతలు: శివుడు, పార్వతి.
అంశం: వాయువు (గాలి).
ప : పంచమం : పరమాత్మ స్వరం

ప్రాణవాయువు సంవృద్ధిగా లభిస్తేనే అగ్ని ప్రజ్వరిల్లేది...
అది బాహ్యంలో ఆలయంలోని యజ్ఞ్యవేదికలో ప్రజ్వరిల్లే యజ్ఞ్యాగ్ని అయినా...
స్థూల శరీరం అనే కోవెల ఆంతరంలో ప్రజ్వరిల్లే జఠరాగ్ని అయినా....
సూక్ష్మ శరీరం అనే జ్ఞ్యానభూమికలో ప్రజ్వరిల్లే యోగాగ్ని అయినా...

మీకు పంచభూత అగ్నిలింగ క్షేత్రమైన శ్రీఅరుణాచలం యొక్క వైభవం, శక్తి, మహిమ్నత, బాగా బాగుగా అర్ధమై తరించాలంటే...

మీరు మొదట పంచభూత వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తి ని 
దర్శించి అక్కడ కొలువైఉన్న శ్రీవాయులింగేశ్వర / శ్రీ కాళహస్తీశ్వర /  శ్రీజ్ఞ్యానప్రసూనాంబ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందుకొని తరించవలసి ఉంటుంది.... 
ఎందుకంటే.... 
ఒక పేద్ద గిన్నెలో ఆలయంలో అమృతమయమైన పరమాన్నం పరమాత్మకు నివేదింపబడి ప్రసాదంగా భక్తులకు వితరణ గావింపబడేందుకు సిద్ధంగా ఉన్నా కూడా....

అన్నపూర్ణమ్మ అనుగ్రహంతో పెట్టేవారు,
పెట్టేందుకు కావలసిన తెడ్డు, ఉద్ధరిణ / స్పూన్,
పట్టేందుకు శుభ్రమైన డొప్పలు, ప్లేట్లు, ఉండాలి కద ..

అప్పుడే కద ఆ పేద్ద గిన్నెలో ఉండే పరమాన్నరాశి నుండి కొంచెం కొంచెం గా ఎంత పెడితే అంత మనం స్వీకరించి తరించేది...

అనగా, శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రాన్ని మొదట 
దర్శించి అక్కడ కొలువైఉన్న శ్రీజ్ఞ్యానప్రసూనాంబ అమ్మవారి అనుగ్రహం సముపార్జించుకున్న వారికి, శ్రీఅరుణాచలం అనే రగులుతున్న జ్ఞ్యానాగ్ని పర్వతం యొక్క అమేయమైన అనుగ్రహం కొంచెం కొంచెం గా ఈశ్వరానుగ్రహంగా ఎంత లభిస్తే అంత మదిలో స్వీకరించి తరించేది...

"శ్రీ అపీతకుచాంబాళ్ సమేత అరుణాచలేశ్వరర్...."
అని సంబోధించడంలో ఉన్న పరతత్త్వం ఏమనగా....

ఎవ్వరు ఏఏ శాస్త్రాల్లో ఎంత జ్ఞ్యానం సముపార్జించుకున్నా కూడా....,
శ్రీఅరుణాచల జ్ఞ్యానాగ్ని పర్వతం ప్రసాదించే జ్ఞ్యానానుగ్రహం ఇంకా ఎంతో ఎంతెంతో మిగిలే ఉంటుంది....
అంటే ఎప్పటికీ ఇంకా స్వీకరింపడని అజరామరమైన 
సుజ్ఞ్యానసుధామృతక్షీరధారలను "శివజ్ఞ్యానప్రదాయిని" గా కొలువై భక్తులకు స్మరణమాత్రంచే అనుగ్రహించే స్వరూపంతో శివపార్వతులు కొలువైన శ్రీజ్ఞ్యానగిరి గా శ్రీఅరుణాచలం విజ్ఞ్యులకు భాసించును...

కొన్ని క్షణాల పాటు మనం నిల్చొని ఉన్న చోటే స్థాణువులై ఉండిపోయేలా, ఒళ్ళంతా తెలియని తన్మయత్వంతో, పరవశంతో, అతిశయభరిత ఆశ్చర్యచకిత ఆనందంతో రోమాంచితమై ఉండగా, ఇవ్వాళ పౌర్ణమి కాదే...
అయినా ఇంతటి వింతవెలుగులకు ఆలవాలంగా అలరారే ఈ అరుణగిరి పర్వతసానువుల ద్యుతి దర్పణాలకు కారణమేమి / కారకులెవరు / అనే ఆంతరశోధనలో మనం నిమగ్నమై ఉండి మేలుకోవడానికి సమయం పట్టే సందర్భాలు శ్రీఅరుణగిరి చుట్టూ ఎన్నో....
ప్రత్యేకించి ఆది అన్నామలై ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎన్నెన్నో.....

శ్రీ త్యాగరాయ ఆరాధనోత్సవాల్లో, శ్రీ అరుణాచల ప్రస్తుతి యొక్క ప్రాశస్త్యమేమనగా...,మన ఎన్నెన్నో పూర్వజన్మల్లో మనం చేసుకున్న సుకృతాల సామాహారంగా శ్రీవాణి అనుగ్రహాన్ని ప్రసాదించే ఈశ్వరుడు,
విశేషమైన, దుర్లభమైన, గంధర్వజ్ఞ్యానలబ్ధికి కావలసిన పాత్రతను అనుగ్రహించి తరింపజేసే శ్రీక్షేత్రం అరుణాచలం....

భగవద్ ఆరాధనలో సమర్పింపబడే ప్రశస్తమైన ఈ క్రింది వివిధ రాజోపచారాల్లో,,,
ఛత్రం, చామరం, వ్యజనం, దర్పణం, నృత్యం, గీతం, వాద్యం, ఆందోళికా, అశ్వ సేవ, గజ సేవ, మంత్రపుష్పం, ప్రదక్షిణ, నమస్కారం...

"ఆందోళికాన్ ఆరోహయామి..."
అనే వచనాన్ని భగవద్ ఉత్సవాల్లో విజ్ఞ్యులు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు కద...

అనగా పల్లకి అనే ఉన్నతమైన ఆసనంలో భగవంతుణ్ణి అధిరోహింపజేసి సేవించడం....
తద్వారా వారివారి జీవితంలో అట్టి ఉన్నతిని భక్తులు భగవదనుగ్రహంగా అందుకొని తరించడం...
అనే తత్త్వం గురించిన ఎరుక గల విజ్ఞ్యులకు తెలిసినట్టుగా...

అందోళిక రాగంలో శ్రీ త్యాగరాయుల వారు అనుగ్రహించిన ఈ కృతిలో పేర్కొనబడినవిధంగా..

యాగం, యోగం, త్యాగం భోగం యొక్క ఫలాన్ని ఒసగే సంగీతరసార్ణవపయనంలో ఓలలాడి విశిష్టమైన భగవదనుగ్రహంతో తరించమని సద్గురువులు సెలవిచ్చారు....

ఒక పడవలో ప్రయాణిస్తూ, ఆనందిస్తూ, మరో తీరానికి చేరుకునే వారందరికీ గొప్పగా పడవను నడిపించడం కూడా రావాలి అని అనరు కద....

అవ్విధముగనే.....
మనకు పరిచయం ఉన్న ఒకటి రెండు సంకీర్తనలను నెమరువేసుకుంటూ, సంగీతశాస్త్ర కోవిదులెందరో ఆలపిస్తూ ఉండగా, సంగీతసరస్వతీపరిఢవిల్లే సభలో ప్రేక్షకులుగా ఆసీనులై ఉండి తరించడం కూడా ఒక గొప్ప యోగమే కదండి.....

[

ప. రాగ సుధా రస పానము జేసి
రంజిల్లవే ఓ మనసా

అ. యాగ యోగ త్యాగ భోగ ఫలమొసంగే (రా)

చ. సదాశివ మయమగు నాదోంకార స్వర
విదులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు (రా)

]

అట్టి సమున్నతమైన యోగాన్ని విజ్ఞ్యులెల్లరికీ అనుగ్రహించిన
కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వణ్మూర్తులకు, మూర్తీభవించిన అపర గీర్వాణి స్వరూపులకు, నిలయ విద్వాంసులకు, గాయకగాయనీమణులకు, మరియు ఇతర విజ్ఞ్యులెల్లరికీ....,

ఎందరో మహానుభావులు.....
అందరికీ వందనములు......

సర్వం (మా బి.వి.అర్.ఐ.టి కాలేజ్ లాన్ మందిరంలో కొలువైన) శ్రీవిద్యాసరస్వతీ శ్రీచరణారవిందార్పణమస్తు....💐🙂🙏

No comments:

Post a Comment