శ్రీఅరుణగిరి / అరుణాచలమిది.... కారుణ్యామృత జలధి....
మ్రొక్కులను / కోర్కెలను అనుగ్రహించడమే కాదు, కైవల్యాన్ని కూడా కరతలామలకం గావించే మూర్తింభవించిన శివస్వరూపమిది....
2018 మహాశివరాత్రినాటి అరుణగిరి ప్రదక్షిణానికి వెళ్ళినప్పుడు అరుణాచల మాధవి మేడం గారి ఇంట్లో భోజనానంతరం సాగిన ఆధ్యాత్మిక చర్చల్లో మేడం గారు ఒక మాట అన్నారు.....
ఒక్క 'కొబ్బరిబోండం' మన దాహం తీరడానికై ఈశ్వరుణ్ణి అడిగితే 100 'కొబ్బరిబోండాలను' వర్షించగల విశేషదైవం అరుణాచలేశ్వరుడు..... కావలసిందల్ల.....
"
అరుణాచలశివ అరుణాచలశివ
అరుణాచలశివ అరుణాచల...
అరుణాచలశివ అరుణాచలశివ
అరుణాచలశివ అరుణాచలా...
"
అనే నిత్య నామస్మరణ న్యాసం....
శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా,
నమఃశివాయ అనే పంచాక్షరి కన్ననూ ఎన్నో రెట్లు అధికపుణ్యప్రదమైన శక్తివంతమైన నామం
" అరుణాచలశివ " నామం.....
పైకి చూడ్డానికి చక్కని స్వరలహరిలా ఉన్న కేవల నామ స్మరణం లా కనిపించినా అందునుండి అధ్యాత్మ సాధనతో తర్కించబడి అందుకోలవసిన తత్త్వజ్ఞ్యానం కొండంత కలదు....
8 సార్లు " అరుణాచల " అనే నామం
అష్టవిధ ప్రకృతికి, పరమశివుడి అష్టమూర్తిత్త్వానికి సంకేతం.....
6 సార్లు శివనామం కుమారక్షేత్రమైన అరుణగిరి యొక్క అంతర్నిహిత "శరవణభవ" అనే షడక్షరి తత్త్వానికి సూచిక.....
8×6=48, అనులోమ విలోమ సిద్ధాంతంతో తిరగేస్తే 84 లక్షల జీవరాశుల సంఖ్యకు సూచిక.....
8+6=14, చతుర్దశ భువనాలకు సూచిక....
అనులోమ విలోమ సిద్ధాంతంతో తిరగేస్తే 41 రోజుల మండల దీక్షకు సూచిక.....
8÷6 = 1.33333333333 అనేది
ఉండే ఒకేఒక్క పరతత్త్వం 11 ఏకాదశ రుద్రులుగా పరివ్యాప్తమై ఉండే త్రిమూర్త్యాత్మక శివతత్త్వ సూచిక....
6÷8 = 0.75, మనుష్యుడు తన మేధతో సాధించుకోగలిగే ధర్మ అర్థ కామ్యములకు తత్త్వ సూచిక....( చివరిదైన మోక్షం అనే పావుభాగం కలిస్తే 0.75+0.25=1 పూర్ణత్వానికి సూచిక......)
ఆ నలుగవ పురుషార్ధం ఎవ్వరికైనను కటాక్షించగలిగే అత్యంత విశేషమైన పుణ్యక్షేత్రమే అరుణాచలం.....
ఇవ్విధంగా సంఖ్యా శాస్త్రం కూడా అరుణాచల మాహాత్మ్యంలో తరిస్తూ ఉన్నది....
ఎందుకో మనసు అరుణాచల ప్రదక్షిణానికై ఆరాటపడుతున్నది....
" 14. అవ్వ బోలే ఒసగి నాకు నీ కరుణ, నన్నేలుట నీ భారం అరుణాచల... "😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment