Sunday, March 6, 2022

శ్రీకార్యసిద్ధిఅభయాంజనేయస్వామి అభయాంజనేయస్వామి వారి 2వ వార్షికోత్సవాంతర్గత శ్రీసీతారాముల కళ్యాణాంతర్గత శ్రీరామాంజనేయ వైభవం...🍦🍨🍧🎂🍕💐😊


శ్రీరామపత్నీ జనకస్యపుత్రీ 
సితాంగనా సుందరకోమలాంగీ
భూగర్భజాతా భువనైకమాతా 
వధూవరాభ్యాం వరదాభవంతు

అంటూ ప్రతీ చైత్ర శుద్ధ నవమికి శ్రీసీతారాముల కళ్యాణం జరగని పురము / ప్రాంతము / కాలని / ఉండవు అని అనడం అతిశయోక్తి కానేరదు....

*****
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: లక్ష్మీదేవి సీత, సేవకులు వైష్ణవజనులు, విరజానది, గోదావరి, వైకుంఠము, భద్రాచలము కాగా ప్రాణుల నుధ్ధరించునట్టి విష్ణువుడవు నీవు దాశరథీ కరుణాపయోనిధీ....
*****

అంటూ ఎంతో భావగంభీరయుక్తంగా శ్రీచాగంటి సద్గురువులు వారి పలు ప్రవచనాల్లో శ్రీభద్రాచల పుణ్యక్షేత్ర వైభవాన్ని ఎంత రసరమ్యంగా వర్ణించారో చాలా మందికి గుర్తుండే ఉంటుంది.....

శ్రీవాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్రామాయణ ఇతిహాస ఆదికావ్యాంతర్గతమైన శ్రీరామచంద్రుడి వైభవాన్ని మరియు హనుమంతుడి ప్రాభవాన్ని, ఎవరెవరు ఎంతగా వారు వారు ఆశ్రయించిన సద్గురువుల బోధాంతర్గతంగా ఒడిసిపట్టిఉన్నారో..... ఆమేరకు వారి వారి వివేచనాత్మక స్వాధ్యాయం కొలది శ్రీసీతారాముల తత్త్వం మరియు శ్రీమద్రామాయణ వైభవం వారి వారి జీవితాలకు ఆపాదింపబడి అనుగ్రహాన్ని వర్షిస్తుంది అనేది ఎందరో మహానుభావుల జీవిత స్వానుభవ సత్యం....

సాధారణమైన ప్రక్రియ వేరు...
సందేశాత్మక ప్రక్రియ వేరు....

సందేశాత్మక ప్రక్రియ సాధారణమైన ప్రక్రియ లానే ఉంటుంది.....
అంతర్ వివేచనతో గురువానుగ్రహంగా, ఈశ్వరానుగ్రహంగా, జ్ఞ్యాన నేత్రంతో దర్శించినప్పుడు మాత్రమే సాధారణమైన ప్రక్రియలా కనిపించే సందేశాత్మక ప్రక్రియలో నిక్షిప్తమై ఉండే ఆంతర్యం అవతగతమై....,
ఔరా ఎంతటి ఘనమైనది మన భారతీయ సనాతన ధర్మ ప్రతిపాదిత సారస్వత వైభవం అని అనిపించకమానదు.....

ఫర్ ఎగ్సాంపుల్....

నేను క్యాజువల్ గా మా ఇంటిపైకి వెళ్ళి మా పాపను నవ్వించడానికి ఆకాశంలోని విమానాన్ని, విహంగాలను, చూపిస్తూ గాల్లో చేతులు ఊపుతూ, సే హాయ్ 2 ఆల్ ది బర్డ్స్...అని ఏదో చెప్పడం అనేది ఒక సాధారణమైన ప్రక్రియ..... 

నేను ట్రెడిషనల్ పంచెకట్టు ధరించి, ఎడమ భుజంపై ఉత్తరీయం ధరించి, రాగి చెంబులో శుద్దోదకాన్ని గంగగా గైకొని, మా ఇంటిపైకి వెళ్ళి గాల్లో చేతులు ఊపుతూ సూర్యుడికి నమస్కరించడం కూడా ఒక సాధారణమైన ప్రక్రియలా కనిపించవచ్చు.....

జ్ఞ్యాన నేత్రంతో దర్శించినప్పుడు మాత్రమే,
సాధారణమైన ప్రక్రియలా కనిపించే సంధ్యావందనం అనే ఈ సందేశాత్మక ప్రక్రియలో నిక్షిప్తమై ఉండే ఆంతర్యం అవగతమవ్వగలదు.... 

"నాకు విహితమైన వర్ణాశ్రమ ధర్మానుగుణంగా, అనగా ఒక క్షత్రియ గృహస్తునకు తగిన రీతిలో నేను గావింపబడే సూర్యనమస్కారంలో....
తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం
అనే నాలుగు దిక్కులకు, మరియు, 
ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయవ్యం అనే నాలుగు ఉప దిక్కులకు,
అధిదేవతలైన వివిధ దేవతాగణములను సంకల్పసహితంగా స్మరిస్తూ,
వారందరిని మనోన్యాసపూర్వకంగా నా గాయత్రి పఠన జనిత శక్తికి రక్షకులుగా నిత్యం నాయందే వసించమని ప్రార్థిస్తూ,
అపరిమితమైన సకల శక్తిదాయక కాంతిపుంజమైన సూర్య భగవానుడిని, సూర్యగాయత్రితో, 
ధ్యేయహ్సదా సవితృమండలమధ్యవర్తి.....
అని నమస్కరిస్తూ.... ఆరాధిస్తూ, 
నా గాయత్రి పఠనజనిత శక్తి దినదినప్రవర్థమానమై,
సూర్యభగవానుడిలా జ్ఞ్యానతపోశక్తి పుంజమై 
నా దేహం నిత్యం సకల దేవతలకు నిలయమై, నాయందే యావద్ విశ్వం కొలువై స్పందించే విధంగా అష్టదిక్కులకు నమస్కరిస్తూ అష్టవిధప్రకృతికి నమస్కరించడం......."

అనే పరమార్థం, గాల్లో చేతులు ఊపుతూ రౌండ్ రౌండ్ గా తిరగడం అనే సాధారణమైన ప్రక్రియలోనే నిక్షిప్తమై ఉండే సందేశాత్మక ప్రక్రియ అనేది ఆధ్యాత్మిక జగత్తుకు అవగతమయ్యే అంశం..... 

మనం ఆలయానికి వెళ్ళి హారతి పళ్ళెంలో ఒక 10 రూపాయలు సమర్పించడం అనేది ఒక సాధారణమైన ప్రక్రియ......
ఒక ఉన్నతాధికారి గారు ఒక ఆలయానికి వెళ్ళి హారతి పళ్ళెంలో 100 రూపాయల నోటు సమర్పించడం అనేది ఒక సందేశాత్మక ప్రక్రియ......

అచ్చం ఇదే విధంగా, 
" శ్రీరాముడు కౌసల్యా దశరథుల పెద్ద కుమారుడిగా జన్మించెను.....
విశ్వామిత్ర మహర్షి చెప్పగా శివధనుర్భంగం గావించి జనకమహర్షి నిర్వహించిన సీతాస్వయంవరంలో విజేతగా నిలిచి సీతాదేవిని వివాహమాడెను....
కైకేయి వరాలకారణంగా వనవాసానికి వెళ్ళెను....
ఎందరో రాక్షసులను తన కోడంద సంధిత శస్తాస్త్ర సంపదతో హతమార్చెను....
హనుమ, నల, నీలాది యోద్ధులతో లంకకు వారధి కట్టి రావణునాదులను కొట్టి, విభీషణుడికి పట్టంగట్టి,
రావణాసురుడు అపహరించిన 
సీతామాతను అగ్నిపునీతగా చేకొని పుష్పకమెక్కి అయోధ్యకు చేరి, 500 నదీ జలాలతో అభిషేకింపబడి కోసలాధీశుడిగా పట్టాభిరాముడై 11000 సంవత్సరాల సుభిక్ష రామరాజ్య పరిపాలనతో ఆదర్శ పాలకుడిగా పేర్గాంచెను...."

అనే సంక్షేప రామాయణాన్ని, విపులంగా సంపూర్ణ రామాయణంగా, కేవల కథగా వినడం సాధారణమైన పురాణశ్రవణం......

ఒక మెట్టు పై స్థాయిలో నిలిచి,
వివిధ జ్ఞ్యాన యోగ స్థాయికి శ్రీమద్రామాయణ కావ్య మధురిమను గురువానుగ్రహంగా ఆపాదించుకొని విని తరించడం అనేది సందేశాత్మక శ్రీమద్రామాయణ పురాణశ్రవణం....

శ్రీచాగంటి సద్గురువులు బోధించినట్టు కేవల కథగా విన్నాసరే....ఎంతో భవ్యమైన అనుగ్రహాన్ని వర్షింపజేసే దైవిక సారస్వతం శ్రీమద్రామాయణం....

గోపంచకాన్ని కేవలం సహజ ప్రాకృతిక క్రిమి నివారిణిగా పంటపొలాల్లో వినియోగించడమా.... 
లేక శుద్ధి గావించబడిన గోపంచకాన్ని ఔషధంగా స్వీకరించి అందులో ఉండే సూక్ష్మ స్వర్ణ అణువులతో ఆరోగ్య పరిపుష్ఠి కూడా అందుకుంటామా అనేది మన జ్ఞ్యాన స్థాయికి సంబంధించిన అంశం.....

అదే విధంగా....
ఒక వానర వీరుడిని భగవంతుడిగా, ఆంజనేయస్వామి వారిగా నిలిపిన శ్రీమద్రామాయణాన్ని....

శ్రీరాముడు, సీతాదేవి, హనుమ, లక్ష్మణుడు అనే క్షత్రియ వీరులసమ్మిళిత స్వరూప వైభవాన్ని ప్రణవానికి తత్త్వ సూచికగా, తద్వారా అలౌకిక పరబ్రహ్మ తత్త్వంగా స్థిరీకరించిన శ్రీమద్రామాయణాన్ని.....

బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, 
( ఉత్తరకాండను కాసెపు పక్కన  పెట్టండి  ) గా 6 కాండల ఆది కావ్యం గా అలరారే ఇతిహాస వైభవాన్ని, వేదోపబృహ్మణంగా వినుతికెక్కిన శ్రీమద్రామాయణ గాథలోని అంశాలను 
" హరికి లంకిణీ హంతకు అంతర మిట్టున్నది....."
అనే అత్యంత రమణీయమైన శ్రీతాళ్ళపాక సంకీర్తనగా 
కీ.శే శ్రీ సత్తిరాజు వేణుమాధవ్ గారు ఈ లోకానికి అందివ్వడం కొందరైనా విని ఉండాలి ....

శ్రీకార్యసిద్ధి అభయాంజనేయస్వామి వారి వైభవం నా పోస్ట్లొ రాసాను...
@
https://m.facebook.com/story.php?story_fbid=10219393902131615&id=1033694038

https://www.facebook.com/1423090737981398/posts/1483161425307662/?app=fbl

http://neevugaliginachalu.blogspot.com/2015/01/1-hariki-lamkini-hamtaku.html?m=1
 

No comments:

Post a Comment