1. గౌ|| ముఖ్యమంత్రి వర్యులు మరియు వారి క్యాబినెట్ మినిస్టర్లు / ఉన్నతాధికారులు / ఐ.ఏ.ఎస్ / ఐ.పీ.ఎస్ అధికార యంత్రాంగం
2. ఎం.ఎల్.ఏ లు / ఎం.పీ లు
3. కార్పొరేటర్లు
4. వివిధ నియోజకవర్గ / ఏరియాల కమిటీలు / కమిటీ సభ్యులు
5. పార్టి కేడర్ / సభ్యులు
ఈ విధమైన పరిపాలనా వ్యవస్థలో సాక్షాత్తు గౌ|| ముఖ్యమంత్రివర్యుల నుండి లేదా తత్ సంబంధిత శాఖామాత్యుల నుండి ఎం.ఎల్.ఏ గారికి డైరెక్ట్ గా ఆదేశాలు జారి గావించబడినప్పుడు, సదరు ఎం.ఎల్.ఏ గారి నియోజకవర్గం / ఏరియాలోని వ్యవహారాల్లో తలదూర్చవలసిన అవసరం కాని, అధికారం కాని, అర్హత కాని ఇతరులెవ్వరికి ఉండవు.....
ఫర్ ఎగ్సాంపుల్,
"గౌ|| సీ.ఎం గారు, మా పోరడు 512 రూపాయలు ఇచ్చి, కొన్ని పండ్లు కొనివ్వమని అడుగుతడు.....
నా వ్యక్తిగత ఖాతాలో నుండి ఆ పండ్లను నేను కొనిచ్చినట్టుగా భావించి కొనివ్వండి....తర్వాతి పండ్లు, కాయల క్రయవిక్రయాల గురించి, వీటి తర్వాత చూద్దాం...ఇన్నర...."
అని చెప్పినప్పుడు, అన్ల అనవసరంగా దూరి కమీషన్లు మెక్కడానికి కక్కుర్తి పడడం అంతగా మంచిది కాదు అని మాత్రమే ఒక గౌరవభరిత పరిధి దాటకుండా కొందరికి నేను చెప్పదలచుకుంది....
ఎందుకంటే ఈ వ్యవహారాన్ని డీల్ చేసే వ్యక్తులు హేమాహేమీలైన రాజకీయ ఉద్దండులు....
ప్రజా నాడిని ఒడిసిసిపట్టే అత్యంత ప్రభావశీలురైన, అత్యంత కీలకమైన పదవిని వరించేందుకు రేస్లో ఉన్న, ఆరితేరిన రాజనీతిజ్ఞ్యులు....
ఇటువంటి పెద్దవారితో డీల్ చేసేటప్పుడు ఒక పద్ధతి,
గౌరవం, మాటల్లో అణకువ, చేతల్లో మరియాద ఇత్యాదిగా ఎల్లరూ నోరు ఒళ్ళు దెగ్గరపెట్టుకొని ప్రవర్తించవలసిన వ్యవహారం....
కాబట్టి దురాశను అదుపులో పెట్టుకొని, దూరదృష్టితో రాబోయే కాలంలో కూడా అందరిచే గౌరవింపబడే విధంగా నడుచుకొని 'పెద్దమనుషులు' అని అనిపించుకోవడంలోనే విజ్ఞ్యత ఉంటుంది అనేది నేను చెప్పదలచుకున్న సంక్షిప్త వివరణ...
No comments:
Post a Comment