Tuesday, March 15, 2022

శ్రీకాళహస్తీశ్వర వైభవం....శ్రీచాగంటి సద్గురువులు ఎంతో హృద్యంగా వారి ఎన్నో ప్రవచనాల్లో ఈ క్రింది పద్యాన్ని ఉటంకించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....💐🍨🍦🙏🍧🎂🍕

శ్రీకాళహస్తీశ్వర వైభవం....
శ్రీచాగంటి సద్గురువులు ఎంతో హృద్యంగా వారి ఎన్నో ప్రవచనాల్లో ఈ క్రింది పద్యాన్ని ఉటంకించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....

*****
ఏ వేదంబు పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్సూచెఁ దా
నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి; చెం చే మంత్ర మూహించె? బో
ధా విర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు; నీ పాదసం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!       

ప్రాణికోటికి మోక్షము కలుగుటకు నీ పాదాలు సేవించు భక్తి ఒక్కటే కారణం గానీ, చదువులెన్ని చదివినా జ్ఞానమును, మోక్షమును కలిగించునా? ఎంతమంది చదివినవారు లేరు? వారందరికీ జ్ఞానము కలిగిందా? మోక్షము కలిగిందా? నీ దయతో మోక్షము పొందిన సాలెపురుగు ఏ వేదము చదివింది? పాము ఏ శాస్త్రములు పఠించినది? ఏనుగు ఏ విద్యలు నేర్చుకొంది? ఎరుకలవాడు ఏ మంత్రజపము చేశాడు. వీరందరూ ముక్తి పొందటానికి చదువులే కారణమైనవా?
*****

శాస్త్రాన్ని సరిగ్గా జీర్ణం చేసుకున్న విజ్ఞులు/సద్గురువులు మాట్లాడేది వేరుగా ఉంటుంది....

శాస్త్రాన్ని కేవలం కిరీటాలు పెట్టించుకోవడం కోసం ఉటంకించే వారు మాట్లాడేది వేరుగా ఉంటుంది....

జ్ఞ్యానాత్ ఏవతు కైవల్యం....
అని నుడివిన శాస్త్రమే.....

మోక్షసాధనాసామాగ్ర్యాం భక్తిరేవగరీయసి.....
అని కూడా నుడివింది.....

భక్తి, జ్ఞ్యానము ఈ రెండూ కూడాను ఒకే గమ్యానికి కొనిపోవు రెండు సమాంతర మార్గాలు..... 

అని బోధించే శ్రీచాగంటి సద్గురువులు, ఆ సామ్యమును శ్రీకాళహస్తీశ్వర వైభవ ప్రవచనాల్లో మనకు ఎంతో ఆర్తితో అందించి తరింపజేసిన వైనం నేను ఎన్నటికీ మరవనిది....

వారి ఈ పద్యం విన్న తర్వాత, నిజంగా 
శ్రీ, కాళ, హస్తి (సాలెపురుగు, పాము, ఏనుగు)  అనే మూడు సాధారణ ప్రాణులకు ఈశ్వరుడు సారూప్య మోక్షాన్ని ఇచ్చి తనలోకి ఐక్యం గావించుకొని ఇప్పటికీ ఎల్లరూ దర్శించగల విధంగా శ్రీకాళహస్తీశ్వర పంచభూత వాయు లింగంగా, ఆనాటి ఆంగ్లేయులు సైతం పరీక్షించి నమస్కరించిన వైభవం తో ఒక పుణ్యక్షేత్రం ఉన్నదా....
అని ఆశ్చర్యంచెంది, చూడ్డానికి నా మితృడు వినోద్ తో 8+ సంవత్సరాల క్రితం వెళ్ళి దర్శించుకున్నాను....

ఇతర అన్ని శివాలయాల్లో ఉన్నట్టుగా టికెట్ తీస్కొని భక్తులను గర్భాలయ శివలింగాభిషేకానికి అనుమతించడం అనే సామాన్య శైవాగమసంప్రదాయం శ్రీకాళహస్తిలో వర్తించదని తెలిసి ఒకింత అయ్యో అని అనిపించినా, అక్కడ ధ్యానం గావించి అందుకు కారణం రాహుకేతు క్షేత్రం అయినందుకు వాయులింగాన్ని సామాన్య భక్తులు ముట్టుకోకూడదనే ఒక అధ్యాత్మ సూక్ష్మాన్ని తెలుసుకొని సమాధానపడ్డాను.....

ఒక్కో పుణ్యక్షేత్రంలో ఒక్కో వైభవంతో, ఒక్కో వైవిధ్యంతో ఈశ్వరుడు కొలువై ఉండడం అనేది ఎల్లరూ గమనించగలిగే సత్యమే.....

ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో హరుడు కాళరూపంలో / లయకారక లింగరూపియై భక్తుల రాహు కేతు / ఛాయాగ్రహ దోషాలను హరించివేసే కాళహస్తీశ్వరుడై తద్వారా శ్రీయుతమైన శుభాలను అనుగ్రహించే శ్రీకాళహస్తీశ్వరుడై కొలువైఉన్నాడు.....
ఇప్పటికీ గర్భాలయంలోని తైల దీపం కాళహస్తీశ్వరుడి ఉఛ్వాస నిశ్వాస లకు అనుగుణంగా కదులుతూ ఉంటుంది అనే వాయులింగ విశేషం గురించి శ్రీచాగంటి సద్గురువులు తెలిపిఉన్నారు....

విజ్ఞ్యులైన పెద్దలకు ఒక విషయం పై అవగాహన ఉండే ఉంటుంది....
లౌకికంగా, పాము విషాన్ని తననుండి బహిర్గతమయ్యేలా చేయగలదు.....
మరియు తనచే బహిర్గతమైన విషాన్ని వెనక్కి తీసుకోగలదు....

అనగా ఆధ్యాత్మికపరంగా పాము యొక్క ఉఛ్వాస నిశ్వాస రెండూ కూడాను విషపూరితమైనవే.... 

కాబట్టి అక్కడి భక్తుల రాహు కేతు దోషాలను హరించే హరుడి కాళస్వరూప లింగ ఉపరితల భాగం నుండి నిత్యం ప్రసరింపబడే గాలి ఆధ్యాత్మిక దృష్ట్యా గరళ సామ్యమును పొంది ఉన్నది....
మరి అక్కడి అర్చకులను ఏమి ప్రభావితం చేయదా ఈ ఆధ్యాత్మిక దృష్ట్యా గరళ సామ్యమును పొంది ఉన్న తత్త్వము అని అంటే.....
చాలా సమయం పాటు ఒక ప్రత్యేకత కలిగిన నవగ్రహకవచం ధరింపబడి ఉన్న 
శ్రీకాళహస్తీశ్వర లింగాన్ని 
"నా రుద్రో రుద్రమర్చయేత్..." అనే వేదప్రమాణాన్ని అనుసరించి ఎంతో భక్తితత్త్పరులై తన గర్భాలయంలో ఉండే అర్చకులను ఈశ్వరుడు సదా అనుగ్రహిస్తూనే ఉంటాడు అనేది సత్యం.....

సామాన్యంగా ఎక్కువగా ఎవ్వరిచే దర్శింపబడ సాధ్యం కాని ఈ శ్రీకాళహస్తీశ్వర వాయు లింగ నిజస్వరూపం నిజంగా అచ్చెరువును కలిగించే అధ్యాత్మ విశేషమే...!!

శివసన్నిధిలో తమకంటూ ఒక శాశ్వత గుర్తింపును, గౌరవాన్ని, అనుగ్రహాన్ని భక్తిప్రపత్తితో సాధింపజేసుకున్న విశేష మనుష్యేతర ప్రాణులు....

శ్రీకాళహస్తిలో దర్శించగల

1. శ్రీ, / సాలెపురుగు
2. కాళ,  / పాము
3. హస్తి, / ఏనుగు

మరియు శ్రీశైలంలో దర్శించగల,

4. పతంజలి,
5. వ్యాఘ్రపాదుడు,

ఈ అయిదుగురు పుణ్యమూర్తుల అనుగ్రహాన్ని ఈశ్వరానుగ్రహంగా అందుకున్న వారి వైభవం బహువిశేషమైనది....

1. లౌకిక సుఖదాయక, సంతోషకారక సంపద,
2. అపారమైన తేజస్సు,
3. అనితరసాధ్యమైన మేధస్సు, 
4. నవవ్యాకరణ పండితులైన హనుమంతులవారిలా  వివిధ యోగ వ్యాకరణాది విద్యల్లో నిష్ణాతులుగా ఉండడం...
5. ఎన్నో పనుల్లో గంగానదీ, సరస్వతీనదీ యొక్క వేగంలా అపరామైన వేగం...
[ ఒక చిరుత పులిలా, మన మెగాపవర్ స్టార్ రాంచరణ్ డ్యూడ్ యొక్క చిరుత సినిమాలోని చిరుత రోల్ లా...
(Being as fast as a leopard...And as slow and steady as a leopard....)
...]

ఇలా ఎన్నో ఎన్నెన్నో....ఈ అయిదుగురి అనుగ్రహ విశేషాలై వర్ధిల్లే అధ్యాత్మ సత్యాలు.....

భుక్తినిచ్చే వాడు భక్తితో అడిగితే ముక్తి నివ్వడని అనడానికి మనకు ఏపాటి విజ్ఞ్యత కలదు....

శ్రీఆదిశంకరులంతటి సర్వజ్ఞ్యులే...

నరత్వం దేవత్వం నగ-వన-మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది-జననం
సదా త్వత్-పాదాబ్జ-స్మరణ-పరమానంద-లహరీ
విహారాసక్తం చేద్-హృదయం-ఇహ కిం తేన వపుశా 10

అని వారు అనుగ్రహించిన శివానందలహరి స్తోత్రంలో అన్నారు....

కాబట్టి....

వినయం-->మరియాద-->గౌరవం-->భక్తి-->ప్రేమ

తో ఎవరు ఎంతగా ప్రార్ధిస్తే వారిని అంతగా అనుగ్రహించడానికి ఈశ్వరుడు ఎల్లప్పుడూ రడీగానే ఉంటాడు.....
మనమే మన లౌకిక / ప్రాపంచిక పనుల్లో పడి ఈశ్వరుడిని మర్చిపోతూ ఉంటాము.....

అయినాసరే.....
ఏదో ఒకనాడు ఒక భక్తుడు నన్ను నమస్కరించి ప్రార్ధించి తరించడానికోసమైనా నేను ఇట్లే ఆలయంలో ఉండాలి కద.....
అనే విశాలమైన హృదయంతో ఈశ్వరుడు ఆలయంలో సాకారమూర్తిగా అందరి కోసం కొలువై ఉన్నాడు.....😊🍕🎂🍧🍦🍨💐🙏

No comments:

Post a Comment