Monday, March 28, 2022

శ్రీయాదగిరి లక్ష్మీనారసిమ్హస్వామి వారి నూతననిర్మిత ఆలయ మహకుంభసంప్రోక్షణోత్సవ శుభాభినందనలు.....💐🍧🍨🙏🍕🎂👍🍦😊🎇

శ్రీ ప్లవ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ఏకాదశి 2022-మార్చ్-28 యొక్క సుముహూర్తంలో,
శ్రీలక్ష్మీనారసిమ్హుడి నూతన నిర్మిత యాదాద్రి ఆలయ మహారాజగోపురాల కలశాలకు / గర్భాలయ గోపురోపరి ముఖ్య కలశమైన శ్రీసుదర్శనాళ్వారుల ప్రతిరూపమైన స్వర్ణవర్ణశోభిత నూతన చక్రానికి, ఇతర ఉపాలయాల / గోపురాల కలశాలకు మహాకుంభసంప్రోక్షణం గావించి,
బాలాలయం నుండి గర్భాలయానికి మూలవర్ల శక్తిస్థిరీకరణతో భక్తులందరికి గర్భాలయ పునర్దర్శనం సంప్రాప్తింపజేసే మహాక్రతువులో పాల్గొని విహిత ధర్మాన్ని నెరవేర్చిన గౌ || ముఖ్యమంత్రి వర్యులకు ఆశీర్వచనాలను అందజేస్తున్న ఆలయ ప్రధానార్చకులు మరియు ఇతర వేదవిద్వణ్మూర్తులు.....

ఒక 100+ గజాల్లో కట్టుకున్న చిన్నపాటి 2 బి.హెచ్.కె ఇంటికే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, గృహప్రవేశం పేరిట ఎన్నో శాస్త్రోక్త కార్యక్రమాలతో ఇంటిని
పవిత్రం / శక్తివంతం / నివాసయోగ్యం గావించి అందులో సుఖశంతోషాలతో జీవించాలని ఆశిస్తామే....

అటువంటిది, కొన్ని వందల సంవత్సరాల పర్యంతం నిలిచేలా, కొన్ని వేల గజాల్లో కొలువుతీరి, నిత్యం లక్షలాది భక్తులకు ఆవాసమై ఉండి కోట్లాది ప్రజల మనోభీష్టములను నెరవేర్చే ఒక బృహత్ వైదిక ఆగమ శాస్త్రోక్త కట్టడం, భక్తులెల్లరికి అందుబాటులోకి రావాలంటే అందుకు ఎంతటి దీక్షాదక్షత, కృషి, ఆర్ధిక, హార్దిక కేటాయింపులు, ఆగమోక్త విధంగా వివిధ అర్చారాధనలు ఉంటాయో ఎల్లరికీ తెలిసిందే....

ఆరితేరిన రాజనీతిజ్ఞ్యుడిగా,
తలపండిన రాజకీయనేతగా,
భాషావేత్తగా,
తెలుగు పండితుడిగా,
నవ తెలంగాణ రాష్ట్ర నిర్మాణకర్తగా,
సుపరిచితులైన గౌ || ముఖ్యమంత్రివర్యులు, శ్రీ కేసీఆర్ గారు, అధ్యాత్మతత్త్పరత గల భక్తులు కూడా కావడం మన భాగ్యవిశేషం....

అందుకే ఇంతటి విశేషపుణ్య క్రతువును వారి హయాంలో సార్ధకపరిచిన సహృదయులైన అధికారులుగా భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో శాశ్వతంగా తమ వైభవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించుకొని శ్రీయాదాద్రిలక్ష్మీనారసిమ్హుడి శ్రీపాదదాస్యంలో తరించి ఎల్లరినీ తరింపజేసినారు....

శ్రీరాజశ్యామలాదేవి / శ్రీచండీమాత / శ్రీవేంకటేశ్వరుడు / ఇత్యాదిగా ఎందరో శక్తివంతమైన దేవీదేవతల మిక్కుటమైన అనుగ్రహానికి పాత్రులై, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి యొక్క అధ్యాత్మ తేజస్సు కూడా 
వేదఘోషాంతర్భాగంగా నూతన శ్రీసుదర్శనచక్రత్తాళ్వారులకు 
సంప్రోక్షణభరితంగా అందివ్వబడడంతో శ్రీలక్ష్మీనారసిమ్హుడి వైభవం మరింతగా ఇనుమడింపబడనున్నది.... 

ఎక్కడరా నీ శ్రీహరి ...?
అంటూ కన్నూ మిన్నూ కానని గర్వంతో తన పుత్రరత్నమైన ప్రహ్లాదుడిపైకి ఆనాడు సిగ్గూశరం లేకుండా దైవదూషణ గావించిన దావవుడికి ఒక స్తంభం కూడా శ్రీహరికి ఆవాసం కాగలదు అంటూ 
శ్రీఉగ్రనారసిమ్హుడిని ఆనాడు బయల్పరిచిన భక్త ప్రహ్లాద భక్తికి తార్కాణంగా ఉండేలా ప్రతీ కృష్ణ శిలా స్తంభంలో / ప్రతి గోపురంలో ఉట్టిపడే జీవకళతో దైవిక తేజస్సుతో అలరారే అద్భుతాలయం భక్తులెల్లరికీ అందుబాటులోకి రావడం నిజంగా చాలా హర్షించవలసిన విశేషం..... 

అక్కడక్కడా మిగిలిన ఇతర చిన్న చిన్న పనులు కూడా పూర్తిగావింపబడి, త్రాగునీరు / శౌచాలయాలు / సత్రాలు / ఇత్యాదిగా భక్తులకు ఉపయుక్తమైన సదుపాయాలతో సకల శ్రేయోదాయక శ్రీయాదాద్రి శ్రీలక్ష్మీనారసిమ్హాలయం భక్తులెల్లరి మనోభీష్టములను
నెరవేర్చే మహా దైవిక సంపదగా కలిగిన తెలంగాణ రాష్ట్ర కీర్తి మరింతగా దశదిశలా వ్యాప్తి గావింపబడాలని ఆశిస్తూ....ఎల్లరికీ శ్రీయాదగిరిగుట్ట లక్ష్మీనారసిమ్హస్వామి వారి నూతననిర్మిత ఆలయ మహకుంభసంప్రోక్షణోత్సవ శుభాభినందనలు.....💐🍧🍨🙏🍕🎂👍🍦😊🎇

No comments:

Post a Comment