ప్రయుక్త 2022 మహాశివరాత్రి పర్వదిన శుభాభినందనలు....
💐🍦🎂🍧🍕🍨😊
మహాశివరాత్రి మహోత్సవం అనగానే,
మన పెద్దలు అనాదిగా మనకు బోధించిన ఉపవాసం, శివాలయ శివశివాదర్శనం / అభిషేకం / కళ్యాణం / జాగరణ / ఇత్యాది శివరాత్రి పర్వసమయ విధి మరియు టీవీల్లో వివిధ ఆధ్యాత్మిక వేత్తల / ప్రవచనకర్తల పరమేశ్వరవైభవం గురించిన ఆధ్యాత్మిక విశేషాల వివరణ....
ఇత్యాదిగా శివరాత్రి అనే మహోత్కృష్ట పర్వప్రాభవం ఎల్లరికీ తెలిసిందే.....
వివిధ శివశివా తత్త్వ విశేషాల గురించి నా పాత పోస్ట్లల్లో వివరించి ఉన్నారు....
వాటికి అనుబంధం గా మరికొంత మహేశ్వర వైభావన్ని తర్కించి తరించే ప్రయత్నంగావిద్దాం....
" శం కరోతి ఇతి శంకరః..." అంటూ ఎంతో సరళంగా మరియు అంతే గంభీరంగా, శ్రీ చాగంటి సద్గురువులు వారి వివిధ ప్రవచనాల్లో వివరించి ఉన్నాను...
ఒక వైపు లయ కర్త / రుద్రుడు / హరుడు / ఉన్మత్తశేఖరుడు / రుద్రభూమి లో నివసించేవాడు / అగ్ని ని మూడో కన్నుగా పెట్టుకొని ఎవ్వరినైనా భస్మం చేయగల కోపి / నాగులను ఆభరణాలుగా ధరించి / విభూతిని తన తిరుమేణికి అలదుకొని / హాలహలాన్ని గళమునందు ఓడిసిపట్టి / గంగను జటాజూటంలో బంధించి / శుద్ధ తదియ నాటి చంద్రరేఖని సిగలో ఆభరణంగా ధరించి / ఏనుగుతోలు ను వస్త్రంగా కలిగి / త్రిశూలానికి ఢమరుకం కట్టుకొని డోలు వాయిస్తూ తిరిగే అత్యంత విచిత్రమైన వ్యక్తిత్త్వాన్ని /
శివుడు అని నిర్వచించడం.....
ఆ శివుడే సర్వమంగళాదేవికి పతిగా ఉండి...
సర్వేశ్వరుడు అన్ని అమంగళాలను హరిస్తూ హరుడిగా ఆరాధింపబడుతుంటే.....
సర్వేశ్వరి అన్ని మంగళాలను అనుగ్రహిస్తూ "సర్వమంగళా సద్గతిప్రదా" గా లలితాసహస్రంలో స్తుతింపబడుతూ ఎల్లరికీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు....
ఈశ్వర స్పృహ లేకుండా కేవలం తినడం కోసమే జీవిస్తున్నామా....
లేదా ఈశ్వర స్పృహతో జీవించేందుకు తింటున్నామా.....
అనే విషయంపై అవగాహనతో జీవించే వారికి శివశివానుగ్రహం మెండుగా ఉందని అర్ధం.....
పదార్థం లో కేవలం ప్రకృతిని చూసే స్థాయిలోనే ఉండడమా...
లేదా ప్రకృతి జనితమైన పదార్ధం ఈశ్వర నివేదన గావింపబడి ప్రకృతిలోనే పరమాత్మను దర్శించగలిగే ఉన్నతమైన స్థాయికి జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమా....
అనే విషయంపై అవగాహనతో జీవించే వారికి శివశివానుగ్రహం మెండుగా ఉందని అర్ధం.....
ఇతరుల్లో ఉండే ఈశ్వరానుగ్రహమైన విభూతిని గుర్తించి గౌరవించగలిగే స్థితిలో జీవించగలిగినప్పుడు వారికి శివశివానుగ్రహం మెండుగా ఉందని అర్ధం.....
ఎప్పుడు అణకువతో ఉండాలో....
ఎప్పుడు గంభీరంగా ఉండాలో....
ఎప్పుడు మాటల్లో మౌనం ఎక్కువగా, మృదువైన మాటలతో సంభాషణ తక్కువగా ఉండాలో.....
ఎప్పుడు మౌనాన్ని తగ్గించి మాటల్లో విజృంభించాలో....
ఎదుటి వ్యక్తి మదిలో మెదిలే ఆలోచనలకు అనుగుణంగా ఎవరితో ఎప్పుడు ఎందుకు ఎలా
ఏ పద్ధతిలో (సామ దాన భేద దండోపాయాల్లో....)
వ్యవహరించాలో....
ఇత్యాదిగా ఎన్నో ఎన్నెన్నో విషయాల్లో
లౌక్యంతో వ్యవహరించగలిగినప్పుడు
శివశివానుగ్రహం మెండుగా సమకూరిందని అర్ధం.....
చక్కగా జోకులు వేస్తూ పై అధికారుల నుండి బాగా సొమ్మును రాబడుతూ తన క్రింద చాకిరి చేసే వారిలో కొందరికి ఏమి ఇవ్వకుండా,
తన క్రింద పనిచేసే వారిలో కుల/ప్రాంతీయ భావాల వైషమ్యాలతో, ఓర్వలేని విధంగా వ్యవహరించే పై అధికారి యొక్క సంకుచితత్త్వాన్ని గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించడంలో శివశివానుగ్రహం అనేది ఆవశ్యకమైనది....
మనము మనము బ్రాహ్మిన్స్ / పైగా పక్క పక్కనే ఉండే ప్రాంతాలకు చెందిన వారము అంటూ మంచిగా మాట్లాడి సంస్థకు కొత్తగా వచ్చిన తన పైఅధికారిని బుట్టలో వేస్కొని, ఆ అధికారి ఇచ్చిన చనువుతో, చక్కని ఒద్దికైన మాటలతో పై అధికారుల నుండి బాగా సొమ్మును రాబడుతూ తన క్రింద చాకిరి చేసే వారికి అందులో కొంత ప్రసాదించినందుకు...
ఎంతో నిజాయితీతో పనిచేసినా కూడా....
ఇక శని ఆది వారాల్లో, సెలవుదినాల్లో కూడా కుక్కచాకిరి చేయాలి అంటూ....
ఇన్నాళ్ళు మాటల్లో చూపిన మంచిమరియాదా మాయమై, కొత్తగా వచ్చిన పై అధికారి యొక్క అండదండలతో తన క్రింద పనిచేసే వారికి వస్తున్న మంచి పేరుని ఓర్వలేక.....
" నేను చెప్పినట్టే 24x7 చాకిరి చేయకపోతే......"
అంటూ ఎంతో కఠినమైన స్వరంతో చూపుడు వేలిని ఎత్తి చూపిస్తూ బెదిరించే స్థాయికి...
అవతలి వ్యక్తి యొక్క మాట తీరు దిగజారిన వైనాన్ని గుర్తించి
" అయ్యా...మీకు, మీ మెంటల్ టార్చర్ కు ఒక నమస్కారం...." అని గౌరవభరితంగా మాట్లాడి....
తన క్రింది స్థాయి సిబ్బంది యొక్క ఎదుగుదలను ఓర్వలేని ఆ వ్యక్తితో జాగ్రత్తగా వ్యవహరించడంలో శివశివానుగ్రహం అనేది ఆవశ్యకమైనది....
అనవసరమైన ఇతరుల వ్యక్తిగత సంప్రదాయ వేషధారణ పట్ల కనీస అవగాహన కూడాలేకుండా,
ఒక ఉన్నతాధికారి ని అనే సోయి కూడా లేకుండా....
చీప్ గా అందరి పైనా కామెంట్స్ వేస్తూ.....
వాళ్ళ టీం తో రోజు లంచ్ కి రాకపోవడం కూడా ఒక పెద్ద ఇష్యూ చేస్తూ.....
బొట్టు కొంచెం పెద్దగా పెట్టుకున్నంత మాత్రాన.....
"Office ko black magic karnay aare kya...Mere Team ke saath lunch ko nahi aatayhona... Dekhoongaa is team may kaisay grow hoga tu..... "
అంటూ ఒక మరాఠి మూర్ఖ అధికారి వాడి క్యాబిన్ ఉండి బయటికి వచ్చి ఏకంగా డెస్క్ దగ్గరికే వచ్చి బెదిరించే స్థాయికి దిగజారినప్పుడు....
[ వాడి పై అధికారి చాలా మందికి అధికారి అయిన అమెరికాలో ఉండే మరాఠి వ్యక్తి.
అతణ్ణి ఎంతగా బుట్టలో వేస్కోకపోతే ఇక్కడ ఇండియాలో ఇంతగా దిగజారి బెదిరించే స్థాయికి వీడి ఆగడాలు శృతిమించుతాయ్...? ]
ఇద్దరు తోటి బృంద సభ్యులను ఏదో డౌట్ గురించి కొంచెం వెంటవెంటనే పింగ్ చేసి సహాయాన్ని అర్ధించిన ఒక చిన్న విషయాన్ని అనవసరంగా ఏదో లోకం మునిగిపోయే ప్రళయంలా చేసి,
ఆఫీస్ ఫ్లోర్ లో ఎంతో మంది చూస్తుండగా పిలిచి...
అయ్యో ఇలా నేను ఒక జూనియర్ వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో తిట్టొచ్చా....
అనే సోయి కూడా లేకుండా ప్రవర్తించిన ఒక బృంద సభ్యురాలు గారి అసలైన సమస్య ప్రాంతీయతావైషమ్యం అని పసిగట్టి.....
ఆఫీస్లో అనవసరమైన ఇటువంటి ప్రాంతీయ వాద వైషమ్యాలకు ఆజ్యంపోస్తూ పక్కన క్యాబిన్ లో ఉండే ఒక ఉన్నతాధికారి అండగా ఉండడంతో...
ఆఫీస్ ఫ్లోర్ పై ఇలాంటి వ్యక్తుల మధ్యన ఎంత కష్టపడినా అది బూడిదలో పోసిన పన్నీరులా వృథాప్రయాస అని వెంటనే గుర్తించి
"మీ అందరికి ఒక నమస్కారం.... "
అని చెప్పి అటువంటి సంకుచిత స్వభావాల వ్యక్తులకు దూరంగా ఉండేలా జాగ్రత్తగా వ్యవహరించడంలో శివశివానుగ్రహం అనేది ఆవశ్యకమైనది....
ఇలా శివశివానుగ్రహం అనేది సకలదేవతానుగ్రహాన్ని వర్షింపజేసే ఒక చింతామణి వంటిది......
శ్రీ చాగంటి సద్గురువులు వారి శ్రీమద్భాగవత ప్రవచనంలో ఒక దెగ్గర.....
"లోకంలో ఎక్కడైనా వాలిన భక్తి....
కూర్చున్న భక్తి....నిల్చున్న భక్తి.....ఉంటుందా....?
మరి పోతనామాత్యులవారు ఎందుకు అలా
"వాలిన భక్తి మ్రొక్కెద..." అంటూ పద్యాన్ని రాసారు....."
అనే విషయాన్ని ప్రస్తావించడం కొందరికైనా గుర్తుండిఉండాలి......
****
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయా
శాలికి, శూలికిన్, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్,
బాల శశాంక మౌళికిఁ, గపాలికి, మన్మథ గర్వ పర్వతో
న్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్.
భావము:
అనంత లీలాతాండవలోలుడైన పరమ శివునికి, మిక్కిలి దయ గలవానికి, త్రిశూల ధారికి, పర్వతరాజ పుత్రి పార్వతీదేవి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుఱ్ఱెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వం అణిచేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించే వానికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను.
*****
మనతో సహా యావద్ విశ్వాన్ని సృజించిన పరమేశ్వరుడికి మనం ఇవ్వగలిగేది ఏముంటుంది....?
1. ఈశ్వర సృష్టి లోని పదార్ధాన్నే నైవేద్యం గా ఒక పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈశ్వరుడికి సమర్పించడం....
2. మనః పూర్వకంగా నమస్కరించడం.....
మొదటిది ఎవ్వరైనా చేయగలరు.....
రెండవది భక్తి గల వారు మాత్రమే చేయగలరు....
కాయలతో, పళ్ళతో నిండుగా ఉన్న కొమ్మ మాత్రమే క్రిందికి వాలి వాటిని ఆశ్రయించిన వారికి అందించగలదు.....
సొ, ఇక్కడ వాలడం అంటే నిండైనా మనసుతో ఈశ్వరుడికి మన మనసును అర్పించడం అనే అర్ధంలో సహజకవి శ్రీపోతనామాత్యులవారు అలా
"వాలిన భక్తి" అని అందుకున్నారు....వారి కలాన్ని....మరియు కాలానికే కాలుడైన శ్రీకాళేశ్వరుడి అనుగ్రహాన్ని కూడా...
ఎల్లరూ నిన్నటి మహాశివరాత్రి మహోత్సవంలో ఈశ్వరుడికి మనఃపూర్వకంగా నమస్కరించి అనుగ్రహాన్ని బడసి తరించి ఉంటారు....
ఈశ్వరుణ్ణి సగటు సాధారణ మనిషి నమస్కరించడం వేరు....
ఈశ్వరుణ్ణి వేదసారస్వతం నమస్కరించడం వేరు....
వైదిక వాంజ్మయం ఎంత గొప్పగా ఈశ్వరుణ్ణి నమస్కరించగలదో శ్రీ రుద్ర నమకం చమకం పై అవగాహన గలవారికి తెలిసే అంశం...
"
నమో’ భవాయ’ చ రుద్రాయ’ చ నమః’ శర్వాయ’ చ పశుపత’యే చ నమో నీల’గ్రీవాయ చ శితికంఠా’య చ నమః’ కపర్ధినే’ చ వ్యు’ప్తకేశాయ చ నమః’ సహస్రాక్షాయ’ చ శతధ’న్వనే చ నమో’ గిరిశాయ’ చ శిపివిష్టాయ’ చ నమో’ మీఢుష్ట’మాయ చేషు’మతే చ నమో” హ్రస్వాయ’ చ వామనాయ’ చ నమో’ బృహతే చ వర్షీ’యసే చ నమో’ వృద్ధాయ’ చ సంవృధ్వ’నే చ నమో అగ్రి’యాయ చ ప్రథమాయ’ చ నమ’ ఆశవే’ చాజిరాయ’ చ నమః శీఘ్రి’యాయ చ శీభ్యా’య చ నమ’ ఊర్మ్యా’య చావస్వన్యా’య చ నమః’ స్త్రోతస్యా’య చ ద్వీప్యా’య చ || 5 ||
"
కూకట్పల్లిలోని మా శ్రీచైతన్య కాలేజ్ కి దెగ్గర్లో ఉండే నారాయణాశ్రమంలోని అత్యంత అరుదైన ఆలయం,
శ్రీ భువనేశ్వరి సహిత ద్వాదశజ్యోతిర్లింగేశ్వర స్వామి వారి సన్నిధిలో లింగోద్భవకాల మహన్యాస పూర్వక రుద్రాభిషేకం / జాగరణ లో నేను కూడా ఈశ్వరుడికి నమస్కరించి తరించినాను....
🙏🙏🙏🙏🙏💐🎂🍦🍧🍨😊
No comments:
Post a Comment