Saturday, March 19, 2022

శ్రీలక్ష్మీ జయంతి 2022/ శ్రీ ఫాల్గుణ పౌర్ణమికి క్షీరసాగర తనయగా శ్రీలక్ష్మీ ఆవిర్భావఘట్టాన్ని శ్రీమద్భాగవతపురాణం పేర్కొన్న పర్వం / మరియు శ్రీ తరిగొండ వెంగమాంబ తపోభూమి గా విరాజిల్లే తుంబురుతీర్థ ముక్కోటి పర్వోత్సవం...


క్షీరసాగరమథన ప్రవచనంలో శ్రీ చాగంటి సద్గురువులు పేర్కొన్నట్టుగా, సాగరతనయ గా ఉద్భవించిన తదుపరి అక్కడ ఉన్నవారందరిని శ్రద్ధగా పరికించి, "నల్లనివాడు పద్మనయనంబుల వాడు...." గా కీర్తింపబడిన శ్రీమహావిష్ణువును ఏరికోరి వరించి, " శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమః " అని సంకల్పంలో నిత్యం పఠింపబడే స్థితికార వైభవానికి శ్రీకారం చుట్టబడిన రోజు ఫాల్గుణ పౌర్ణమి శుభపర్వం....😊🍧🍨🍕🎂💐🍦

"లక్ష్మ్యతే ఇతి లక్ష్మీ" అనే వ్యుత్పత్తిని వివరిస్తూ శ్రీ చాగంటి సద్గురువులు బోధించినట్టుగా,
ఒక సూచికగా / ఒక గుర్తు గా / భాసించే తత్త్వమే శ్రీలక్ష్మీ తత్త్వం....

ఇంద్రకృత శ్రీమహాలక్ష్మీ అష్టకం లోని ఈ క్రింది శ్లోకాల్లో స్తుతింపబడినట్టుగా శ్రీమహావిష్ణునాభికమలజులైన బ్రహ్మగారిలా, ఆవిడ పద్మాసనస్థిత గా అలరారే పరబ్రహ్మస్వరూపిణి.....

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే ||7||

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే ||8||

శ్రీ చాగంటి సద్గురువుల శ్రీమద్భాగవత ప్రవచనాలు విన్నవారికి గుర్తున్నట్టుగా,
ఆధ్యాత్మిక పరంగా, అన్నా చెల్లెళ్ళు గా చెప్పబడే 

1. బ్రహ్మదేవుడు, లక్ష్మీ దేవి
(సృష్టి కర్తృత్వం......
అన్ని రకాల తత్త్వాలను సృజించే వారు...) 

2.విష్ణుదేవుడు, పార్వతీదేవి 
( స్థితి కారులైన నారాయణా నారాయణీ )

3. శివుడు, సరస్వతీ దేవి
(లయ కర్తృత్వం....
అన్ని రకాల అజ్ఞ్యానాలను లయం గావించే వారు )

ఇక్కడ అర్ధం చేసుకోవలసిన విషయం ఏంటంటే....

ఒకే పరతత్త్వం వివిధ కారణాలకు వివిధ తైజసిక స్వరూపాలను స్వీకరించడం అనేది దేవతాంశల యొక్క ప్రత్యేకత కాబట్టి,

ఒక పరతత్త్వం ఒక కారణానికి పుం స్వరూపం స్వీకరించి......
అదే కారణానికి స్త్రీ స్వరూపం స్వీకరిస్తే వారిని అన్నా చెల్లెళ్ళు గా శాస్త్రం ఉటంకించడం... 

ఒక పరతత్త్వం ఒక కారణానికి పుం స్వరూపం స్వీకరించినప్పుడు...
తద్ అభిన్నమైన శక్త్యాంశగా ఒక స్త్రీ స్వరూపం నిత్యాన్నపాయిని గా చెప్పబడినప్పుడు వారిరువురిని జంటగా చెప్పబడి భార్య భర్తలుగా ఉటంకించడం అనేది ఇక్కడ శాస్త్రం యొక్క వైభవ విశేషం అని విజ్ఞ్యులు గుర్తించవలె.....

సదరు జీవుడి సృష్టి కార్యంలో బ్రహ్మగారు లక్ష్మీ అమ్మవారి వైపు చూసి
" ఎంత లక్ష్మీ కటాక్షం రాయమంటావు ఈ జన్మలో ఈ పుర్రెకి...?"

అని అడిగినప్పుడు ఆవిడ యొక్క స్మితవదన పూరిత సమాధానం మరియు భృకుటి ముడివేసిన వదనంతో ఉండే సమాధానం అనేది సదరు జీవ ధారకుడి శ్రీలక్ష్మీ అనుగ్రహాన్ని శాసించే సూచికయై ఉంటుందని శ్రీ చాగంటి సద్గురువుల శ్రీమద్భాగవత ప్రవచనంలో తెలిపి ఉన్నారు......

" దేశకాలములను గుర్తించి పాత్రతను ఎరిగి ఒక్క రూపాయి కూడా దాన ధర్మాలు చెయ్యని జన్మలే వారివి అధికం.....కాబట్టి నా అనుగ్రహం శూన్యం...."
అని భృకుటి ముడివేసిన వదనంతో ఆవిడ సమాధానం ఇస్తే ఇక ప్రస్తుత జన్మలో ఆ దేహధారి అన్నపానీయాలకు కూడా దేహి దేహి అంటూ జీవించే బ్రతుకే అవుతుంది......

అట్లుకాక, యోగ్యులైన వారికి దేశకాలములను గుర్తించి పాత్రతను ఎరిగి మనస్పూర్తిగ గావించిన దాన ధర్మాలకు సంతసించే శ్రీలక్ష్మీ అమ్మవారి స్మితవదన సమాధానం ప్రస్తుత జన్మలో ఆ దేహధారి ఇతరులకు అన్నపానీయాలను దానం చేస్తూ జీవించే వైభవం తో ఉండడం.....

అనే విరించి లలాట లిఖిత ప్రక్రియలో నిక్షేపింపబడి సూచింపబడే అధ్యాత్మ తత్త్వం శ్రీలక్ష్మీ తత్త్వం అని అంటే అది విశ్వసించడంలో గొప్పదనం ఉంటుంది కాని, వితండవాదం చేయడంలో కాదు అని నేనంటే కొందరు మాడర్న్ హేతువాదులకు ఒక సినిమా స్టోరీలా అనిపించవచ్చేమో.....

ఈ లౌకిక ప్రపంచంలోని అత్యంత సామాన్యమైన ఒక ఎగ్సాంపుల్ తీస్కుంటే.....

చిటికెడంత ఉండే ఒక నానో సిం లో బుట్టెడంత 
ఇన్ఫర్మేషన్ దాగుండి అని నమ్మి ఒక మొబైల్ ఫోన్లో సిం వేసి యాక్టివేట్ చేసిన తదుపరి ఆ ఇన్ఫర్మేషన్ ని పొంది విశ్వసించే ఆధునిక మనిషికి....

పైన ఉటంకింపబడిన బ్రహ్మగారి లలాట లిఖిత ప్రక్రియ ఎందుకు నమ్మశక్యంగా ఉండదు అని ప్రశ్నిస్తే తెల్ల మొహం వేయడం వినా ఈ ఆధునిక మనిషి మరేం మాట్లాడగలడు...?

ఇదే విధంగా సూక్ష్మంలో మోక్షం...... అన్నట్టుగా......
వివిధ స్థాయిల్లో ఉండే సూచికల్లోనే వివిధ తత్త్వ సర్వస్వం ఇమిడి ఉండి అదియే శ్రీలక్ష్మీ తత్త్వం అనబడినప్పుడు అది విశ్వసించిన వారే శ్రీలక్ష్మీ అనుగ్రహానికి పాత్రులౌతారు అని అనడం ఎంత మాత్రము అతిశయోక్తి కానేరదు.....!

ఇక ఎవ్విధంగా ఆ వివిధ సూక్ష్మ తత్వాలను స్థూల రూపంలోకి ఆకళింపుజేసుకొని తరించాలి అనేది మనం ఆరాధించే సద్గురువులపై ఆధారపడి ఉండే అంశం.....!!

అందుకే అన్నారు......

" స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే | " 

అని....

శ్రీమదలర్మేల్మంగా పద్మావతీ సమేత శ్రీశ్రీనివాస పరబ్రహ్మణే నమః ...
🙏🍨🍧🍦🎂💐🍕😊

No comments:

Post a Comment