Sunday, March 13, 2022

శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి హార్దిక జన్మదిన శుభాభినందనలు......💐😊🍕🎂🍨🍧🍦🙏


గౌ|| నిజామాబాద్ శాసన మండలి సభ్యులు, ఎంతో మందికి నిత్యం అందుబాటులో ఉంటూ తెలంగాణ ప్రజానీకానికి కవితక్క గా సుపరిచితులై వివిధ జాతీయ అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ప్రజానాడికి ప్రతిరూపంగా నిలిచి, ఎల్లరిచే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఆదరాభిమానాలను చూరగొనేలా వివిధ జనజాగృతి కార్యక్రమాల్లో అందరినీ మమేకం గావిస్తూ...,
ఆదరణ కరువైనందుకే ఎందరో తెలంగాణ ప్రజల ప్రతిభాపాటవాలు ఈ లోకానికి తెలిసిరాలేదు.... 
శ్రద్ధతో కూడిన పరస్పర గౌరవ ధోరణిలో ఇక్కడి ప్రజానీకానికి తగు ప్రోత్సాహాన్ని అందిస్తే ఆకాశమే హద్దుగా సాగే వీరులు, వరిష్ఠులు,
పండితులు, ప్రౌఢ కావ్య రచయితలు,
సాంకేతిక నిపుణులు, సకల కళాపోషకులు ఇత్యాదిగా ఎన్నో రంగాల్లో రాటుదేలిన ఎందరో మహానుభావులకు ఈ నేల నెలవు అనే సత్యాన్ని లోకానికి తెలిసివచ్చేలా చేసే మీ వివిధ కార్యక్రమాల ద్వారా ఎందరికో దక్కిన గౌరవం ఎల్లరికి తెలిసిందే....

తెలంగాణ వైభవాన్ని బహు వర్ణరంజితంగా లోకానికి తెలియజేసే బ్రతుకమ్మ పండగ పాటకు ఏ.ఆర్ రెహ్మాన్ గారు సంగీతాన్ని అందించేంతగా సంస్కృతి సంప్రదాయాలపట్ల మీ యొక్క కృషి సదా అభినందనీయమైనది...

మరెందరో ఆశావహులకు మీ ప్రజా ప్రస్థానం నిరంతరం ఆపన్నహస్తమై ఉంటూ,
మీ రాజనీతి ప్రస్థానం దినదినప్రవర్ధమానమై, యావద్
భారతదేశం గర్వించే రీతిలో మీ ప్రజాసేవ కొనసాగాలని ఆకాంక్షిస్తూ, Wishing one of the most sober polity professionals of India, Smt Kavitha gaaru, a very happy and a prosperous birthday....🙏🍦🍧🍨🎂🍕😊💐

No comments:

Post a Comment