Tuesday, April 22, 2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పంచమి నుండి చైత్ర శుద్ధ నవమి, 2025 ఏప్రిల్ 2 నుండి 6 వరకు వరకు, 5 రోజుల అత్యంత వైభవోపేతమైన శ్రీపాంచరాత్రగమోక్త శ్రీమదలర్మేల్మంగాపద్మావతీఅండాళ్ సమేత శ్రీశ్రీనివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాంతర్గత శ్రీశ్రీనివాసకళ్యాణ విశేషాలను కొంత పరికిద్దాం...

శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పంచమి నుండి చైత్ర శుద్ధ నవమి, 2025 ఏప్రిల్ 2 నుండి 6 వరకు వరకు, 5 రోజుల అత్యంత వైభవోపేతమైన శ్రీపాంచరాత్రగమోక్త శ్రీమదలర్మేల్మంగాపద్మావతీఅండాళ్ సమేత శ్రీశ్రీనివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాంతర్గత శ్రీశ్రీనివాసకళ్యాణ విశేషాలను కొంత పరికిద్దాం...

"శుభం కరోతు కళ్యాణం" అని ఆర్యోక్తి...
శుభం అనగా ఏంటి..? ఎవరికి..? ఎట్లా..? ఎందుకు..? 
అనే ప్రశ్నలు ఉదయించడం సహజం...

ఇక్కడ భగవద్ కళ్యాణం అనగా లోకకళ్యాణం అని భావించవలెను...

అది ఎట్లో ఈశ్వరానుగ్రహంగా కొంత పరికిద్దాం...

భగవద్ కళ్యాణంలో పాల్గొనే భక్తుల మనోభావాలను, ప్రార్ధనలను క్షుణ్ణంగా ఆలకించే "మనోజ్ఞ్య" శ్రీమహాలక్ష్మి అమ్మవారు....అని శ్రీచాగంటి సద్గురువులు ఒకసారి ప్రవచించడం కొందరు విజ్ఞ్యులకైనా గుర్తుండే ఉంటుంది...
ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మావారు,
ఆ ప్రకృతి తన అధీనంలో ఉండే పరమాత్మ ఎవ్విధంగా అనుగ్రహిస్తే భక్తులు తరిస్తారో అనే అంశంలో చక్కని చల్లని ఎరుక గల శ్రియః కారిణి ఆ "సర్వభూతహితప్రదాం" అయిన శ్రీమదలర్మేల్మంగాపద్మావతీదేవి...

ఫర్ ఎగ్సాంపుల్.....

ఒక భక్తుడు ...
"ఓ శ్రీశ్రీనివాస....ఒక చక్కని పుస్తకాన్ని అనుగ్రహించి నా జీవితాన్ని తరింపజేయు స్వామి..." అని మనసులో ప్రార్ధిస్తున్నాడు అని అనుకుందాం...

ఈ లోకంలో ఎన్నో సబ్జెక్ట్లకు సంబంధించిన ఎన్నెన్నో పుస్తకాలు ఉండడం ప్రకృతిధర్మం....

సదరు భక్తుడి యొక్క ప్రస్తుత స్థితిగతులను, దశాంతర్దశలను, 
సంచితప్రారబ్ధాగామి కర్మఫలితాలను, క్షుణ్ణంగా పరికించి...
ఏ పుస్తకం లభిస్తే సదరు భక్తుడికి శ్రేయస్కరమో....
ఏ పుస్తకం అనుగ్రహింపబడడం వల్ల సదరు భక్తుడు తరించి, సహృదయులైన సాటి భక్తులను కూడా తరింపజేస్తాడో...
ఇత్యాదిగా మొత్తం కార్యకారణసిద్ధాంతాన్ని దర్శించే పరమాత్మ...

పురుషకారిణి, ప్రకృతిస్వరూపిణి అయిన అమ్మవారికి....
"దేవి..బ్రహ్మవిష్ణుశివాత్మిక అయిన ఓ కాలస్వరూపిణి....
మన భక్తుడి ఉద్ధరణకు సదరు పుస్తకం లభించేలా దేశకాలస్థితిగతులను సవరించు..." అని సెలవివ్వగా...
అమ్మవారు అట్లే ఈ ప్రపంచాన్ని వ్యవస్థీకరించును...

ఈశ్వరస్పృహ లేని జీవితంలో ఉండే వారికి మరియు ఈశ్వరుడిపట్ల చక్కని భక్తితో ఉండే వారికి, కోరికలు సమానమే..

భక్తిరాహిత్యంతో జీవించే వారి...
"ఒక మంచి పుస్తకం దొరికితే బావుణ్ణు కద.." అనే కోరిక..
ఏ మన్త్లి మాగ్జీనో, ఏ చందమామ కథలో, ఏ మరో ఇతర కేవల లౌకికాంశభరిత పుస్తకమో లభించి ఓ వారంపాటు చదువుకుంటారు...

భక్తిప్రపత్తితో జీవించే వారి
"ఒక మంచి పుస్తకం దొరికితే బావుణ్ణు కద.." అనే కోరిక....
విజ్ఞ్యుల నిర్వహణలో ఉన్న చక్కని పుస్తకవిక్రయశాలలో, 
వివేకానందుల జీవితవైభవానికి సంబంధించిన పుస్తకమో....,
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల జీవితవైభవానికి సంబంధించిన పుస్తకమో....,
శ్రీవేంకటాచలమహాత్మ్యానికి సంబంధించిన పుస్తకమో....,
ఒక చక్కని శ్రేయస్కరమైన శాస్త్రవైభవానికి సంబంధించిన పుస్తకమో....,
లభించి జీవితపర్యంతం తరిస్తూ ఉంటారు...

ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే....

భక్తిరాహిత్యంతో జీవించే వ్యక్తులు వెచ్చించిన వారి సమయశక్తియుక్తివిత్తం అనేది ఒకవారం / కొంతకాలం పాటు కేవలం వారి ప్రీతికి / వారి వంటి ఇతర ఇంకొందరు లోకుల ప్రీతికి మాత్రమే కారణం అయ్యింది...

భక్తిప్రపత్తితో జీవించే వ్యక్తులు వెచ్చించిన వారి సమయశక్తియుక్తివిత్తం అనేది వారి జీవితపర్యంతం ఇతర ఎందరో విజ్ఞ్యుల అభ్యున్నతికి కూడా కారణం అవుతూ ఉంటుంది...
లోకకళ్యాణం అంటే ఇదేకద...!

ఇక్కడ "ఒక మంచి పుస్తకం దొరికితే బావుణ్ణు కద...."
అనే ఎగ్సాంపుల్ కి బదులుగా మరే ఇతర సాధారణ వాస్తవిక అంశం అయినా ప్రస్తావింపబడవచ్చును...
అంతే కాని...
"నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే బావుణ్ణు కద...
ప్రధానమంత్రి అయితే బావుణ్ణు కద...
అమెరిక ప్రెసిడెంట్ అయితే బావుణ్ణు కద...
ముకేష్ అంబాని అయితే బావుణ్ణు కద...
మెగాస్టార్ చిరు అయితే బావుణ్ణు కద...."
అనే అతిశయభరిత కోరికల ప్రస్తావన గురించి కాదు అని విజ్ఞ్యులు గమనించవలె....

అంటే అలాంటి అతిశయభరిత కోరికలు భగవంతుణ్ణి కోరకూడదా అని అంటే....
ఎవ్వరు ఏం కోరుకున్నాకూడా అది భక్తుడికి భగవంతుడికి సంబంధించిన ఆంతరంగిక అంశం...
కాని ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే....
సదరు ఈప్సితం ఈడేరే దిశగా...
మన స్వయంకృషి, స్వాధ్యాయం ఎంత అనేది భగవంతుడు కూడా పరికిస్తాడు...

వారివారి ఉద్యోగ / వ్యాపారాల్లో కృషి గావిస్తూ ఏనాడు ప్రభుత్వానికి 5 అంకెల్లో పన్ను కట్టని వారు, 
"ఇప్పుడు మనం ముకేష్ అంబాని అయితే బావుణ్ణు కద...." అని అనుకోవడం / భగవంతుణ్ణి కోరడం ఎంతవరకు సమంజసం అని అలోచించడం కూడా భక్తుల విహితధర్మమౌను...

"ఇప్పుడు మనం మెగాస్టార్ చిరు అయితే బావుణ్ణు కద...."
అని అనుకునే వారు...
"స్వయంకృషి" సినిమాలో చూపినట్టుగా..
చిరంజీవి గారు వారు ఎన్నుకున్న చిత్రపరిశ్రమలో ఎంత పరిశ్రమ, స్వయంకృషి గావిస్తే మెగా స్టార్ చిరు అయ్యి ఇతర ఎందరో స్టార్లు ఇవ్వాళ స్టార్లు కావడానికి కారణం అయ్యారో అని అలోచించడం కూడా భక్తుల విహితధర్మమౌను...

అట్లే మిగతా ఎగ్సాంపుల్స్ కి కూడా వర్తించును...

ఒక మంత్రిగారినో, మరే ఇతర మాన్యులనో మరియాదా పూర్వకంగా సదరు ప్రజాప్రయోజన అంశం గురించి ప్రస్తావించి, విన్నవించడానికి వెళ్తే...
పుష్పగుఛ్చాలు, పండ్లు, సావనీర్లు, ఇతరత్రా సుహృద్భావకారక వస్తువులను తీసుకెళ్ళేది / బహూకరించేది ఎందుకు...?
ఆ మంత్రిగారి / మాన్యుల ఇంట్లో పూలకు, పండ్లకు, ఇతరత్రా వస్తువులకు కొదవనా.?
లేక...
అది ఒక మరియాదావిష్కారక పద్ధతి, గౌరవావిష్కరణ రీతి, ఇత్యాది వాటి కోసమా..?

అచ్చం అదే విధంగా...
భగవద్ సన్నిధికి / సన్నిధిలో సత్వగుణోపేత వస్తువులను / దక్షిణతాంబూలములను, భగవద్ స్వరూపంగా గౌరవింపబడే అర్చక అచార్య ముఖేన ఈశ్వరార్పణం గావించడం కూడా...

తండూలరాశి / బియ్యం చంద్రసంబంధమైన ధాన్యం...
కాబట్టి అవి ఈశ్వరార్పణం గావింపబడడంతో చక్కని మనోవైభవం / మనోబలం సిద్ధించును....

పూర్ణఫలం / మధురఫలం అయిన కొబ్బరిబోండం / అరటిపండు, భక్తుల ప్రార్ధనలకు పూర్ణప్రతిఫలాన్ని అనుగ్రహించును...

ఈశ్వరుడికి పుష్పం / పుష్పమాలా కైంకర్యం పంచోపచార ఫలాన్ని అనుగ్రహించును.

ఈశ్వరుడికి దక్షిణతాంబూల సమర్పణ....
ఆ ధన/ద్రవ్యం తో ఈశ్వరుడికి ఏఏ కైంకర్యాలు గావింపబడితే భక్తిలకు ఆయా పుణ్యఫలాలు అనుగ్రహింపబడును...

అని అనాదిగా విజ్ఞ్యుల / భక్తుల విశ్వాసం...

ప్రతీరోజు జాతీయపతాకానికి వందనం గావించడం ఒక ఎత్తు...
జనవరి-26 గణతంత్రదినోత్సవం నాడు / ఆగస్ట్-15 స్వాతంత్ర్యదినోత్సవం నాడు జాతీయపతాకానికి గౌరవవందనాలను ఆవిష్కరించడం ఒక ఎత్తు....

అవ్విధముగనే....

ప్రతీరోజు ఈశ్వరుడికి వందనం గావించడం ఒక ఎత్తు...
వార్షిక బ్రహ్మోత్సవాంతర్గత శ్రీవార్లశాంతికళ్యాణమహోత్సవంలో పాల్గొని వారివారి సమయశక్తియుక్తివిత్తాన్ని వెచ్చించి ఈశ్వరుడికి గౌరవవందనాలను ఆవిష్కరించి పుణ్యాన్ని గడించి తరించడం ఒక ఎత్తు...

మయూరవిన్యాసానికి తనువంతా వివిధవర్ణవైచిత్రిభరిత వర్ణించనలవికాని సోయగమే అన్నట్టుగా...
శ్రీవేంకటేశ్వరుడి తనువంతా వివిధశ్రీలక్ష్మీతత్త్వం నిత్యం ఆశ్రయించి ఉండును....
శ్రీవేంకటేశ్వరుడి శ్రీపాదపద్మములను నిత్యం ఆశ్రయించి ఉండే శ్రీలక్ష్మితత్త్వం యొక్క పేరు / గౌణము "అనఘాలక్ష్మి".
అనఘాలక్ష్మీ అనగా దర్శనమాత్రం చేత నిత్యం పాపభంజనం పుణ్యవర్ధనం గావించే శ్రీలక్ష్మీతత్త్వం...!

శ్రీవేంకటేశ్వరుడి తిరుముఖమండలాన్ని 
నిత్యం ఆశ్రయించి ఉండే శ్రీలక్ష్మితత్త్వం యొక్క పేరు / గౌణము "భాగ్యలక్ష్మి".
భాగ్యలక్ష్మి అనగా దర్శనమాత్రం చేత నిత్యం ఎన్నో భోగభాగ్యాలను అనుగ్రహించే శ్రీలక్ష్మీతత్త్వం...!

శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆపాదతలమస్తకమూ బాగా దర్శించండి....అని పెద్దలు ఎందుకు సెలవిస్తారో తెలుసా....?

అనగా శ్రీపతి యొక్క శ్రీపాదాలతో మొదలుకొని తిరుముఖమండలోపరి శిరోభూషణమైన స్వర్ణకిరీటంపై అమరి ఉండే మణిపూసవరకు...బాగా బాగుగా స్వామివారిని దర్శించండి అనే విజ్ఞ్యుల ఉవాచ యొక్క ఆంతర్యము ఏమనగా...

మొదట స్వామివారి శ్రీపాదయుగళాన్ని ఆశ్రయించి ఉండే అనఘాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా గైకొని పాపభంజనంతో పుణ్యవర్ధనంతో తరించి, ఆ తదుపరి స్వామివారి తిరుముఖమండలం వరకు ఆశ్రయించి ఉండే వివిధ శ్రీలక్ష్మీతత్త్వానుగ్రహాన్ని అందుకొని తరించండి....
అని భక్తులకు తెలియజేయడమే అందలి ఆంతర్యం.....

చేతినిండా చమురు ఉన్నవారికి సీసం / గాజు వస్తువులపై గ్రిప్ / పట్టు ఎట్లు లభించును...??
చేతికి ఎంత తక్కువ చమురు ఉంటే అంత ఎక్కువగా సీసం / గాజు వస్తువులపై పట్టు సమకూరును...

అచ్చం అదే విధంగా...

ఒంటినిండా పాపం ఉన్నవారికి భోగ / భాగ్యాలపై శ్రియఃకారక పట్టు ఎట్లు లభించును...??
దేహానికి ఎంత తక్కువ పాపం ఉంటే అంత ఎక్కువగా భోగ / భాగ్యాలపై పట్టు సమకూరును...

అందుకే మొదట స్వామివారి శ్రీపాదయుగళాన్ని ఆశ్రయించిన వారికి మాత్రమే స్వామివారి తిరుముఖమండలస్థిత భాగ్యలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం శ్రియఃకారక తత్త్వంగా అందివచ్చే అంశం...
లేనిచో ఆ భోగభాగ్యాలు "భోగి" నీడగా మారడానికి ఎంతో సమయం పట్టదు...
ఎందుకంటే...
చేతికి చమురు ఎక్కువగా ఉన్నా కూడా, మొదట చమురును శుభ్రంగావించడం గురించి కాకుండా చక్కనైన గాజు / సీసం 
వస్తువుల మీద పట్టుకై ప్రయాస పడితే ఆ గాజు / సీసం వస్తువు జారినప్పుడు కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు...

శ్రీచాగంటి సద్గురువులు, శ్రీవారి శ్రీపాదయుగళ మాహాత్మ్యం గురించి ఒకసారి చెప్పిన ఈ క్రింది అంశం గురించి కొందరు విజ్ఞ్యులకైనా గుర్తుండే ఉంటుంది...
"శ్రీవైష్ణవసంప్రదాయంలో శ్రీశ్రీనివాసుడి శ్రీపాదయుగళారాధన లేని ఆరాధన అసలు భగవదారాధనగా విజ్ఞ్యులచే ఆమోదింపబడదు...
అందుకే ద్వారకాతిరుమలలో కొన్ని కారణాలరీత్యా శ్రీవేంకటేశ్వరుడి శ్రీపాదయుగళం అధోలోకాల్లోని విజ్ఞ్యుల ఆరాధనలు అందుకుంటూ ఉన్న కారణంగా / ఆ మూర్తికి అదనంగా మరో మూర్తిని ప్రతిష్ఠితం గావింపజేసి నిత్యనైమిత్తికారాధనలు గావింపబడుతూ భక్తులు అనుగ్రహింపబడుతున్నారు..."

అందరితో బాగా కామెడీలు చేసే ఒక కొలీగ్ / ఫ్రెండ్ పెళ్ళికి ఒకసారి ఏలూర్ కి వెళ్ళిన్నప్పుడు ఎంతో ప్రశాంతమైన దైవిక వాతావరణంలో వెలసిన / శ్రీచాగంటి సద్గురువుల ప్రహృష్టవచనాల్లో మెరిసిన ద్వారకాతిరుమలేశుడి సందర్శనంతో తరించడం నా జన్మాంతర సౌభాగ్యం..!

"పరగు శ్రీవేంకటపతి తన దాసులను అరుదుగా గాచే అనంతుడితడు..."
అని శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారి ఒకానొక ఘనమైన ఈ క్రింది సంకీర్తనలో సెలవిచ్చారు....

ఇక్కడ అనంతుడు / అనంతశయనుడు / అనే అర్ధం కన్నా...అనంతమైన విభూతులతో అలరారే ఆనందనిలయుడైన శ్రీవేంకటేశ్వరుడితడు....
అనే సామ్యము బాగా శోభించును....

కంటిమి నేడిదె గరుడాచలపతి
ఇంటివేలుపగు ఈశ్వరుడితడు ||

శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు
దానవాంతకుడు దయానిధి
నానా మహిమల నమ్మిన వారిని
పూనుక కాచె పోషకుడితడు ||

దేవాది దేవుడు దినకర తేజుడు
జీవాంత రంగుడు శ్రీవిభుడు
దైవ శిఖామణి తలచిన వారిని
సేవలు గొనికాచె విభుడితడు ||

పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు
కరుణానిధి బుధకల్పకము
పరగు శ్రీవేంకటపతి తనదాసుల
నరదుగ గాచేయనంతుడితడు ||

http://annamacharya-lyrics.blogspot.com/2008/03/439kamtimi-nedide-garudacalapati.html?m=1

https://youtu.be/J4ugJlApLBM?si=mHdELa2PyyGsqp0P

మానవులకు అత్యంత ఆవశ్యకమైన శుభం జ్ఞ్యానసిద్ధి...అదే మనకు అసలైన కళ్యాణకారక అనుగ్రహం..!

"పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు"
అనే శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల పదప్రయోగం ఎంత ఘనమైన జ్ఞ్యానదాయక స్తుతియో, సంప్రదాయం తెలిసిన విజ్ఞ్యులకు శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో తెలిసే ఉంటుంది...
అమ్మవారి కబరీబంధనం / తురుము / పూలజడను దర్శించేవారి అజ్ఞ్యానం లయించును...
అనగా జ్ఞ్యానసిద్ధి గడించి తరింపజేసే సిద్ధలక్ష్మీ అనుగ్రహం అమ్మవారి కబరీబంధనమును ఆశ్రయించి ఉండునని అర్ధం...💐😊

ప|| పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత | పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ||

చ|| పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద | పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు |
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు | పేరుకుచ్చ సిగ్గువడీ బెండ్లి కూతురు ||

చ|| బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర | బిరుదు మగని కంటె బెండ్లి కూతురు |
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి | బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ||

చ|| పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె | పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు |
గట్టిగ వేంకటపతి కౌగిటను వాడి | పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||

https://annamacharya-lyrics.blogspot.com/2006/11/94pidikita-talambrala-pemdli-kuturu.html?m=1

సర్వం శ్రీకొండగట్టు వీరాంజనేయ సమేత శ్రీలక్ష్మీవేంకటేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు...💐

No comments:

Post a Comment