1. దాహం శమింపబడాలి అని దేవుడికి నమస్కరించాలి.
2. లేకపోతే వెళ్ళి నీళ్ళు తాగాలి..
3. లేకపోతే ఎవరినైనా నీళ్ళు తెచ్చివ్వమని అడగాలి.
అంతే కాని ఇష్టం వచ్చినట్టు చుట్టూ ఉన్నవారిని తిడితే ఎవరూ ఊర్కోరు.
ఎక్క్వనాటకాలాడితే, ఎర్రగడ్డ మెంటల్ హాస్పటల్కి వెళ్ళమని చెప్తరు...
ఎందుకంటే, ఎవరి గౌరవం, స్వాభిమానం, ఔన్నత్యం వారిదే....
అదే బురదలో ఊరపంది కూడా ఉంటుందికదా అని, బురదలో ఉండే పద్మం యొక్క గౌరవానికి ఇబ్బంది ఎందుకు ఉండాలి...?
ఎందుకంటే పద్మం ఉన్న కొలనులోకి ఊరపందులొచ్చి బొర్లి మొత్తం కొలను యొక్క స్వఛ్చతను పాడుచేస్తున్నై కాని పద్మం వెళ్ళి ఎవ్వర్నీ ఇబ్బందిపెట్టట్లేదు....
అని విజ్ఞ్యులు గమనించవలెను...
అఛ్ఛం అదేవిధంగా...
ఒక వ్యక్తికి ఏదో ఒక రోగమో, లేక కొందరు మూర్ఖులు నూరిపోసే మాయరోగమో అయితే....
1. రోగం శమింపబడాలి అని దేవుడికి నమస్కరించాలి....
(ప్రతిరోజు నమస్కారాలకు అనుగ్రహించేందుకు ఆకాశంలో ప్రత్యక్ష వైద్యనారాయణుడిగా ప్రకాశించే సూర్యుడు ఉన్నది ఎవరికోసమో అని అనుకుంటే ఎందుకా బ్రతుకు...?)
2. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి వైద్యుడికి నమస్కరించి ఔషధాన్ని అడిగి స్వీకరించాలి.
(ఊరిమీదపడి అడ్డమైనవన్నీ కొనుక్కోవడానికి, అరోగ్యం పాడుచేసుకోవడానికి ఉన్న ఓపిక, ధనం, అవసరమైన ఔషధాలు కొనుక్కోవడానికి వెచ్చించకపోతే
ఎందుకా బ్రతుకు...?)
3. లేకపోతే ఎవరినైనా ఔషధాన్ని తెచ్చివ్వమని అడగాలి.
అంతే కాని ఇష్టం వచ్చినట్టు చుట్టూ ఉన్నవారిని తిడితే ఎవరూ ఊర్కోరు.
ఎక్క్వనాటకాలాడితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పటల్కి వెళ్ళమని చెప్తరు..
ఎందుకంటే, ఎవరి గౌరవం, స్వాభిమానం, ఔన్నత్యం వారిదే...
అనే విజ్ఞ్యతను ఎవరికివారే అలోచించుకొని, నలుగురుకి చెప్పేవాళ్ళం అని చెప్పుకునేవారు, నలుగురితో చెప్పించుకునే స్థితికి రాకుండా ఉంటే మంచిది....
ప్రతీ మనిషికి...
మంచి మనసైనా ఉండాలి...
మంచి బుద్ధైనా ఉండాలి...
మంచి చదువైనా ఉండాలి....
మంచి విజ్ఞ్యతైనా ఉండాలి....
అప్పుడు...
మంచిగా బ్రతకడం అంటే ఏంటో...
మంచివారిగా బ్రతకడం అంటే ఏంటో...
ఇతరులకు మంచి చేస్తూ బ్రతకడం అంటే ఏంటో...
అర్ధమౌతది....
లేనినాడు....
ఆ బ్రతుకు యొక్క పయనం...
పంది నుండి ఊరపందికి...ఊరపందినుండి అడవిపందికి...
అన్నట్టుగా....
ఎల్లరూ విసుక్కునే, ఎల్లరిచే దూషింపబడే బ్రతుకే అవుతుంది....
ఇంతాకన్నా ప్రయత్నపూర్వకంగా దిగజారి చెప్పడం విజ్ఞ్యులకు కుదరదు....
సర్వే సుజనాః సుఖినోభవంతు....
No comments:
Post a Comment