శ్రీ విశ్వావసు నామ 2025 సంవత్సర చైత్ర శుద్ధ నవమి / శ్రీరామనవమి పర్వసమయ శుభాభినందనలు... 💐😊శ్రీసీతారామచంద్రస్వామి వారి వార్షిక తిరుక్కళ్యాణమహోత్సవవైభవాన్ని స్వామివారి అనుగ్రహం మేర కొంత పరికిద్దాం...
ఈ లోకంలో ఏ మంత్రి అయినా / ఏ పరిపాలకుడైనా / ఏ ప్రజాప్రతినిధి అయినా / ఏ నాయకుడైనా / శ్రీరాముడి విష్ణ్వాంశ యొక్క అనుగ్రహంతోనే వారికి ఆ ప్రజాపరిపాలనాయోగం సమకూరును... కాబట్టి వారివారి భూపతులెల్లరూ / భూపరిపాలకులెల్లరూ వారికి శ్రీరామ సమానులు అని విజ్ఞ్యులు భావించవలె...
అనగా దేశానికి ప్రాతినిధ్యం వహించే గౌ|| ప్రధానమంత్రి గారి నుండి వారివారి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే
గౌ || ఎం.ఎల్.ఎ గారి వరకు....దేశంలోని నాయకులెల్లరూ శ్రీరాముడికి ప్రతీకలే అని భావించవలెను...
శ్రీరామరాజ్యం....
రామరాజ్యంలో ప్రజలకు ఆకలి దప్పికలు ఉండనేరవు...
రాజారామచంద్రభగవాన్ కి జై...
శ్రీరామజయం...
రాం రాం...
అదొక పెద్ద రామాయణం...
ఇత్యాదిగా ఎన్నో వాక్యాలు అనాదిగా జనబాహుళ్యంలో ఉండడానికి కారణం శ్రీరాముడు తన అవతారప్రయోజనమైన
పౌలస్త్యవధానంతరం తన విహిత కర్తవ్యమైన కోసలరాజ్యపరిపాలనను 11000 సంవత్సరాలు గావించి,
(దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ...
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిశ్యతి...)
మనుజులకు ధర్మపరిపాలన అంటే ఎలా ఉండవలెనో తెలియజెప్పి మరియాదాపురుషోత్తముడిగా, ఆదర్శ పరిపాలకుడిగా, ప్రియతమతప్రభువుగా...
భారత ఇతిహాసంలో చిరకీర్తిని గడించిన చిరస్మరణీయుల్లో ఒకరిగా, దేవుడిగా, ఇప్పటికీ ప్రజలచే...భక్తులచే.....
కీర్తింపబడడం జగద్ప్రసిద్ధినొందిన అంశం...
ధర్మం, కర్తవ్యం
అనే రెండూ కూడా అత్యంత శక్తివంతమైన సార్వజనీన సార్వకాలిక గౌణములు...
అవి దృఢంగా ఉంటే ఎంతటి అభ్యున్నతి అయినా సాధింపబడును.....
అది ఎట్లనగా...
రెండు సమాంతరమైన భారి పొడవాటి ఇనుప కడ్డీల స్థిరమైన వ్యవస్థను రైల్ పట్టాలు అని అందురు...
అవి ఏ మేరకు దృఢంగా ఉండునో...అంతవరకు వాటిని ఆధారంగా గావించి సాగే ఏ రైలు ప్రయాణమైనా కూడా ఎంతో గొప్పగా సాగును....
"హే ఆ గూడ్స్ బండి ట్రైన్ ని చూడు...
తన వేగన్స్ లో నింపబడిన పెట్రోల్ ఒలకకుండా నిదానంగా ఎలా ఒక స్థిరమైన వేగంతో సాగుతున్నదో....."
"హే ఆ ప్యాసెంజర్ ట్రైన్ ని చూడు...
ఎలా వేగంగా సాగుతున్నదో....."
"హే ఆ వందేభారత్ ట్రైన్ ని చూడు...
బుల్లెట్ స్పీడ్ తో ఎట్ల దూసుకుంటూ వెళ్తుందో....."
ఇలా ఏ ట్రైన్ గురించి మాట్లాడాలన్నా....
అవి ప్రయాణించే రైలు పట్టాలు దృఢంగా ఉన్నప్పుడే మనం వాటి ప్రయాణం గురించి మాట్లాడుకునేది...
అచ్చం ఇదే విధంగా...
శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా...
"ధృయైర్వా జనైః ఇతి ధర్మం..."
(జనులచే ధరింపబడునదే ధర్మం)
అనేది ధర్మం అనే పదానికి వ్యుత్పత్తి....
అట్టి ధర్మం యొక్క ఆచరణకే కర్తవ్యం అని పేరు.,.
దేశకాలానుగుణంగా నిత్యం మారుతూ ఉండేది ధర్మం...
మారనిది సత్యం...(అనగా భగవంతుడు)
ఎన్నో ధర్మసూక్ష్మాల సమ్మిళిత సమాహారమే ధర్మం...
ధర్మం కర్తవ్యం అనే రెండు సమాంతర పట్టాలపై సాగే మన జీవితప్రయాణం అనే అంశంలో...
ఎవరి ప్రయాణమైతే నిరంతరం దృఢమైన ధర్మ కర్తవ్య ఆధారితమై ఉండునో....
వారు ఎక్కడికి, ఎట్లు, ఏమార్గంలో ఎంత స్పీడ్ తో ప్రయాణించినా కూడా...వారి అభ్యున్నతికి వారు పాటించినా / పాటించే / పాటించబోయే దృఢమైన ధర్మ నిరతి కర్తవ్య స్పృహ బాసటగా ఉండి వారిని సమున్నతంగా తీర్చిదిద్దును....
అట్టి రాశిభూతమైన ధర్మానికి / కర్తవ్య భరిత ప్రయాణానికి / అయనానికి నిండు ఉదాహరణ, శ్రీమద్రామాయణం...
అనగా కౌసల్యా దశరధ మహారాజుల పెద్ద కుమారుడైన
శ్రీరాముడి జీవిత ప్రయాణం...
మితభాషి స్మితభాషి హితభాషి పూర్వభాషీచ రాఘవ....
అని పెద్దల ఉవాచ....
అట్టి ధర్మస్వరూపమైన రఘురాముడి జీవితమే శ్రీమద్రామాయణ ఇతిహాసమై,
ఆదికావ్యమై, వేదోపబృహ్మణమై, అనాదిగా ఎందరో విజ్ఞ్యులచే ఆరాధింపబడే అమరసారస్వతమైనది...
బ్రహ్మగారి వరభూషితులైన శ్రీవాల్మీకీ మహర్షి విరచితమైన శ్రీమద్రామాయణ బాలకాండలోని ఈ క్రింది శ్లోకాల సారాంశంగా..
ప్రతి సంవత్సర చైత్ర శుద్ధ నవమి సమయాన శ్రీసీతారాముల తిరుక్కళ్యాణం నిర్వహింపబడడం అనే సత్సంప్రదాయం గురించి విజ్ఞ్యులెల్లరికీ విదితమే...
తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయు:.
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ৷৷1.18.8৷৷
నక్షత్రేదితిదైవత్యే స్వోచ్చసంస్థేషు పఞ్చసు.
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిన్దునా సహ৷৷1.18.9৷৷
ప్రోద్యమానే జగన్నాథం సర్వలోకనమస్కృతమ్.
కౌసల్యాజనయద్రామం సర్వలక్షణసంయుతమ్৷৷1.18.10৷৷
విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకువర్ధనమ్.
https://www.valmiki.iitk.ac.in/sloka?field_kanda_tid=1&language=te&field_sarga_value=18
https://www.facebook.com/share/198qxvjTK4/
నిన్నటి పోస్ట్ లో దేవతాకళ్యాణం యొక్క వైభవం గురించి వివరించాను కద....
ఇవ్వాళ్టి పోస్ట్ లో శ్రీసీతారాముల తిరుక్కళ్యాణం నిర్వహింపబడడంలోని అసలైన అధ్యాత్మ ఆంతర్యం ఏంటో ఈశ్వారానుగ్రహంగా కొంత పరికిద్దాం...
జనకనందిని గా భూశోధనలో ప్రభవించిన సీతమ్మ జీవుడికి ప్రతీక....
ఏ పురాణ ఇతిహాసం లో కూడా సీతమ్మ యొక్క జన్మవృత్తాంతానికి సంబంధించిన నిర్దిష్టమైన వివరణ లేదని విజ్ఞ్యుల అభిప్రాయం...
అనగా...
సదరు జీవుడు ఎన్ని జన్మలుగా జన్మాంతర ప్రయాణం సాగిస్తూ వస్తున్నాడో అనే అధ్యాత్మ అంశం ఎవ్వరికీ కూడా నిర్దిష్టమైన రీతిలో తెలియదు....
అనగా ఫలానా జన్మలో నువ్వు అక్కడ ఆ వ్యక్తి గా జన్మించి ఆయా పాపపుణ్యాలను కూడబెట్టావు...
ఇప్పుడు ఈ జన్మలో నువ్వు ఇక్కడ ఈ వ్యక్తి గా జన్మించి ఈ పాపపుణ్యాలను కూడబెట్టావు...
ఇక రాబోవు సమయంలో నువ్వు ఆర్జించుకున్న పాపపుణ్యాలకు సరితూగే ఫలాన జన్మను పొందెదవు...
అని మాత్రమే,..అధ్యాత్మ శాస్త్రం ద్వారా తెలియబడవచ్చును...కాని..
ఫలానా వ్యక్తి యొక్క జీవుడి జన్మపరంపరలను క్రోనాలజికల్ ఆర్డర్ లో లిస్ట్ చేయడం కేవలం ఈశ్వరుడికి మాత్రమే తెలిసిన అంశం...
కద్రువ, వినత, సతి, దితి, అదితి,
దక్షప్రజాపతి యొక్క కూతుర్లు...
వీరిలో...
దితి మరియు అదితి ఇద్దరూ కూడా...
కశ్యపప్రజాపతిని పెళ్ళిచేసుకొని సవతులయ్యారు....
అదితి సంతానమే దేవతలు...
దితి సంతానమే దైత్యులు...
కద్రువ యొక్క సంతానమే సర్పాలు..
వినత యొక్క సంతానమే సూర్యరథసారధి అయిన అనూరుడు మరియు అతని తమ్ముడు గరుత్మంతుడు..
సతిదేవి శివుణ్ణి వివాహం చేసుకొని, తన తండ్రి దక్షుడు పిలవని శివుడు లేని యజ్ఞ్యానికి వెళ్ళి అవమానం పొంది దేహత్యాగం గావించడం, ఆగ్రహంతో ఊగిపోతున్న రుద్రుడి భుజస్కందాలపై ఉన్న సతీదేవి యొక్క యోగాగ్నిలో దహ్యమైన దేహం
శ్రీమహావిష్ణు యొక్క సుదర్షనచక్రం వల్ల ఖండితమై, ఆ దేహభాగలు భూలోకంలో శక్తిపీఠాలుగా కొలువైఉండడం...
ఇత్యాది పురాణ వృత్తాంతాలు విజ్ఞ్యులకు ఎరుకే...
నిత్యం ఈ విశ్వంలో వారిని ఆహ్వానింపబడిన వారివద్దకు వెళ్ళి వరాలను అనుగ్రహించే దేవతలకు తల్లిగా కొనియాడబడే అదితి అధిదేవతగా గల పునర్వసు నక్షత్ర సంజాతుడై, భారతావనిలో ఎన్నెన్నో చోట్ల ప్రయాణిస్తూ తన శ్రీపాదయుగళం లో కొలువై ఉండే అనఘాలక్ష్మీ యొక్క అనుగ్రహాన్ని ఆశ్రయించిన ఎల్లరికీ అనుగ్రహించిన అమరవంద్యుడైన దేవాధిదేవుడు శ్రీరాముడు భువిపై నడిచిన ప్రత్యక్ష పరమాత్మకు ప్రతీక...
అసంఖ్యాక ధనుర్వేదోక్త శస్తాస్త్ర విద్యాప్రదాత / గురువులైన శ్రీవిశ్వామితృల వారి ఆనతి ప్రకారంగా...,
జనకమహారాజు గారిచే నిర్వహింపబడిన సీతా స్వయంవరంలో పాల్గొని శివధనస్సును ఎక్కుపెట్టి...
సీతమ్మ యొక్క మన్ననలను అందుకొని
సీతను రాముడు పెండ్లాడడం అంటే...
అసంఖ్యాక జన్మల్లో ప్రయాణిస్తూ ఉన్న జీవుడు కూడబెట్టుకున్న ఎన్నో విద్వత్ విషయాలను స్వాధ్యాయంతో అనుసంధీకృతం గావిస్తూ...
శివం గా ఉన్న మన శరీరం అనే ధనస్సును నిత్యం భగవద్ నామం అనే అల్లెత్రాడుతో ఎక్కుపెడుతూ శరప్రహారానికి సంసిద్ధమై ఉన్న ధనస్సులా ఈ శరీరాన్ని నిత్యమూ చైతన్యశక్తితో / గాయత్రిశక్తితో పరిపుష్టంగావిస్తూ...
జీవ జీవేశ్వర ఐక్య భావనను సాధించి తరించడమే...
లోకంలో నిత్యం నిర్వహింపబడే అసంఖ్యాక
శ్రీసీతారాములకళ్యాణోత్సవాల్లోని అసలైన్ అధ్యాత్మ ఆంతర్యం...
కె.జె ఏసుదాస్ గారి అమృతగళంలో శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల ఈక్రింది అత్యంత రామణీయమైన శ్రీవేంకటరామసంకీర్తనను మీరు కూడా వినే ఉంటారు కద...
ప|| రాజీవ నేత్రాయ రాఘవాయ నమో |
సౌజన్య నిలయాయ జానకీశాయ ||
చ|| దశరథ తనూజాయ తాటక దమనాయ |
కుశిక సంభవ యజ్ఞ్య గోపనాయ |
పశుపతి మహా ధనుర్భంజనాయ నమో |
విశద భార్గవరామ విజయ కరుణాయ ||
చ|| భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ |
ఖరదూషణాయ రిపు ఖండనాయ |
తరణి సంభవ సైన్య రక్షకాయనమో |
నిరుపమ మహా వారినిధి బంధనాయ ||
చ|| హత రావణాయ సంయమి నాథ వరదాయ |
అతులిత అయోధ్యా పురాధిపాయ |
హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో |
వితత వావిలిపాటి వీర రామాయ ||
https://annamacharya-lyrics.blogspot.com/2007/05/201rajiva-netraya-ragavaya-namo.html?m=1
చ|| దశరథ తనూజాయ తాటక దమనాయ |
కుశిక సంభవ యజ్ఞ్య గోపనాయ |
పశుపతి మహా ధనుర్భంజనాయ నమో |
విశద భార్గవరామ విజయ కరుణాయ ||
అనే చరణం యొక్క వాక్యార్ధం పైకి...
దశరథ తనూజుడవై, తాటకిని దమించినవాడవై, విశ్వామితృల యజ్ఞ్యసమ్రక్షకుడవై, శివధస్సును ఎక్కుపెట్టి భంజించిన శ్రీరాముడికి నమస్కారం..
అట్లు గావించి ఎల్లప్పుడూ ఆవేశంతో ఊగిపోతూ ఉండే పరశురాముడి ఆవేశాన్ని తనలోకి లయింపజేసి భార్గవరాముడికి విజయాన్ని ప్రసాదించిన శ్రీరాముడవు....."
అని అనిపించినా..., అందలి అంతరార్ధం...
"పంచ జ్ఞ్యానేంద్రియాల...
పంచ కర్మేంద్రియాల...
సంఘాతమైన శరీరం అనే రథంలో కొలువై ఉండే పరమాత్మ అయిన ఓ ఆత్మారాముడా...
తమస్సు అనే తాటకిని దమించి...
("రెయ్....మీ వెర్రి వేషాలు ఎక్కువైతున్నై....
క్లాస్ లో అల్లరి తగ్గించకపోతే మీ "తాట" తీస్తా..."
అని చిన్నప్పుడు స్కూల్ల్ డేస్ లో సార్లు తిట్టే క్యాజువల్ వచనాలు గుర్తుండే ఉంటాయ్...)
సత్వగుణసాంద్రతను ఉద్దీపనం గావించే స్వాధ్యాయ యజ్ఞ్యం దిశగా మా గాయత్రిశక్తిని పరిరక్షించు...
మేము ధరించినది కేవలం శరీరం అనే మృణ్మయ భావనను భంజించి...మాలో నిరంతరం జనిస్తూ ఊగిపోతూ ఉండే అరిషడ్వర్గప్రకోప భృగుతత్త్వానికి నీ పరమాత్మ తత్త్వాన్ని ఎరుకపరుస్తూ,
ఇంద్రియజనిత సహజమైన అస్థిరత్వాన్ని నీలోకి లయింపజేసి,
ఈ చిన్మయాంతర్గతమైన జీవజీవేశ్వర స్వస్వరూపానుసంధానంలో నీ ఆంతరదర్శనాన్ని ప్రసాదించి మాకు విజయాన్ని అనుగ్రహించు...."
అట్టి ఆత్మజ్ఞ్యానోద్దీపన కారక అనుగ్రహమే శ్రీసీతారాముల తిరుక్కళ్యాణమహోత్సవ వీక్షణఫలం...
అప్పుడే మానవజన్మ నిజమైన విజయం సాధించినట్టుగా అధ్యాత్మశాస్త్రం పరిగణించును....
నడిచేదైవంగా / ఇప్పటికీ ప్రార్ధించేవారికి పలికే దైవంగా, మరో శంకరాచార్యావతారులు గా, శిష్యులచే ఆరాధింపబడే శ్రీకంచిపరమాచార్యుల వారి మాహాత్మ్యాన్ని వివరిస్తూ శ్రీచాగంటి సద్గురువులు ఒకసారి ఈ క్రింది అంశం గురించి ప్రస్తావించడం కొందరికైనా గుర్తుండే ఉంటుంది...
"సర్వసంగపరిత్యాగులైనా సరే మాపట్ల మీ ఉదారమైన అనుగ్రహానికి గౌరవార్ధంగా, మీకు ఎన్నో ఇవ్వాలని ఉంది...
మేము మీకు ఏం ఇవ్వగలమో దయచేసి తెలపగలరు...
అని భక్తులు ఒకసారి మహాస్వామి వారిని అభ్యర్ధించినప్పుడు....
"మీరు ఇంత ప్రేమగా అభ్యర్ధిస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను....
నాకోసం మీరు ప్రతిరోజు కొంతసేపు మీ సమయాన్ని సమర్పించండి...
ఆ సమయంలో శ్రీరామనామస్మరణను గావించండి...
అదే మీరు నాకివ్వగలిగే గౌరవాభిమానం..."
అని వచించిన మహాస్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రీమద్రామాయణం ఈ లోకానికి ఈశ్వరుడు శ్రీవాల్మీకి మహర్షి రూపంలో అనుగ్రహించిన అమేయమైన అమరసారస్వతం...
శ్రీచాగంటి సద్గురువుల ఎన్నెన్నో ప్రవచనాలను ఎందరో మహానుభవులు ఆలకించే ఉంటారు...
వేటి ప్రత్యేకత వాటిదే అయినా...
అప్పుడు, ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ,
శ్రీచాగంటి సద్గురువుల సంపూర్ణ శ్రీమద్రామాయణ ప్రవచనాలకు భక్తలోకం వారికి సదా కృతజ్ఞ్యులు....
ఎందుకంటే...
కొన్ని వినాలన్నా...
కొన్ని తినాలన్నా...
కొన్ని తిరగాలన్నా..
ఎంతో పుణ్యం, ఈశ్వరానుగ్రహం ఉంటేనే సాధ్యమయ్యేది...
సంపూర్ణశ్రీమద్రామాయణం, మూకపంచశతి, సౌందర్యలహరి, గజేంద్రమోక్షం, ధృవోపాఖ్యానం, కుచేలోపాఖ్యానం, ఇత్యాది పురాణ ఇతిహాస వైభవాలు వినాలన్నా...
కాశి గంగానదీ తీర్థస్నానం / శ్రీవిశ్వనాథదర్శనం...,
తిరుమల స్వామిపుష్కరిణీ తీర్థస్నానం, శ్రీవేంకటేశ్వర దర్శనం / ప్రసాదం...,
భద్రాచలతీరస్థిత గోదావరీ తీర్థస్నానం / శ్రీసీతారామ ఏకశిలా ఆలయోపరి స్థిత మహాసుదర్శనచక్ర సందర్శనం..,
అరుణాచల గిరిప్రదక్షిణం,
సామర్లకోట కుమారారామ క్షేత్రదర్శనం,
ఇత్యాదివి దర్శించి / సేవించడానికి పెట్టిపుట్టాలి....
ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ ।
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ॥
ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః ।
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ॥
పైన పేర్కొనబడిన శ్రీమద్రామాయణ ఫలశృతిని గౌరవిస్తూ, ఎందరో విజ్ఞ్యులు వారి జీవితాలను స్వాధ్యాయంతో తీర్చిదిద్దుకున్నారు....
మరెందరో విజ్ఞ్యుల జీవితాల్లో కూడా శ్రీమద్రామాయణం యొక్క మాహాత్మ్యం పరిమళించాలని ఆకాంక్షిస్తూ...
మూర్తీభవించిన ధర్మస్వరూపమైన త్రేతయుగం నాటి శ్రీరామచంద్రుడు...,
ఈ కలియుగంలో...
భద్రమహర్షి భద్రగిరిగా కొలువైఉండగా...
భద్రుడి శిరస్సుపై శ్రీవరభద్రగిరీశుడిగా...,
ధర్మం / వృషభం వృషభాద్రి గా కొలువైఉండగా...
శ్రీవేంకటగిరిపై శ్రీవేంకటరాముడిగా...,
వెలసి ఉన్న శ్రీరాముడికి నమస్కరిస్తూ....
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల హృదయకోవెలలో మెరిసిన శ్రీవేంకటరాముణ్ణి ఈ క్రింది సంకీర్తనతో స్మరిస్తూ....
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి
గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము
పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము
తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
https://annamacharya-lyrics.blogspot.com/2006/11/55ramachandrudithaduraghuvirudu.html?m=1
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
శ్రీభద్రాచల సీతాసమేతశ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః...🙏
సర్వం వృషభాద్రీశ శ్రీవేంకటరామచంద్రశ్రీచరణారవిందార్పణమస్తు...🙏😊💐
No comments:
Post a Comment