స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఆచారశుద్ధి, మంత్రశుద్ధి, బింబశుద్ధి, అనే అత్యంత ముఖ్యమైన పంచశుద్ధిభరిత కార్యనిర్వాహకశుద్ధితో పరిఢవిల్లే ఆలయవైభవం చాలా అరుదుగా భక్తులకు సంప్రాప్తించే అనుగ్రహం....
అట్టి మహత్వభరితమైన మన కూకట్పల్లి, వివేకానందనగర్ ఆలయంలో,
అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడై, ఆర్తితో ప్రార్ధించే భక్తులకు పలికే ప్రత్యక్షదైవమై, కోరిన వరాలను వర్షించే వరదుడై, ఈ కలియుగ భక్తులకు సంప్రాప్తించిన సంసారసాగరతరణసేతువై,
వరదకటిహస్త ముద్రలతో, వక్షస్థలశ్రీవత్సచిహ్నభూషితుడై వెలసిన శ్రీశ్రీనివాసుడి శ్రియోత్సవాలకు, గరుత్మంతులవారిచే దివిజగణములెల్లరూ ఆహ్వానింపబడుతుండగా, భక్తుల్లెల్లరూ
ప్రపన్నపారిజాతమై పరిఢవిల్లే పద్మావతీదేవిప్రియుడి దైవికపరిణయపరిమళోత్సవంలో పాల్గొని తరతరాలకు తరగని పుణ్యసంపత్తును ఆర్జించి తరించెదరుగాక....💐😊
సర్వే సుజనాః సుఖినోభవంతు.....
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
ప|| వేదం బెవ్వని వెదకెడివి | ఆదేవుని గొనియాడుడీ ||
చ||
అలరిన చైతన్యాత్మకు డెవ్వడు
కలడెవ్వ డెచట గలడనిన |
తలతు రెవ్వనిని దనువియోగదశ |
యిల నాతని భజియించుడీ ||
చ||
కడగి సకలరక్షకు డిందెవ్వడు |
వడి నింతయు నెవ్వనిమయము
పిడికిట తౄప్తులు పితరు లెవ్వనిని |
దడవిన ఘనుడాతని గనుడు ||
చ||
కదసి సకలలోకంబుల వారలు |
యిదివో కొలిచెద రెవ్వనిని |
త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి |
వెదకి వెదకి సేవించుడీ ||
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
https://annamacharya-lyrics.blogspot.com/2007/11/347vedam-bevvani-vedakedivi.html?m=1
No comments:
Post a Comment