The soothing music too is equally divine....
Darshanaath Abhrasadasi...
Jananaat Kamalaalayea...
Kaashyaantu maraNaanmuktih...
Smaranaath Arunaachalay...
I am very much thankful to Parameshwara for blessing me with the Abhrasadasi / Chidambara Darshanam...
Taking a birth in Kamalaalayam / Tiruvaaroor can only be had by Parameshwara's pristine grace....
I shall be very fortunate to be blessed by the Parameshwara to have my demise in Kaashi...
and I am always grateful to Parameshwara for being able to chant the name of Arunaachaleshwara....
అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ
అరుణాచల...
అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ
అరుణాచలా...
అరుణాచల మనుచు స్మరియించువారల అహము నిర్మూలింపు అరుణాచలా...
అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ
అరుణాచలా...
అనే సుప్రసిద్ధ అరుణాచలస్మరణ వాక్యంలో....
చాలా మంది "అహము నిర్మూలింపు అరుణాచలా...."
అనే వాక్యాన్ని సరిగ్గా అర్ధం చేసుకోరు....
ఇక్కడ ప్రస్తుతింపబడే "అహము" అనేది...
సాధారణంగా మనం వాడుకభాషలో ఉపయోగించే అర్ధాలు కావు...అనగా...
"రెయ్ మావా...వాడికి ఎంత పొగరో చూడ్రా...
కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కున్నడని వాడి స్టైల్, వాడి బిల్డప్, వాడి పొగరు వేషాలు చూడు...."
అనే ఉదాహరణలో ఉన్న పొగరు....
"రెయ్ వాడి బలుపు చూడు....
వాడిచ్చిన ఎందుకూ పనికిరానివి కాదని, వేరేదోస్తులిచ్చిన మంచి డీసెంట్ డ్రెస్ వేసుకున్నందుకు....
కనీసం హ్యాపి బర్త్డే గ్రీటింగ్స్ కూడా చెప్పకుండా ఏగాదిగా చూస్కుంట పోతున్నడు...."
అనే ఉదాహరణలో ఉన్న బలుపు.....
"హెయ్ వాడి అహంకారం చూడు...
భోజనప్రసాదం / అన్నదానానికి అందరితో పాటు లైన్లో రమ్మని చెబితే...
నన్నే లైన్లో రమ్మంటవా...
అని అన్నం తినకుండా వెళ్ళిపోయాడు...."
అనే ఉదాహరణలో ఉన్న అహంకారం....
ఇత్యాదిగా, భేషజం, భేదభావం, స్వోత్కర్ష, భంగపాటు, మిడిసిపాటు, గర్వం, ఇత్యాది స్థితిని చెప్పడానికి మనం సర్వసాధారణంగా వచించే పదాలకు పర్యాయపదం కాదు అరుణాచలస్మరణంలోని "అహము" అనే పదం....
ఏ ప్రాపంచిక భావన అయితే మనలో ఉన్న ఈశ్వరాంశను పరమాత్మ స్వరూపంగా మనకు మనమే గుర్తించేందుకు, లౌకికమైన, సహజమైన, అధ్యాత్మపరమైన, భౌతికపరమైన, పరిధిగా, తెరగా, ఉండి శరీరాంతర్గత జీవుడు, హృదయపంచకోశాంతర్గత జీవేశ్వరుడితో అనుసంధానమయ్యేందుకు అడ్డుగా ఉన్నదో, అట్టి షడూర్ములజనిత నిత్యమాయను "అహము" అని అధ్యాత్మశాస్త్ర విజ్ఞ్యులు వచింతురు...
ఉన్నది బ్రహ్మమొక్కటే...
"బ్రహ్మ సత్యం...జగత్తు మాయ..."
అనే నిర్వచనంలోని మాయ గురించి
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో...
"మాయ అనగా... యా మా..." అని వినే ఉంటారు కద...
అట్టి మాయనే శ్రీఆదిశంకరాచార్యులవారు వారి అత్యంత మహిమాన్వితమైన సుప్రసిద్ధమైన శ్రీదక్షిణామూర్తిస్తోత్రంలో
ఇవ్విధముగా వచించారు.....
***** ***** ***** ***** ***** ***** ***** *****
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా |
యః సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మాన మేవాద్వయం
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || ౧ ||
అర్థం:
(తన ప్రగాఢ నిశ్శబ్దం ద్వారా మనలోని ఆత్మ యొక్క వైభవాన్ని మేల్కొల్పే శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం)
1.1: మొత్తం ప్రపంచం అద్దంలో కనిపించే నగరం లాంటిది , ఒకరి స్వంత ఉనికిలో జరిగే దృశ్యం , 1.2: ఇది ఆత్మలో జరిగే సాక్షి , బాహ్యంగా ఊహించబడిన ప్రపంచం యొక్క (సాక్ష్యం) ; మాయ శక్తి ద్వారా ఊహించబడింది ; నిద్రలో ఒక కలలాగా , 1.3: ఒకరి స్వంత ఆత్మ యొక్క ద్వంద్వ విస్తీర్ణంలో ఆధ్యాత్మిక మేల్కొలుపు సమయంలో దీనిని ప్రత్యక్షంగా (మాయ యొక్క ఈ ఆట) అనుభవిస్తారు , 1.4: ఆయనకు నమస్కారాలు , ఈ జ్ఞానాన్ని మేల్కొల్పిన మన అంతరంగ గురువు యొక్క వ్యక్తిత్వం ; శ్రీ దక్షిణామూర్తికి నమస్కారము
***** ***** ***** ***** ***** ***** ***** *****
అట్టి అత్యంత దుర్భేద్యమైన ఆంతరంగిక మాయను తనలోకి లయింపజేసేవాడే అమేయకారుణ్యమూర్తి అయిన శ్రీఅరుణాచలేశ్వరుడు....
అందుకే
"అరుణాచల మనుచు స్మరియించువారల అహము నిర్మూలింపు అరుణాచలా...."
అని విజ్ఞ్యులు వచించారు....
అనగా, ఎంతగా ఎప్పుడెప్పుడూ అరుణాచలేశ్వరుడు స్మరింపబడునో...
అంతగా అప్పుడు...మనలోనే నిత్యం సహజమైన ప్రాపంచిక తత్త్వంగా జనిస్తూ కొండలలా పేర్కుంటూఉండే
"ప్ర పంచం" అనే మాయ యొక్క తెరను నిత్యం నిర్మూలిస్తూ ఉండేవాడే శ్రీఅరుణాచలేశ్వరుడు....!
ఇదంతా చాలా కాంప్లికేటెడ్ గా, అరవిందుల
(https://en.m.wikipedia.org/wiki/Sri_Aurobindo)
ఆంతరంగిక భాష్యంలా ఉన్నది అని మీరనుకుంటే గనక....
చాల సింపుల్ వాక్యాల్లో చెప్తా...
సుందరమైన, స్వచ్ఛమైన, నిత్యావాసస్థానమైన మన ఇల్లు...
కొన్ని రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి సుదూరప్రాంతాల తీర్థయాత్రలకు వెళ్ళడం కారణంగా...
ఎంతో దుమ్ము, ధూళి, చెత్తతో పేరుకొనిఉన్న ఒక అలక్ష్మీసౌధమై ఉన్నది అని అనుకుంటే......
అంత చెత్తను ఒకేసారి శుభ్రపరుచుకొని మన ఇంటిని మళ్ళీ ఆవాసయోగ్యంగా కావించడంకోసం
ఒక పరిచారకుణ్ణి పిలిచి, నాయన నీకు రోజు ఇంత బియ్యం, పప్పు, చింతపండు, బెల్లం, ఇస్తాను....
రోజు కొంతచొప్పున మా ఇల్లంతా శుభ్రపరిచి ఇవ్వు...సరేనా....
అని వచించడం ఎట్లో....
ఈశ్వరా...ఎన్నో జన్మలతరబడి ఈశ్వరస్పృహలేమితో, ఈశ్వరుణ్ణి విస్మరించి జీవించడంతో....
కొండలలా పేర్కొన్న ఈ ప్రాపంచికమాయను దాటి జీవుడి స్వస్వరూపానుసంధానంలో హృదయకోశంలో కూడా ఉన్న పరమాత్మను దర్శింపలేకున్నాను....
కాబట్టి, అత్యంత మహిమాన్వితమైన, అత్యంతకారుణ్యభరితమైన "అరుణాచలేశ్వర" అనే నీ నామస్మరణ కావింతును....
నీ నామస్మరణ యొక్క అనుగ్రహఫలంతో నాలోనే ఆవరించి ఉన్న ప్రాపంచిక మాయను తొలగించి,
ఈశ్వరుడి తత్త్వానుసంధానంలో నిత్యం ఓలలాడే జీవజీవేశ్వరైక్యస్థితిని అద్వైతసిద్ధిగా అనుగ్రహించు
దేవా...
అని ఈశ్వరుణ్ణి సదా ప్రార్ధించడంలోని ఆంతర్యమే...
"అరుణాచల మనుచు స్మరియించువారల అహము నిర్మూలింపు అరుణాచలా..."
అనే నామస్మరణంలోని ఆంతర్యం...
శ్రీఅపీతకుచాంబసమేత సమేత అరుణాచలేశ్వరాయ నమః.. 🙏💐
No comments:
Post a Comment