Tuesday, April 1, 2025

శ్రీ క్రోధి నామ (2025-మార్చ్-26) సంవత్సర సౌమ్యవాసర ప్రయుక్త ఫాల్గుణ బహుళ ద్వాదశి, శ్రీ తాళ్ళపాక అన్నమా అన్నమాచార్యుల వర్ధంతి సందర్భంగా, ఆర్యులు మెచ్చే అన్నమార్యుల హృదయాంతరంగాన్ని ఆవిష్కరించే చిరు ప్రయత్నం గావిస్తాను....


శ్రీ క్రోధి నామ (2025-మార్చ్-26) సంవత్సర సౌమ్యవాసర ప్రయుక్త ఫాల్గుణ బహుళ ద్వాదశి, శ్రీ తాళ్ళపాక అన్నమా అన్నమాచార్యుల వర్ధంతి సందర్భంగా, ఆర్యులు మెచ్చే అన్నమార్యుల హృదయాంతరంగాన్ని ఆవిష్కరించే చిరు ప్రయత్నం గావిస్తాను....

" సీసనల్ అట్టైర్ " అనే అంశం గురించి ఎల్లరికీ విదితమే కద...

అనగా రెయిని సీసన్ లో రెయిన్ కోట్స్, గొడుగులు, ఇత్యాది వాటిని కొనుగోలు చేయడం...
వింటర్ సీసన్ లో ఉన్ని వస్తువులు / శ్వెటర్లు, బ్లాంకెట్లు, ఇత్యాది వాటిని కొనుగోలు చేయడం...
సమ్మర్ సీసన్లో పల్చని లైట్ వెయిట్ కాటన్ వస్త్రాలను కొనుగోలు చేయడం...
అనే సామన్యమైన దేశకాల ఆహార్యశైలి గురించి విజ్ఞ్యులెల్లరికీ ఎరుకే కద.....

అలా ఒక్కో ఋతువులో ఒక్కో వస్త్రధారణకు ప్రాముఖ్యతను ఇవ్వడాన్ని దేశకాలానుగుణవస్త్రధారణౌచిత్యం అని అందురు.....
అనగా...
వేసవిలో ఉన్ని దుస్తులు / శ్వెట్టర్లు....
వర్షాకాలంలో పల్చని తేలిక పాటి ఖాది దుస్తులు....
చలికాలంలో రెయిన్ కోట్లు...
ధరించకూడదు అని చెప్పడం ఇక్కడి ఉద్దేశ్యం కాదు....
వేసవిలో పల్చని తేలికపాటి ఖాది దుస్తులు,
వర్షాకాలంలో రెయిన్ కోట్లు...
చలికాలంలో ఉన్ని దుస్తులు / శ్వెట్టర్లు....
ధరించడంలో ఆరోగ్యం, శ్రేయస్సు ఉన్నది అనేది విజ్ఞ్యుల ఉవాచ...
అని చెప్పడమే ఇక్కడి ఉద్దేశ్యం కద....

అచ్చం అదే విధంగా రమారమి 365 రోజుల నిడివిగల సంవత్సర కాలం అనేది.....
కృతయుగం (17.28 లక్షల సంవత్సరాలు), 
త్రేతాయుగం (12.96 లక్షల సంవత్సరాలు) , 
ద్వాపరయుగం (8.64 లక్షల సంవత్సరాలు), 
కలియుగం (4.32 లక్షల సంవత్సరాలు) గా ....
ఈశ్వరుడిచే వ్యవస్థీకరింపబడినది...
(ద్వాపర యుగంలో శ్రీకృష్ణనిర్యాణానంతరం ప్రారంభమైన ప్రస్తుత కలియుగంలో ఇప్పటికి 5125 సంవత్సరాలు పూర్తైనవి....)

ఎన్ని మహాయుగాలైనా, ఎన్ని మన్వంతరాలైనా, ఎన్ని కల్పాలైనా, ఈ నాలుగు యుగాలే నిత్యం పునరావృతం అవుతూ ఉంటాయ్....
అది ఎవ్విధంగా ఉండునంటే....
ఒక సుదీర్ఘమైన గుర్రంసవారీలో,
"టక్ టక్ టక్ టక్...." అనే గుర్రపు పాదాల డెక్కల సవ్వడులను, ఎన్నో శబ్దాలను విన్నట్టుగా మీకు అనిపించినా....
అవి కేవలం ఆ గుర్రం యొక్క నాలుగు పాదాలు భూమిపై సాగించే పయనం యొక్క లయబద్ధమైన శబ్దాలు అని మీరు గ్రహించాలి.....

అవ్విధముగనే అగ్రాహ్యమైన రోదసిలో ఈ విశ్వం సాగించే చతుర్యుగాల కాలచక్రం అనే నిత్యభ్రమణం రీతి కూడాను....

కృతేతు నారసిమ్హశ్చ
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే వాసుదేవశ్చ
కలౌ వేంకటనాయకః

కృతయుగంలో నారసిమ్హస్వామి
త్రేతాయుగంలో శ్రీరాముడు
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు
కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు

యుగదేవతలుగా పరిఢవిల్లుచుందురు.....
అని శాస్త్రోక్తి....

అనగా...
ఈ కలియుగంలో శ్రీనారసిమ్హుడి, శ్రీరాముడి, శ్రీకృష్ణుడి సామాన్య ఆరాధన గావించినా....
శ్రీవేంకటేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధించి తీరవలెను అనేది శాస్త్రం యొక్క ఉవాచ...

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు శ్రద్ధగా ఆలకించిన విజ్ఞ్యులకు గుర్తున్నట్టుగా....

శాస్ర్త్రం యొక్క వ్యుత్పత్తి....
"శాసనాత్ శంసనాత్ ఇతి శాస్త్రం..."
అనగా "శ్రేయస్సును కలిగించే విధంగా శాసించునదే శాస్త్రం..." అని అర్ధం.....

ఫర్ ఎగ్సాంపుల్...

వైద్యశాస్త్రం ఏమని చెప్తుంది.....
"ఎండాకాలంలో మిట్టమధ్యాహ్న సమయంలో...
సూర్యుడు ప్రచండభానుడిగా ప్రజ్వలించే సమయంలో బయట ఎక్కువగా తిరగకుండా...నీడపట్టున ఉండి వడదెబ్బ తగలకుండా...అరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి....
అపరంజివర్ణంలో ప్రకాశించే పూర్ణసూర్యగోళాన్ని కళ్ళతో ప్రత్యక్షంగా దర్శించగలిగే సూర్యోదయ / సూర్యాస్తమయ సమయంలో ఎండలో ఉండి అరోగ్యాన్ని గడించి తరించండి...."
అని చెప్తుంది...

విని బాగవ్వడమా...
వినకపోవడమా అనేది...
వారివారి విజ్ఞ్యతకు, వివేకానికి సంబంధించిన అంశం...

అచ్చం అదే విధంగా...
అధ్యాత్మ శాస్త్రం ఏమని చెప్తుంది....

"ఈ కలియుగంలో శ్రీవేంకటాద్రిపై వరదకటిహస్తముద్రలతో, శ్రీవత్సచిహ్నభూషితుడై, శ్రీవక్షస్థలవ్యూహలక్ష్మీశోభితుడై, ఆనందనిలయంలో అష్టదలపద్మపీఠంపై
వీరస్థానకధృవమూర్తిగా, కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని, గోవిందుడిగా, సంకీర్తనప్రియుడిగా, ఆశ్రితపారిజాతంగా, శ్రితజనవత్సలుడిగా, శిష్టరక్షకుడిగా, దుష్టశిక్షకుడిగా,
ధర్మసంస్థాపకుడిగా, భక్తవరదుడిగా సేవించి తరించండి.."
అని చెప్తుంది...

విని బాగవ్వడమా...
వినకపోవడమా అనేది...
వారివారి విజ్ఞ్యతకు, వివేకానికి సంబంధించిన అంశం...

ఈ శాస్త్రవచనాన్ని సర్వజనసమ్మతమైన శాస్తీయసంగీతశక్తితోమేళవించి, శ్రీహరిసంకీర్తనామృతంగా భక్తలోకానికి అందించి తాము తరించి లోకాన్ని తరింపజేసిన అత్యంత అరుదైన మహానుభావులు, శ్రీహరినందకఖడ్గాంశ సంభూతులైన శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు....

శ్రీతరిగొండ వెంగమాంబ విరచిత 
" శ్రీవేంకటాచలమాహాత్మ్యం " అనే అత్యంత మహిమాన్వితమైన గ్రంథాన్ని ఒక్కసారైనా శ్రద్ధగా చదివితే,
ఈ కలియుగం అంటే ఏంటో, ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీవేంకటేశ్వరుడు ఎవ్విధముగా భూవైకుంఠమైన తిరుమలలో స్వామిపుష్కరిణితీర్థావాసప్రాంతంలో శ్రీఆనందనిలయుడిగా వెలిసాడో, స్వామివారి మహత్తు ఎంతటి అగ్రాహ్యమైనదో, ఘనమైనదో, మనుష్యుల మేధోస్థాయికి అందని మహిమలతో అలరారే అసంఖ్యాక మహిమాన్వితమైన తీర్థాలకు ఆవాసమైన శేషాచలశిఖరసానువులమంజరికి శ్రీవేంకటమణిబింబమై పరిఢవిల్లే పద్మావతిదేవిహృదయసీమాలంకృతమణిరత్నమైన శ్రీశ్రీనివాసుడి విభూతులన్నీ ఈశ్వరానుగ్రహంగా దృగ్గోచరమౌను...

ఒక సరస్వతీ ఉపాసకుల వైభవం మరో సరస్వతీ ఉపాసకులకు మాత్రమే అవగతమవ్వును అనే సత్యానికి తార్కాణంగా,
అంతటి మహిమాన్వితమైన "శ్రీవేంకటాచలమాహాత్మ్యం" గ్రంథకర్తయైన శ్రీతరిగొండ వెంగమాంబగారి ఔన్నత్యాన్ని గుర్తించి, ఎంతో ఆదరంతో తిరుమల ఆలయ ఆవరణలో ఆవాసం కల్పించి, స్వామివారి ఆలయ నిత్య అర్చక విధుల్లో వెంగమాంబ గారు కూడా ఒకరిగా ఉండేలా అవ్వడానికి, తద్వారా నేటికి కూడా "శ్రీతరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి" అనే సేవలో స్వామివారు సంతసించడానికి కారణం శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు...!

శ్రీవేంకటేశ్వరుణ్ణి తప్ప, సాధారణంగా ఇతరులెవ్వరి ప్రస్తుతిని కూడా వారి సంకీర్తనల్లో గావించని శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు...
"చాలదా బ్రహ్మమిది సంకీర్తనం..." అనే అత్యంత రమణీయమైన సంకీర్తనలో...
శ్రీతరిగొండ వెంగమాంబ గారిని ప్రస్తుతించడం....
ఈ ఇద్దరు సమకాలీన మాన్యుల పరస్పర గౌరవాభిమానములకు తార్కాణం...

చ|| జలజాసనుని నోరి సంకీర్తనం | చలిగొండ సుతదలచు సంకీర్తనం |

https://annamacharya-lyrics.blogspot.com/2007/03/145chalada-brahmamidi.html?m=1

(తడికుండ, తరిగొండ, చలిగొండ ఇత్యాది పేర్లు కాలప్రవాహంలో శ్రీవెంగమాంబ గారి ఊరికి ఆపాదింపబడిన పేర్లు అని విజ్ఞ్యులు గమనింపవలె...)

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు,
కేవలం ఒక గొప్ప సంకీర్తనాచార్యులు మాత్రమే కాదు...
ఆనాటి కాలాన ఒక గొప్ప సంఘసంస్కర్త, అభ్యుదయవాది, సమాజసేవకులు కూడా....

వారి అనితరసాధ్యమైన శ్రీహరిసంకీర్తనాకైంకర్యానికి, అభ్యుదయభావాలకు, సమాజసేవాస్ఫూర్తికి ఆనాడు సాక్షాత్తు అలమేలుమంగమ్మే ఒకానొక సమయంలో శ్రీశుకనూర్ పురప్రలందరికీ వినపడేలా పలికిందనే సత్యం ఇప్పటికీ చాలామంది పాతతరం విజ్ఞ్యులకు ఎరుకే....
( శ్రీశుకనూర్ / తిరుశుకనూర్ / తిరుచానూర్
(అప్పటి శ్రీశుకమహర్షి యొక్క ఆశ్రమస్థలి / ఇప్పటి తిరుచానూర్)

విజ్ఞ్యులైన వారి తాతగారైన శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులను గౌరవిస్తూ, చిన్న తిరుమలయ్య గారు రచించిన ఈ సంకీర్తనలో, అన్నమయ్య గారి అంతరంగం ఎంతో హృద్యంగా ఆవిష్కరింపబడినది కద....

బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||

https://annamacharya-lyrics.blogspot.com/2007/09/302appani-varaprasadi.html?m=1

సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమార, అనే బ్రహ్మగారి మానసపుత్రులైన నలుగురు వేదమూర్తులు, నిత్యం శ్రీహరిసంకీర్తనం గావిస్తూ నారదమహర్షి వారిలా అన్నిలోకాల్లోను సంచరిస్తూ ఉంటారు...
వీరి తపఃశక్తి అనితరసాధ్యమైనది.....
పాపనాశనం డ్యాంని దాటి అడవిమార్గంలో తుంబురుతీర్థమునకు ప్రయాణించే భక్తులకు ఎదురయ్యే మొట్టమొదటి తీర్థం "సనకసనందనతీర్థం"....
(ఈ తీర్థాన్ని శ్రద్ధగా ప్రార్ధించి సేవించిన వారికి నాలుగు జాముల పాటు ఆకలిదప్పికలు ఉండవు అని భక్తుల విశ్వాసం...)

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారి భవిష్యద్ ద్రష్టత్వానికి ఈ లోకం సదా ఋణపడి ఉన్నది.... 
కొన్ని కారణాల రీత్యా రాబోవు కాలంలో దుండగుల దండయాత్రల్లో విలువైన భారతీయసనాతనప్రాచీనసంపద
కొందరు దుష్టుల వల్ల ఇబ్బందికి గురౌతుందని దర్శించిన అన్నమాచార్యులవారు,
వారి అజరామరమైన సంకీర్తనలను రాగిరేకులపై లిఖింపజేసిన వారి తరువాతి తరాలవారికి వాటిని శ్రీశ్రీనివాసుడి ఆనందనిలయంలో శ్రీయోగనారాసిమ్హుడి పర్యవేక్షణలో ఎదురుగా ఉన్న ఒక అరలాంటి మందిరంలో గుప్తపరిచే ప్రేరణకలిగించారు....

దాచుకో నీపాదాలకు - దగనే జేసినపూజలివి
పూచి నీకీరీతిరూప - పుష్పములివియయ్యా

https://te.m.wikisource.org/wiki/%E0%B0%A6%E0%B0%BE%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%8B_%E0%B0%A8%E0%B1%80%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81%E0%B0%A6%E0%B0%97_%E0%B0%A8%E0%B1%87_%E0%B0%9C%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%AA%E0%B1%82%E0%B0%9C_%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BF

అని అన్నమాచార్యుల వారు ఎంతో ప్రేమతో వినమృలై స్వామివారికి శ్రీహరిసంకీర్తనాకైంకర్యం గావించారు కాబట్టి, ఆ సంకీర్తనా సారస్వత సంపద శ్రీవేంకటయోగనారసిమ్హశక్తితో వందలసంవత్సరాలుగా సమ్రక్షింపబడుతూ, ఇప్పటి వర్ధమాన కాలంలో మనకు ఆ ప్రాచీన సంకీర్తన సారస్వత సంపద స్వామివారి అనుగ్రహంగా లభ్యమై, 
వివిధ తెలుగు సాహిత్య పరిశోధక విజ్ఞ్యుల కృషివల్ల సుస్వర శ్రీహరిసంకీర్తనలుగా భక్తజనభోగ్యమై తరిస్తున్నాము....

అట్టి ఎన్నో పరిష్కృత శ్రీఅన్నమాచార్యసంకీర్తనలను అంతర్జాలంలో భక్తులందరికీ లభ్యమై తరించేలా వ్యవస్థీకరించిన ఈ క్రింది పుటల నిర్వాహకులకు భక్తులెల్లరూ సదా కృతజ్ఞ్యులు.... 

https://annamacharya-lyrics.blogspot.com/

https://te.m.wikisource.org/wiki/%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82:%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%B2%E0%B1%81

దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు
జనకు(డ అన్నమాచార్యు(డ విచ్చేయవే

అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే

వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశు(గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే

సంకీర్తనముతోడ సనకాదులెల్ల(బాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభు(డు నీవు
నంకెల మాయీంటి విందు లారగించవే

https://te.m.wikisource.org/wiki/%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81_%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6%E0%B0%BF_%E0%B0%A8%E0%B1%87%E0%B0%A1%E0%B1%81

సర్వం శ్రీ అన్నమాచార్య నుత శ్రీశ్రీనివాసశ్రీచరణారవిందార్పణమస్తు.....💐🙏

No comments:

Post a Comment