Wednesday, October 10, 2018

శివుడు నాదస్వరూపుడు. అక్షర శరీరుడైన శివుని స్వరూపము ఈ విధ౦గా ఉన్నది.

Bramhasri Samavedam Shanmukha Sarma
శివుడు నాదస్వరూపుడు. అక్షర శరీరుడైన శివుని స్వరూపము ఈ విధ౦గా ఉన్నది.
అకారము పరమేశ్వరుని శిరస్సు. ఆకారము లలాటము. ఇకారము కుడి కన్ను. ఈకారము ఎడమకన్ను. ఉకారము కుడి చెవి. ఊకారము ఎడమ చెవి. ఋకారము ఆ పరమేశ్వరుని కుడి చెక్కిలి. ౠకారము ఎడమచెక్కిలి. అలు, అలూ కారములు రె౦డు ముక్కుపుటములు. ఏకారము పై పెదవి. ఐకారము ఈశ్వరుని క్రి౦ది పెదవి. ఓకారము పై పళ్ళవరుస. దేవదేవుడగు శివునికి అ౦ అః అనునవు తాలు(దవడలు)స్థానములాయెను. వీటికి ప్రాణాక్షరములు అని పేరు.
క వర్గలోని ఐదు అక్షరములు(క ఖ గ ఘ జ్ఞ) ఐదు కుడిచేతులు కాగా, చవర్గలోని ఐదు అక్షరములు ఐదు ఎడమచేతులాయెను. టవర్గలో ఐదు, తవర్గలో ఐదు వెరసి పది అక్షరములు పాదముల వ్రేళ్ళు ఆయెను. పకారము ఉదరముకాగా, ఫకారము కుడి పార్శ్వము ఆయెను. బకారము ఎడమ పార్శ్వము కాగా భకారము స్క౦ధమాయెను. యోగీశ్వరుడు, మహాదేవుడగు శ౦భువునకు హృదయము మకారము. సర్వవ్యాపియగు శివునకు యకారము మొదలుగ సకారము వరకు గల ఏడు అక్షరములు ఏడు ధాతువులు(చర్మము, రక్తము, మా౦సము, అస్తి, కొవ్వు, మజ్జ, శక్ర౦) ఆయెను. హ కారము నాభి అనియు, క్షకారము ఘ్రాణే౦ద్రియము అనియు చెప్పబడెను. వీటికి ప్రాణ్యక్షరములు అని పేరు. మ౦త్రముద్వారా ఉత్పన్నమయ్యే చైతన్యమే దేవత. సర్వదేవతలూ మ౦త్రాధీనులు. సర్వ మ౦త్రములూ అక్షరాధీనములు. సర్వ అక్షరములు ఓ౦కార స్వరూపములు. ఓ౦కారమే శివుడు, సర్వదేవతామయుడు, మ౦త్రమయుడు, అక్షరమయుడు.

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం - 'సుదర్శన చక్రం'

ఈ క్షేత్రానికి గల మరో పెద్ద విశేషం ఎమనగా, గర్భ గుడి గోపురం పై కల 'సుదర్శన చక్రం' స్వయంగా రాముల వారు ఆలయ అర్చకులకు గోదావరి నదిలో ప్రసాదించినది ! ఈ క్షేత్రానికి దెగ్గర్లోనె ఉన్న 'అంబ సత్రం' లో స్వయంగా రాములవారు మరియు లక్ష్మణ స్వామి వంట చేసిన పాత్రలు " రామగుండిగ " ,
"లక్ష్మణగుండిగ" ఇప్పటికి మనం చూడవచ్చు !!
భక్తి సమాచారం
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం
శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానము ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.
17 వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉన్నది. 17 వ శతాబ్దం రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం తహశీల్దార్ గా ఉన్నపుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనంను ఉపయోగించారని గోల్కొండ లోని ఒక చెరసాలలో ఈయనను బంధించారు. కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాదీశుడైన సుల్తాన్ కు దివ్య రూపంలో కనిపించి గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం. బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు. అప్పటి నుండి గోపన్నను రామదాసు అని పిలుస్తుండేవారు. భద్రాచలం మరియు విజయనగరం ప్రాంతాలకు రామాయణంతో దగ్గర సంబంధమున్నట్లు రామాయణ గ్రంధాల ద్వారా తెలుస్తున్నది. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాల నందు రాముడు, సీత మరియు లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం మరియు మేనకల కుమారుడే భద్రుడు (భద్రగిరి). ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయినాడు. ఈ భద్రగిరిపై వెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు కూడా ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్నది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమయినాయి అని మళ్ళీ అతనిని ఆలయంలోనికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలం కి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం మరియు మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.

అస్మద్ గురుభ్యోనమః !!

ఆధ్యాత్మిక ప్రపంచం లో అడుగిడిన వారికి " గురువు " అన్న నామవాచకం తో ఎందరో విలక్షణమైన పెద్దలు లభించవచ్చు. కాని, కంటికి కనిపించని దైవాన్ని , దైవిక తత్వాన్ని , దైవానుభవాన్ని, అన్నిటినిమించి దైవసాక్షాత్కారాన్ని తమ అమృతవాక్కులతో మనకు ప్రసాదించే గురువులు చాలా అరుదుగా ఈ భరత భూమిపై నడయాడుతారు. తెలుగు నేల చేసుకున్న భాగ్యమో లేక
" దేశ భాషలందు తెలుగు లెస్స " అన్న రాయల వారి స్తుతికి ఆ భారతమ్మ ప్రసాదించిన వరమో , చాగంటి గురువు గారు ఈ తరానికి లభించడం ...! అస్మద్ గురుభ్యోనమః !!

Tuesday, October 9, 2018

​బ్రతుకమ్మ (ప్రకృతి) / బతుకమ్మ (వికృతి) ఉత్సవ వైభవవిశేషాలు....! :)

​బ్రతుకమ్మ (ప్రకృతి) / బతుకమ్మ (వికృతి) ఉత్సవ వైభవవిశేషాలు....! 
తెలంగాణా రాష్ట్ర పండుగగా స్థీరీకరించబడిన బతుకమ్మ పండుగ, చూడ్డానికి రంగు రంగుల పూలతో, ఉయ్యాల పాటలతో, కేవలం ఒక గ్రామీణ జానపద సంప్రదాయంలో అబ్బురంగా సాగిపోయే అమాయకపు పల్లె ప్రజల పండుగ అని మాత్రమే అనుకుంటారు....
కాని ఈ ఆశ్వయుజ మాస శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా జరుపుకునే ఈ ప్రాంతీయాచారం వెనక ఎంత గొప్ప ఆధ్యాత్మిక పరమార్థం దాగుందో తెలుసుకుంటే ఆశ్చర్యంచెంది మరింత ఆనందంతో ఈ పండుగను జరుపుకోవడం ఖాయం...
అస్మద్ గురుదేవులు, శ్రీ చాగంటి సద్గురువుల పర్యవేక్షణలో మొన్నటి కాకినాడ లో జరిగిన హేవిళంబి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవంలో స్వామికి జరిగిన ప్రత్యేక పుష్పార్చనలో, స్వామి వారి ఆహ్నిక ధృవమూర్తి అచ్చం బ్రతుకమ్మలో పేర్చబడిన వివిధ పుష్పదొంతరల మధ్య కొలువైన గుమ్మడిపువ్వులాగా ఉండడం చూసి స్వామిని ధ్యానిస్తే తెలిసింది బ్రతుకమ్మ లో దాగిన ఆ ' చైతన్య కుసుమప్రియ ' యొక్క చిత్శక్తి వైభవం....!
నా 1స్ట్ క్లాస్ నుండి, గత 25+ సంవత్సరాలుగా మా అమ్మ ఎంతో నియమ నిష్టలతో, మా ఇంటిదెగ్గరి జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాలనుండి, పెద్ద గునుగు, తంగేడు, చామంతి, రంగు రంగుల చిన్న గునుగు, గుమ్మడి, బంతి, ఇత్యాది వివిధ పువ్వులు ఆకులు కొని/సేకరించి చిన్న బత్కమ్మ, పెద్ద బత్కమ్మ అని రెండు పేర్చి, చివరికి గుమ్మడిపువ్వులోని పసుప్పచ్చని కేసరాన్ని లేదా పసుపుముద్దని పైన మణిపూస లాగ పెట్టి బ్రతుకమ్మను సాయంత్రం వాకిట్లో పెట్టి ఇరుగు పొరుగు వారితో కలిసి చుట్టూర తిరుగుతూ కొన్ని ఉయ్యాల పాటలు పాడి, కాలనిలోని కాలువ దెగ్గర అందరి బత్కమ్మలతో కలిపి అక్కడ కూడా అందరు ముత్తైదువులు / ఆడపడుచులు కలిసి చప్పట్లు కొడుతూ పాటలు పాడి నీటిలో వదలడంతో, ఈ పండగ ముగిసేది....
ఇప్పుడంటే తీరిక లేక, ఖర్చుల కారణంగా, చిన్నచిన్నగా పేరుస్తున్నారు కాని, మా అమ్మమ్మ తాత వాళ్ళ రోజుల్లో అయితే 5 ఫీట్లు, 7 ఫీట్ల ఎత్తు బ్రతుకమ్మలు కూడా పేర్చేవారట...!. కేవలం రామవరం అనే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే కాకుండా, మొత్తం భద్రాద్రి కొత్తగూడెం లోనే మా అమ్మమ్మ తాతలు పేర్చే బ్రతుకమ్మకు 1స్ట్ ప్రైజ్ రావడం ఆ రోజుల్లో పరిపాటి..
రామవరం నుండి వచ్చే కేశ వీరయ్య / గట్టమ్మల బతుకమ్మ అంటే అంత ఘనంగా ఉండేదని మా అమ్మమ్మ చిన్నప్పుడు చెప్తుండేది..!
నాకు చిన్నప్పుడైతే, అంటే 5 వ తరగతి వరకు అలా, బతుకమ్మ పండగ అంటే, ఇంట్లో అమ్మ, కాలనిలో అందరు ఫుల్లుగా పంచే ప్రసాదాలే గుర్తుకువచ్చేవి... బెల్లం కలిపిన నువ్వుల పిండి, చక్కెర పొడి కలిపిన పెసరు పిండి, బియ్యం పిండి, సత్తుపిండి, మినప్పిండి, అటుకులు బెల్లం, పుళిహోర, దద్యోజనం, ఇలాంటి రకరకాల ప్రసాదాలే నాకు సద్దులబతుకమ్మ అనాగానే మొట్టమొదట గుర్తొచ్చేవి.... ఎంత సేపు అవన్నీ తినేయడమే పనిగా ఉన్న నాకు, ఇలా ఈ పూల పండుగ జరుపుకోవడంలోని పరమార్థమేమి అనే ప్రశ్నైతే వచ్చింది కాని, దానికి సమాధానం మాత్రం అందని ద్రాక్షగానే ఉండిపోయింది.... పరంపరాగతంగా జనబాహుళ్యంలో ఉన్న సదాచార సంప్రదాయాల గౌరవ మరియాదలు తెలిసిన పెద్దలు ఏది చేసినా, చెప్పినా, సుదూరాలోచనతో, అందరి క్షేమం, ఉన్నతి కోరి చెప్తారు కాబట్టి, ఈ పండుగలో కూడా ఏదో ఆంతర్యం ఉండేఉంటుంది అని ప్రతి సంవత్సరం కేవలం అలాగే చూస్తూ సరిపెట్టుకున్నాను కాని, దానికి సమాధానం మాత్రం 2+ దశాబ్దాల తరువాత, అస్మద్ గురుదేవుల వివిధ ప్రవచనాల సారాన్ని సమన్వయం చేసుకొని స్వామిని ధ్యానిస్తే మొన్నటికి లభించింది... 
సాధారణంగా అందరు పెద్దలు చెప్పేది, ఆ వివిధ పూల బత్కమ్మలను కాలువల్లో, చెరువుల్లో, బావుల్లో, నదుల్లో, వేస్తే, ఆషాఢశ్రావణభాద్రపదం నాటి వర్షాలకు వచ్చి చేరిన కొత్త బురదనీటికి సహజసిద్ధమైన క్రిమిసమ్హారకంగా ఉండి ఆ నీటికి స్వచ్చతను, జీవశక్తిని ప్రసాదించి జీవకోటికి దాహార్తిని తీర్చే జలాలను శుద్ధి కావించడం అని....
అటువంటప్పుడు డైరెక్ట్ గా పూలన్ని తెంపి తీస్కెళ్ళి నీళ్ళలో గుమ్మరిస్తే సరిపోతది కదా అనే సందేహం వచ్చేది.. కాబట్టి ఈ మొత్తం బ్రతుకమ్మ ఉత్సవం మానవాళి మనుగడకు ఒక మంచి సందేశం ఇస్తూ సాగే సరళమైన, విరుల వారోత్సవం ( సద్దుల వరకు, ఈ 9 రోజులు కూడా చాలా చోట్ల ఆడుతారు కాబట్టి ఇది వారోత్సవం అన్నాను..) అని భావించడం కద్దు...
సో, ఈ చక్కనైన పరిమళాల పుష్పోత్సవం లో దాగిన గగన గంభీరమైన అధ్యాత్మ సందేశం ఏమనగా....
ఈ కాలం లో పుష్పించే వివిధ పుష్పాలన్ని సేకరించి, ఒక త్రికోణవృత్తావళి గా పూలను పేర్చుతూ బ్రతుకమ్మను పేర్చడం = చర్మము, రక్తము, అస్తి, మేధ, శుక్రము, మజ్జ, మాంసము, అనే 7 వివిధ ధాతువుల తో మనిషి శరీరము అనే ఒక సౌకుమార్య నిర్మాణము పరమాత్మచే గావించబడడం....
బతుకమ్మపై మధ్యలో తీర్చబడిన గుమ్మడిపువ్వు కేసరాన్ని / పసుపుముద్దని గౌరమ్మ గా ఆరాధించడం = మనిషి హృదయాంతరంలో పరమాత్మ తానే గౌర వర్ణంలో జీవాత్మగా కొలువై ఉండడం...!
( " తస్యమధ్యే వహ్ని’శిఖా అణీయో”ర్ధ్వా వ్యవస్థి’తః | నీలతో’-యద’మధ్యస్థాద్-విధ్యుల్లే’ఖేవ భాస్వ’రా | నీవారశూక’వత్తన్వీ పీతా భా”స్వత్యణూప’మా | తస్యా”ః శిఖాయా మ’ధ్యే పరమా”త్మా వ్యవస్థి’తః | స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సో‌உక్ష’రః పరమః స్వరాట్ || "
అని మంత్ర పుష్పం లో చెప్పినట్టు కదా, ఆలయంలో అర్చకులు మనకు నిత్యం స్వామి అనుగ్రహాన్ని కల్పిస్తూ ఉంటారు....  )

ఎక్కడెక్కడో పేర్చబడి తెచ్చిన అన్ని బతుకమ్మలను ఒకచోటికి చేర్చి అందరూ చుట్టూ చేరి ఆటపాటలతో చప్పట్లు కొడుతూ బ్రతుకమ్మను సేవించడం... ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన మనుష్యులందరు సంఘజీవులుగా అందరితో కలిసి మెలిసి జీవనం సాగిస్తూ తమ జీవన యాత్రను / తుదకు జీవ యాత్రను సుసంపన్నం చేసుకోవడం ... )
ఇక ఆఖరికి, పెద్దవా చిన్నవా...., ఎవరు పేర్చినవి, ఎవరి ఇంటినుండి వచ్చినవి, ఎంత గొప్పోల్లవి, ఎంత సామాన్యులవి, అనే భేదభావాలేవి లేకుండా అన్ని బతుకమ్మలను దెగ్గర్లోని నీటి లో వదలడంతో అవి అలా కాసేపు నీటిపై తెలుతూ కొద్ది దూరం వెళ్ళాకా నీటిలో కలిసిపోయి ప్రకృతిలోకి ఒదిగిపోవడం.... = ఒక కుటుంబం గా, ఒక సంఘం గా కొన్ని సంవత్సరాలు జీవించిన మనుష్యులందరు, ఎక్కనుండి వచ్చారు, ఎంత గొప్ప వారు, ఎంత సమాన్యులు, ఇత్యాది భేదభావలేవి లేకుండా, విరించి లిఖిత ఊపిరులు / శ్వాస లెక్కలు ఇక సరి అయిననాడు, సప్తధాతువుల ఈ శరీరం ఎలా ఏర్పడిందో అలాగే శీర్యమై ప్రకృతిలోకి కలిసిపోవడం....!
ఈ రోజుల్లో అంటే సాంకేతిక విప్లవంతో , టీ.వీ లు, ఇంటర్నెట్లు, బుక్కులు, పత్రికలు, ఇత్యాది ఎన్నెన్నో ప్రచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఆధ్యాత్మిక విజ్ఞ్యానాన్ని నలుగురితో పంచుకొని అందరు సమిష్టిగా జీవ యాత్ర లో ముందుకు వెళ్ళడానికి ఉపకరణాలు ఉన్నాయి...
మరి ఆ పూర్వపు రోజుల్లో మన పెద్దలకు, హరి కథలు / బుర్ర కథలు / ఒగ్గు కథలు / ఆలయాలు / జానపద గేయాలు / ప్రాంతీయాచారాలు మాత్రమే కదా ఉండేవి.... అందుకే ఈ విధంగా సంవత్సరానికి ఒక్కసారైనా అందరూ కలిసి ఒక చోట జరుపుకునే ఇటువంటి గ్రామీణ ఆచారాలను ఏర్పాటు చేసి అందులో వెలకట్టలేని మన శాస్త్ర విజ్ఞ్యానాన్ని మేళవించి అందరూ సంతోషంగా జీవించాలనే ఉన్నతమైన మన పూర్వుల జీవనదృక్పథాన్ని భావి తరాలకు కూడా అందేలా సంస్కృతిని సమ్రక్షించడం ప్రతి నాగరికుని విహిత ధర్మమే కదా...! 
( చిత్ శక్తి లోని ' చిత్ ' అనే పదం, జనపదం లో ' చిత్తూ ' గా మారింది )
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడ లోన...
రాగి బింద తీసుక రమణి నీళ్ళకు వోతే
రాములోరు ఎదురయే నమ్మో ఈ వాడ లోన...
వెండి బింద తీసుక వెలది నీళ్ళకు వోతే
వెంకటేశు డెదురాయే నమ్మో ఈ వాడ లోన...
బంగారు బింద తీసుక బామ్మా నీళ్ళకు వోతే
భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడ లోన...
పగిడి బింద తీసుక పడతి నీళ్ళకు వోతే
పరమేశు డెదురాయే నమ్మో ఈ వాడ లోన...
ముత్యాల బింద తీసుక ముదిత నీళ్ళకు వోతే
ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడ లోన...! 

Friday, October 5, 2018

Samskrutam.....🙂 Idam Devabhaashaayaah Vaibhavam... !

Samskrutam.....🙂
Idam Devabhaashaayaah Vaibhavam... !
----------------------
*Sanskrit Sanskrit:: Mind Blowing Facts about Sanskrit*
------------------------------------
• Sanskrit has the highest number of vocabularies than any other languages in the world.
• 102 arab 78 crore 50 lakh words have been used till now in Sanskrit. If it is used in computers & technology, then more than these number of words will be used in next 100 years.
• Sanskrit has the power to say a sentence in a minimum number of words than any other language.
• *America has a University dedicated to Sanskrit and the NASA too has a department in it to research on Sanskrit manuscripts.*
• Sanskrit is the best computer friendly language. (Ref: Forbes Magazine July 1987).
• Sanskrit is a highly regularized language. In fact, NASA declared it to be the *“only unambiguous spoken language on the planet”* – and very suitable for computer comprehension.
• Sanskrit is an official language of the Indian State of Uttarakhand.
• There is a report by a NASA scientist that America is creating 6th and 7th generation super computers based on Sanskrit language. Project deadline is 2025 for 6th generation and 2034 for 7th generation computer. After this there will be a revolution all over the world to learn Sanskrit. However, trend has picked up in the Western world. Indians are waiting for the moment when Sanskrit Scholars from overseas countries will come to teach them.
• The language is rich in most advanced science, contained in their books called Vedas, Upanishads, Shruti, Smriti, Puranas, Ramayana Mahabharata etc. (Ref: Russian State University, NASA etc. NASA possesses 60,000 palm leaf manuscripts, which they are studying day and night).
• Learning of Sanskrit improves brain functioning. Students start getting better marks in other subjects like Mathematics, Science etc. which some people find difficult. It enhances the memory power. James Junior School, London has made Sanskrit compulsory. Students of this school are among the toppers year after year. This has been followed by some schools in Ireland also.
• Research has shown that the phonetics of Sanskrit has roots in various energy points of the body and reading, speaking or reciting Sanskrit stimulates these points and raises the energy levels, whereby resistance against illnesses, relaxation to mind and reduction of stress are achieved.
• Sanskrit is the only language, which uses all the nerves of the tongue. By its pronunciation, energy points in the body are activated that causes the blood circulation to improve. This, coupled with the enhanced brain functioning and higher energy levels, ensures better health. Blood Pressure, diabetes, cholesterol etc. are controlled. (Ref: American Hindu University after constant study).
• There are reports that Russians, Germans and Americans are actively doing research on Hindu’s sacred books and are producing them back to the world in their name. Seventeen countries around the world have a University or two to study Sanskrit to gain technological advantages.
• Surprisingly, it is not just a language. Sanskrit is the primordial conduit between Human Thought and the Soul; Physics and Metaphysics; Subtle and Gross; Culture and Art; Nature and its Author; Created and the Creator. In fact, it is a medium of direct contact between Human beings and God.
• Sanskrit is the Scholarly language of 3 major World Religions – Hinduism, Buddhism (along with Pali) and Jainism (second to Prakrit).
• Today, there are a handful of Indian villages (in Rajasthan, Madhya Pradesh, Odisha, Karnataka and Uttar Pradesh) where Sanskrit is still spoken as the main language. For example in the village of Mathur/Mattur in Karnataka, more than 90% of the population knows Sanskrit. Mathur/Mattur is a village 10 kms from Shimoga, Karnataka speaks Sanskrit on daily basis for day-to-day communication.
• Even a Sanskrit daily newspaper exists! Sudharma, published out of Mysore, has been running since 1970 and is now available online as an e-paper (sudharma.epapertoday.com)!
• The best type of calendar being used is Hindu calendar(as the new year starts with the geological change of the solar system), Ref: German State University.
• The UK is presently researching on a defence system based on Hindu’s Shri Chakra.
• Another interesting fact about Sanskrit language is that the process of introducing new words into the language continued for a long period until it was stopped by the great grammarian Panini who wrote an entire grammar for the language laying down rules for the derivation of each and every word in Sanskrit and disallowed the introducing of new words by giving a full list of Roots and Nouns. Even after Panini, some changes occur which were regularised by Vararuchi and finally by Patanjali. Any infringement of the rules as laid down by Patanjali was/is regarded as a grammatical error and hence the Sanskrit Language has remained in the same glorious stage without any change from the date of Patanjali up to this day.
• *संस्कृत* is the only language in the world that exists since millions of years. Millions of languages that emerged from Sanskrit are dead and millions will come but Sanskrit will remain eternal. It is truly language of Bhagwan. Wealth of information on Sanskrit language and scholarly global nations' concern for Sanskrit shows how India lags behind America, Europe, Australia and select Asian brilliants in this matter. We Indians are reading sacred texts, performing pujas for various religious festivals throughout the year. So we will not be lying if we say Sanskrit is also one of our languages or our mother tongue in the next Census excercise without forgetting, to help save our own language from disappearing & doing our bit for the language.
## Learn Sanskrit and own such a heavenly wisdom. Being descendants of the Rishis, the amazing human beings on the earth, if you allow Sanskrit to die, heaven will not lose anything, but the humanity will be deprived of a priceless treasure!!
( From a Whatsapp forward message....)
SUDHARMA.EPAPERTODAY.COM

Brundaavanamadi andaridi.... GovinduDu andarivaaDaylay.....😀

I believe delegates are of 2 types...
One, who swear in to perform their regular appointed duties for that they need be done, and the other, who bring in a different execution perspective to their regime, by going a bit beyond their call of the duty for the well being of a common man to the best extent possible, within the permissible feasibility and earn not just accolades from the upper top brass execs but also respect and blessings from the heart of many a AamAadmi for easing their journey forward... 😊
Ever since Mr. Anil Singhal was roped in as the 25th Honorable E.O of TTD, significant improvements have been made to the day to day common man darshan system to ease their 'journey inching' towards perumaal's holy lotus feet in the Aananda Nilayam...😊
They might look small, yet play a key role in streamlining the overall queue movement to a great extent...which in-fact were a pain area since decades for almost every AamAadmi and surprisingly no one has even considered them as compelling improvement areas..!
To take a few as a **reference** for the same, the chaotic path ways inside the VCQ compartments have always been a great turn off for peaceful queue moment with a narrow passage entrance for a broader pathway which resulted in extremely suffocating pass thru that has always dreaded the children and elderly people to move forward in the Q. With the new SS barricades put in place to align the Q with the breadth of the passage area, the pilgrim movement is just seamless all along the VCQ...!!
The final Scanning / Security check system near the MahaaDwaaram, has been swiftly made implicit to the VCQ passage itself with multiple counters and ample free space around, there by providing more room to speed up the Q in to the temple with hassle-free, faster, much efficient and completely fool proof scan in place.
'Time slot based Sarvadarshan' has completed changed a common man's thoughts on how arduous and time taking it is, there by bringing that much needed smile on their face to 'face the Q'.
On the whole, there is indeed a considerable lift up in the AamAadmi's happiness quotient to bring them much 'closer' to the Lord, there by living up fully to the very purpose of serving mankind to serve god as per our elders say... 'Maanava seavea Maadhava seava...! ' .
Many come and leave......
A few come and live forever in the hearts before they leave to another place to continue their exceptional execution saga..... 😊
Brundaavanamadi andaridi.... GovinduDu andarivaaDaylay.....😀

శ్రీ చాగంటి సద్గురువుల సద్బోధామృతం.....

శ్రీ చాగంటి సద్గురువుల సద్బోధామృతం.....
గత దశాబ్ద కాలంగా కొన్ని కోట్ల మంది ఆస్తికజనుల జీవితాలకు వెలకట్టలేని ఆస్తిగా కొలువయ్యింది ఆ వాక్కు అనేది జగద్విదితమే...
దైహికంగా వారు ఒక సామాన్య శరీరం ఉన్న మానవులలా తిరుగాడుతున్నప్పటికీ, వారి సద్వాక్కులను ఉపాసన చేసే వారికి వారు ఎల్లప్పుడూ భగవత్ స్వరూపమై శిష్యులకు వాగ్దిక్సూచియై సహాయం చేయడం ఎందరెందరికో జీవితస్వానుభవము...
దేవ పారిజాతం లాంటి ఒక గొప్ప పువ్వు యొక్క వైభవం, ఆ పువ్వుకి సంబంధించిన విషయపరిజ్ఞ్యానం ఉన్నవారికి మాత్రమే తెలిసిఉండవచ్చు.కాని ఆ పువ్వులోని సౌరభం మాత్రం, అది కొలువైన చోట ఉన్నవారందరికి ఆనందాన్ని తన్మయత్వాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది...
అది ఎవ్వరికైనా సరే.... ఆ పువ్వు గొప్పతనం గురించి ఏ మాత్రం అవగాహన లేని సామాన్యులకు సైతం..!
అదే విధంగా ఒక సద్గురువు యొక్క వాక్యం ఎక్కడ ఆలకించబడి ఆరాధించబడుతుందో అక్కడ సకల శుభాలకు ఆటపట్టైన సకల దేవతానుగ్రహం నిత్యం వర్షించబడుతుంది అన్నది అంతే సత్యం....!
కొందరికి ఇది ఒకింత ఆశ్చర్యంగా విడ్డూరంగా అనిపించవచ్చు... కాని ఒక చిన్న ఉదాహరణ చూస్తే బాగా అర్ధమవుతుంది...
శ్రీమద్రామాయణభారతభాగవతాది గ్రంధములు మనంకూడా కొనుక్కొని అందులోని శ్లోకాలు వల్లెవేసినంత మాత్రాన అది సద్గురువుల బోధకు సమానం అవుతుందా అంటే ఒక్కనాటికి కానేరదు.
శంఖం లో పోస్తేనే తీర్థమన్నట్టుగా....
ఒక సద్గురువుల ద్వార నుడువబడినప్పుడు మాత్రమే ఆ వాక్కుకి అమేయమైన వాగ్ శక్తి సమకూరి అది ఆలకించబడిన వ్యక్తికి, ప్రాంతానికి , పరిసరాలకి ఆ దైవ శక్తి యొక్క అనుగ్రహప్రసరణ జరిగి వారి వారి జీవితాలను సర్వతోముఖాభివృద్ధితో సుసంపన్నంగావించడం అనే యోగక్షేమములు సమకూరేది...
మన ఇంట్లోనే ఒక మాస్క్, లైట్, ఆప్రన్, సిసర్,
కాటన్, ఇట్లాంటి వైద్య పరికరాలు అన్నీ ఉన్నాయి కదా అని మన వారికి మనమే దంత చికిత్స చేయడానికి.....
మరియు
ఒక నిష్ణాతుడైన వైద్యుడి దెగ్గరికి వెళ్ళి అవే పరికరాలతో దంతచికిత్స సరైనవిధంగా చేయించుకోడానికి ఎంత భేదం ఉందో...
మనకు తెలిసిన ఒ నాల్గు శ్లోకాలు స్తోత్రాలు చదివేసి దైవం యొక్క అనుగ్రహం వర్షించేయాలి అనుకోవడానికి....
మరియు
నిష్ణాతులైన సద్గురువుల దెగ్గర అవి విని పొందే దైవానుగ్రహానికి కూడా అంతే భేదం...!!
కొందరు అది కేవలం ఒక 3 రంగులతో ఉన్న బట్ట ముక్క అనుకొని సామాన్యంగా భావించడానికి,
ఇంకొందరు అది ఈ దేశ సార్వభౌమ అధికారానికి చిహ్నం గా ఉన్న జాతీయపతాకం అని భావించి నమస్కరించడానికి ఉన్న భేదం లా..
సద్గురువులు చెప్పేది ఏవో నాలుగు శ్లోకాల అర్ధతాత్పర్యాలు అని సామాన్యంగా కొందరు భావించడానికి....
ఇంకొందరు, అది సాక్షాత్ పరతత్వ ప్రామాణ్యాన్ని మనలోనే స్థిరీకరించే బ్రహ్మవిద్యా వర్షితమైన సద్వాక్కు అని భావించి నమస్కరించడానికి కూడా అంతే భేదం...!!! 😊
యద్ భావం.... తద్ భవతి....!😊
నగురోరధికం..... నగురోరధికం..!
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం...!! 🙏