శ్రీగురు సద్వాక్కుల స్మరణం... శ్రీహరిహర నామముల స్మరణం....
శ్రీగురు దర్శనం... శ్రీహరి దర్శనం...
శ్రీగురు పాద సంసేవనం...శ్రీహరి పాద సంసేవనం...
శ్రీమాత..గోమాత..భూమాత..స్వమాతాపిత..సేవ...
నారాయణసేవ/అన్నసమారాధన/అన్నదానం...
శ్రీగురు దర్శనం... శ్రీహరి దర్శనం...
శ్రీగురు పాద సంసేవనం...శ్రీహరి పాద సంసేవనం...
శ్రీమాత..గోమాత..భూమాత..స్వమాతాపిత..సేవ...
నారాయణసేవ/అన్నసమారాధన/అన్నదానం...
ఈ 5 సేవలు ఎనలేని పుణ్యార్జితములు అని సనాతన ధర్మమునందు ఎందరో మహనీయులచే యుగయుగాలుగా రూఢి పరచబడిన సార్వకాలికసత్యశ్రేష్టములు..! ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
ఈ కల్తీల కలియుగంలో, ఆఖరికి వీటిని కూడా కలుషితం చేసేలా ఈనాటి కలికాలపు దాష్టీకములు ఉండడం శోచనీయమే అనుకోండి...
కనీసం శ్రీసూక్త / పురుషసూక్త / మంత్రపుష్పాదులకు సైతం సరైనవ్యాఖ్యానం చేయలేని వారు, ఆధునిక గురువులుగా అవతారాలెత్తి దొరికినకాడికి దండుకొని బిచాణా ఎత్తేసే ఆశ్రమాలు స్థాపించి, ప్రజలకు ఆధ్యాత్మికతపై ఏహ్యభావన కలిగించే వారుండడం...!
మూర్ఖుల చెప్పుడు మాటలు విని వ్యసనాలకోసం, డబ్బులకోసం, ఆస్తులకోసం కన్నబిడ్డలనే కష్టాలకు గురిచేసే తల్లితండ్రులుండడం...!
చదివించి పెంచి పెద్ద చేసిన కన్నవారికి కనీసం పట్టెడు కూడు పెట్టకుండ, వాళ్ళు ఎప్పుడు పోతారా..వాళ్ళ ఆస్తులు ఎప్పుడు మనపేర చేసుకుందామా అని సుదూరాలోచనగా దురాలోచన సాగించే బిడ్డలుండడం..!
చదివించి పెంచి పెద్ద చేసిన కన్నవారికి కనీసం పట్టెడు కూడు పెట్టకుండ, వాళ్ళు ఎప్పుడు పోతారా..వాళ్ళ ఆస్తులు ఎప్పుడు మనపేర చేసుకుందామా అని సుదూరాలోచనగా దురాలోచన సాగించే బిడ్డలుండడం..!
అంతంతమాత్రంగా బ్రతుకుతున్న అన్నల దెగ్గర కాలిబూట్ల నుండి డబ్బులు వరకు అడుక్కొని చదువుకున్న తమ్ముళ్ళు, పెళ్ళై ఒక ఉన్నత స్థాయికి చేరుకోగానే చేసిన మేలును మరిచి కృతఘ్నతతో జీవించడం...!
దైవానుగ్రహంగా లభించిన కొద్దిపాటి అధికార సాకుతో, తమ క్రింద పనిచేసే సిబ్బంది లోని నైపుణ్యాన్ని ఓర్వలేక అక్కసుతో వారికి శల్యసారధ్యం రచించే చదువుకున్న బుద్ధిహీనులుండడం...!
ఇట్లా ఈ కలియుగంలో కొదువేలేని కర్కశత్వాలు కోకొల్లలు.....!!
అందుకే ఈ కలియుగంలో శ్రీ గురు హరి హర సంబంధిత వ్యాపకములు / సేవలు, గోసేవ, భక్తులకు అన్నసమారాధన...
ఇటువంటివి ఒకమనిషిని సంపూర్ణంగా తరింపజేసేందుకు ఉపయుక్తంగా ఉండే ధర్మసాధనములు...
వాటి ద్వారా ఆర్జించబడిన జ్ఞ్యానైశ్వర్యపుణ్యములు శాశ్వతసుఖశాంతి కారకములు.....
ఇటువంటివి ఒకమనిషిని సంపూర్ణంగా తరింపజేసేందుకు ఉపయుక్తంగా ఉండే ధర్మసాధనములు...
వాటి ద్వారా ఆర్జించబడిన జ్ఞ్యానైశ్వర్యపుణ్యములు శాశ్వతసుఖశాంతి కారకములు.....
ఇవన్నీ జీవితంలోకి సక్రమరీతిలో సమకూరడం అన్నది, కేవల మన ప్రమేయంతో మాత్రమే కాకుండా సద్గురువాగ్ అనుగ్రహ విశేషంగా సిద్దిస్తుంది...
ఎవరికి ఎవరు సద్గురువు అన్నది వారి వారి జ్ఞ్యానస్థాయిని బట్టి వారి ఆత్మోద్ధరణకై వారే నిర్ణయించుకునే వ్యక్తిగత అంశం...,
(అంటే నా ఉద్ధేశ్యం, మనకు గల జ్ఞ్యానం మొట్టమొదట మనకు బోధించేది మనకు ఎంత తెలియదు అనే విషయమే...
As a saying goes, " The more learnt and wise I become, I come to know how much I don't know...." )
(అంటే నా ఉద్ధేశ్యం, మనకు గల జ్ఞ్యానం మొట్టమొదట మనకు బోధించేది మనకు ఎంత తెలియదు అనే విషయమే...
As a saying goes, " The more learnt and wise I become, I come to know how much I don't know...." )
అందులో దైవనిర్ణయమే తుదిగా ఉండి, ప్రార్ధించే సదరు జీవుడికి యోగ్యమైన సద్గురువు ఎవరన్నది సూచించడానికి, ఒక్కొక్కచో తానే ఆ సద్గురువై వస్తాడన్నది అధ్యాత్మ జగత్తులోని ఆశ్చర్యమైన అంశం..!
లోకమంతా నేలమీద పడి నమస్కరించే, నడిచే దైవంగా పేర్గాంచిన శ్రీ కంచి పరమాచార్యులవారు, ఒకనాడు ఒక వ్యక్తి మీరు జగద్గురువులు ఎందుకు అవుతారు అని అడిగితే, దానికి సమాధానంగా,
'ఈ జగత్తులో ఎందులోనైనా నేను ఒక గురువును దర్శించి నమస్కరించగలను...
ఉదాహరణకు..ఒక చిన్న పిట్ట, పుల్లలను ఏరి ఎంతో నేర్పుతో నివసించేందుకు చెట్టు కొమ్మకు వేలాడేలా గూడు కట్టుకొనే విద్య నాకు రాదు...
కాబట్టి ఆ పిట్టలో ఒక గురువుని దర్శించి నమస్కరించగలను....అందుకే...." అని చెప్పినప్పుడు, వారి పాదాలకు అప్పటికప్పుడే నేల మీద పడి ప్రణమిల్లడం ఆ వ్యక్తివంతయ్యింది... ఇక్కడ అప్రయత్నంగానే ఆ వ్యక్తికి తన సద్గురువు లభించి, ఆ గురుత్వం ద్వారా తను ఉద్ధరించబడడం అనేది జరిగింది...

ఒకనాడు, నరేంద్రుడు ( స్వామి వివేకానంద ) శ్రీరామకృష్ణ పరమహంసలను తన గురువులుగా స్వీకరించేక్రమంలో, " మీరు నిజంగా దేవుణ్ణి చూసారా...? ", అని ప్రశ్నించినప్పుడు,
" ఓ, చాలా బాగా చూసా నరేన్... నిన్ను ఇప్పుడు ఎంత దెగ్గరగా స్పష్టంగా చూస్తున్నానో...అంతకంటే దెగ్గరగా స్పష్టంగా చూసా...!" అని సమాధానం ఇవ్వడంతో, ఆ సద్గురువుల జ్ఞ్యానవలలో చిక్కి, ఆ తదుపరి లోకానికి ప్రాచ్య పాశ్చాత్య అధ్యాత్మ విద్యానుసంధానకర్తగా ఉండి, అక్షీణ అధ్యాత్మవిద్యాగంగాజలాలను భువిపై దశదిశలా ప్రవహింపచేసి, తరతరాలకు వన్నెతరగని వివేకానందుని బోధలుగా సుస్థిర పరిచిన శాంతి కపోతమై, ఆనాడు 3 పదులే భౌతికంగా నివసించి కాలగతిలో కరిగిపోని శాశ్వత జ్ఞ్యాన వజ్రమై నిలిచిన శ్రీ ఆదిశంకరాచార్యుల లాగా, ఈ నవయుగపు గురువులుగా స్వామి వివేకానందున్ని నిలిపింది, కేవలం శ్రీ శారదామాత-రామకృష్ణపరమహంసల గురుకటాక్ష వైభవమే...!

అలనాడు శ్రీరామానుజాచార్యులు, తమకు గురుకటాక్షంగా లభించిన "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరి మంత్రాన్ని, అన్యాపదేశం వలదు అని వారించినాసరే గుడిగోపురం పైకెక్కి అరిచిమరీ భక్తజనులందరికి పంచి మీరందరుకూడా ఈ అష్టాక్షరి ని జపించి తరించండి అని, ఉదాత్తభావం తో సెలవివ్వడం, సద్గురువుల స్థాయిలో నిలిచి లోకశ్రేయస్సు కాంక్షించేవారిగా ఉండడంవల్లే....
ఇవ్విధంగా, సద్గురుకటాక్షం / సద్గురువాగ్ వైభవం, సిద్ధింపజేయనిదంటూ ఏదిఉండదు...ఎందుకంటే వారిది లోక/సాధుసజ్జనుల శ్రేయస్సు కోరి జీవించే తత్వం కనుక....!
----------------------------------------------------------------------
ఇవ్వాళ్టి పేపర్లోని, శ్రీభూ సతులతో తిరుమల శ్రీనివాసుడి ప్రణయకలహోత్సవం చూడగానే, నాకు 2016 నాటి స్వామివారి ప్రణయకలహోత్సవం గుర్తుకువచ్చింది...
ఎందుకంటే అలనాటి ఉత్సవంలో, అస్మద్ గురుదేవులు, శ్రీ చాగంటి సద్గురువులు కూడా స్వామివారి పక్కనే ఉండి , హరి గురువుల దర్శన భాగ్యం ఏకకాలంలో సంప్రాప్తించడం నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం... పైకి చూడ్డానికి ఈ ఉత్సవం చాలా గమ్మత్తుగా, సరదాగా స్వామి తన ఇరుదేవేరులతో జోక్స్ వేస్తూ, అలక తో సాగే అమరోత్సవంగా ఉన్నా, ఇందులోని గాంభీర్య సందేశం జీవుడిని ఈ కలికాలపు ధాటినుండి సమ్రక్షించి తన శ్రీపాదదాస్యంలో ధృడంగానిలిపి తరింపచేయడమే....
' కల్యతే ఇతి కలి...' అనే వ్యుత్పత్తి ప్రకారంగా, అకారణ కలహములను కలిగించి జీవుడికి సదా వివిధ కష్టాలు కలిగించువాడు కలిపురుషుడు....
తదనుగుణంగా, ఆ కలికారక కలహాలను తన క్రీగంటి చూపులతోనే రూపుమాపి, ఒక చిన్న రభసగా మాత్రమే అవి జీవుడిని స్పృశించేలా చేసి, దుష్కర్మక్షయం గావించి, దురితాపహారకుడిగా, దయజూచేవాడు ఆ దామోదరుడు... ఆ దేవతాఉత్సవం ఈ విధంగా జీవుడికి శుభమై వర్ధిల్లడానికి అక్కడ సమ్మిళితమైన సద్గురువు అనుగ్రహమే కారకమై ఒప్పారుతుంది అనేది ఇక్కడి గహనమైన కర్మసిద్ధాంతపు మార్మికం...!![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
ఎందుకంటే అలనాటి ఉత్సవంలో, అస్మద్ గురుదేవులు, శ్రీ చాగంటి సద్గురువులు కూడా స్వామివారి పక్కనే ఉండి , హరి గురువుల దర్శన భాగ్యం ఏకకాలంలో సంప్రాప్తించడం నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం... పైకి చూడ్డానికి ఈ ఉత్సవం చాలా గమ్మత్తుగా, సరదాగా స్వామి తన ఇరుదేవేరులతో జోక్స్ వేస్తూ, అలక తో సాగే అమరోత్సవంగా ఉన్నా, ఇందులోని గాంభీర్య సందేశం జీవుడిని ఈ కలికాలపు ధాటినుండి సమ్రక్షించి తన శ్రీపాదదాస్యంలో ధృడంగానిలిపి తరింపచేయడమే....
' కల్యతే ఇతి కలి...' అనే వ్యుత్పత్తి ప్రకారంగా, అకారణ కలహములను కలిగించి జీవుడికి సదా వివిధ కష్టాలు కలిగించువాడు కలిపురుషుడు....
తదనుగుణంగా, ఆ కలికారక కలహాలను తన క్రీగంటి చూపులతోనే రూపుమాపి, ఒక చిన్న రభసగా మాత్రమే అవి జీవుడిని స్పృశించేలా చేసి, దుష్కర్మక్షయం గావించి, దురితాపహారకుడిగా, దయజూచేవాడు ఆ దామోదరుడు... ఆ దేవతాఉత్సవం ఈ విధంగా జీవుడికి శుభమై వర్ధిల్లడానికి అక్కడ సమ్మిళితమైన సద్గురువు అనుగ్రహమే కారకమై ఒప్పారుతుంది అనేది ఇక్కడి గహనమైన కర్మసిద్ధాంతపు మార్మికం...!
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
No comments:
Post a Comment