"పురుషులలో పుణ్యపురుషులు వేరయా...విశ్వదా అభిరామ వినరా వేమా... "
అనే వేమన పద్య భాగాన్ని, అబ్బో లోకం లో, అందునా ఈ కలియుగంలో అలాంటి వారు కూడా ఉంటారా అంటూ ఏదో హాస్యాస్పదంగా చిన్నప్పటినుండి మిత్రులతో ఏవో జోకులు వేసుకుంటూ అనుకోవడం తప్ప, బ్రహ్మశ్రీ చాగంటి వారు, తమ ప్రవచనాంతర్భాగంగా నుడివిన ' శ్రుణ్వన్ తపః ' అనే వాక్యం కర్ణకుహరాల్లోంచి హృదయకుహరంలోకి చేరుకున్న రోజున అర్ధమైంది, అలాంటి వారు నిజంగా ఉంటారని...!
శరీర సహజ సంజాతాలైన కామ క్రోధాది అరిషడ్ వర్గాన్ని జయించడమే శాంతికి మార్గం అని, నిత్యం హరి నామం పలకండని, శివాభిషేకాలు చేసెయ్యండనీ, సింపుల్ గా చెప్పేసే వారు ఎందరో ఉంటారు...
ఇంకా కావాలంటే, పదివేలిస్తే శక్తిపాతాలు, దానికి పదింతలిస్తే ఏకంగా ముక్తికి సోపానాలు అంటూ, సామాన్య ప్రజానీకాన్ని అయోమయానికి గురిచేసి ' ఆధ్యాత్మికత ' అనే పదానికి అర్ధాన్ని మార్చి, అది ఒక వ్యాపారంగా ఏమార్చగలిగే వారెందరో ఉన్న ఈ కలికాలంలో, సిసలైన సాధనామార్గాన్ని సులభతరంగా అందించే అసమాన గురుస్వరూపులు, నిలువెత్తు ఆప్యాయత మూర్తిభవించి, ఈ తరానికి లభించిన రామకృష్ణ పరమహంస శ్రీ చాగంటి వారు... [ లలాట సాముద్రికాది యోగ శాస్త్రాలు పరిచయం ఉన్నవారికి, గురువుగారు మరియు గురుపత్ని గారు, శ్రీరామకృష్ణులు మరియు శారదా మాత అంశారూపులు అని ఇట్టే తెలుసుకోగలరు...]
అవతల కూర్చున్నవారు,
వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలోని కాండలు ఆరా లేక ఏడా, భాగవతంలో ద్వాదశ స్కంధాలు, 18 మహాభారత పర్వాల పేర్లు, వంటి చిన్న చిన్న ఆధ్యాత్మిక విషయాలు కూడా సరిగ్గా గుర్తుండని [ నాలాంటి ] పామరులా,
లేదా,
ఋక్యజుస్సామములను కంఠగతం చేసుకున్న వైదిక నిష్ఠాగరిష్ఠులా, తర్క-న్యాయ-మీమాంస-నిరుక్త-వ్యాకరణ-ఛందస్సులను ఆపోశన పట్టిన శాస్త్ర కోవిదులా,
ఆష్టాదశ పురాణాలను ఆకలింపు చేసుకున్న అపరవిద్యాదురంధరులా,
మొదలైన భేదభావాలేవీ కించిత్ కూడా లేకుండా, తమ ప్రవచనా ప్రసాదాన్ని సహృదయంతో సమభావంతో పంచిపెట్టే పుంభావ సరస్వతీ స్వరూపులు శ్రీ చాగంటి వారు....!!!
వియద్ గంగా సమమైన వారి పవిత్ర అమృత వాక్కులు, ఎందరికో జీవితపు అగోచర బాటల్లో దారి చూపే స్వప్రకాశ నక్షత్ర కాంతిపుంజములై సదా వెలుగొందుతుండాలాని ఆకాన్షిస్తూ....
అస్మద్గురుపాదద్వయము చెంత ఒక చిరు ఎకలవ్య శిష్యుడు సమర్పించే వినయాక్షర సుమాంజలి...!!!

No comments:
Post a Comment