Friday, January 18, 2019

శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ వరములొసగవయ్యా వాసుదేవ కృష్ణ...

చతుర్దశ భువనాధీశుడైన శ్రీ వేంకటకృష్ణున్ని,
14 సార్లు కృష్ణ నామగుణకంతో నిర్మించబడిన ముచ్చటైన ముద్దుకృష్ణుని గోవిందనామ సంకీర్తనగా మలిచి, కంచి వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తి కి నీలమేఘశ్యాముని అలంకారం జోడించిన ఈ కీర్తన ఎంత మధురమైనదో కదా...!🙂
శ్రీచాగంటి సద్గురువుల భాగవతాంతర్గత శ్రీకృష్ణలీలలు
మనస్ఫూర్తిగా ఆలకించిన వారికి, మన ఇంట్లోనో, చుట్టుపక్కనో, ఎవరైన చిన్నపిల్గాడిని చూసినప్పుడు వారిలో శ్రీ కృష్ణుని దర్శించి తరించడం కద్దు...!! 😁
Shaik Rafi to ఫేస్ బుక్ అన్నమయ్య.. facebook annamayya
అన్నమాచార్య 600:1,2,3,4
1.శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ వరములొసగవయ్యా వాసుదేవ కృష్ణ
2.మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ సుద్దులు చెప్పవయ్యా అచ్యుత కృష్ణ ఒద్దు రాగదవయ్య ఉపేంద్ర కృష్ణ ముద్దులు గురియవయ్య ముకుంద కృష్ణ
3.గొల్లెతల మరిగిన గోవింద కృష్ణ చెల్లునయ్య నీచేతలు శ్రీధర కృష్ణ అల్లన దొంగాడవయ్య హరి శ్రీ కృష్ణ మల్లుల గెలిచినట్టి మధుసూదన కృష్ణ
4.గోవుల గాచిన యట్టి గోపాల కృష్ణ కైవశమై మమ్మేలు శ్రీకర కృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ సేవకుడ నీకు జుమ్మీ శ్రీవేంకట కృష్ణ

No comments:

Post a Comment