భోగి కి - ఆ భోగీంద్రశాయి అనుగ్రహంగా మన ఇక్కట్లు/దురితాలన్ని కూడా భోగి మంటల్లో దగ్ధమై మన జీవితాలు ఎనలేని నూతన భోగభాగ్యాలతో నిండుగాక...
మకరసంక్రాంతి కి - వెయ్యేండ్లు పోరాటానంతరం, పాహి ఈశ్వర.. పాహి ఈశ్వర.. అని ప్రార్దించిన మత్తేభానికి మకరి పీడ వదిలించి, సమ్రక్షించిన మాధవుని అనుగ్రహంతో మన
జన్మజన్మాంతర దుష్కర్మలు దూరమై, సత్కర్మాచరణమందు మన మనసులు సదా స్థిరమైఉండుగాక...
జన్మజన్మాంతర దుష్కర్మలు దూరమై, సత్కర్మాచరణమందు మన మనసులు సదా స్థిరమైఉండుగాక...
కనుము కి - మన కుటుంబాలన్ని కలకాలం ఆ సితకమాలాక్షుని క్రీగంటి చల్లని చూపులతో సదా శుభాలకు ఆలవాలమై ఒప్పారుగాక...
తిరువేంకటశ్రీరామచంద్రుడి అప్రమేయానుగ్రహ పరంపరల వెల్లువై, ఈ 2019 - విళంబి సంక్రాంతి అందరికి ఎనలేని శుభాల జల్లులవ్వాలని అభిలషిస్తూ, అందరికి సంక్రాంతి శుభాభినందనలు...! ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png)
No comments:
Post a Comment