Thursday, January 3, 2019

HariNaamaVaibhavam...!

సకలతత్త్వ సంశయఖండన మిది | సకలకర్మ నిశ్చయము నిది | సకలవిధి రహస్యప్రధాన మిది | అకారణహితం హరినామం || 
Shaik Rafi to ఫేస్ బుక్ అన్నమయ్య.. facebook annamayya
అన్నమాచార్య 591:1,2,3,4
1.సకల సంగ్రహము సకల సంచయము | అకృతసుకృత మిది హరినామం ||
2.సకలవేదశాస్త్రములసార మిది| సకలమంత్రరాజంబు నిది| సకలపురాణ రసములమధుర మిది| అకుటిలపావనం హరినామం ||
3.సకలతత్త్వ సంశయఖండన మిది | సకలకర్మ నిశ్చయము నిది | సకలవిధి రహస్యప్రధాన మిది | అకారణహితం హరినామం ||
4.సకలదేవతా స్వామిప్రియం బిది | సకలలోక రక్షణము నిది | ప్రకటం వేంకటపతి నామాంకిత- | మకించనధనం హరినామం ||


Audio_Link_To_Sakala_Sangrahamu_SakalaSanchayamu.mp3

No comments:

Post a Comment