సంక్రాంతి పండుగ సంబురాల్లో భాగమైన పతంగుల ఉత్సవాంతర్గతంగా నాకు తోచిన జీవన సారం..... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
అస్మద్ గురుదేవులు, శ్రీ చాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాల సారంగా దర్శించిన మనుష్య జీవన సాఫల్యతను / అనేకానేక శరీరాలను ధరించే జీవుడి గమనాన్ని, సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేక ఆకర్షణగా ఉండే పతంగుల (గాలిపటాల) ఉత్సవాంతర్భాగంగా వర్ణించే చిరు ప్రయత్నం చేస్తాను..![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
" దీపావళి పటాకీల తర్వాత సంక్రాంతి పతంగుల్లో కూడా పరతత్వ విషయ ప్రామాణ్య స్థిరీకరణ చేస్తున్నావా నాయనా..." అని అనుకుంటారేమో....
మన పూర్వీకులు ఏర్పరిచిన ప్రతి పండుగలో, ప్రతి ఆటలో, ప్రతి ఆచారంలో, ఎన్నెన్నో గొప్ప అధ్యాత్మ విజ్ఞ్యాన విషయాలు దాగున్నాయి అని మన పెద్దలు ఎప్పుడూ చెప్పడం చూస్తూనే ఉంటాం...
దేహం దహ్యం కాకముందే అవి శక్తిమేర గురువులచే తెలుకుసుని, ఆ జ్ఞ్యాన గంధాన్ని అలదుకుని, అసంఖ్యాక జన్మల పరంపర అనే చక్రం నుండి విడివడి, పరమాత్మలో ఐక్యం అవ్వడమే కదా ప్రతి జీవి యొక్క తుది గమ్యం...!

భోగి - మకరసంక్రాంతి - కనుమ - ముక్కనుమ / పొంగల్ / లొహ్రి / గుడిపడ్వ ఇత్యాది పేర్లతో భరతభూమి పై ఎన్నో ప్రదేశాల్లో జరుపుకునే పండుగ సంక్రాంతి... మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, సంక్రాంతి అంటే, దసరా, దీపావళి, తర్వాత ఇంకో పెద్ద పండుగే...
సంక్రాంతి పండుగ యొక్క శాస్త్ర సంబంధమైన విశేషాలు టీ.వీ ల్లో ఎందరో ఆధ్యాత్మికవేత్తలు, గురువుల దెగ్గర వినే ఉంటారు...
సూర్యుని మకర సంక్రమణాన్ని పురస్కరించుకొని జరుపుకోవడం, చాంద్రమాన మరియు సౌరమాన - సాయన సిద్ధాంతాల్లో కూడా సరిగ్గా ఒకేసారి జరుపుకునే పండుగ, దక్షిణాయనం నుండి ఉత్తరాయనం వైపుగా, చైత్రం మొదలు ఫాల్గుణం వరకు ఉండే 12 మాసములతో, వసంత-గ్రీష్మ-వర్ష-శరద్-హేమంత-శిశిరం వరకు 6 ఋతువులతో ఉండే సంవత్సర కాలచక్రపు గమనాన్ని, సూర్యుని సప్తాశ్వ రథ చక్రలాను ఉత్తరం వైపునకు సూర్యరథసారథిగా ఉండే వినతా జ్యేష్ఠ పుత్రుడు ( గరుత్మంతుని అన్నయ్య ) అనూరుడు మళ్ళిస్తూ...,
వానలు, చీకట్లు, చలి తో కొంత ఇబ్బంది గా సాగిన కాలాన్ని,
వెలుతురు, ఆహ్లాదాం, పచ్చదనం, వైపుగా తీసుకెళ్ళడం, ఆరుగాలం శ్రమించిన రైతులకు సస్యలక్ష్మి గా పంటచేతికి అందివచ్చే కాలం, ఇత్యాది పరంగా సంక్రాంతి పండుగ యొక్క విశేషాలను వినే ఉంటారు....
వెలుతురు, ఆహ్లాదాం, పచ్చదనం, వైపుగా తీసుకెళ్ళడం, ఆరుగాలం శ్రమించిన రైతులకు సస్యలక్ష్మి గా పంటచేతికి అందివచ్చే కాలం, ఇత్యాది పరంగా సంక్రాంతి పండుగ యొక్క విశేషాలను వినే ఉంటారు....
శాస్త్ర సంబంధంగా కాకపోయినా, కాలక్రమంలో లౌకిక ప్రాంతీయాచారంగా వచ్చి చేరిన ఉత్సవాలు, పద్దతులు, ఆటపాటలు, కొన్ని మనం చూస్తూనే ఉంటాం...
అట్లాంటివే ఈ సంక్రాంతి గొబ్బెమ్మలు, డూ డూ బసవన్నలు / గంగిరెద్దులతో ఒగ్గు కథ / హరి కథ గానం చేసే హరిదాసుల నృత్యాలు, పతంగుల ఉత్సవాలు మొదలైనవి అన్నమాట...![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
అట్లాంటివే ఈ సంక్రాంతి గొబ్బెమ్మలు, డూ డూ బసవన్నలు / గంగిరెద్దులతో ఒగ్గు కథ / హరి కథ గానం చేసే హరిదాసుల నృత్యాలు, పతంగుల ఉత్సవాలు మొదలైనవి అన్నమాట...
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
సంక్రాంతి పండుగ అనగానే అటు వినువీధులన్నీ రంగురంగుల పతంగులతో, ఇటు తెలుగింటి లోగిళ్ళన్నీ రంగు రంగుల రంగవల్లికలతో చూడముచ్చటగా మారిపోవడం కద్దు.....
చిన్నప్పుడు, అంటే మా స్కూల్ డేస్ లో, సంక్రాంతి పండుగ అనగానే మాఇంట్లో హాఫ్ ఇయర్లీ ఎగ్సాంస్ అయిపోయి నేను, తమ్ముడు 1 వీక్ హాలిడేస్ లో ఉండే టైం....
కాలని కమాన్ దెగ్గర ఉండే బాగా ఫేమస్ అయిన ' రాజన్న హోల్ సేల్ పతంగీల షాప్ ' లో ఈ సారి ఏ స్టైల్ పతంగీలు కొనాలి ? ఏ కలర్ మాంజా కొనాలి..? సజ్జపైన ఉన్న లాస్ట్ ఇయర్ చరక్ వాడాలా లేదా కొత్త చరక్ కొనాల..? సంక్రాంతి టైంలోనే వచ్చే నా బర్త్ డేకి ఈ సారి కొత్త డ్రెస్ అమీర్పేట్ చెర్మస్ లో కొనాలా లేక బాలానగర్ ఎస్.కుమార్ లోనా...? బర్త్ డేకి అమ్మని గులాబ్ జామూన్ చేయమనాలా లేక డబల్-కా-మీఠా నా..?
అంటూ సాగేవి మా హాలీడే టైం టాక్స్...
అంటూ సాగేవి మా హాలీడే టైం టాక్స్...
నేనూ, తమ్ముడు...ఇద్దరూ ఇద్దరే....ఎవరి పతంగీలు వారివి...ఎవరి మాంజ వారిది...ఎవరి ఫ్రెండ్స్ తో వారు... ఎవరు ఎన్ని పతంగీలు ' పేంచ్ లో అఫ్ ' చేసామో, అఫ్ అయిన పతంగీలు ఎవరికి ఎన్ని దొరికాయో, పొద్దున మొత్తం కాలని అంతా తిరుగుతూ పతంగీలు ఎగిరేసి సాయంత్రం అలిసిపోయి ఇంటికి వచ్చి, అమ్మ చేసిన సంక్రాంతి స్పెషల్ అరిసెలు, సకినాలు, మురుకులు, తింటూ,
' అరెయ్ విజ్జు, నీకు దొరికిన ఈ గుడ్డు డిసైన్ పెద్ద పతంగి నాకు ఇయ్యవారా ప్లీజ్...నీకు 2 సకినాలు ఎక్కువ ఇస్తరా...." అని నేను....
' నీకు దొరికిన ఆ పెద్ద తోకపతంగి, దాని మాంజ కూడా నాకు ఇస్తే...అప్పుడు నాకు దొరికిన గుడ్డు డిసైన్ పెద్ద పతంగి నీకు ఇస్తా అన్న..." అని వాడు...
ఇలా ఇద్దరం మాకు ఆ రోజు దొరికిన పతంగీల లెక్కలను సరి చూసుకుంటూ, చిరిగిన పతంగీలను పేపర్ ముక్కలకు అన్నం మెతుకులు రాసి అతికించి సరిచేసుకుంటూ, తెగిపోయిన ' కన్నాలను ' సరిగ్గా కడుతూ, మరునాటి కైట్ ఫ్లయింగ్ కి సంసిద్ధమయ్యే మా సుందర బాల్యకౌమారపు రోజులు సదా ఆనందాన్ని పంచే మధురస్మృతులే కదా...
సజ్జపైన దాచి పెట్టిన పతంగీలు ఎవరికైనా కనిపిస్తే తీసుకుంటారేమో అని, నా ఇంటర్ 1స్ట్ ఇయర్ వరకు (2003 వరకు) మాకున్న 50 గజాల చిన్న 2 రూముల సిమెంట్ రేకుల ఇంటి పైకి పాకిన సోరతీగ ఆకుల క్రింద పతంగీలను దాచిపెట్టడం తలచుకొని ఇప్పటికీ అప్పుడప్పుడు ఆపకుండా నవ్వుకుంటాను నేను...!

ఆ చిన్ననాటి పతంగుల ఆటలో కూడా ఎంతటి ఆధ్యాత్మికత దాగుందో,
10 తరగతి తర్వాత 6 సంవత్సరాలకు, బి.టెక్ డేస్ నుండి ఒక 7 సంవత్సరాల పాటున్న జీవితంలోని ఎంతో గడ్డుకాలంలో నాకు లభించిన ఎకైక స్వాంతన, శ్రీ చాగంటి సద్గురువుల బోధాంతర్భాగంగా జీవితాన్ని సమన్వయం చేసుకున్నప్పుడు గోచరించి,
" ఔరా...ఎంతటి ఘనమైనది మన సనాతన సంప్రదాయప్రతిపాదిత విజ్ఞ్యాన సారస్వతం..." అని అనిపించి, సద్గురువుల శ్రీమద్భాగవతప్రవచన బోధలో సంక్రాంతి పతంగులను కూడా దర్శించి తరించాను...!

ఆ సమన్వయం ఏమనగా...
చిన్నవి, పెద్దవి, ఆ రంగు, ఈ రంగు, ఆ స్టైల్, ఈ స్టైల్, అన్నీ కలిపి పతంగులు ఎన్ని రకాలైనా సరే, వాటన్నిటి ఉనికికి ఆధారం 2 పుల్లలు / వెదురు బద్దలు మాత్రమే....
ఇక్కడ ఆ పతంగుల తయారీకి ఉపయోగించిన పేపర్ / కవర్, 7 ధాతువుల మానవ శరీరం అని భావిస్తే, ఆ శరీరానికి ఉనికిని ప్రసాదించేందుకు మూలకారణమైనవి ఆ 2 పుల్లలు...
ధనస్సు లేదా శుద్ధ తదియనాటి చంద్రవంక లా అడ్డంగా ఉండే ఆ బద్ద జీవుడి " జన్మ " మరియు, ధనస్సును ఎక్కు పెట్టినట్టు ఉండే ఆ నిలువు బద్ద, జీవుడి " కర్మ " ....
అసలు జీవుడికి ఐహిక ఉనికి ఏర్పడడానికి మూలకారణం, ఈ " జన్మ - కర్మ " అనే ఇరు బంధనములు మాత్రమే ...
అవి రెండు లేనినాడు జీవుడికి ఉనికే లేదు.. లేదా, ఉనికి ఉండవలసిన అవసరమే లేదు..!
( షాప్ లోకి వెళ్ళిన పిల్గాడు పతంగి కొనే ముందు చూసేది ఆ రెండు పుల్లలు సరిగ్గ ఉన్నాయా లేదా అనే...అవి సరిగ్గ లేకుంటే అది పక్కనపారేసి, ఇంకో పతంగి చూస్తాడు...)

అలా ఒక మంచి పతంగి షాప్ నుండి కొనితెచ్చి మనం మొట్టమొదట చేసేది దానికి ' కన్నాలు ' కట్టడం...
( ఇక్కడ ' కన్నాలు ' అంటే చిల్లులు అని కాదు...రెండు బద్దలు కలిసే చోట రెండు చిల్లులు వేసి, కొంచెం దూరంలో తోకకు దెగ్గరగా ఇంకో 2 చిల్లులు వేసి, దారంతో ఆకాశంలో గాలిపటం యొక్క వాయుగమనానికి అనువైన ఒక నియమిత కొలతలు గల వ్యవస్థను దానికి బిగించడం...
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పరిభాషలో ఒక ఏరోడైనమిక్ ప్రొపెల్లింగ్ మాడ్యూల్ ని స్పేస్ క్రాఫ్ట్ కి అనుసంధానించడం అన్నమాట... )
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పరిభాషలో ఒక ఏరోడైనమిక్ ప్రొపెల్లింగ్ మాడ్యూల్ ని స్పేస్ క్రాఫ్ట్ కి అనుసంధానించడం అన్నమాట... )
అలా ఆ రెండు ' కన్నాలు ' కట్టకుంటే గాల్లో అది ఎగరవేయడం కుదరదు...
ఒక జీవుడు " జన్మ - కర్మ " అనే ఇరు బంధనాల కారణంగా, సప్తధాతువుల ఒక శరీరధారియై ప్రపంచంలోకి ప్రచేశించాక, పరమాత్మ ఆ జీవుడికి ప్రసాదించిన " మనసు - బుద్ది " అనే ఇరు అగోచర శరీర పగ్గాలే ఆ రెండు కన్నాల వాయుగమన వ్యవస్థ..... వాటి ఆధారంగానే వినువీధిలో పతంగి యొక్క గమనం శాసించబడుతుంది...
అదేవిధంగా " మనసు - బుద్ధి " అనే శరీరపు ఇరు పగ్గాల ఆధారంగానే ప్రపంచంలో మనుష్య ప్రాణియొక్క గమనం శాసించబడుతుంది...
చరక్ కి చుట్టుకుని ఉన్న దారం ఆధారంగా, ఎంత దూరంవీలైతే ఆకాశంలో అంత దూరం ఆ పతంగి తన పయనం సాగిస్తుంది...అది దారం ఉన్నంతలో ఒక పరిమిత పరిధివరకే...
ఒక శరీరధారికి పరమాత్మచే ప్రసాదించబడిన శ్వాస లెక్కలప్రకారంగా, తన ఆయుః ప్రమాణం పూర్తయ్యేంతవరకు ఒక ప్రాణి కూడా అట్లే ఈ ప్రపంచంలో తన పయనం సాగిస్తుంది...
ఒక శరీరధారికి పరమాత్మచే ప్రసాదించబడిన శ్వాస లెక్కలప్రకారంగా, తన ఆయుః ప్రమాణం పూర్తయ్యేంతవరకు ఒక ప్రాణి కూడా అట్లే ఈ ప్రపంచంలో తన పయనం సాగిస్తుంది...
ఇక మధ్యలో ఉండే ఆ డీల్, కీంచ్, కట్ మారో, రోక్ మారో, పిలాయించు, ఇధర్ పిలావో, ఉధర్ పిలావో, అఫ్ చేయడాలు, చరక్ లప్టాయించు, లచ్చకొట్టు, ఇలాంటివన్ని మన ఐహిక ప్రపంచజీవితపు రోజువారి లేచామా, తిన్నామా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదో ఒకటి మాట్లాడుకున్నామా, పనిచేసామా, పడుకున్నామా, మళ్ళి లేచామా రిపీట్ చేసామా....లాంటి రెగ్యులర్ గోల గా అనుకోవచ్చు.... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
ఆకశంలోకి రై రై అంటూ ఎగిరిన ఒక పతంగి యొక్క ప్రస్థానం, ఒక పేంచ్ లో అటు ఇటు పోరాడి చివరికి నానా రభస పడి అఫ్ అయిపోవడం తోనో, లేదా ' చిరిగి కరాబ్' అవ్వడంతోనో, లేదా అసల్ అనుకోని రీతిలో ఎగరవేస్తూ ఉండగానే, చరక్ కి దారం చివర ముడివేయకపోవడంతో చేతిలో నుండి దారం కొస జారిపోయి వాయువేగానికి తృటిలో మనతో సంబంధం కోల్పోయి ఆ విశాలవినీలాకాశంలో అలా కలిసిపోవడంతోనో, ముగిసిపోతుంది...! (లేదా అఫ్ అయిన ఆ పతంగి ఎక్కడో దూరంగా పడి, మనకు ఏ మాత్రం సంబంధంలేని ఎవరికో అది దొరికి, వారి కొత్త దారంతో తన పాత దారం ముడిపడి, పాత కొత్త దారాల సమ్మిళిత సంఘాతంతో, ఇంకేవైనా కొన్ని మార్పుచేర్పులతో ఆకాశంలో ఇంకో సరికొత్త ప్రస్థానం మొదలుపెడుతుంది...! )
అదే విధంగా ఒక ప్రాణి, తన విరించి లిఖిత ఆయుః ప్రమాణం పూర్తయ్యి చరమాంకంలో దగ్గు, ఆయాసం తో అటు ఇటు పోరాడి నానారభస పడి కాలం చేయడమో,
లేదా మధ్యలోనే ఎక్కడో గండకాలపు ఘడియలకు అకాల కాలంచేయడమో, లేదా అనుకోని విధంగా, రోజువారి జీవితంలోనే అందరితో నవ్వుతూ, మాట్లాడుతూ అందరూ చూస్తుండగానే సంపూర్ణ చేతనతో ఉండి ఈశ్వర నామస్మరణతో తృటిలో కనుమూసి ఈశ్వరైక్యం చెందడంతో, తమ లౌకిక ప్రస్థానానికి ముగింపు పలకడం...!

ఒక్కోసారి, కొంత విశేషమైన కర్మయొక్క ప్రభావంచే ఒక చోట గతించిన జీవుడు, అతి కొద్ది కాలానికే కర్మశేషం పూర్తిచేయడానికి ఇంకొంకరి ఇంట్లో జన్మనెత్తి ప్రారబ్ధలెక్కలకు సరితూగేల జీవించి తన ప్రస్థానం ముగించడమో...లేదా యథావిధిగా అంతూ దరిలేని కర్మసిద్ధాంతపు పునర్జన్మ చట్రం ప్రకారంగా, ఆ జీవుని సంచితపు మరియు గత జన్మ తాలూకా ఆగామిని, కలుపుకొని, ' ఇంకో కొత్త ప్రారబ్ధం ' అనే సంచిలో పాతకర్మల ఫలితాలను మోసుకుంటూ ( Old wine in a new bottle, అన్న సామెత లాగ ) అనుభవించడానికి మళ్ళీ ఎత్తవలసిన జన్మను స్వీకరించి తిరిగి తన జీవ ప్రస్థానాన్ని కొనసాగించుట... అంటే 4వ రకంగా, అఫ్ అయిన ఆ పతంగి ఇంకొకరికి దొరికి,
తను విడిపోయినప్పుడు ఉన్న పాతదారం + ఇంకో కొత్త దారం కలుపుకొని మళ్ళీ ఆకాశంలో ఎగిరినట్టుగా...!
తను విడిపోయినప్పుడు ఉన్న పాతదారం + ఇంకో కొత్త దారం కలుపుకొని మళ్ళీ ఆకాశంలో ఎగిరినట్టుగా...!
ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది...ఆ 3వ పద్దతిలో ఆకాశంలో కలిసిపోయిన పతంగి, చరక్ కు దారం కొస ముడిపడకపోవడంతో అలా గాల్లో తేలుతూ దారం యొక్క చివర రాగానే, ఈ లోకం తో సంబంధం కోల్పోయి చాలా సునాయాసంగా తన ప్రస్థానాన్ని ముగించింది...లేదా ఆ పతంగి అందనంత దూరంలో పడి మరొక కొత్త ప్రస్థానం సాగించింది..
అదే విధంగా, ఈ దేహం ఒకనాడు కచ్చితంగా దహించుకుపోయేది... అనే సత్యాన్ని తెలుసుకున్న యోగి, ఈలోకం లోనే ఉన్నాసరే లోకానికి తన మనసును-బుద్ధిని ముడిపెట్టకుండా జీవిస్తూ, లోకేశ్వరునితో పారలౌకిక అనుబంధానికై ఉన్నతంగా తనను తాను తీర్చిదిద్దుకున్న కారణంచేత, లోకపు పోకడలతో పెద్దగా సంబంధం లేకుండా, అవసాన ఘడియలు ఆసన్నమయిన మరుక్షణం ఈశ్వర నామస్మరణతో తనను తాను ఈశ్వరైక్యం చేసుకోవడంతో తమ లౌకిక ప్రస్థానానికి ముగింపు పలికినట్టు....
లేదా భూమికి దూరంగా ఉండే ఇతర పుణ్యలోకాలకు ఉన్నత ఉత్తమ జన్మలు ఎత్తేలా ఆ జీవుడు తరలి వెళ్ళాడు అన్నమాట....!

శ్రీచాగంటి సద్గురువుల వాక్కుల్లో ,
" అనాయాసేన మరణం... వినా దైన్యేన జీవితం... దేహాంతే తవ సాయుజ్యం... దేహిమే పార్వతీపతే...!"
అనేలా జీవితాన్ని సద్గురువుల అనుగ్రహం తో తీర్చిదిద్దుకున్న వారు, ఆ 3వ పతంగినిర్యాణ ( ఉన్నత జన్మలకు ఏగుట )
లేదా పతంగినిర్వాణ ( ఈశ్వర కృపతో సామీప్య/సారూప్య/సాలోక్య/సాయుజ్య మోక్షాలను గడించుట ) కోవలోకి వస్తారన్నమాట...![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
" అనాయాసేన మరణం... వినా దైన్యేన జీవితం... దేహాంతే తవ సాయుజ్యం... దేహిమే పార్వతీపతే...!"
అనేలా జీవితాన్ని సద్గురువుల అనుగ్రహం తో తీర్చిదిద్దుకున్న వారు, ఆ 3వ పతంగినిర్యాణ ( ఉన్నత జన్మలకు ఏగుట )
లేదా పతంగినిర్వాణ ( ఈశ్వర కృపతో సామీప్య/సారూప్య/సాలోక్య/సాయుజ్య మోక్షాలను గడించుట ) కోవలోకి వస్తారన్నమాట...
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది..
అలా 3వ పద్దతిలో చరక్ కి చివర దారం కొస ముడిపడకపోవడంతో అఫ్ అయిన పతంగులు కొన్ని, అప్పుడప్పుడు ఏదో చెట్టుకో, స్తంభానికో, మిద్దెలపై / మేడలపై, అలా ఎక్కడైనా చిక్కుకొని అలానే గాల్లో ఎగురుతూ ఉంటాయి...
ఆ పతంగి కనిపించనంత దూరంలో ఆకాశంలో ఎక్కడో ఉన్నాసరే, దాని దారం మాత్రం మనకు అందేలా చిక్కుకొని ఉండడం చూస్తుంటాం...
ఆ పతంగి కనిపించనంత దూరంలో ఆకాశంలో ఎక్కడో ఉన్నాసరే, దాని దారం మాత్రం మనకు అందేలా చిక్కుకొని ఉండడం చూస్తుంటాం...
అంటే ఇప్పుడు ఆ పతంగి అఫ్ అయినట్టా కానట్టా ? మనకు చిక్కినట్టా ? చిక్కనట్టా..? ఎగురుతూ ఉన్నట్టా ? లేనట్టా..? అనే ఆలోచనరాక మానదుకదా..
( నాకు అలాంటి పతంగి ఒకసారి మా ఇంటి పక్కన బిల్డింగ్ పైన ఉన్న పిల్లర్ సీకులకు దారం చిక్కుకొని కనిపించడం తో, ఠక్కున వాళ్ళ ఇంటిమీదికి దూకి పిల్లర్ పైకి ఎక్కి ఆ దారం అందుకొని ఒక 20 నిమిషాలకు ఆ పతంగిని క్రిందకు దింపి, నా చరక్ కి ముడివేసి, చరక్ ని స్పీడ్ గా ' లచ్చకొట్టడం ' తో ఆహా ఇది కదా భాగ్యం అంటే...మొత్తం సాదా దారం + మాంజా తో సహా ఇంత పెద్ద పతంగి నా ముందుకు వచ్చి వాలేలా చేసావ్...సాయి బాబా ఎంత మంచి వాడివి నువ్వు ...నీకు ఈ గురువారం పెద్ద కొబ్బరికాయి కొని కొడ్తాలే....నెక్స్ట్ ఇయర్ కి కూడా దారం కొనే అవసరం లేకుండా చరక్ మొత్తం ఫుల్ల్ అయ్యింది...అహా ఓహూ అంటూ సంబురపడ్డాను....
)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
ఇదేవిధంగా అతి కొద్ది మంది మహానుభావులు, తాము తప్పక అనుభవించ వలసిన సంచిత, ప్రారబ్ధ కర్మశేషం పెద్దగా లేకపోయినాసరే, ఉన్నతమైన లోకాలకు వెళ్ళిపోకుండా, చతుర్విధ మోక్షాల్లో తమకు శ్రేష్టమైంది స్వీకరించి పరమాత్మలోకి వెళ్ళిపోకుండా, మన మధ్యనే ఉంటూ, సాటి జీవులందరు ధర్మమార్గంలో ప్రయాణించేందుకు వీలుగా ఆచార్యులై, సద్గురువులై, నిలిచి అనుగ్రహిస్తూ భువిపై అందరిలాగే తిరుగాడే మహాపురుషులు కొందరు ఆ కోవకు వస్తారన్నమాట...
శ్రీ చాగంటి సద్గురువులు, శ్రీ సామవేదం వారు, శ్రీ ఆదిశంకరాచార్య స్థాపిత శృంగేరి-ద్వారక-బదరి-పురి చతురామ్నాయ మరియు కంచి పీఠాధిపతులు, యతీశ్వరులు, యోగులు, ఇత్యాది పుణ్యపురుషులందరు...
వీరు జీవన్ముక్తులు / 5వ రకమైన విదేహముక్తిని గడించిన వారు...వీరు సమసమాజంలో మన మధ్యనే ఉండి సదా అనుగ్రహించడం వల్లే మన జీవితాలు కూడా అన్నిట్లో ఫుల్లుగా ఉండి, వారి బోధలు మనలను ముక్తితీరాలకు చేర్చే కరదీపికలై మనకు సదా తోడునీడై సహకరించుట...!

అస్మద్ గురుదేవుల " శ్రీ పోతనామాత్యుల శ్రీమద్భాగవతం " బోధలో సంక్షిప్తంగా నేను దర్శించిన సంక్రాంతి పతంగుల్లోని పరతత్వ సారం ఇదన్నమాట... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
సద్గురువుల బోధావలోకనం ఒక క్షీరసాగర మథనం లాంటిదని నా ఫీలింగ్....
అది అందుకున్న వారికి అందుకున్నంత... జీవితానికి అనుసంధానించుకొని శ్రద్ధగా సమన్వయపరచుకున్నవారికి తుదకు లభించేది జీవామృతమే..అది సేవించి ఎవరికి వారు పరమాత్మ పాదపద్మముల సన్నిధి అనే కైవల్యతీరానికి ఏగుటయే ఆ భగవత్భక్తిజ్ఞ్యానామృతసేవన సిద్ధి..!!![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
అది అందుకున్న వారికి అందుకున్నంత... జీవితానికి అనుసంధానించుకొని శ్రద్ధగా సమన్వయపరచుకున్నవారికి తుదకు లభించేది జీవామృతమే..అది సేవించి ఎవరికి వారు పరమాత్మ పాదపద్మముల సన్నిధి అనే కైవల్యతీరానికి ఏగుటయే ఆ భగవత్భక్తిజ్ఞ్యానామృతసేవన సిద్ధి..!!
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
ఏ ఒక్కరికో సొంతంకాని అందరి సొత్తై, అందరికంటే ఎంతో ఎత్తులో ' వెండిపైడి అగు వేంకటగిరిపి పై ' అందరికీ అందుబాటులో ఉండే ' గోవిందుడు ' అనే అతి పెద్ద దేవపతంగి...
ఎవరికి తోచినట్టు వారు ' భక్తి ' అనే సాదా దారానికి, ' శరణాగతి ' అనే మాంజా ని ముడివేసి,
' మది ' అనే చరక్ లో నిత్యం సుడులు తిరిగే (లప్టాయించే) సంకల్ప వికల్పాలతో చుట్టేసుకొని
తమవద్దకు లాక్కొని, మనోవీధుల్లో నిత్యం ఎగరవేసి ఆనందించగలిగే ' భక్తసులభుడు ' అనే అతి పెద్ద నిత్యానుగ్రహ పతంగి...
' మది ' అనే చరక్ లో నిత్యం సుడులు తిరిగే (లప్టాయించే) సంకల్ప వికల్పాలతో చుట్టేసుకొని
తమవద్దకు లాక్కొని, మనోవీధుల్లో నిత్యం ఎగరవేసి ఆనందించగలిగే ' భక్తసులభుడు ' అనే అతి పెద్ద నిత్యానుగ్రహ పతంగి...
ఎన్ని సార్లు లాక్కున్నా, ఎన్ని సార్లు ఎగరవేసినా, ఎన్నటికి చెదరని, వన్నెతరగని, నీలి రంగు వెలుగు జిలిగుల తణుకులీనుతూ, ' శ్రీవేంకటేశ్వరుడు ' అనే నామధేయం తో సదా మందస్మితుడై ఉండే శ్రీవైఖానసాగమోక్త షట్కాలార్చిత, షడ్రిపుభంజక, కలిదోషనివారక, సకల శాంతిసౌఖ్యసంపద దాయక, శ్రీనివాసుడు అనే దివ్య శ్రీపతంగి.....!! ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
ఆ భవ్య శ్రీవైష్ణవ పతంగిని అన్నమాచార్యులవారు తమ పదకవితల దారాలతో, ఒక సంక్రాంతికి తమ ముంగిట్లోకి ఈ కీర్తనతో అందుకున్నారనుకుంటా.... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
"కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో.."
No comments:
Post a Comment