శ్రీశార్వరి నామ సంవత్సర జ్యేష్ఠ అమావాస్య / సినివాలి భానువాసర ప్రయుక్త మృగశిర నక్షత్ర ప్రభావిత పాక్షిక రాహుగ్రస్త చూడామణి ఆకార సూర్యగ్రహణం ( 2020-June-21) సందర్భంగా తత్ నక్షత్ర సంజాతకులు ( అనగా మిథున రాశి వారు ) తగురీతిలో తమ తమ శక్తికొలది గ్రహణకాల శాంతి జరిపించుకొని ప్రశాంతంగా జీవించగలరు.....
అని వివిధ టీవీ ఛానెల్స్ లో ప్రాజ్ఞ్యులైన పెద్దలు, జ్యోతిషశాస్త్ర విద్వాంసులు, ఆధ్యాత్మిక వేత్తలు, రాబోయే సూర్యగ్రహణం తాలుకు విశేషాలు చెప్పడం ఎల్లరికి విదితమైన విషయమే కద......
గ్రహణకాల నియమాలను ఎవరు ఎంతవరకు నమ్మి పాటిస్తారు, ఆచరిస్తారు అనేవి వారి వారి వ్యక్తిగత నమ్మకాలకు, వారి విశ్వాసానికి, వారి జ్ఞ్యాన స్థాయికి, సంబంధించిన విషయాలు......
కాబట్టి వాటి గురించి పెద్దగా చర్చించడం కాకుండా
అసలు గ్రహణం అంటే ఏంటి...?
ఎందుకు గ్రహణాలకు ప్రత్యేకత ఆపాదించబడింది....?
గ్రహణం అంటే కేవలం ఖగోళశాస్త్ర సంబంధిత సైన్స్ ఫినామిన....గా భావించాలా,
లేదా అధ్యాత్మ శాస్త్ర పరంగా అవి ఎంతో విలువైన ఖగోళ శక్తిప్రసరణాల ప్రత్యేక పర్వములగా భావించబడాలా...?
ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ తమ గురుబోధలకు అనుగుణంగా సమకూరిన జ్ఞ్యాన నిధికి తగ్గట్టుగా ఈ విశ్వంలోని వింతలను విశేషాలను విశ్లేషిస్తుంటారు అనేది వాస్తవం....
గ్రహణం అనేది అది కేవల భౌతికశాస్త్రం పై ఆధారపడిన సామాన్యశాస్త్రోక్త ఒక
"సైన్స్ ఫినామిన..." అని విశ్లేషించడం చాల మంది చేసే సామాన్య R&D.....
ఇంకో అడుగు ముందుకెళ్ళి, మహత్తరమైన ప్రాచ్య అధ్యాత్మ విజ్ఞ్యానాన్ని కూడా ఆ సైన్స్ కి జోడించి, గ్రహణం అనే ఆ ఖగోళ వింతను పరిపూర్ణంగా విశ్లేషించడం లోనే గొప్పదనం ప్రత్యేకత ఉంటాయి కద....😊
So lets begin our R&D on the spectacular cosmic, astronomical, astrological, physical and meta physical phenomenon called
"An Eclipse....!"
"రాబోయే 24 గంటల్లో, మామూలు వర్షంకాదు, తూఫాన్ ప్రభావం వల్ల పెద్ద పెద్ద వడగళ్ళవాన పడబోతోంది....",
అని వెదర్ ఫోర్కాస్ట్ వారు టీవీల్లో చెప్పినప్పుడు....
1. "వడగళ్ళవాన పడితే ఏముంది.....
మామూలు వర్షంపడితే ఏముంది....
ఎప్పటిలానే నా ఇంటి ముందు నేను తిరుగుతా......
నా ఇష్టం మీకెందుకు....."
అని అనుకునే వారు సామాన్యులు......
2. "మామూలు వర్షంపడితేనే గొడుగు, రేయిన్ కోట్, తో తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటాము కద.....
ఇది వడగళ్ళవాన కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి...."
అని అనుకునే వారు ఇంకో మెట్టు పైస్థాయిలో ఆలోచించే వారు.....
3. "మామూలు వర్షం కాకుండా వడగళ్ళవాన కాబట్టి ఆ వడగళ్ళను వృధాగా పోనివ్వకుండ వాటన్నిటిని ఒడిసిపట్టుకునే వ్యవస్థను ఏర్పాటుచేసుకొని ఒక పెద్ద హైడ్రల్ సిస్టెం ద్వారా రెగ్యులర్ రైన్ వాటర్ హార్వెస్టింగ్కి ఆ భారి వడగళ్ళను కూడా తరలించి మరింతగా ప్రాకృతిక జలసంవృద్ధిని సాధించి లాభపడాలి "
అని అనుకునే వారు ఇంకో మెట్టు పైస్థాయిలో ఆలోచించే వారు.....
4. అరుదుగా సంభవించే వడగళ్ళవాన కాబట్టి ఆ వడగళ్ళను వృధాగా పోనివ్వకుండ వాటన్నిటిని ఒడిసిపట్టుకునే వ్యవస్థను ఏర్పాటుచేసుకొని ఒక పెద్ద హైడ్రల్ సిస్టెం ద్వారా రెగ్యులర్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ కి ఆ భారి వడగళ్ళను కూడా తరలించి మరింతగా ప్రాకృతిక జలసంవృద్ధిని సాధించి లాభపడటమే కాకుండా ఆ వడగళ్ళపై తమ జ్ఞ్యాన స్థ్యాయికి తగ్గట్టుగా రిసర్చ్ జరిపి వాటిని అమూలాగ్రంగా పరిశీలించి, పరిశోధించి వాటి ద్వార ఆ మేఘమండంలో జరిగిన ఎటువంటి మార్పుల వల్ల అవ్విధంగా వడగళ్ళు భూమికి చేరాయి....
వాటివల్ల ఈ భూలోక వాసులకు ఆ వినువీధిలో ఉండే వాతావరణంలోని మూలకాల గురించిన అవగాహన, వాటికి కారణమైన రసాయన చర్య ఇత్యాది విషయాల గురించి శ్రమించేవారు ఇంకో మెట్టు పైస్థాయిలో ఆలోచించే వారు.....
5. "యత్ పిండే తత్ బ్రహ్మాండే...." అనే సూత్రానికి అనుగుణంగా ఆ వడగళ్ళలో ఉన్న
"మైక్రోకాసం" యావద్ వినువీధిలో వివిధ లేయర్స్ గా ఉండే ఖగోళం యొక్క "మ్యాక్రోకాసం" కాబట్టి ఆదిశగా అత్యున్నతమైన స్థ్యాయిలో సైన్స్ యొక్క లిమిట్స్ ని సరికొత్త హద్దులకు వ్యాప్తిగావించే విధంగా తమ పదునైనమేధోమండల శక్తితో ఈ భూమండలం పై ఉండే 'భువర్' , 'సువర్' , 'మహర్' మండలాల శక్తిని తమ గుప్పిటిలోకి ఒడిసిపట్టేలా ఆలోచించే ఇంకొందరు అతి కొద్ది మంది స్పిరిట్యుయల్ సైంటిస్ట్స్.....
ఆ 3 ప్లేన్స్ పైన ఉండే జనోలోక, తపోలోక, సత్యలోక మనబడే అత్యున్నత స్థాయి మండలాలు మానవగ్రాహ్యములు కావు కాబట్టి వాటి గురించిన అవగాహన కేవల మానుషశరీరధరకులకు దుర్లభం.....
ఇలా కేవలం వడగళ్ళ వాన అనే ఆకాశజనిత
"అరుదైన జలశక్తి ప్రసరణ ప్రక్రియ"
అనేదానిపైనే ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు తమ తమ జ్ఞ్యాన నిధికి తగ్గటుగా పరిశోధనలు చేసి అవి సైన్స్ సూత్రాలు గా చెబితే వినడం అనేది మన కళ్ళెదుట కదలాడే సత్యమైనట్టుగా.....
అచ్చం ఇదేవిధంగా " గ్రహణ ప్రక్రియ జనిత ఖ శక్తి ప్రసరణ"
అనే అంశం పై కూడా ఎవరి జ్ఞ్యాన స్థ్యాయికి తగ్గట్టుగా వారు పరిశోధనలు గావించి
" These are the various scientific and spiritual effects that occur on the planet earth because of the cosmic phenomenon called an Eclipse...."
అని మనకు తెలిపినప్పుడు, అవి ఎవరు ఏమేరకు ఆకళింపు చేసుకొని తరిస్తారు అనేది వారి వారి వ్యక్తిగతమైన విషయం.......
వడగళ్ళు పడుతునప్పుడు ఆకాశం పైకి చూస్తు...
"నేను ఫుల్ తోప్ ని.....చూసారా వడగళ్ళు మనల్ని ఏమిచేయవు.....మీరు కూడ వచ్చి మీ మీద వడగళ్ళు పడేలా ఆకాశాన్ని చూడండి......"
అని ఒక మూర్ఖుడు చెప్తే వాడి మాట విని ఎవరైనా ఆకాశంలోకి నేరుగా అట్లే మొహం పెడితే,
మన సున్నితమైన ముఖమండలం భరించలేని వేగంతో ఆ వడగళ్ళు వినువీధి నుండి శ్రీరామకోదండసంధిత శరప్రహారం లా వచ్చి పడితే, అప్పుడు తెలుస్తుంది ఎందుకు విజ్ఞ్యులైన పెద్దలు వడగళ్ళ వానలో బయటతిరగొద్దని మనకు బోధించారో......
"మొహం కొబ్బరి పచ్చడైనా పర్లేదు అట్లే వడగళ్ళకు అభిముఖంగా ఆకాశంలోకి చూస్తు, హేతువాదులం
అనే పేరుతో జనాలను కూడా అట్లే చేయమని చెప్తాం....."
అనడం ఆ మూర్ఖుల హద్దెరగని మౌఢ్యానికి ప్రతీకే అవుతుంది తప్ప అదేదో వాళ్లు ఈ లోకానికి చేసిన గొప్ప ఘనకార్యం అనిపించుకోదు.....
"తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచెన్....." అన్న చందంగా ఉండే ఆ మూర్ఖుల మాటలు ఎంత పట్టించుకోకుంటే అంత మంచిది.....
"మీరు...మీ మొహం....మీ ఇష్టం.....
అట్లే ఆకాశంలోకి చూస్తు ఉండండి...
మమ్మల్ని మాత్రం దయచేసి మీరు ఇబ్బంది పెట్టకండి......
మాకు మా విజ్ఞ్యులైన పెద్దల ద్వార తెలుసును ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలో...
కాబట్టి మీ నయవంచక హితబోధలు ఆపండి..."
అని మరియాదగా చెప్పినా సరే వినకుండా మనల్ని కూడా ఆ వడగళ్ళ వానకు ఇబ్బందిపడేలా వారితో రమ్మని మనల్ని హింసించే వారిని
గూబ గుయ్ అనేలా ఒక పచ్కడ్ పీకి
" నీ దార్లో నువ్వు పో.....
అనవసరంగా నా జోలికి రాకు.....
ఇంకా నన్ను ఇబ్బంది పెడితే నాదైన శైలిలో నేను కొట్టే దెబ్బలకు లేవలేనంతగా పడతావ్....
జాగ్రత్త...'
అనేలా సమాధానం ఇవ్వడం సాధారణంగా ఎవ్వరైనా చేసేదే....కద......
అట్లే గ్రహణ కాలంలో మన విజ్ఞ్యులైన పెద్దలు చెప్పినవాటిని
"హేతువాదులం" అనేపేర మనల్ని పాటించకుండా పెడబోధలు చేసే మూర్ఖులపట్ల కూడా మనం అవలంబించవలసిన వైఖరి అంత దృఢంగా ఉండాలి.....లేనిచో మనకు మనమే అపకారం చేసుకున్న మూర్ఖులుగా అవుతాం....
ఇక అసలైన విషయం గ్రహణం యొక్క ప్రత్యేకత గురించి చర్చించడం...
గ్రసించునది గ్రహణం....
"ఆధ్యాత్మిక పరంగా ఛాయాగ్రహములైన రాహుకేతువులు సూర్యచంద్రులను వారి సహజ శక్తిని కోల్పోయేలా కొద్ది కాలం పాటు వారిని తమ అధీనంలోకి తీసుకొని గ్రహణానికి కారణమవ్వడం....
శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా క్షీరసాగర జనిత అమృతాన్ని దేవదానవులకు తనదైన శైలిలో పంచే మోహిని రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుకు
'అటు రక్కసుల ప్రక్కన ఉండవలసిన రాహుకేతువులు ఇటు దేవతలప్రక్కన వచ్చి చాటుగా కూర్చున్నారు....'
అని తమ ప్రక్కన ఉన్న రాహుకేతువుల గురించి తెలిపి వారి సమ్హారానికి కారకులైనందుకు ఆనాటినుండి ఈనాటి వరకు కూడా పగబట్టి సూర్యచంద్రులను గ్రహణ రూపంలో గ్రసిస్తూనే ఉన్నారు....." అనేది అధ్యాత్మిక వివరణ......
సూర్యుడి చుట్టూ భూమి,
భూమి చుట్టూ చంద్రుడు,
తన చుట్టూ తాను భూమి,
భ్రమణం సాగించడం అనే సాధారణమైన సైన్స్ ప్రక్రియలో
అప్పుడప్పుడు ఒక సరళరేఖపైకి ఆ 3 వచ్చినప్పుడు ఒకరి నీడ ఇంకొకరిపై పడడంవల్ల,
అనగా
సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చి సూర్యకాంతిని అడ్డుకోవడం వల్ల సూర్యగ్రహణం....
మరియు
సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి రావడం తో, సూర్యకాంతి చంద్రుడిపై పడకపోవడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడ్తాయి అనేది మనకు చిన్ననాటి నుండి సైన్స్ నేర్పిన పాఠం....
సైన్స్, స్పిరిట్యుయాలిటి అనే ఈ రెండు, రెండు భిన్నమైన ధృవాలు అనుకునే వారు మూర్ఖులు.....
ఈ రెండు కూడా సామ్యము కలిగిన సమాంతర శాస్త్రములు అని అనుకునే వారు మాన్యులు....
ఈ రెంటిని కూడా మేళవించి మానుష జీవనసాఫల్యానికి వాటి యొక్క సమ్మిళిత మహత్తును సోపానాలుగా మలుచుకోవాలి అని అనుకునే వారు మహనీయులు.....
ఇక గ్రహణకాల వైశేషిక పరిణామాలగురించి చెప్పాలంటే....
గ్రహణసమయంలో
1. ఆలాయలను ఎందుకు మూసివేస్తారు....?
2. దేవతలందరు ఎక్కడికి వెళ్తారు...?
3. ఆహారం ఎందుకు భుజించకూడదు...?
4. నేరుగా కళ్ళతో ఎందుకు చూడరాదు..?
4. ప్రత్యేకంగా పట్టుస్నానం, విడుపుస్నానం,
జపాలు, సహస్రనామాపఠనాలు, ఇత్యాదిగా గ్రహణకాలంలో ప్రత్యేక శ్రద్ధాపూర్వక ఆచారనియమాలు ఎందుకు...?
5. గ్రహణానంతర శాంతులు, దానధర్మాలు ఎందుకు...?
ఇత్యాది గా ఎందరికో చాలా చాల ప్రశ్నలు సందేహాలు ఉండడం సహజమే....
అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినవేంకాదు కద......
మన ధార్మిక పెద్దలు ఎప్పటినుండో మన క్షేమం కోరి ఆయా విధివిధానాలను ఏర్పరిచారు అని భావించి వాటిని ఆచరించడంలోనే ఎల్లరికి శ్రేయస్సు ఉంటుంది.....
వడగళ్ళవానలో ఆకాశం వైపు చూస్తూనే ఉంటాం అనే మూర్ఖులకు, గ్రహణకాల నియమాలను పెద్దగా పట్టించుకోము అనే మూర్ఖులకు పెద్దగా భేదం లేదు......
వడగళ్ళవాన అప్పటికప్పుడే మొహం పగలగొట్టి సమాధానం ఇస్తుంది....
గ్రహణకలా విషపూరిత ఖశక్తి ప్రసరణ అప్పటికప్పుడు కాకుండా మెల్లగా జీవితంలో ఆ ప్రభావాన్ని చూపుతుంది.....
గ్రహణ కాల విధివిధానాలను హేళన గావించి, ఊరంత తిరుగుతాం, ఏ అడ్డు కూడా లేకుండా మా కళ్ళతో గ్రహణం చూస్తాం.....అప్పుడే తిండి తింటాం....
అనే వెకిలి చేష్టలు గావించే వారికి
"జోర్ కా ఝట్కా ధీరేసేలగే...."
అన్నట్టుగా ఎప్పుడో ఒకప్పుడు ఆ గ్రహణశక్తి యొక్క ప్రతాపం తెలిసివస్తుంది......
చాలా సింపుల్ గా, "ఎలెక్షన్స్" అనే ఒక లౌకిక ఎగ్సాంపుల్ తో గ్రహణసమయ గొప్పదనం గురించి వివరిస్తాను.....
1. "ఎలెక్షన్ కోడ్ అమలులో ఉందండి....
కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేయడం, బహిరంగ సమావేశాలు పెట్టడం, ఎక్కువగా క్యాష్ క్యారి చేస్తు ప్రయాణాలు చేయడం, ఇత్యాదివి
చేయకుండా ECI మరియు గవర్నర్ యొక్క అధీనంలో రాష్ట్రం ఉన్నందున వారిచే జారీచేయబడిన నియమావళిని పాటిస్తు, ఎలెక్షన్ కోడ్ ఉల్లంఘించకుండా 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలెక్షన్స్ అనే ఈ ప్రక్రియకు సహకరించి క్షేమంగా ఉండండి...."
అని చెప్పినప్పుడు,
" నా డబ్బు నాఇష్టం......బ్యాంకు కెళ్ళి ఎప్పటిలానే డ్రా చేసి నా కార్లోనే ఊపుకుంటూ వెళ్తా...."
అనే మూర్ఖుడుకి ఏం చెప్తాం...?
"అది నీదే అయినా సరే,
ఈ సమయంలో అలా తీస్కెళ్ళడం క్షేమం కాదు.....
పెద్దమొత్తం లో డబ్బులు కనిపిస్తే అవి లాక్కోవడానికి, వాటి గురించి సవాలక్ష ప్రశ్నలను వేసి విచారించడానికి,
బయట ఒక వ్యవస్థ ఉంది.....
ఎలెక్షన్ కోడ్ పూర్తయ్యేవరకు అట్లే
ఉంటుంది.... కాబట్టి ఆ నియమావళికి తగ్గట్టుగా ఉండడమే శ్రేయస్కరం..."
అని వివరిస్తారు.....
అది వినడం, వినకపోవడం అనేది సదరు వ్యక్తి యొక్క బుద్ధికి సంబంధించిన విషయం.....
అట్లే గ్రహణ సమయంలో మీదే అయినా సరే, ఎప్పుడూ తిన్నట్టుగా ఆహారం పెద్దమొత్తంలో తినరాదు.....
దాన్ని విషంగా మార్చి ఆరోగ్యాన్ని హరించేలా బయటి వాతావరణంలో కొన్ని మార్పులు చోటు
చేసుకున్నయి....
"గ్రహణసమయం" పూర్తయ్యేవరకు ఈ నియమావళిని పాటించాలి....
అని చెప్పినప్పుడు, విన్నవాడు ఆరోగ్యవంతుడు...
విననివాడు మూర్ఖుడు.....
అంతే కద.....
2. "ఎలెక్షన్ సమయంలో రాష్త్ర పరిపాలకులు రాజ్యాధినేత గా ఉండే సీ.ఎం గారు, CMO లో ఉండరు...... కాబట్టి సీ.ఎం ఆఫిస్ తెరవరు.....
ఎలెక్షన్ కోడ్ పూర్తయ్యి, కౌంటింగ్ తర్వాత రిజల్ట్స్ వచ్చి, మళ్ళీ సీ.ఎం గా కే.సీ.ఆర్ గారు ప్రమాణస్వీకారం చేసేంతవరకు
ఎవరిని CMO లోకి అనుమతించరు......"
అని చెబితే దాని అర్ధం సీ.ఎం గా ఉన్న కే.సీ.ఆర్ గారు అధికారం మొత్తం గవర్నర్ మరియు EC కి ఇచ్చేసి
ఎక్కడో అమెరికాకు వెళ్ళినట్టా...??
కాదు కద.....
ఆ ఎలెక్షన్స్ అనే ప్రక్రియలో భాగంగా తాత్కలికంగా వారే గవర్నర్ గారికి తమ పరిపాలక అధికారాన్ని సమర్పించి CM అనే ఆ పదవి కొంత సమయం వరకు వర్తించని విధంగా ఆ ఎలెక్షన్ అనే ప్రక్రియకు సహకరించి CMO కు దూరంగా ఉన్నారు అని దాని అర్ధం.....
కాబట్టి ఆ ఎలెక్షన్ అనే ప్రక్రియ మొత్తం పూర్తవ్వగానే మళ్ళీ సీ.ఎం గా కే.సీ.ఆర్ గారు తమ అధికారాన్ని గవర్నర్ మరియు ECI కి నుండి తిరిగి స్వీకరిస్తారు అని దాని అర్ధం......
అప్పుడు CMO కి యథాతథంగా
అందరు వెళ్ళడం, వారి విన్నపాలను సమర్పించుకోవడం, అనే సాధారణ ప్రక్రియ పునః ప్రారంభమవుతుంది.....
అట్లే గ్రహణసమయంలో దేవతలు / అనగా దేవతాశక్తులు,
అధిదేవతా / ప్రత్యధిదేవతలుగా ఉండే శాసక దైవిక శక్తులు ఈ భూలోక వాసులకు అందుబాటులోలేని విధంగా గ్రహణప్రభావం లేని వేరొక ప్లెన్ లోకి వెళ్తారు.......
కాబట్టి గుడిలో ఎప్పుడూ ఉన్నట్టుగానే
దర్శనాలు / ప్రసాదాలు ఉండవు....
గ్రహణానంతర శుద్ధి, శౌచ ప్రక్రియల తరువాతే తిరిగి ఆయా దేవతా శక్తులను తమ తమ స్థానములలోకి రమ్మని మంత్రపూర్వకంగా ఆహ్వానించడం, ఆవహించబడడం జరిగిన తరువాతే ఎప్పటిలాగే భక్తులకు పునః దర్శనాలు / కొత్తగా వండిన ప్రసాదాలు.....
3. సీ.ఎం గారు, గవర్నర్ గారు ఇరువురు కూడా నిజానికి రాష్ట్రపరిపాలన సజావుగా సగేలా రాజ్యాంగం ఏర్పరిచిన ఇరు పరిపాలకశక్తి కేంద్రకస్థానములు.......
ఆ ఎలెక్షన్ సమయంలో ఒకరి నుండి మరొకరికి అది పూర్తైన పిదప మళ్లీ అట్లే ఒకరినుండి మరొకరికి ఆ పరిపాలక శక్తి ట్రాన్స్ఫర్ అయ్యింది....
అంతే తప్ప అసలు లేకుండా పోలేదు...
"Energy can only be transferred from one form to the other.....
Hence the involved implicit power transmission will only change its name for a while and its not that it has completely gone somewhere else....."
అట్లే ప్రకృతి / పరమేశ్వరుడు అనే ఇరు పరిపాలక శక్తికేంద్రకస్థానాలుగా ఈ లోకంలో దైవం తన శాసకత్వం నిర్వహిస్తుంది....
గ్రహణసమయంలో గుడిలో ఉన్న దేవుడు ఎక్కడికో వెళ్ళాడంటే దాని అర్ధం
సీ.ఎం గారు గవర్నర్ గారికి అధికారమార్పిడి గావించి కొంత సమయం అధినేత పదవినుండి దూరంగా ఉన్నట్టుగా....
పరమేశ్వరుడు/పరమేశ్వరి గా ఉండే ఆ దైవిక శాసక శక్తి గ్రహణ సమయంలో తన అధికారాన్ని ఈ పాంచభౌతిక ప్రకృతికి కట్టబెట్టి
గ్రహణప్రభావంలేని ప్లేన్ కి మాత్రమే తనను తాను పరిమితం చేసుకుందని అర్ధం.....
అందుకే గ్రహణసమయంలో ప్రకృతి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది.....
ఆ గ్రహణసమయ ప్రకృతి యొక్క శక్తి అనేది వరదగోదావరి లా ఉధృతంగా ఊగిపోయే శక్తి......
ఆ వరదగోదావరికి ఎంత దూరం ఉండాలో అంత దూరాన్ని పాటిస్తు...,
ఆ అధికజలసంవృద్ధిని అనగా ఆ చరజలశక్తిని వివిధ రీతుల మనకు ఉపకరించేలా స్థిరజలశక్తిగా మార్చుకోవడంలోనే గొప్పదనం ఉంటుంది......
అనగా ఆ నీరంతా సముద్రంపాలు కాకుండా, చెరువుల్లోకి, కాలువల్లోకి, రిసర్వాయర్లలోకి,
పంటబావుల్లోకి, చేరేలా ఏర్పాట్లు చేసుకొని ఆ చరజలశక్తిని స్థిరజలశక్తిగా మార్చుకొని తదనంతర కాలంలో వాటిని ఉపయోగించుకొని లాభించడంలోనే గొప్పదనం ఉంటుంది.....
అదే విధంగా in abundance గా ఆకాశమునుండి వెలువడే ఆ
"ecliptic supra cosmic energy "ని
గ్రహణానికి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉంటూనే జప తప న్యాస రూపాల్లో సాధకులు ఒడిసిపట్టి, మామూలు సమయంలో చేసే జపానికి వచ్చే శక్తికంటే కొన్ని కోట్ల రెట్లు అధికమైన జపశక్తి సంవృద్ధిని సమకూర్చే గ్రహణసమయం కూడా
ఆ వరదగోదారిలా ఊగిపోయే ఉధృతసమయం......
గోదారికి వరదొచ్చిందని ఏదో ఒక పనికిరాని సోది కొడుతు ఆ వరదను ఒక వింతగా చూస్తూ మాత్రమే ఉంటామా....
లేదా పైన చెప్పినట్టుగా ఆ జలసంవృద్ధిని వృధా కాకుండా వివిధ రీతుల ఒడిసిపట్టుకుంటామా అనేది ఎట్లో.....
ఆకాశంలో గ్రహణమొచ్చిందని ఏదో ఒక పనికిరాని సోది కొడుతు ఆ ఖగోళ దృశ్యాన్ని ఒక వింతగా చూస్తూ మాత్రమే ఉంటామా....
లేదా పైన చెప్పినట్టుగా ఆ గ్రహణకాలజనిత
హై ఫ్రీక్వెన్సి శక్తితరంగసమృద్ధిని వృధా కాకుండా వివిధ రీతుల ఒడిసిపట్టుకుంటామా అనేది కూడా అట్లే.....😊
అన్నమాచర్యుల వారు తమ సంకీర్తనలో సెలవిచ్చినట్టుగా.....
ప|| త్రికరణశుద్ధిగ జేసినపనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును |
వొకటి కోటిగుణితంబగుమార్గములుండగ బ్రయాసపడనేలా ||
చ|| తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి |
కనకబిందుయమునాగయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ |
దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు సేసినఫలములు |
తనుదానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగగ మరి యేలా ||
గ్రహణ పర్వసమయములందు అచరించబడిన విహితకర్మలు కాలాంతరంలో తమకు తామే సిద్ధిని కలిగిస్తాయి....
అని చెప్పడంలో గ్రహణాలయొక్క ప్రత్యేకతను చెప్పకనే చెప్పినారు ఆచార్యులు....😊
http://annamacharya-lyrics.blogspot.com/2007/11/336-trikaranasuddhiga-jesinapanulaku.html?m=1
No comments:
Post a Comment