శ్రీసింగిరెడ్డి నారాయణరెడ్డి గారు భౌతికంగా ఈ తెనుగునేలకు దూరమైనాసరే వారియొక్క రచనల రూపంలో ఇప్పటికీ ఎప్పటికీ సాహిత్యారాధకుల హృదయాల్లో వారు మరియు ఆచంద్రతారార్కమైన వారియొక్క రచనా వైదుష్యం సజీవమే కద....
ఆధ్యాత్మిక జగత్తును శాశ్వతంగా శాసిస్తు ఒక సద్గురు యొక్క స్థానంలో ఎప్పటికీ నిలిచిఉండేది శ్రీమద్భాగవతం....
సంస్కృతమూలాన్ని మనకు అందించిన అష్టాదశ పురాణకర్త శ్రీవ్యాసమహర్షి వారి అత్యద్భుతమైన గ్రంథరాజాన్ని తెనిగించి మనకు అందించి తరించిన సాటిలేని సాధుసత్పురుషులు, సహజకవి
శ్రీ బమ్మెరపోతనామాత్యులవారు....
ఆ శ్రీమద్భాగవతంలోని కొన్ని మధురఘట్టాలను
మందారమకరందాల పేరిట మనకు ఎంతో హృద్యమైన వివరణతో అందించి తరించిన మహనీయులు శ్రీ సీనారే గారు....
నోబెల్ ప్రైజ్ ఇచ్చే వారికి, ఆ ప్రైజ్ కోసం నామినేట్ చేసే కమిటీ సభ్యులకు తెలుగు భాషయొక్క వైభవం, మరియు ఈ త్రిలింగదేశం యొక్క గొప్పదనం గురించి ఏకొద్దిపాటి అవగాహన ఉన్నా సరే ఈ పాటికి ఎందరో మన రచయితలకు సాహితీ స్రష్టలకు ఈపాటికే ఎన్నెన్నో బహుమతులు , పురస్కారాలు వచ్చుండాలి....
కనీసం మన దేశంలోనైనా సరే కేంద్ర కమిటీలు మన తెలుగు భాషారచనలకు మరింతగా తగు రీతిలో గౌరవం ఇచ్చి పురస్కారాలు ప్రసాదించే ఆవశ్యకత ఎంతైనా ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం....😊
అలా లౌకికంగా ఎవరైనా విజ్ఞ్యులైన పెద్దలకు ఏదైనా ప్రశస్తమైన పురస్కారం లభిస్తే, గౌరవ సూచకంగా ఆ బిరుదును అసలు పేరుకు ముందు పెట్టి ఉపయోగించడం అనేది ఎల్లరు సాధారణంగా పరికించే అంశమే....
ఫర్ ఎగ్సాంపుల్, అస్మద్ గురుదేవులకు
" ప్రవచనాసామ్రాట్ " , " వాచస్పతి ",
ఇత్యాది బిరుదునామాలు ఎన్నో వారికి మాన్యులచే గౌరవసూచకంగా ప్రసాదించబడినాయి......కద....
అనగా దాని అర్ధం ఇక గురుదేవులు వారి చిన్ననాటినుండి ఉన్న స్కూల్, కాలెజ్, సర్టిఫికేట్లపై గల వారి అసలు పేరుకు ముందు ఈ బిరుదులన్నీ జతచేర్చి,
" ఇక మీరు నన్ను ఎప్పటికీ ఈ బిరుదునామాలన్నీ కూడా జతకలిపి పిలిస్తేనే పలుకుతాను....."
అని ఎప్పుడైనా అన్నారా మనతో...??
లేదే....
ఇప్పటికీ, మరియు ఎప్పటికీ కూడా
'శ్రీ చాగంటి గారు.....' అని పిలిచిన మరుక్షణం వారు మనకు పలుకుతారు.....
అవునా...?
మరియు, అట్లే ఆ బిరుదు నామాలన్నీ కూడా జతకలిపి పిలిచినాసరే వారు పలుకుతారు..
అవునా...?
కేవలం ఏ ఒక్క బిరుదునామానికే పలకడమో, లేదా కొన్నిటికి మాత్రమే పలకడమో అనేది ఇక్కడ అన్వయం కాని విషయం.....
మీ మీ గౌరవాభిమానంకొలది ఏ ఏ బిరుదు నామం వారి అసలు పేరైన "శ్రీ చాగంటి గారికి..." ఆపాదించి మీరు పిలుస్తారో, అవ్విధంగా వారు పలికి మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటారు అనేది శాశ్వతమైన సత్యం....
కాని అన్ని బిరుదు నామాలకు ఇక్కడ పలికేది మాత్రం ఒక్క ఆ శ్రీ చాగంటి వారే....
అచ్చం ఇదే విధంగా, మీరు మీ మీ భక్తిభావనకొలది ఏ ఏ పేర్లతో ఆ శాశ్వతమైన సత్యమైన పరబ్రహ్మతత్వాన్ని పిలుస్తారో ఆయా విధంగా ఆ పరబ్రహ్మశక్తి పలుకుతుంది...
దేశకాలానుగుణంగా ఒక్కోసారి ఒక్కోవిధంగా....
వివిధ ప్రత్యేక ఐహిక పారమార్ధిక , ఉపలబ్ధికి వివిధ రీతుల....,
1. మీరు ఆ పరబ్రహ్మశక్తిని " శ్రీదుర్గామల్లేశ్వరస్వామి " గా ప్రార్ధిస్తే....
శత్రువులను సమూలంగా నశింపజేసే తన దుర్గతిభంజక శక్తి సహితుడిగా ఆ శాశ్వతమైన పరబ్రహ్మము పలుకుతుంది...
2. మీరు ఆ పరబ్రహ్మశక్తిని
"శ్రీమదలర్మేల్మంగాపద్మావతీసమేతశ్రీశ్రీనివాసుడిగా" ప్రార్ధిస్తే....
సకల సంపదలను అనుగ్రహించే వరదుడిగా తన భోగభాగ్యదాయక శక్తి సహితుడిగా ఆ శాశ్వతమైన పరబ్రహ్మము పలుకుతుంది..
3. మీరు ఆ పరబ్రహ్మశక్తిని
"శ్రీరాజరాజేశ్వరిసహితరాజరాజేశ్వరస్వామి...."
గా ప్రార్ధిస్తే....
ఈ సకల చరాచరవిశ్వానికి అధినాయకి గా ఉండే
తన రాజరాజేశ్వరి శక్తి సహితుడై
అమేయమైన రాచరికత్వాన్ని
అనుగ్రహించే శ్రీరాజరాజేశ్వరుడి గా ఆ శాశ్వతమైన పరబ్రహ్మము పలుకుతుంది.....
4. మీరు ఆ పరబ్రహ్మశక్తిని
"శ్రీలక్ష్మీనారసిమ్హస్వామి...." గా ప్రార్ధిస్తే....
సకలవిధమైన అలక్ష్మిని నశింపజేసే తన దుష్టసమ్హారక శక్తి సహితుడై దురితాపహారక శ్రీ యాదగిరినృసిమ్హుడి గా ఆ శాశ్వతమైన పరబ్రహ్మము పలుకుతుంది.....
5. మీరు ఆ పరబ్రహ్మశక్తిని
"శ్రీసీతాదేవిసహిత శ్రీలక్ష్మణస్వామి సమేత శ్రీరామచంద్రమూర్తి..." గా ప్రార్ధిస్తే....
తరతరాలకు తరగని ఇష్టకామ్యార్ధ సిద్ధిని అనుగ్రహించే తన పోషక, రక్షక శక్తి సహితుడై
శ్రీ వరభద్రగిరీశుడిగా ఆ శాశ్వతమైన పరబ్రహ్మము పలుకుతుంది.....
అలా
మీ మీ భక్తి భావం కొలది మీ ఆర్తికి తగురీతిలో ఆ శాశ్వతమైన భగవద్ తత్త్వం అనుగ్రహిస్తూనే ఉంటుంది....
అన్ని దీపాలు కూడా కాంతి / వేడి
అనే అనుగ్రహన్ని ప్రసాదిస్తూనే,
వారి వారి సశాస్త్రీయ జ్ఞ్యాన వివేచనతో ఉపయోగించబడిన తైలం / ప్రమిద కొలది మరి కొంత ప్రత్యేకమైన అనుగ్రహన్ని సమకూర్చినట్టుగా....
పరంజ్యోతి గా ఆరాధించబడే ఆ పరబ్రహ్మతత్త్వం,
స్వీకరించబడిన ఒక్కొక్క స్వరూపం కొలది ఒక్కొక్క ప్రత్యేక విధమైన అనుగ్రహం ప్రసాదించడం కూడా పైన
వివరించబడిన వివిధ దీపాల రీతుల ఉండడం అనేది అధ్యాత్మవిశేషం.......
అంతమాత్రంచేత,
వైవిధ్య ఈశ్వరనామరూపాత్మక అభివ్యక్తతచే ఈశ్వరభేదం ఉందనుకోవడం కేవలం మన అజ్ఞ్యానానికి కొలమానం అవుతుందే తప్ప అది ఈశ్వరానుగ్రహానికి మేయం కారాని భావన....
పరబ్రహ్మతత్వాన్ని మీరు ఏవిధంగా నుడివినా ,
ఏవిధంగా ఆపాదించినా, ఏవిధంగా సమన్వయపరచినా, అది ఎప్పటికీ ఉండే శాశ్వతమైన నిత్యసత్యమైన దైవికతత్త్వం.....
శ్రీచాగంటి సద్గురువులు మనకు చాల చోట్ల బోధించినట్టుగా ఆ పరబ్రహ్మతత్వాన్ని అందుకే
" పరంజ్యోతి " అనే పేరుతో అన్ని సహస్రనామాల్లో మన ఋషులు అందించారు......
అది విష్ణుసహస్రమైనా....
లలితాసహస్రమైనా.....
శివసహస్రమైనా.....
మరే భగవద్ భగవతి సహస్రమైనా సరే " పరంజ్యోతి " అనే పేరుతోనే వచించారు....
ఒక దీపం మీరు
నేతితో వెలిగించినా,
వివిధ తైలములతో వెలిగించినా,
దీపం తత్త్వం మాత్రం ఒక్కటే కద....
వెలుగు / కాంతి ( ద్యుశక్తి )
మంట / వేడి ( ఉష్ణశక్తి )
అనె శక్తిద్వయం మీరు వెలిగించిన ఏ దీపానికైనా ఆపాదించబడే లక్షణాలు.....
మీరు నేతితో వెలిగించిన దీపం
మరియు
కొబ్బరినూనే,
నువ్వులనూనే,
ఆవనూనే,
వేపనూనే
ఇత్యాది వాటితో వెలిగించినప్పుడు మరి భేదం ఎక్కడకానవస్తుంది....???
కేవలం వాసనలో మాత్రమే మీకు ఆ భేదం అనుభవంలోకి వస్తుంది.....
అది కనిపించదు, వినిపించదు, మరియు ఘ్రాణశక్తికి తప్ప మరేవిధంగాను ఆ భేదం తన ఉనికి చూపదు.....
కాబట్టి ఎవ్వరు ఏ దీపం వెలిగించినా
సరే అందరికి కనిపించే కాంతి, మరియు అందరి చర్మంచే గ్రహించబడే వేడి ఒక్కటే రీతిలో ఉంటుంది...
కేవలం వాసన మాత్రమే మీరు వాడిన తైలానికి అణుగుణంగా మారుతుంది.....
అట్లే అద్వయమైన ఆ పరతత్త్వం కూడా
అందరికి ఒకేలా ఉండే నిత్యమైన సత్యమైన
సత్ చిత్ ఆనంద స్వరూపం.....
అది ఎల్లరిచే ఒకే రీతిలో ఆరాధించి అందుకొనబడే సత్యతత్త్వం.....
మరి వివిధ రీతుల / మార్గాల / పేర్ల / మతాల / సాంప్రదాయాల / ఆచారవ్యవహారాల ద్వార ఆ పరతత్త్వం ఒక్కొక్కిచే ఒక్కోవిధంగా భావించబడడం /
" ఆత్మానుభవంగా " అభివ్యక్తీకరించబడడం /
ఆత్మసాక్షాత్కారంగా భ్రమించబడడం
అనే తత్త్వానికి ప్రతీకయే ఆ వివిధ తైలములతో వెలిగించబడిన దీపం యొక్క భేదాన్ని వాసన రూపంలో వేరు వేరు తత్త్వాలుగా అందుకోవడం...
కాబట్టి ఇప్పుడు చెప్పండి..
అన్ని దీపాలు ఒకేలా కాంతిని వేడిని కలిగి ఉన్నయి కాబట్టి అవన్నీ ఒకేవిధంగా భావించబడాలా..???
లేదా ఒక్కో తైలంతో వెలిగించబడినందుకు ఈ దీపం వేరు....ఆ దీపం వేరు అని భావించబడాలా...?
అది మీ మీ వివేచనకు సంబంధించిన వ్యక్తిగత విషయం...
ఎక్కడెక్కడో ఉందని చెప్పబడే ఆ పరతత్త్వాన్ని ప్రతి మనుష్యప్రాణికి గ్రాహ్యమయ్యే రీతిలో ఆ భగవంతుడు
మనలోనే నిఘూడంగా ఆ పరబ్రహ్మతత్త్వాన్ని నిక్షిప్తం గావించాడు అనేది ఎంతో ఆశ్చర్యకరమైన కేవల మనుష్యప్రాణికి మాత్రమే పాప్తించిన
మహత్తరమైన అనుగ్రహ విశేషం...
అందుకే మానవులు అనగా
" మా నవతీతి మానవః...."
అని మన పెద్దలు, గురువులు నుడివినారు...
అనగా ఆ గుప్తమైన పరబ్రహ్మతత్త్వాన్ని అనుభవైకవేద్యమైన సత్యంగా ఆధ్యాత్మిక సాధన గావించి, సాధించి సంతసించి సంచితాన్ని సమూలంగా క్షయింపజేసుకొని పునర్జన్మ యొక్క అవసరం లేని విధంగా ( మా నవతి) మళ్ళీ పుట్టవలసిన ఆవశ్యకత లేని విధంగా లేదా పుట్టవలసివస్తే ఎంతో దైవానుగ్రహ ప్రాప్తమైన గొప్ప మహనీయుడిగా జన్మించి ఎందరెందరికో ఆ జీవితం బాసటగా నిలిచేలా జీవించగలిగే అనుగ్రహం అని ఇక్కడి అసలైన అర్ధం...!
ఎంతో గహనమైన వేదాంతం కాకుండా
చాల సింపుల్ గా ఎందరో భక్తులకు సుపరిచయమైన సాహిత్యంతో ఆ జీవగతమైన జీవేశ్వర వైభవం గురించి వివరిస్తా వినండి.....
హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా |
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయఙ్ఞ వినాశినీ ||
అంత’ర్బహిశ్చ’ తత్సర్వం వ్యాప్య నా’రాయణః స్థి’తః | అనంతమవ్యయం’ కవిగ్‍మ్ స’ముద్రేஉంతం’ విశ్వశం’భువమ్ | పద్మకోశ-ప్ర’తీకాశగ్ం హృదయం’ చాప్యధోము’ఖమ్ | అధో’ నిష్ట్యా వి’తస్యాంతే నాభ్యాము’పరి తిష్ఠ’తి | జ్వాలమాలాకు’లం భాతీ విశ్వస్యాయ’తనం మ’హత్ | సంతత’గ్‍మ్ శిలాభి’స్తు లంబత్యాకోశసన్ని’భమ్ | తస్యాంతే’ సుషిరగ్‍మ్ సూక్ష్మం తస్మిన్” సర్వం ప్రతి’ష్ఠితమ్ | తస్య మధ్యే’ మహాన’గ్నిర్-విశ్వార్చి’ర్-విశ్వతో’ముఖః | సోஉగ్ర’భుగ్విభ’జంతిష్ఠ-న్నాహా’రమజరః కవిః | తిర్యగూర్ధ్వమ’ధశ్శాయీ రశ్మయ’స్తస్య సంత’తా | సంతాపయ’తి స్వం దేహమాపా’దతలమస్త’కః | తస్యమధ్యే వహ్ని’శిఖా అణీయో”ర్ధ్వా వ్యవస్థి’తః | నీలతో’-యద’మధ్యస్థాద్-విధ్యుల్లే’ఖేవ భాస్వ’రా | నీవారశూక’వత్తన్వీ పీతా భా”స్వత్యణూప’మా | తస్యా”ః శిఖాయా మ’ధ్యే పరమా”త్మా వ్యవస్థి’తః | స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోஉక్ష’రః పరమః స్వరాట్ ||
అని లలితాసహస్రంలో క్లుప్తంగా,
నారాయణసూక్తంలో విస్తారంగా,
మన హృదయంలోనే ఎప్పటికీ కొలువైఉండే ఆ పరతత్త్వం గురించి మన సనాతన మహర్షులు వివరించడం ఎల్లరికీ విదితమే కద...
బ్రతుకమ్మ ఉత్సవంలో త్రికోణవృత్తావళి గా పేర్చబడే
ఆ లఘు సుమసౌధంలో ఊర్ధ్వమున అలకరించబడే ఆ గుమ్మడిపువ్వు యొక్క పిప్పొడి తో సంకేతించబడే తత్త్వం గా ఆ " త్రికోణాంతరదీపిక " ను, నిత్యం జీవుల హృదయకోశంలో వెలిగే పరంజ్యోతిని మన సనాతన పెద్దలు అలా జానపద ఉత్సవాంతర్గతంగా మనకు బోధించారు.....
( ఆ గుమ్మడిపువ్వు యొక్క కాడ / మూలము బత్కమ్మ మధ్యలో కొలువై ఉంటుంది...
ఆ సామ్యము క్రింద " పంచకోశాంతరస్థిత " గా
వివరించాను.... )
ఆశ్వయుజ దుర్గగా కాలపుపగ్గలాను చేబూని దక్షిణాయణ నాయకిగా కొనసాగే ఆ జగదంబ వైభవాన్ని ఇది వరకే
" బత్కమ్మ ( బ్రతుకమ్మ ) వైభవం " అనే పోస్ట్లో వివరించడం జరిగింది కద....
ఇప్పుడు ఆ పరంజ్యోతి యొక్క
వైభవాన్ని మరికొంత విశ్లేషిద్దాం......
శ్రీలలితాసహస్రం లోని " త్రికోణాంతరదీపిక " అనే నామంపై ఎపుడైనా ధ్యానం చేసారా...???
లౌకికమైన శ్రీచక్రయంత్రస్థిత నవావరణాంతర్గతమైన శాక్తేయ వైశేషిక విషయాలను వివరించడం ఇక్కడ నా అభిమతం కాదు....
శ్రీచాగంటి సద్గురువులు బోధించినట్టుగా యంత్రాలు, శ్రీచక్రాలు, సాలిగ్రామాలు, ఇత్యాది హైవోల్టేజ్ ఆధ్యాత్మిక పరికరాల జోలికి సామాన్యులు వెళ్ళకపోవడమే మంచిది....
మోటార్ డ్రైవింగ్ స్కూల్లో రెండునెళ్ళు కార్ డ్రైవింగ్ నేర్చుకొని, ఇక నేను విమానం నడుపుతాను అనడం ఎవ్విధంగా ఉంటుందో.....
శివ విష్ణు శక్తి సహస్రాల పుస్తక పఠనం, వివిధ స్తోత్రాలు
మనకు వచ్చు కదా అని ఇక ఇంట్లో మేరుయంత్రం పెట్టేయడం, శ్రీచక్రార్చన చేసేయడం, కూడా అట్లే ఉంటుంది....
కాబట్టి టీవీలో, 1+1 ఫ్రీ అని అడ్వర్టైస్మెంట్లు వస్తే,
చాక్లెట్లు, బిస్కెట్ పాకెట్లు, గులాబ్జామూన్ పాకెట్లు మొదలైనవి కొనుక్కొని తినాలి కాని,
శ్రీచక్రాలు, స్ఫటిక యంత్రాలు కొనుక్కొని ఇంట్లో పెట్టడం అంత శ్రేయస్కరమ కాదు.....
వాటి అత్యున్నతమైన స్థాయి వేరు....,
వాటికి కావలసిన నిరంతర శౌచసాంప్రదాయిక గురోక్త పూజావిధివిధానాలు వేరు....
వాటిని హ్యాండిల్ చేయడం ఈ కలియుగ జీవనశైలిలో అందరికీ కుదరనిపని
విమానం కనిపిస్తే చూసి ఆనందించాలి....
లేదా ప్రాప్తం ఉంటే అందులో ప్రయాణించి ఆనందించాలి...
అంతేకాని పైలట్ లా గాల్లో నడిపిస్తాననడం అంతగా సమంజసం కానిది....
( Unless one has an exceptional training and command on the same )
యంత్రాలు చక్రాలు కూడా అంతే...
మన శరీరమే ఒక బృహత్ శ్రీచక్రం....
మన శరీరంలోని 9 కన్నాల ద్వారా
సాగే పిండాండ బ్రహ్మాండ సమన్వయమే
( స్థూల శరీర బాహ్య ఆంతర కమ్యునికేషన్ వ్యవస్థ ) ఆ శ్రీచక్రనవావరణ లోని శక్తివంతమైన దైవిక వ్యవస్థ...
క్రమక్రంగా ఆ శక్తిమొత్తం చేరే తుది స్థానం మన హృదయకోశంలో ఒక త్రికోణవృత్తావళి గా కొలువైన పంచకోశాంతర్గత మధ్యమున కొలువైఉండే
" ఆనందమయ కోశం" అనే సూక్ష్మమైన బిందుమధ్యగత స్వప్రకాశికలోకి...
ఆ నిరంతర స్వప్రకాశక బిందువే లౌకిక ప్రపంచంలో మనం చూసే శ్రీచక్రఊర్ధ్వమున కొలువైఉండే ఆదిపరాశక్తి శ్రీచక్రేశ్వరి శివకవితేశ్వరి యొక్క నివాస స్థానం.....
ఆ పరతత్త్వ హృదయదీపికనే వివిధ రీతుల మన సనాతన మహర్షులు దర్శించి స్తుతించి మనకు వారి యొక్క ఆ జ్ఞ్యాన విశేషాన్ని సూక్త స్తోత్ర రూపాల్లో అందించారు....!
( ఇందాక పైన ఉదహరించబడిన అస్మద్ గురుదేవుల వివిధ బిరుదు నామాలు మరియు ఎప్పటికీ శాశ్వతంగా ఉండే వారి "శ్రీచాగంటి...." అనే అసల్ పేరు యొక్క సామ్యములా అన్నమాట....)
ఇంకా చాలా సింపుల్ గా చెప్పలంటే
కింద భూమిమీద 3 చుక్కలను కలుపుతు 60 డిగ్రీల కోణంలో అమరే విధంగా ఒక సమకోణత్రిభుజం
గీయడానికి 3 చుక్కలను పెట్టండి...
ఇప్పిడు ఆ గీసిన ట్రయాంగిల్ యొక్క భుజాలను ఊర్ధ్వముఖంగా అనుసంధానించినప్పుడు ఆ 3 భుజాలు కలిసే కొసను 4 వ చుక్కగా భావించండి....
క్రిందన ఉన్న ఆ 3 చుక్కలను కలుపగా వచ్చిన త్రికోణసమతలానికి మరియు పైన ఉన్న 4 వ చుక్కకి సమదూరంలో ఈ నాలుగు చుక్కలను నిరంతరం అనుసంధానిస్తు ధగ ధగ మని మెరుస్తుండే ఆ 5 వ చుక్కయే ఆదిపరాశక్తి అయిన ఆ
" త్రికోణాంతర దీపిక ".....!
( The 3D triangular shape as in the attachment, is how our Hrudaya Trikonam Hrudayapadam being explained in the post looks like.....
However the central astral self luminous cosmic energy [' daharaakaaSa prakaaShika' ] is not visible here in the given attachement because it lies inside equidistant to all the 4 corners of that shape connecting and illuminating all 4 of them to execute it's unparalleled, unfathomable, unlimited, indescribable, immeasurable, cosmic energy transfusion process that sustains us through all the phases of our life until it leaves us during the body's expiry day......
That is when this " Shivam " that has been doing every possible good becomes "Shavam" because it's source of energy transfusion has left the mortal coil upon the call of it's supreme master out there in the vast universe....)
ఈ 5 చుక్కలచుట్టూ ఆవరించి ఉండేవే
1. అన్నమయ
2. ప్రాణమయ
3. మనోమయ
4. విజ్ఞ్యానమయ
5. ఆనందమయ
కోశములు.....
కాబట్టి
ఆ " త్రికోణాంతరదీపిక "
ఆ " అంతర్ముఖసమారాధ్య బహిర్ముఖసుదుర్లభ..."
ఇప్పుడు ఎక్కడున్నట్టు...?
ఈ పంచకోశములందు ఆవరించి ఉండే దహరాకాశామధ్యమున వెలుగుతున్నందునే ఆ పరంజ్యోతి " పంచకోశాంతరస్థిత " అనే నామంతో స్తుతించబడడం.....
ఆ త్రికోణతలానికి మూడు వైపుల ఉన్న
చుక్కలే అన్నమయ కోశ మధ్యము, ప్రాణమయ కోశ మధ్యము, మనోమయ కోశ మధ్యము......,
ఊర్ధ్వమున ఉన్న ఆ 4వ చుక్క విజ్ఞ్యానమయ కోశ మధ్యము....
వీటన్నిటిని నిరంతరం అనుసంధానిస్తూ వెలుగుతూండే ఆ 5వ మధ్య చుక్కయే ఆనందమయకోశ మధ్య గత శ్రీమత్సిమ్హాసనేశ్వరి.....!
ఆ 5 చుక్కల ఘనత్రికోణమే, అనగా మన హృదయపద్మమే ఆ పరాశక్తి యొక్క సిమ్హాసనం....
ఆ సిమ్హాసనంపై శ్రీమహారాజ్ఞిగా కొలువై మన జీవితాలను శాసించే పరాశక్తియే మీరు ఏ నామరూపాలతో కూడా ఆరాధించినా అనుగ్రహించే
" సత్ చిత్ ఆనంద స్వరూపాత్మక " శాశ్వతమైన నిత్యమైన సత్యమైన పరబ్రహ్మ తత్త్వం....!! 😊
ఇక ఆ ఆదిపరాశక్తి ఏవిధంగా ఈ పంచాకోశాలతో మన పాంచభౌతిక శరీరంలోనే ఆ అలౌకిక పరతత్త్వ వీచికలను సదరు సాధకుడి ఆర్తికి అనుగుణగంగా ప్రభవింపజేసి మనిషికి అసాధ్యం కానిదంటూ లేని రీతిలో యావద్ విశ్వాన్ని మన యోగశక్తితో ఒడుసిపట్టుకునేలా అనుగ్రహిస్తుందో వేరొక పోస్ట్లో వివరిస్తాను...😊
అందుకే అన్నమాచార్యుల వారు ఈ కలియుగప్రత్యక్ష పరబ్రహ్మశక్తిని ఆ శ్రీవేంకటనగముపై కొలువైన పరతత్వాన్ని
"ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు.....అంతరాంతరము లెంచిచూడ పిండంతే నిప్పటి అన్నట్లు...."
అనే సంకీర్తనలో అన్ని దైవిక తత్త్వాలను ఆ తత్త్వాధీశునికి ఆపాదిస్తు,
" శ్రీవేంకటపతి నీవైతే మముచేకొనిఉన్న దైవమని...
ఈవలనే నీ శరణనియెదను
ఇదియే పరతత్త్వము నాకు.....
ఇదియే పరతత్త్వము నాకు.....
ఇదియే పరతత్త్వము నాకు..... "
అని మనకు సెలవిచ్చిరి.....😊
http://annamacharya-lyrics.blogspot.com/2006/11/65entha-matramuna-evvaru-talachina.html?m=1
No comments:
Post a Comment