Monday, June 8, 2020

శ్రీవేంకటేశ్వరవైభవం.....😊

శ్రితచేతనమందారంశ్రీనివాసమహంభజేత్.....🙏😊

" శ్రీవేంకటేశ్వరవైభవం " ప్రవచనంలో శ్రీచాగంటి సద్గురువులచే బోధించబడిన అత్యద్భుతమైన శ్రీనివాస పరదైవం యొక్క కలియుగ భక్తసమ్రక్షణా వైచిత్రి గురించి ఎల్లరు విని తరించే ఉంటారు......

"ధనమూలం ఇదం జగత్..." అనే నానుడి పై ఆధారపడిన ఈ కలికాలంలో ప్రత్యక్ష దైవమైన శ్రీశ్రీనివాసుడి అనుగ్రహం వినా ప్రశాంతంగా సుఖసంతోశాలతో జీవించడం దుర్లభం....

ఎవరు ఎన్ని బోధలు గావించిన అందరి జీవితాలు నిత్యం భ్రమించేది ధనార్జనపైనే...ఇది ఈ కలియుగ వాస్తవం... 

సాక్షాత్తు స్వామివారే తన అష్టోత్తరంలో ఏ భగవంతుడికి లేని పేరు పెట్టుకొని
" ఓం ధనార్జనసముత్సుకాయనమః...." 
అని నిత్యం ఆలయాల్లో పూజింపబడుతుండడం....

అందుకు తగ్గట్టుగానే మొక్కులు / కానుకలరూపంలో ఆయన డబ్బులనే తన ధర్మహుండీల ద్వారా స్వీకరించడం, అలా భక్తులచే నిత్యం సమర్పించబడిన డబ్బులతోనే ఎన్నెన్నో భక్తసమ్రక్షణా , ధర్మసమ్రక్షణా కార్యక్రమాలను టిటిడి ద్వారా నిర్హహించడం,
ప్రతి భక్తుడి ద్వారా తిరుమల ఆలయ వ్యవస్థకు చేరిన పైకాన్ని నయాపైసలతో సహా తిరుమల పంచబేరమూర్తుల్లో ఒకరైన గర్భాలయంలో వేంచేసిఉన్న శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి గారికి ప్రతి రోజు కొలువు సేవలో లెక్కాపత్రం చదివి వినిపించడం, ఎల్లరికి విదితమైన సత్యమే కద....

తిరుమల శ్రీశ్రీనివాస దర్శనం గురించి ఆలయాన్ని దర్శించిన వివిధ భక్తులు వివిధ రకాలుగా వారికి భగవద్ అనుగ్రహంగా జ్యోతకమైన ఆధ్యాత్మిక విషయాలను చెప్పడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం కద....

స్వామివారి అనుగ్రహంగా భాగవతార్ శ్రీమాన్ పరిటాల గోపికృష్ణ గురువుగారి నేతృత్వంలో 2 సార్లు అనగా 7+7=14 రోజుల పాటు తిరుమల ఆలయంలో శ్రీవారిసేవక్ గా విధులు నిర్వహించిన ఆ సేవాకార్యక్రమంలో, వారంలోని ప్రతీ రోజు, అనగా ఆ 14 రోజుల సమయంలో

ఏదో ఒక షిఫ్ట్లో వారంలోని అన్ని రోజులు
కూడా ఆనందనిలయంలో భక్తుల దర్శనం Q లైన్ ని త్వరితగతిన ముందుకు నడిపించేందుకు అక్కడ విధులు నిర్వహించే సేవకుల్లో ఒకడిగా ఉండగలిగే భాగ్యం నాకు లభించడంతో.....

ఒక వైపు 

"నడవాలి గోవిందా....ముందుకు నడవాలి...."

అని భక్తుల లైన్  ముందుకు సాగేలా భౌతికంగా నా శరీరం తో సేవచేయడం, ఆ అప్రాకృత సజీవ సాలిగ్రామావేశిత దివ్యమంగళమూర్తి యొక్క స్వరూపాన్ని, ఎన్నో జన్మల పుణ్యఫలితంగా ఈశ్వరానుగ్రహంగా , ఆపాద తలమస్తకం అలా దర్శిస్తు ఉండడం తో మనసులో ఆ శ్రీవేంకటమాధవుడిని నిలుపుకోవడం.....

వీటితో పాటుగా అసలు ఇంతటి ఘనమైన శ్రీనివాసుడి దర్శన వైభవంలోని ఆంతర్యమేమి అనే జ్ఞ్యానమార్గాన్వేషణ కూడా అక్కడ స్వామి వారి అనుగ్రహంగా తర్కించడం జరిగింది....

కలియుగ వరదుడైన ఆ శ్రీభూసమేతశ్రీనివాసుడి దర్శనంలో అన్ని తత్త్వాలు ఇమిడిఉన్నాయి....

ఎవరు ఏ తత్త్వంలో ఈశ్వరుడిని అందుకోగలరో వారికి ఆయా తత్త్వాల్లో భగవంతుడు తనను తాను ఎరుకపరిచి తన దరికి వారిని చేర్చుకుంటాడు.....

కాబట్టి అన్నితత్త్వాలు ఆ పరమాత్మయొక్క లీలావిభూతులే అనేది అధ్యాత్మతత్త్వసారం....

మలయప్ప స్వామివారిని

శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి గా సేవించడంలో గల ఆంతర్యాన్ని శ్రీచాగంటి సద్గురువులు మనకు ఈ క్రింది విధంగా వివరించినారు కద.....

" అలా శ్రీదేవి భూదేవి సహితుడిగా పరమాత్మ సేవింపబడడం అంటే దాని అర్ధం ఆయన ఇద్దరు పెళ్ళాలతో తిరుగుతున్నాడు అని కాదు....

"సకల విశ్వంలో ఉన్న సంపద మొత్తం 

చర శక్తి / శ్రీ శక్తిగా....,

స్థిర శక్తి / భూ శక్తిగా...,

లభ్యమవ్వడం ఆ ఇరువురుకి ప్రతీకలైతే, ఆ ఇరు శక్తులకు కూడా అధిపతిగా ఉండి సకల విశ్వాన్ని సమ్రక్షించే విశ్వవ్యాప్తమైన విష్ణువుని నేను....."

అని సంకేతించడమే శ్రీ భూ సమేత శ్రీనివాసుడిగా మలయప్పస్వామివారిని ఆరాధించడంలోని ఆంతర్యం.....

కాబట్టి యావద్ విశ్వమే ఆ విష్ణువు.....
ఆ విష్ణువే యావద్ విశ్వం......

"యత్ పిండే తత్ బ్రహ్మాండే......" అనే సూత్రానుగుణంగా,
పిండాండమైన ప్రతి జీవిలో ఉన్నది...
బ్రహ్మాండమైన యావద్ విశ్వంలో ఉన్నది ఒకే వైశ్విక చైతన్య శక్తి....

ఆ శక్తి సాంద్రత లోని వివిధ భేదాలే ఈ యావద్ ప్రపంచంలో వివిధ నామారూపాత్మకంగా పరిఢవిల్లే జగత్తు....

6 అడుగుల మనిషి శరీరంలో ఉన్న వివిధ భాగాలకు వివిధ స్పెషలిస్ట్లు గా 
కార్డియాలజి, నెఫ్రాలజి, న్యురాలజి,
పల్మనలాజి, ఆఫ్థాల్మాలజి, అని అలా ఎనెన్నో గహనమైన శాస్త్రాలుగా మెడిసిన్ అనే సైన్స్ ని విభాగించి ఎందరెందరో అధ్యయనం గావించి,.....
వైద్యో నారాయణో హరిః......

అని ఎల్లరిచే గౌరవింపబడుతున్నారే....

మరి ఆ శ్రీహరి ఎన్నెన్ని శాస్త్రాలకు నెలవై తనలో వాటన్నిటిని ఆపాదతలమస్తకం నింపుకొని ఉంటాడో ఒక సామాన్య మనిషికి అందే విషయమేనా అది.. ?

లౌకిక వైద్యులు, మన X-రేలు, CT స్కానింగ్లు, వివిధ రిపోర్ట్లు, రోగికి ఉండే / రోగిచే చెప్పబడే 
లక్షణాలు ఇత్యాది వాటిని ఆధారంగా చేసుకొని ఆ రోగియొక్క శారీరక, మానసిక ఆరోగ్యాలను చక్కదిద్దుతారు.....

అటువంటి వైద్యులకే వైద్యుడైన భగవంతుడు,
శ్రీవేంకటహరిగా ప్రత్యక్ష పరమాత్మగా
ఆ ఆనందనిలయంలో కొలువై,
రెప్పపాటులో వందలమందిని
తన X-రే కళ్ళతోనే స్కాన్ చేస్తు, ఆ కళ్ళనే లేసర్ బీంస్ గా మార్చి తనను దర్శించే ప్రతి భక్తుడి యొక్క 
"కర్మ సిద్ధాంత ఆరోగ్యాన్ని" చక్కదిద్దే ఘనవైద్యుడు ఆ శ్రీహరి...!!

ఒక డాక్టర్ దెగ్గరికెళ్తె  అందరిని ఒక క్రమపద్ధతిలో రమ్మని చెప్తూ, అనవసరంగా ఎవ్వరు కూడా డాక్టర్ల సమయం వృధాచేయకుండా, హాస్పిటల్లో అనవసర గోల పెట్టకుండా, ఇతర రోగులకు ఇబ్బంది కలగకుండ, ఉండే రీతిలో మనల్ని వ్యవహరించమన్ అక్కడివారు మనకు చెప్పడం అందరికి విదితమే కద....

అలా O.P Q లైన్ లో కొందరు వ్యక్తులు,
" అహా....ఈ డాక్టర్ గారు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు....
నాకు ఇక్కడే చాలా సేపు ఇట్లే ఉండిపోవాలని ఉంది ఈ హాస్పిటల్లో....నన్ను ఇక్కడినుండి వెళ్ళమని అడగకండి..."

అని అనడం ఎంత విడ్డూరంగా ఉంటుందో....

ఆనంద నిలయంలో ని భక్తుల Q లైన్లో స్వామి వారి దర్శనం మన ఆర్తికి అనుగుణంగా ప్రాప్తమున్నన్ని క్షణాల పాటు గావించిన పిపద 
" ఆహ...స్వామి వారి దర్శనం ఎంత బావుందో....నన్ను తొయ్యకండి... నేను ఇక్కడే ఇట్లే ఉండిపోతా....."

అని అనడం కూడా అట్లే విడ్డూరంగా ఉంటుంది....

స్వామివారి మణిమండపంలో ప్రవేశించిన ప్రతీభక్తుడు అట్లే అంటే ఇక వెనక వైకుంఠం Q కాంప్లెక్స్ లో వేచి ఉన్న వేలాది భక్తులకు ఎట్లా మరి ఆ భవరోగవైద్యుడి అనుగ్రహం అంది తరించేది.....??

ఒక హాస్పిటల్ లో స్వేచ్ఛగా చాలా సేపు అలా ఉండిలోవాలంటే 

మనం అందులో మెడికల్ స్టాఫ్ అయినా అయ్యుండాలి....

లేదా సపోర్టింగ్/హెల్పింగ్ స్టాఫ్ అయినా అయ్యుండాలి....

లేదా O.P కాకుండా దీర్ఘకాలం వైద్యనిమిత్తమై అడ్మిట్ అయిన పేషెంట్ అయినా అయ్యుండాలి....

అవునా...?

అట్లే

తిరుమల ఆలయంలో చాలాసేపు ఉండాలంటే,

ఎన్నెన్నో జన్మల పుణ్యఫలితంగా మాత్రమే, ఈశ్వరానుగ్రహంగా లభించే వరం, టి.టి.డి ఉద్యోగి అయినా అయ్యుండాలి....

లేదా మరూన్ / గ్రీన్ కలర్ డ్రెస్ కోడ్ లో ఉండే అక్కడి సపోర్టింగ్ / హెల్పింగ్ స్టాఫ్ అయినా అయ్యుండాలి....

లేదా శ్రీవారిసేవ నిమిత్తమై వారం రోజులపాటు అక్కడ ఉండే శ్రీవారిసేవక్ అయినా అయ్యుండాలి....

కద...

శంఖనిధి, పద్మనిధి అధిదేవతలకు నమస్కరించి ఆలయ పడికావలి లోకి అడుగుపెట్టిన సదరు భక్తుడు ఒక గంటే కంటే ఎక్కువ సమయం ఆలయంలో ఉండేందుకు పైన పేర్కొన్న 3 విధాలు కాకుండా మానుష ఉపాధితో ఆక్కడ అంతకంటే ఎక్కువ సమయం ఉండగలగడం దుర్లభం....

జీవిడిని దేవుడు,
దేవుడిని జీవుడు
ఎంతో ఆర్తితో పరికించే ఆ కొద్ది క్షణాల్లోనే శ్రీనివాసుడు గావించే ఆ అక్షయమైన దైవిక మహత్తు గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది.....

ఎన్ని కోట్ల మేధోమండలాలు ఈ భూప్రపంచంలో ఉన్నాయో వాటికి సరిపడేలా...

ఎల్లప్పుడు అంతకంటే పది ఇంతలు ఎక్కువే ఉంటుంది ఆ శ్రీనివాసుడి దెగ్గర 
" మానుష మస్తిష్క గత మేధోమండల నిర్వాహక భవరోగ వైద్య సామాగ్రి...!"

శ్రీదేవి భూదేవి కి ప్రతీకలుగా తన విశాల వక్షస్థలంపై స్వర్ణాభరణాల రూపంలో కొలువైన తన ఇరు శక్తులతో ఉన్న శ్రీహరి అలా ఎలా ఈ విశ్వంలోని సర్వస్వాన్ని
తన అనుగ్రహ ప్రక్రియలోకి అనుసంధానిస్తాడు అనేది ఒకింత ఆశ్చర్యకరమైన దైవిక తత్త్వమహత్తే...!

పాంచభౌతికమైనది కదా ఈ యావద్ ప్రపంచం.....

శ్రీ భూ సమేతంగా కొలువైన శ్రీహరి తత్త్వంలోకి సకల పాంచభౌతిక బృహద్ విశ్వం ఎట్లొచ్చి చేరుతుంది అని మనం అనుకుంటాం.....

కాని ఆ శ్రీ భూ అనే ఇరు శక్తుల్లోనే సకల పాంచభౌతిక వైశ్విక శక్తులు అంతర్గతంగా ఇమిడిఉన్నాయి అనేది ఇక్కడ గమనించవలసిన అధ్యాత్మతత్త్వసూక్ష్మం....

అదెట్లో చెప్తా వినండి..

సకల ఐహిక సంపదలకు, చర శక్తికి ప్రతీకగా ఉండే శ్రీదేవి శక్తిలో

మరియు

సకల భూజనితమైన సంపదకు / స్థిర శక్తికి ప్రతీకగా
ఉండే భూదేవి శక్తిలో

సకల పాంచభౌతిక వైశ్విక శక్తి ఇమిడి ఉంటుంది....

1. ఆకాశం
2. వాయువు
3. అగ్ని
4. జలం
5. పృథ్వి

అనేవి పంచభూతాలు కద....

ఆకాశాత్ వాయుః
వాయోరగ్నిః
అగ్నేరాపః
అబ్ధ్యఃపృథ్వి

అనే క్రమంలో ఈశ్వరానుగ్రహంగా ప్రభవించిన పంచభూతాల్లో ఒక విచిత్రం దాగుంది....

అన్నిటికి మూలకారణమైన మొట్టమొదటిదైన ఆకాశంలో

మరియు

ఆఖరిదైన భూమి / పృథ్వి లో ఈ 5 పంచభూతాలు కూడా కొలువైఉండడం విచిత్రమైన విశేషం.....!

ఆకాశం అనగా...??

హద్దులేనిది.....
అగ్రాహ్యమైనది.....
ఎంతవరకు ఉందని మీరు భావించగలరో అంతకంటే పది అంగుళాలు ఎక్కువే ఉంటుంది...

అందుకే అది ఈశ్వరతత్త్వానికి సూచికగా చెప్పబడేది....

భూగోళం తో సహా అన్ని గ్రహమండలాలు ఎక్కడ ఎక్కడున్నాయి...??
ఆకాశంలోనే.....
కాబట్టి ఆకాశంలో భూతత్త్వం ఇమిడి ఉంది..

"ఆకాశానికి చిల్లులు పడ్డాయ ఏమి అన్నట్టుగా వారం రోజులుగా భారి వర్షాలు పడడంతో ఊరంతా గోదారైయ్యింది...."
అన్నప్పుడు ఆ జలం అంతా ఎక్కడినుండి వచ్చింది...?
ఆకాశం నుండి.....
కాబట్టి ఆకాశంలో జలతత్త్వం ఇమిడి ఉంది....

"ఆకాశమంతా మెరుపులతో ఉరుములతో భయానకంగా ఉండి ఫాలనా చోట పిడుగుపడి చెట్ట్లు నిలువునా దహించబడ్దాయి....."
అన్నప్పుడు అంతటి అగ్ని ఎక్కడినుండి వచ్చింది...??
ఆకాశం నుండి.....
కాబట్టి ఆకాశంలో అగ్నితత్త్వం ఇమిడి ఉంది....

"తూఫాన్ తాకిడికి భారి వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి......"
అన్నప్పుడు అంతటి వాయు ప్రభంజన శక్తి ఎక్కడినుండి వచ్చింది...??
ఆకాశం నుండి.....
కాబట్టి ఆకాశంలో వాయు తత్త్వం ఇమిడి ఉంది....

అట్లే.....

"బొరింగ్ వేయగా పాతాళగంగ పెళ్ళుబికింది......"
అన్నప్పుడు అంతటి జలం ఎక్కడినుండి వచ్చింది...??
భూమి నుండి.....
కాబట్టి పృథ్విలో జల  తత్త్వం ఇమిడి ఉంది....

"అగ్నిపర్వతం బద్దలై ఇనుమును సైతం చిటికెలో కరిగించివెయ్యగల లావా ఎగిసిపడుతుంది......"
అన్నప్పుడు.....
అంతటి అగ్ని శక్తి ఎక్కడినుండి వచ్చింది....
భూమి నుండి.....
కాబట్టి పృథ్విలో అగ్ని తత్త్వం ఇమిడి ఉంది....

"సింగరేణి బొగ్గుగనుల్లో, భూమిపొరల్లోనుండి విషవాయువులు ఉత్పన్నమై చాల మందికి అస్వస్థతకు కారణమయ్యింది...."
అన్నప్పుడు.....
అంతటి వాయు శక్తి ఎక్కడినుండి వచ్చింది....
భూమి నుండి.....
కాబట్టి పృథ్విలో వాయు తత్త్వం ఇమిడి ఉంది....

"కొన్ని వందల మీటర్ల లోతు తవ్వకాలలో పురాతన ఆలయాలు, గుహలు ఆ గుహల్లో వివిధ వస్తువులు ఇప్పటికి కూడా చెక్కుచెదరకుండా లభ్యామయ్యాయి...."
అన్నప్పుడు.....
( అది ఖాళి అంటారు కొందరు...
కాని అది పూర్ణము అంటాను నేను... )
అంతటి ఆకాశం ఎక్కడ దాగుంది ఇన్నాళ్ళుగా....
భూమి లో.....
కాబట్టి పృథ్విలో ఆకాశ తత్త్వం ఇమిడి ఉంది....

కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టుగా

ఆకాశంలోను మరియు పృథ్విలోను పంచభూతాత్మక పరిపూర్ణత్వం అంతర్నిహితమై ఇమిడి ఉంది.....

కాబట్టే ఆయన శ్రీ భూ సమేత శ్రీనివాసుడిగా సేవించబడుతున్నాడు....

ఎందుకంటే పరమాత్మ లా  ఆకాశం/శ్రీశక్తి మరియు పృథ్వి/భూశక్తి రెండూ కూడా పరిపూర్ణాత్మకం కాబట్టి....😊

వాటినుండి ఎవ్విధమైన తత్త్వములను సైతం సృజించవచ్చును కాబట్టి.....

ఇదన్నమాట క్లుప్తంగా ఆ శ్రీభూసమేత శ్రీనివాసుడి పరిపూర్ణాత్మక వైభవం.....

పై వివరణకు సరితూగేలా

మీరు ఆకాశం మరియు భూమిని మాత్రమే స్త్రీ వాచకం తో అనాదిగా పోల్చబడడం మిగతా 3 పంచభూతాలను పుం వాచకంతో పోల్చబడడం గమనించేఉంటారు.....

వాయు దేవుడు
అగ్ని దేవుడు
వరుణుడు / సముద్రుడు / పర్జన్యుడు

అని గాలిని, అగ్నిని, జలాన్ని, సంబోధించడం వినుంటారు గాని.....

ఆకాశ దేవుడు , భూదేవుడు అని ఎక్కడా వినుండరు.....

గీర్వాణి పలుకు, చరవాణి పలుకు, ఆకాశవాణి పలుకు, అని స్త్రీవాచకంగానే ఆకాశాన్ని సంబోధించడం వినుంటారు.....

భూదేవి ఆంశలో ప్రభవించిన సీతాదేవి,
'ఓం భూసుతాయై నమః' అని అర్చించబడే గోదాదేవి, ఇత్యాదిగా
భూమిని భూదేవిగా స్త్రీ వాచకం తోనే సంబోధించడం మీరు వినుంటారు కద.....

" భూమ్యాకాశం ఎకమైనా సరే నన్ను, నాకుటుంబాన్ని సతాయించిన వారిని అంతకు అంత సాధించి తీరేంతవరకు నా పడగ దించను.....
వారిని కాటేసేంతవరకు నా పగ చల్లారదు...."

అనేలా ఉండే సినిమా డైలాగ్లు వినుంటారు కాని.....

గాలి నీరు ఎకమైనాసరే....
నీరు నిప్పు ఎకమైనాసరే....
నిప్పు గాలి ఎకమైనాసరే....

అనేలా డీలాగ్స్ ఎప్పుడైనా విన్నర...?

పైన వివరించబడిన భూమికి ఆకాశానికి ఉన్న ప్రత్యేకత వల్ల మరియు అవి రెండు, రెండు ఎక్స్ట్రీంస్ కావడం వల్ల అలా ఆ రెంటినే వాడుకలోకి తీస్కోవడం జరిగింది... 

ఏ ఎక్స్ట్రీంస్ అయినా సరే పరమాత్మ అదుపాగ్జ్యలలోనే ఉంటాయి కాబట్టి కేవలం భూమి మరియు ఆకాశం మాత్రమే నామరూపాత్మక గ్రాహ్య శక్తులుగా శ్రీనివాసుడి ఇరుదేవేరులుగా కొలువై మనల్ని రక్షిస్తున్నాయి....

" లక్ష్మ్యతే ఇతి లక్ష్మి..." అనే వ్యుత్పత్తి ప్రకారంగా
లక్ష్మ్య అనగా గుర్తు లేదా సంకేతించబడునది....

కాబట్టి తన శ్రీ భూ సతులైన ఇరుదేవేరులతో పాటుగా పరమాత్మ యొక్క సకల శక్తులకు గుర్తుగా / సంకేతించబడే తత్త్వసూచికగా ఆ శ్రీనివాసుడు ఈ కలియుగంలో తన శక్తిని " వ్యూహలక్ష్మి " గా తన ఉరముపై వామభాగంలో కొలువైఉండేలా చేసుకొని,
కుడివైపు తన శ్రీవత్సచిహ్నం తో, వరద కటిహస్తాలతో,
పూర్ణచంద్రుని వంటి వదనంతో, మందస్మితుడై ఆనందనిలయుడిగా కొలువై ....

" శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం
శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజేదనిశం...." 

అని భక్తలోకంచే నిరంతరం వివిధ రీతుల సేవించబడుతున్నాడు ఆ శ్రీవేంకటేశపరబ్రహ్మము....😊

అందుకే అన్నమాచార్యుల వారు,
స్వామివారు ఎంత ఘనమైన గగనగంభీరమైన తత్త్వంతో అలరారే పరిపూర్ణుడిగా, శ్రీవేంకటపతిగా కొలువైనారో,

"అణోరణీయన్ మహతోమహీయన్...."

అనేంతటి గంభీరమైన తాత్వికత తనలో ఇముడ్చుకున్న్న సంకీర్తనలో

"ఆనురేణుపరిపూర్ణమైనా రూపము....
అణిమాదిసిరి అంజనాద్రిమీదిరూపము....."

అని స్తుతించారు ఆ అనంతమైన పరిపూర్ణ దైవిక తత్త్వమహత్తును.....😊

శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత శ్రీశ్రీనివాసపరబ్రహ్మణే నమః...🙏

http://annamacharya-lyrics.blogspot.com/2007/04/197anurenu-paripurnamaina.html?m=1

No comments:

Post a Comment