Monday, June 1, 2020

శ్రీకరమై శుభకరమై శతథా శ్లాఘనీయమై ఉండును సజ్జనుల నడవడి......😊

శ్రీకరమై శుభకరమై శతథా శ్లాఘనీయమై ఉండును సజ్జనుల నడవడి......😊
సామాన్యుల మార్గం :
భేదభావాలతో, పరస్పర వైరుధ్యభరితమైన అవివేక పూరిత ప్రణాళికలతో, గర్వంతో కావించే కార్యాచరణతో, ఇతరుల మనోభావాలకు విలువనివ్వకుండా కేవలం తమ అహంకారజనితమైన ఆలోచణాధోరణిలోనే సాగే తత్త్వంతో దూరదృష్టిలేని, సమగ్రమైన అవగాహనా రహితమైన నడవడి తో సాగే పంథా వీరిది...
ఏ అడ్డగాడిద ఏం కూసినా సరే వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి మోసపోతూంటారు.....
వాళ్ళతో పాటుగా ఇతరులు కూడా మోసపోయేలా వ్యవహరిస్తుంటారు అజ్ఞ్యానంతో....
ఈ సామాన్యమైన పరిధి దాటి, సంకుచితం గా వ్యవహరిస్తు మూర్ఖులుగా మారిన వారు ఇంకో మెట్టు దిగజారి,
గ్రామసిమ్హాలలా మొరుగుతూ, తోడేళ్ళలా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో చిచ్చులు పెట్టి లాభపడడం, సఖ్యతతో ఉన్న నలుగురి మధ్య వాళ్ళ అక్కసు అనే విషాన్ని నూరి పోసి బాధపడుతున్న వారి జీవితాలను ఏదో ఒక సినిమా లా చూస్తు అపహాస్యం చేయడం, తమ కుటిల పాచికలతో ఇతరుల జీవితాలను ఇబ్బందులకు గురిచేసి ఏదో గొప్ప పని చేసినట్టుగా విర్రవీగడం.....ఇత్యాదిగా ఉండేది అధముల మౌఢ్యపు కార్యాచరణ.....
మాన్యుల మార్గం :
ప్రతీ విషయాన్ని ఎంతో సున్నితమైనదిగా భావించి, సమగ్రంగా పరిశీలించి, సరైన అవగాహనతో ఆకళింపుజేసుకొని, సమస్యను మాత్రమే టార్గెట్ చేస్తు అందులోని వ్యక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండ, చాలా జాగ్రత్తగా గౌరవభరితంగా ఒక చక్కని పద్ధతితో కూడిన కార్యాచరణతో సాగే పంథా వీరిది....
ఇతరులను కూడా తమలా భావించి, ఎవరైనా ఎదైనా ఒక పని చేస్తే ఆ పని వల్ల తమకు ఇబ్బంది కలిగితే, అది ఇతరులకు కూడా అట్లే ఇబ్బంది కలిగిస్తుంది కదా అనే వివేకంతో కూడిన సమాలోచనతో ఉంటుంది మహాత్ముల కార్యనిర్వహణ శైలి.....
" నీకు నీ ఇల్లు ఎంత అపురూపమో.....
ఇతరులకు వారి ఇల్లు అంతే అపురూపము....
నీకు నీ కుటుంబం సంతోషంగా, ప్రశాంతంగా, సఖ్యతతో ఉండడం ఎంత ముఖ్యమో.....
ఇతరులకు వారి కుటుంబం సంతోషంగా, ప్రశాంతంగా సఖ్యతతో ఉండడం అంతే ముఖ్యం....
నీకు నీ గౌరవమర్యాదలు ఎంత ప్రాణప్రదమో.....
ఇతరులకు కూడా వారి గౌరవమర్యాదలు అంతే ప్రాణప్రదం....
అనగా,
నీకు నీ జీవితం ఎంత గొప్పదో....
ఇతరులకు కూడా వారి జీవితం అంతే గొప్పది.... "
ఈ లౌక్యాన్ని బాగా అర్ధం చేసుకొని మసలుకునే వారు మాన్యులు.....
ఈ లౌక్యాన్ని అంతగా పట్టించుకోని వారు సామాన్యులు....
ఈ లౌక్యాన్ని ఎందుకు పట్టించుకోవాలి అనే తలబిరుసుతనంతో వ్యవహరించే వారు అధములు....
క్లుప్తంగా ఇదన్నమాట ఈ లోకంలో 3 రకాలుగా ఉండే జన విభాగం....
కాబట్టి విజ్ఞ్యులైన వారు ఎల్లప్పుడు మహాత్ములను ఆశ్రయించి వారి యొక్క ధార్మికమైన చింతనతో అనుగ్రహించబడే సమాలోచలన మేరకే తమ జీవితాల్లో నడుచుకోవడం సహజం......
సామాన్యుల పోకడలను అంతగా పట్టించుకోకపోవడం సమంజసం....
అధముల గర్హనీయమైన రీతిని ససేమిర వలదని వర్జించడం వాస్తవికం.....
ఎవ్వరు ఔనన్నా కాదన్నా ఇదే ఈ లోకంలో ఉండే మానుషనైజం.....
కాబట్టి ఎవరు ఎవరిని ఆదర్శంగా స్వీకరించి వారినుండి తమ జీవితాలకు ఉపయుక్తమైన రీతిలో ప్రేరణపొందుతున్నారు అనేది వారి వారి బౌద్ధిక పరిణతకు సంబంధించిన విషయం.....
శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్భాగవతం ప్రవచనంలోని
" మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు...." పద్య గద్యముల వివరణ విన్నవారికి ఈ లోకసహజమైన ఉత్తముల రీతి గురించి చక్కని అవగాహన ఏర్పడుతుందనేది నా యొక్క అభిప్రాయం......
ఎందుకంటే ఒక చక్కని కొబ్బరి మామిడి పండుని తిన్నవారు మాత్రమే దాని గురించి వివరించగలరు.....
వివరించి ఇతరులకు కూడా ఆ భాగ్యం లభించేలా కృషిచేయగలరు.....
అంతేకాని కేవలం పిజ్జాబర్గర్లు తినే వారు
కొబ్బరి మామిడి యొక్క గొప్పదనం గురించి ఎట్లు నుడవగలరు....?
అది ఎట్లు ఇతరులకు అందేలా కృషిచేయగలరు...?
అచ్చం అట్లే, మహాత్ముల సాన్నిధ్యంలో లభించే జ్ఞ్యానామ్రఫలం యొక్క గొప్పదనం కూడా....
అది ఆరగించి ఆస్వాదించిన వారు మాత్రమే ఆ ఫలం యొక్క గొప్పదనం గురించి మనకు సెలవిచ్చి ఇతరులకు కూడా ఆ ఫలాన్ని అనుగ్రహఫలంగా అందివ్వగలరు......
ఆ మహాత్ముల బాట చివరికి మనల్ని ఆ సాటిలేని పరతత్త్వ తీరాలకు చేర్చి భగవంతుని కడకు కొనిపోవు ముక్తి మార్గములకు దారి చూపుతుంది అనేది తరతరాలుగా మన విజ్ఞ్యులైన పెద్దలు మనకు అందించిన సత్యం....
అంటే ఏంటి బాబు నువ్వు చెప్పేది...?
"కొందరు మహాత్ములు భగవంతుడిని బాగా అర్ధం జేసుకున్నారు కాబట్టి మనకి కూడా వారు ఆ కనిపించని భగవంతుణ్ణి బాగ ఎరుకపరిచి భగవద్ తత్వాన్ని అనుగ్రహించి కడకు ఆయన దెగ్గరికి చేర్చుతారు....."
అంతేనా....?
చాల్చాల్లేవో చెప్పొచ్చావ్.....
"ప్రత్యక్షంగా మానుష మాంస నేత్రానికి కనిపించని / అందని భగవంతుడితో మహాత్ములకు ఉన్న
" కమ్యూనికేషన్ " తో వాళ్ళు మనకు అది అందించి మనల్ని కూడా తరింపజేస్తారు...... "
అని చెప్పడానికి, వినడానికి చందమామ కథలలా బానే ఉంది కాని అది మహాత్ములకు ఎట్లు చెల్లును....?
అనేదే మీ ప్రశ్నైతే ఒక చిన్న లౌకిక ఎగ్సాంపుల్ తో వివరిస్తా వినండి ......
మాకు సీ.ఎం గారు ఇవ్వాళ ఆ న్యూస్ చెప్పారు.....
నిన్న ఆ విషయం చెప్పారు......
రేపు ఇంకోటి చెప్తారు.....
అని అలా ఒక్కొకరు ఒక్కొలా చెప్తుంటారే......
మనలో ఎంత మంది మన సీ.ఎం గారిని ప్రత్యక్షంగా చూసాం....?
కొందరేమో వాళ్ళ ఇంట్లోని టీ.వీ
లో రోజు సీ.ఎం గారిని చూస్తూనే ఉంటాం అంటారు.....
కొందరేమో మా 6 అంగుళాల స్మార్ట్ ఫోన్లో మేము ఎప్పటికప్పుడు సీ.ఎం గారి తో అప్డేటెడ్ గా ఉంటాము అని అంటారు....
కొందరేమో మేము రోజు మా న్యుస్ పేపర్లో సీ.ఎం గారు చెప్పేవన్నీ ఫాలో అవుతూనే ఉంటాం అని అంటార్....
కొందరేమో మా బంధువులు మరియు ఇతర పరిచయస్తులతో మేము ఎప్పటికప్పుడు సీ.ఎం గారితో టచ్లోనే ఉంటాము అని అంటారు.....
ఇంత మంది ఇన్ని రకాలుగా సీ.ఎం గారితో కమ్యూనికేట్ అవుతున్న మాట అందరికి విదితమయ్యే నిజమేకద....
అంటే వీరందరు రోజు సీ.ఎం గారిని ప్రత్యక్షంగా వారి వారి మానుష మాంస నేత్రాలతో చూసిన తర్వాతే సీ.ఎం గారిని విశ్వసిస్తున్నారు అని దాని అర్ధమా...?
కాదే...
ఎవరి ఛానెల్ వారిది..... ఎవరి వీలు వారిది......ఎవరి శైలి వారిది.....ఎవరి రీతి వారిది.....
ఇంత మంది ఇన్ని రకాలుగా సీ.ఎం గారితో కమ్యునికేట్ అవుతున్నా, ప్రగతిభవన్లో ఉన్నది ఒకేఒక్క సీ.ఎం.......
ఎవరికి ఏ ఏ రీతిలో లభ్యమైతే వారికి తగు రీతిలో తన కమ్యునికేషన్ చేరుతుంది అని సీ.ఎం గారు భావిస్తే, వారికి ఆయా రీతిలో తన సౌలభ్యాన్ని ప్రకటించడం అనేది ఇక్కడి వాస్తవం....
అంతే తప్ప రోజు సీ.ఎం గారు ఇంత మందినీ వారి వారి ఇంటికెళ్ళి చాయ్ తాగి వాళ్ళతో సంభాషిస్తున్నట్టు కాదు కదు....
A supreme entity will always make its presence gracefully available in a multi-channel methodolgy so that it can always remain reachable in it's intended form to all those who desire it to be available in a so and so form as per their preferred channel which would neither make that supreme entity an absolute entity tied to a specific channel nor a relative entity that varies continuously in all of it's selected communication channels....
It will only establish the supreme entity as a relatively absolute entity that reaches them as per the choice of their communication channels to ensure they are in sync with what everyone else is up to, thus making it an omnipresent entity in the desired form to assimilate it's message and seek it's blessings accordingly....
కాబట్టి మనకుండే సామాన్య ఉపాధి కి ప్రత్యక్షంగా ఉపలబ్ధమయ్యే విధంగా ఒకానొక సమయంలో నిర్ణీతమైన కారణాంతరముల చే ఈశ్వరుడు అవతారాన్ని స్వీకరించి వచ్చినప్పుడు మాత్రమే భగవద్ ఉనికిని విశ్వసిస్తాను అనుకోవడం కేవల మూర్ఖత్వం....
ఎప్పుడైనా ఎక్కడైనా సీ.ఎం గారు నాకు ప్రత్యక్షంగా కనిపిస్తేనే నేను సీ.ఎం అనే వారు ఒకరున్నారని నమ్ముతాను అనడం మూర్ఖత్వమైనట్టుగా....
అలా ఎప్పుడైనా భాగ్యవశాత్తు ప్రత్యక్షంగా కనిపించినప్పుడు,
" ఒహో...నేను వివిధ చానెల్స్ ద్వారా ఇన్ని రోజులు సీ.ఎం గారు అని విశ్వసించింది వీరినే అన్నమాట....." అని భావించడంలోనే విజ్ఞ్యత ఉంటుంది.....
అవునా...?
అచ్చం అట్లే, వివిధ మహాత్ములకు " అందిన " ఈశ్వరుడిని వారి సద్వాక్కుల ద్వారా విశ్వసిస్తూ,
వారిలా మాకు కూడా భగవంతుడు " అందివచ్చిన " నాడు....
" ఒహో...నేను వివిధ మహాత్ముల ద్వారా ఇన్ని రోజులు భగవంతుడు అని విశ్వసించింది వీరినే అన్నమాట....."
అని భావించడంలోనే విజ్ఞ్యత ఉంటుంది.....
ఇక్కడ మనకు సీ.ఎం గారిని రోజు
" ప్రత్యక్ష పరోక్షంగా " అందించే న్యుస్ చానెల్స్, ప్రింట్ మీడియా, ఇంటర్నెట్ లైవ్, ఇత్యాది మాధ్యమాలన్నీ కూడా...
సకల ద్వైదీభావనలకు అతీతుడైన
శాశ్వత అద్వయ సత్య తత్త్వమైన ఆ ఈశ్వరుడిని మనకు " అపరోక్ష సత్యంగా " ప్రత్యక్షంగా అందించే వివిధ సద్గురువులు, మహాత్ములు అన్నమాట...😊
అందుకే శ్రీచాగంటి సద్గురువులు ఒక గొప్ప మాట తరచూ బోధిస్తుంటారు....
" భక్తి తో కూడిన కర్మాచరణ చేసుకుంటూ వెళ్ళడమే మనకు విహిత ధర్మం......
మిగతావన్నీ కూడా, నమ్మినందుకు ఆ సర్వేశ్వరుడు మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు.....
ఆ సర్వశ్రేయోదాయకమైన అనుగ్రహమే ఈశ్వరుడు....! 😊 "
అన్నమాచార్యుల వారు కూడా బహు చిత్రమైన ఆ భగవద్ తత్త్వాన్ని, అంతే చక్కనైన చిత్రమైన సంకీర్తనలో,
"ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై ఉండు...
సంస్తుత్యుడీ తిరువేంకటాద్రివిభుడు...."
అని మనకు విశదపరిచినారు కద.... 😊
ANNAMAYYA-U.BLOGSPOT.COM
ప : నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు - సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యు.....

No comments:

Post a Comment