గఙ్గాతరఙ్గరమణీయజటాకలాపం గౌరీనిరన్తర విభూషితవామభాగమ్..!
నారాయణప్రియమనఙ్గమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్..!!
అని ఆ శ్రీకాశివిశ్వనాథుడిని భక్తులందరు ఎంతో ఆర్తితో కీర్తించడం ఎల్లరికి విదితమే కద.......
శ్రీ చాగంటి సద్గురువులను
నా జీవితంలో మొట్టమొదటి సారి ప్రత్యక్షంగా దర్శించిన ఆ అత్యంత మధురమైన రోజు 2010 సంవత్సరంలో
సికింద్రాబాద్లోని ఒక సుబ్రహ్మణ్య సేవా సమితిలో గంగావతరనం మరియు షణ్ముఖోత్పత్తి ప్రవచనానికి వారు విచ్చేసి నప్పుడు....
అప్పటి వరకు వారి ప్రవచనాలు ప్రతిరోజు వినడమే తప్ప ఎన్నడు వారిని కళ్ళారా చూసింది లేదు....
కాబట్టి శ్రీమద్రామాయణాంతర్గత ప్రవచనాలుగా ఆ రోజు వాటిని వినడం, నా దెగ్గరున్న 2 దానిమ్మపళ్ళు వారికి ఇచ్చి వారి పాదాలకు
అక్కడున్న వారందరు గావించినట్టే నేను కూడా సాష్టాంగ నమస్కారం చేసుకొని తరించడం అనే ఆ దివ్యమైన క్షణం నాకు జీవితాంతం ఒక ప్రత్యేకమైన మధురాతి మధుర స్మృతి...! 😊
అటువంటి కొన్ని దివ్యమైన సందర్భాలు ఎంత వర్నించినా వివరించలేము.....
ఒక్క మాటలో చెప్పాలంటే నా 7 వ తరగతి నుండి వెళ్తున్న మా ఇంటి దెగ్గర చిత్తారమ్మ గుడి దెగ్గరి సాయిబాబ ఆలాయంలోని బాబా పాదాలను అప్పటివరకు ప్రతి గురువారం సేవించడం ఒకెత్తైతే,
ఆ బాబాయే శ్రీ చాగంటి సద్గురువులుగా నడయాడి కళ్ళెదుట నిలువగా వారి కరకమలాలకు నా స్వహస్తాలతో రెండు దానిమ్మ పళ్ళను సమర్పించి ఆ సద్గురు పాదపద్మాలకు ప్రత్యక్షంగా నమస్కరించి తరించిన క్షణం అది.....! 😊
నా సంచిలోని అవే రెండు పళ్ళను నేను శిరిడీలో ఇస్తే దూరంగా అలా ఒక్క క్షణం బాబా వారికి చూపెట్టి ఇలా మనకు తిరిగి ఇచ్చేస్తారు.....
బాబా దర్శనానంతరం బయటకు వచ్చిన తర్వాత అవి మనమే తినేస్తాం కాబట్టి
ఇక అక్కడ మనము నిజంగా సమర్పించుకున్నది ఏముంది.....?
సమర్పించుకున్నాము అని సంతసించడానికి ఏముంది...?
కాని ఇక్కడ అలా కాదు కద.....
ప్రత్యక్షంగా కళ్ళెదుటే సద్గురువుల రూపంలో నడయాడే పరమాత్మకు నా చేతులతో నేనే దానిమ్మ పళ్ళను సమర్పించుకున్నాను.....
అనగా వారు ప్రత్యక్షంగా స్వీకరించిన ఆ రెండు దాడిమీఫలాలకు ప్రతిగా నాకు వారి పాదములయందు అప్రతయ్నంగానే మనోన్యాసము , బుద్ధిన్యాసము అనే రెండు అనుగ్రహఫలాలు వారి అనుగ్రహరూపంలో
లభించేసాయి అని దాని అర్ధం....! 😊
దాహంతో, ఆకలితో అలమటించే వారికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై రెండు అక్షయ పాత్రలను ఇచ్చి,
" భక్తా....నీ ప్రార్థన మేరకు ఈ రెండు అక్షయ పాత్రలను నా అనుగ్రహంగా స్వీకరించు...
మొదటిది నీ దాహం తీర్చడానికి నువ్వు ఏ తీర్థం కోరితే ఆ తీర్థం అందులోంచి అక్షయంగా ప్రసాదించబడుతుంది......
రెండోది, నీ ఆకలి తీర్చడానికి నువ్వు ఏ పదార్ధం కోరితే ఆ పదార్ధం అందులోంచి అక్షయంగా ప్రసాదించబడుతుంది........ శుభంభూయాత్..."
అని అంతర్ధానమైతే......
ఇక ఆ భక్తుడికి సంతోషంగా జీవించడానికి శాశ్వతంగా
"భుక్తి సిద్ధి" లభించినట్టే కద.....!
అట్లే ఒక సద్గురువుల పాదపద్మముల యందు
మనోన్యాసం, బుద్ధిన్యాసం అనే వరాల వల్ల లభించిన రెండు అక్షయజ్ఞ్యానపాత్రలు, ఆ భక్తుడి ఇహ పర జీవితానికి కావలసిన లౌకిక, పారలౌకిక సిద్ధిని సమకూర్చినట్టే కద...!
ఆనాడు ప్రవచనంలో గంగమ్మ వైభవం వినడం భగవద్ నిర్ణయమే అనుకుంటా.....
ఎందుకంటే ఆ తర్వాత 2013 మార్చ్ లో అలాహాబాద్ / ప్రయాగ లో జరిగిన అత్యంత అరుదైన కుంభమేళ
( అప్పటి అత్యంత అరుదైన గ్రహకూటమి కారణంగా అది 12×12=144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సంభవించే మహా శక్తివంతమైన కుంభమేళ కావడం....)
గురువుగారి సద్వాక్కుల్లో గంగమ్మ వైభవం అలా ప్రత్యక్షంగా విన్న భాగ్యం వల్లే, ఆ కుంభమేళ గురించి తెలియగానే హుటాహుటిన వెళ్ళి గంగమ్మ దర్శనం చేసితీరవలసిందే అనే నిర్ణయాత్మకమైన
నా పట్టుదలతో అప్పటికప్పుడు త్రివేణి సంగమానికి అట్నుండే కాశికి వెళ్ళగలిగే సౌభాగ్యం లభించింది...
ట్రైన్లన్నీ కూడా ఫుల్లై అసలు ఇంకో రెండు నెలలవరకు అలాహాబాద్ కు రిసర్వేషన్ లేదని తెలిసి,
సికింద్రాబాద్ టు న్యూఢిల్లి,
న్యూఢిల్లి టు అలాహాబాద్,
అలాహాబాద్ టు వారణాసి,
వారణాసి టు సికింద్రాబాద్
అనే 4 సుదీర్ఘమైన ట్రైన్ యాత్రల్లో భాగంగా రెండు రోజుల ప్రయాగ / కాశి / గంగమ్మ దర్శనం లభించి తరించడం జరిగింది....
అప్పుడు మా ఇల్లు ఒక నిత్యనరకంలా ఉన్న పరిస్థితి.......
గుళ్ళు, తీర్థాలే మనిషికి భగవంతుడు ప్రసాదించిన నిజమైన మితృలు అని నాకు చిన్నపటినుండే బాగ గట్టిగా విశ్వాసం....
కాబట్టి ఆ క్లిష్ట పరిస్థితుల్లో అంతటి శక్తివంతమైన తీర్థయాత్ర అప్పుడు నిజంగా నాకు చాల ఆవశ్యకమైనదే.....అందుకు తగ్గట్టే భగవంతుడు కరుణించాడు.....
శిరిడీ, తిరుమల తరువాత జీవితంలో నా మూడో దూరయాత్ర ఇదే కావడం మరియు అప్పటి దురితాలను దునుమాడి మమ్ము రక్షించే ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం ఆ శక్తివంతమైన కుంభమేళా సమయంలో వివిధ విధాలా మాకు లభించి మా కుటుంబం రక్షించబడడం మొదలైనవన్నీ కూడా ఇంతకు ముందు గురువుగారి గంగమ్మ వైభవం ప్రవచనం విన్నందుకు మాత్రమే సిద్ధించబడ్డాయి అనేది నాకు మాత్రమే తెలిసిన సత్యం.....
అలా గురువుగారి సద్వాక్కుల్లో గంగమ్మ వైభవం విని ఉండి ఉండక పోయుంటే,
అప్పుడు చాలా మంది అనుకున్నట్టే నేను కూడా
" అంత దూరం నాలుగు రోజులు ట్రైన్లో ప్రయణాలు అవసరమా....ఊరుకాని ఊర్లో....తిండికి కష్టాలు పడుతూ లక్షల మంది మధ్యలో
ఎక్కడతప్పిపోతామో ఏమో అనే ఆదరబాదరలో వెళ్ళడం ఎందుకులే....."
వెళ్ళడం ఎందుకులే అని లైట్ తీసుకునేవాడినేమో.....
"శ్రేయాంసి బహువిఘ్నాని...." అన్నట్టుగా మంచి మనసుతో ఒక మంచి కార్యం తలపెడితే, ఏడిచే మూర్ఖులు, ఓర్వలేని మనసుతో చెడగొట్టె హీనులే ఈ లోకంలో ఎక్కువగా ఉంటారు...
నన్ను కూడా అట్లే ఎందరో ఎన్నో రకాలుగా
వెళ్ళడం ఎందుకు..... వద్దు అని ఎన్నో రకాలుగా పెడబోధ చేసినా, గురుబోధ ముందు అవన్నీ బలాదూర్ అన్నట్టుగా, తుదకు నా గురోక్త సంకల్పమే నిలిచి గెలిచింది......
అంతదూరం ఒక్కడివైతే వద్దంటే వద్దని ఇంట్లో అమ్మ ఒకటే గోల.....
ఆ నస భరించలేక తమ్ముడికి ఆ కుంభమేళా గొప్పదనం గురించి వివరించి రమ్మని చెప్పి ఒప్పించి,
మా పెద్దమ్మగారి పెద్దబ్బాయ్ ని కూడా వెంటరమ్మని అడిగి,
"నేను తప్పిపోకుండా అటొకరు ఇటొకరు ఉన్నారు కద ...ఇప్పటికైనా వెళ్ళనివ్వమ్మ అని చెప్పి..." మొత్తానికి నేను అనుకున్నది సాధించి తీరాను.....
పెద్దన్న, తమ్ముడు, నేను ముగ్గురం అలాహాబాద్ కి చేరుకొని, ట్రైన్లో పరిచయమైన ఒక మంచి మనసున్న ఉత్తరాది కుటుంబం వారు కూడా త్రివేణి సంగమానికే ప్రయాణం అని మాట మాట కలపడంతో తెలిసి, వారికి అక్కడ తెలిసిన వారి ఆశ్రమం ఉందని తెలిపి మమ్మల్ని కూడా వారితో తీసుకువెళ్ళి మా బసకు సహాయం చేసిన వారిని మాకు ఆ కాశి విశ్వనాథుడే తోడుగా పంపుంటాడు.....!
"తుం మద్రాసి హై క్యా...." అని దక్షిణాది వారందరిని ఒకేలా భావించి కొంచెం దూరం పెట్టే ఉత్తరాదివారు సహాయం చేస్తారు అని నేను పెద్దగా అనుకోలేదు....
" హం హైదరబాది హై..." అని హిందిలో బాగా ముచ్చట్లు పెట్టడంతో వారికి మేము కూడా హిందివారిమే అన్నట్టుగా అనిపించిందేమో....
చిన్నన్న కు ( అసలు పేరు లక్ష్మీనారాయణ) , నాకు, తమ్ముడికి ( విజయ్ కి) కూడా హింది బాగనే వచ్చు కాబట్టి పాలలో నీళ్ళలా బానే కలిసిపొయాం వారితో.......
అలా అక్కడ మాకు వారి సహాయంతో ఒక సంత్ ఆశ్రమంలో ఆ రాత్రి బసకు బాసట దొరికి తెల్లారగానే వారితో పాటుగా సంగంసెక్టార్ కి తీర్థస్నానాలకు నడిచివెళ్ళడం ప్రారంభించాం....
ఒక ఊరినుండి ఇంకొక ఊరికి నడిచివెళ్ళినట్టుగా గంటలతరబడి నడిచి మొత్తానికి ఆ భక్తజన సముద్రాన్ని దాటి త్రివేణి సంగమస్థలికి
చేరుకున్నాం.......!
అచ్చం గురువుగారు ప్రవచనాల్లో చెప్పిన్నట్టె,
ఎర్రగా కనిపించే గంగమ్మ ప్రవాహం,
నల్లగా కనిపించే యమునా ప్రవాహం,
అంతర్వాహినిగా ఎంతోవేగమైన ఊర్ధ్వముఖ సుడులు తిరుగుతూ వచ్చి చేరే సరస్వతీ నదీ, ఈ ముగ్గురి కలయికైన త్రివేణిసంగమానికి మొత్తానికి చేరుకొని ఆ పుణ్యస్నానాలు ఆచరించి,
తీర్థ స్నానానికి ముందు పిప్పలాదాత్....శ్లోకం....
మరియు స్నానం తర్వాత ముమ్మారు కపర్ధి నామస్మరణతో ఆ పుణ్యస్నానాలు సంపూర్ణం గావించాము....
ఇన్ని వ్యయప్రయాసలకు ఓర్చి ఇంత దూరం వచ్చాం కద, ఆ పడవల వారు చెప్పినట్టుగా సంగమ ప్రదేశ మధ్య వరకు వెళ్ళి అక్కడకూడా మళ్ళీ తీర్థస్నానాలు చెద్దాం అని ఎంత చెప్పినా మావాళ్ళు వినలేదు.....
"అంత దూరం మళ్ళీ నడవడం, దిగడం, స్నానాలు, ఇవన్నీ మా వల్ల కాదు నాయన...
మేము వెళ్ళి రైల్వేస్టేషన్లో ఉంటాము....నీ ఇష్టం...." అని వారు విముఖంగా వెనుతిరగడంతో ఇక చేసేదేంలేక, రెండ్రోజుల ట్రైన్ ప్రయాణ అలసటతో వారు అలా అనడం అర్ధంచేసుకొని నేను కూడా వారితోనే తిరుగుప్రయాణం బాటలో స్టేషన్ చేరుకున్నాను......
కాని ఇప్పటికీ కూడా నా మనసుకు,
" ఆ కాస్త దూరం కూడా బోట్లో వెళ్ళి త్రివేణిసంగమం మధ్యలో నిల్చొని తీర్థస్నానం చేస్తే బావుండేది కద...."
అని నిత్యం నా కాశియాత్ర గుర్తొచ్చినప్పుడల్లా అనిపిస్తూనే ఉంటుంది....
ఈశ్వరుడు నా ప్రార్ధనను ఆలాకించి ఇప్పుడొచ్చే 2025 కుంభమేళాలో నాకు ఆ అనుగ్రహం ప్రసాదించు గాక......😊
అక్కడి భక్తుల కోలహలం ఒకెత్తైతే,
కేవలం ఆ కుంభమేళా తీర్థస్నానం కోసమై ఎక్కడెక్కడినుండో అక్కడికొచ్చిన నాగసాధువుల కోలాహలం ఒకెత్తు.....
అసలు వారిది ఈ లోకమేనా అనిపించేలా.....
మనం వేసే 5 అడుగుల దూరాన్ని ఒక్క అడుగులో దాటుకుంటు వెళ్తున్న వారి ఎంతో గంభీరమైన
నడకలోని వేగం...
నిప్పులు విరజిమ్ముతున్నారా ఏమి అనేలా ఉన్న ఆ నయనతపో తేజస్సు,
రుద్రగణాలా ఏమి అన్నట్టుగా సంవత్సరముల తరబడి జటలుకట్టిన వారి ఎర్రని నల్లని తెల్లని సమ్మిళితమైన కేశపాశాలతో,
300 సినిమాలోని స్పార్టన్స్ యొక్క బలాఢ్యమైన పోటుకి ఇక్కడ పొడిస్తే అక్కడ ఎగిరిపడతారు అనే రీతిలో వారి చేతిలో ఉన్న ఎంతో పదునైన త్రిశూలం.....
ఆపాదతలమస్తకం భస్మాంగరాగమైన దేహంతో, అంత బరువైన ఆ త్రిశూలాన్ని అవలీలగా చేతి 5 వేళ్ళతో ఒడిసిపట్టి అంత వేగంగా ఒక శ్వేతనాగులా జర జర జర మని సాగిపోయే వారి శైలికి ఎవ్వరైనా ఆశ్చర్యం చెందవలసిందే....!!
దుర్గమమైన హిమాలయ పర్వత గుహలలో ఉంటూ కేవలం 12 ఏళ్ళకు ఒక్కసారి జరిగే ఈ కుంభమేళాలకు మాత్రమే వారు తరలిరావడం నాకైతే నిజంగా ఎంతో ఆశ్చర్యం వేసింది.....
వారిని నాగసాధువులంటారో, అఘోరాలంటారో, మరెమంటారో కాని, ఆ దివ్య సాధుసత్పురుషుల దర్శనం నిజంగా ఒక వింతగొలిపే సంఘటనే...
అసలు పాదరక్షలు లేకుండా, దిగంబరంగా, నిద్రాహారాలు లేకుండా అలా లోకం మొత్తం తిరగడం కేవల మనుష్యులకు నిజంగా ఎలా సాధ్యం అనేది ఎవ్వరికైనా వింతగా అనిపించే సత్యమే కదా మరి....!
మనిషి మనీషి గా మారుండాలి....!
లేదా మనీషి మనిషిగా వచ్చుండాలి....!!
మేము కాశీకి రిసర్వేషన్ చేస్కున్న ట్రైన్ ఏవో కారణాల వల్ల క్యాన్సెల్ అని తెలియడంతో ఇక చేసేదిలేక ఆ రాత్రి కాశీకి వెళ్ళే ఏదో ఒక ట్రైన్ కి అప్పటికప్పుడే జెన్రల్ టికెట్ తీసుకొని వెళ్ళడంతో కాశీకి చేరుకునే సరికి బాగ ఆలస్యమయ్యింది... తెల్లారి 4 కల్ల చేరుకుందామనుకున్న సూపర్ ఫాస్ట్ ట్రైన్ రిసర్వేషన్ ప్రయాణం కాస్తా నార్మల్ ఎక్స్ప్రెస్ లో జెన్రల్ కంపార్ట్మెంట్ ప్రయాణమై మాకు అసలు ఆ రాత్రి నిద్రే లేకుండా పోయింది...
అసలే అక్కడి పరోటాలు పడక ఆ తిండి తినలేక, బిస్కెట్ ప్యాకెట్ల మీద 3 రోజులుగా బ్రతుకుతున్న నా బక్క ప్రాణం అప్పటికే డీలాపడడంతో, ఆ రాత్రి నిద్రలేమి మరింతగా ఇబ్బంది పెట్టింది.....
మధ్య మధ్యలో ఇరుక్కొని కూర్చున్న ఆ ఫుల్ ప్యాక్డ్ బోగిలో అలా అలా కునుకు తీస్తుండగా, మొత్తానికి ఉదయం 9 కల్లా వారణసి జంక్షన్ కి చేరుకున్నాము.....
ఆలస్యమైతే మళ్ళీ సాయంత్రం తిరుగుప్రయణానికి రిసర్వేషన్ చేసుకున్న సూపర్ ఫాస్ట్ ట్రైన్ అందుకోకపోతే ఇక ఆ అవస్థ వర్ననాతీతం కాబట్టి, రెస్ట్ తీస్కోవడం లాంటివి లేకుండా చక చక మని ఆటోలో శివ్లా ఘాట్ కి చేరుకొని, ఒక చిన్న రూం తీస్కొని త్వర త్వరగా ఫ్రెషప్ అయ్యి, వెంటనే కాశీ గంగాస్నానానికి బయల్దేరాము....
నా జీవితంలో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఆ అత్యంత విశేషమైన ఆనందదాయకమైన కాశీ గంగా తీర్థస్నాన పర్వసమయం రానే వచ్చింది....!!
అప్పటికే గురువుగారి "భజగోవింద స్తోత్ర వైభవంలో..."
" గంగాజలలవాకణికాపీతా....." అని విన్న గంగమ్మ వైభవం కళ్ళముందు సత్యమై సాక్షాత్కరిస్తుంటే అదొక వర్నించనలవికాని విశేషం...!!
దర్శనానికి లేటైతే కష్టం అని బోట్లో వెళ్ళాము విశ్వనాథుడి ఆలయ సమీపఘాట్ కి....
పడవలో కూర్చొని, గంగమ్మ మధ్యలో ప్రయాణిస్తు, దోసిట్లోకి ఆ స్వచ్ఛమైన తేజోభరితమైన గంగా జలాన్ని తీస్కొని ఒక కరువు ప్రాంతం నుండి కాశికి వచ్చిన వ్యక్తిలా గంగాజలాన్ని తాగడం జీవితంలో ఎన్నడు మరువలేని అద్భుతం.....!!! 😊
"జిస్ దేశ్ మే గంగా బెహ్తీహై...." అని ఎందరెందరో మహనీయులచే కొనియాడబడే ఆ గంగాజలాన్ని పుట్టి బుద్ధిగడించిన 26 సంవత్సరాలకు సేవించే మహద్భాగ్యం లభించింది కదా అని ఎంతగానో సంతసించిన సందర్భం అది......
బ్రహ్మకమండలోద్భవీం,
హరిపాదోద్భవీం,
రుద్రజటాజుటోద్భవీం,
త్రిపథగామినీం,
గంగా,
మందాకిని,
జాహ్నవి
ఇత్యాది పేర్లతో స్తుతించబడే గంగమ్మ జలాన్ని సేవించి ప్రార్ధించడం సామాన్యం కాదు కదా మరి....!
గంగమ్మ తీర్థస్నానాంతరం విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళగా అక్కడ లైన్లో ఉండగా పక్కన కొబ్బరికాయలు పాలు పూలు పత్రి అమ్మే దుకాణాల్లో 10 రూపాయలకు ఒక మట్టి గ్లాస్ నిండుగా ఆవుపాలు, బిల్వదళం అని వారు చెప్పగా ముగ్గురం కూడా వాటిని కొనుక్కొని ఆలయంలోని శ్రీవిశ్వనాథ జ్యోతిర్లింగానికి సమర్పించి తరించాము.....
నా జీవితంలో మొట్టమొదటి జ్యోతిర్లింగ సదర్శనాభాగ్యం అది....😊
అట్నుండే అన్నపూర్ణమ్మ ఆలయాన్ని దర్శించి అక్కడి భోజనప్రసాదశాలలో భోజనప్రసాదం స్వీకరించి, శక్తిపీఠ శ్రీవిశాలాక్షి అమ్మవారిని కూడా దర్శించి, రూం కి తిరుగుప్రయాణంలో బోట్ కాకుండా నడుచుకుంటూ వెళితే ఘాట్లన్నీ కూడా దర్శిస్తు మధ్యలో ఉన్న ఆలాయాలన్నీ కూడా కవర్ చేయొచ్చని అలా నడుచుకుంటూ, వచ్చిన గుళ్ళన్నిటిని దర్శిస్తు మొత్తానికి రూంకి చేరుకొని ఒక గంట అలా విశ్రమించి, సాయంత్రం ట్రైన్ కి సికింద్రాబాద్ తిరుగుప్రయాణం మొదలుపెట్టాం.....
'ఇంత దూరం ప్రయాణించి కాశికి వచ్చి సాయంసంధ్యాసమయంలో గంగమ్మ హారతి చూడలేకపోయామే.....' అనే వెలితి మాత్రం అట్లే ఉండిపోయింది....
మరోసారి వెళ్ళినప్పుడు అన్నీ కవర్ అయ్యేలా ఆ విశ్వనాథుడు కరుణించుగాక....
పేరు చూస్తే విశ్వనాథుడు......!
కాని జ్యోతిర్లింగ అరూపరూపి స్వరూపంలో ఉన్న శివలింగం చూస్తే మనుష్య మేధోమండలం
అంత పరిమాణంలో ఉండడం ఎల్లరికి విదితమే కద......మరియు ఆశ్చర్యజనకం కూడా....కద....
పెద్ద పెద్ద శివలింగ స్వరూపాల్లో చాలాచోట్ల ఉన్నడు కద శివయ్య అనేది నిజమే....
( శ్రీవేములవాడ రాజరాజేశ్వరుడి ఆలయం దెగ్గర్లో ఉండే శ్రీభీమేశ్వరాలయం, వరంగల్ వెయ్యిస్థంభాల గుడి, తంజావుర్, ఇత్యాది ఎన్నో చోట్ల బృహత్ శివలింగ స్వరూపాల్లో ఉండడం అందరికి తెలిసిందే కద..)
కాని ఇక్కడ విశ్వనాథ జ్యోతిర్లింగ పేరుకు / భౌతిక శివలింగ పరిమాణానికి / స్వరూపానికి సామ్యము గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇతర ఆలయాలలోని శివలింగస్వరూపాల గురించి కాసేపు అలా పక్కన పెట్టండి...
శ్రీ చాగంటి సద్గురువులు ఎన్నో ప్రవచనాల్లో మనకు బోధించినట్టుగా ' ఈశ్వరానుగ్రహం ' అనగా ఏమిటి....?
ఈశ్వరానుగ్రహం అనగా అత్యంత పదునైన మేధోశక్తియే...!
బిల్వదళం ఒకవైపు ఈశ్వరుడిని స్పృశిస్తే జ్ఞ్యానం, మరో వైపు స్పృశిస్తే సకలవిధ ఐశ్వర్యం అని కద సద్గురువుల బోధ.....
అంటే దాని అసలైన అర్ధం భక్తిజ్ఞ్యానమే అసలైన ఐశ్వర్యం అని......
వాటితో ఎవ్విధమైన లౌకిక ఐశ్వర్యములనైనను మనిషి ఈశ్వరానుగ్రహంగా సృష్టించగలడు కాబట్టి.....
అది ఎల్లప్పుడు అందరికి అట్లే జ్యోతకమవ్వాలని ఏంలేదు......
ఈశ్వరుడి అనుగ్రహం ఉన్నవారికి అది గోచరం.....
అన్యులకు అది అగోచరం....
ఎందుకంటే వారికి తత్ జ్ఞ్యానరూపమైన ఈశ్వరానుగ్రహం ఇంకా లభించలేదు కాబట్టి.....
'జ్ఞ్యానసంపద ఉందంటావ్ కాని అందరికి కనిపించనవసరం లేదంటావ్......ఇదెట్లా కుదురుతుంది నాయనా.....నీది మరీ చాదస్తం కాకపోతే......'
అని కొందరంటారేమో.....
అందుకు ఒక చిన్న లౌకిక ఎగ్సాంపుల్ చెప్తా వినండి.....
రోజు న్యూస్ లో NSE / BSE పేర్లతో
"ఇన్ని కోట్ల స్టాక్ సంపద ఇవ్వాళ పెరిగింది......
అంత మొత్తంలో స్టాక్ సంపద ఒక్కసారిగా పడిపోయి ఇన్వెస్టర్లు లబో దిబో మని బాధపడుతున్నారు...."
అనే వార్తలను అందరు ఎప్పుడోఒకప్పుడు వినేఉంటారు కద.....
మరి ఆ స్టాక్ సంపద అంతా కూడా ఎక్కడ నిలువ చేసారు....??
అది "పడిపోయినప్పుడు" ఎవరి మీద పడింది....
"క్రిందికి పడిపోయినప్పుడు" ఎన్ని ముక్కలుగా అయ్యి పడింది...???
"అవేం ప్రశ్నలు బాబు....
స్టాక్ అనే భౌతిక సంపద ఉంటుంది కాని కరెన్సి నోట్ల లా కనిపించదు.....
" క్రిందికి పడుతుంది" కాని ఎవ్వరి మీదా పడదు....
It's not a tangible entity for you to make such allegations to say that it doesn't exist in the world...."
అనేది మీ సమాధానమైతే....
జ్ఞ్యానం, ఈశ్వరానుగ్రహము, బుద్ధి, సిద్ధి, ఇవన్నీ కూడా భౌతిక సంపదలే.....
కాని కనిపించవు.....అచ్చం మీ స్టాక్ సంపద లా....
They are not tangible entities for you to make allegations against....
Hence unless you understand about stock market you don't deserve making derogatory statements about that same.....
and so is the case with Lord, his blessings, his knowledge , his wisdom and all those intangible assets....that you fret over just because you don't yet possess a proper understanding of the same....😊
అందుకే శ్రీచాగంటి సద్గురువులు ఒక చక్కని మాట బోధిస్తుంటారు.....
ఈశ్వరుడు, ఈశ్వరానుగ్రహం అంటే ఏంటి....అని మీకు తెలియాలంటే....
ఈశ్వరుడిని ప్రార్ధించడం / అర్చించడం అనేదే అందుకు గల ఎకైక మార్గం....
కాబట్టి విశ్వవ్యాప్తమైన ఆ విశ్వనాథుడి వైభవం అర్ధమవ్వాలంటే కాశికి వెళ్లి శ్రీవిశ్వనాథుడిని సేవించడమే ఎకైక మార్గం....కద....😊
శ్రీకరమైన సకల సంపదలంటే అందరికి కావాలి కాబట్టి అంతవరకు బానే ఉంది...
మరి ఈశ్వరుడిని జ్ఞ్యానం కొరకు ప్రార్ధించడం ఎందుకు అంతగా ముఖ్యం అని అంటే.....
జ్ఞ్యానం లేకపోవడమే జీవితంలో శోకానికి మూలకారణం.....!
అంటే అన్ని రకాల బాధలకు జ్ఞ్యానలేమియే ముఖ్యకారణమై ఉంటుంది కాబట్టి సంపద కన్నా జ్ఞ్యానమే మరింతగా మనిషికి అత్యంత అవసరం......
పెద్ద పెద్ద విషయాల గురించిన పరిజ్ఞ్యానం లేకున్నను చిన్న చిన్న విషయాల గురించిన ఇంగిత జ్ఞ్యానం లేకపోవడం వల్ల వారి జీవితాలను వారే నరకతుల్యం గావించి వారి చుట్టు ఉన్న వారి జీవితాలను కూడా ఎంతో ఇబ్బందిగా మార్చి బాధిస్తుంటారు హద్దెగరని మూర్ఖత్వంతో.....
కాబట్టి మూర్ఖత్వమే ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సమస్య......
జీవితాలను నరకంగా మార్చే మూర్ఖులకు భగవద్ అనుగ్రహం వినా మరో ఔషధం లేదు....
మూర్ఖులకు మన, పర అనే భేదమేమి ఉండదు.....
మనవారైనా, పరాయివారైనా మూర్ఖులు మూర్ఖులే.....
వారిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఎట్ల డీల్ చేయాలో అట్లనే డీల్ చేయాల్సిఉంటుంది.....
( అతితెలివితో స్లెడ్జింగ్ చేస్తు ఇండియన్ హాకి జట్టు ని ఇబ్బంది పెట్టి ఓడిద్దామని అనుకున్న ప్రత్యర్ధులను,
వారి శైలిలోనే వారికి ధీటైన సమాధానం ఇచ్చేలా షారుక్ ఖాన్ టీం కి బోధ చేసి వారిని గెలిపించినట్టుగా.... )
లేకపోతే వారి మూర్ఖత్వంతో ఎందరో జీవితాల్లో అశాంతికి కారణమై, వీళ్ళు బ్రతికి ఎవరిని ఉద్ధరించేదిఉందికనక.....అని చుట్టూ ఉన్న వారు నిరంతరం చికాకు పడేలా బ్రతుకుతూ ఉంటారు.....
బురద ఎక్కడ ఉంటుంది...??
ఎక్కడో సహారా ఎడారిలో ఉండదు కద....
నీరు ఉన్న చోటే బురద ఉంటుంది....అవునా...
ఆ బురదను శుభ్రం చేయడానికి కావలసింది కూడా నీరే...!
అచ్చం ఇదే విధంగా...,
బుద్ధి గత ప్రాణులైన మనుష్యులకే మూర్ఖత్వం అనే మాట వర్తిస్తుంది......
మరలా అదే బుద్ధి
(అనగా సద్బుద్ధి తో ) మాత్రమే ఆ మూర్ఖత్వాన్ని తొలగించగలం......
"ఎందుకట్ల ప్రతీ చిన్న విషయానికి కూడా కుక్కలా మొరుగుతుంటావ్.....?
ప్రశాంతంగా మాట్లాడి చుట్టు ఉన్న వారిని ప్రశాంతగా ఉండనివ్వొచ్చు కదా.....ఎంత చెప్పినా ఎందుకంత మూర్ఖత్వం...?"
అని మీరు ఒక మనిషిని అడగగలరు కాని....
"ఓ కుక్కా....ఎందుకలా నువ్వు ఆ మనిషిలా మొరుగుతావ్ ఊర్కే.....ప్రశాంతంగా ఉండవా....."
అని మీరు ఒక కుక్క ని అడగగలరా...??
"హడి...హడి..." అని....ఒకసారి అదిలించి వదిలేస్తారు...
అది బుద్ధిగత ప్రాణి కాదు కాబట్టి....
అవునా....?
కాబట్టి ఈశ్వరుడిని జ్ఞ్యానం కోసం ప్రార్ధించవలసిన ఆవశ్యకత మనుష్యులకే ఉంటుంది....
శ్రీ చాగంటి సద్గురువుల గత దశాబ్దపు ప్రవచనాల్లో అలాంటి మూర్ఖులను ఎందరినో మనం చూడవచ్చు.....
1. " చాగంటి గారు మీరేమి అనుకోకపోతే మిమ్మల్ని
" అల్లుడు గారు " అని భావించి నా బాధ చెప్పుకుంటాను....." అని విలపించిన అత్తగారి గురించి వినలేదా...
" కొడుకు " అనే పదం కూడా పలకడం ఇష్టం లేనంతగా బాధించిన అటువంటి మూర్ఖులు లేరా....??
2. తల్లితండ్రుల ఆస్తి మొత్తం కాజేసి,
ముసలితనంలో ఉన్న అమ్మకు పట్టెడన్నం పెట్టడం కూడా బరువనిపించి అనాథాశ్రమం దెగ్గరి బస్టాప్లో వదిలేసి.....
" నేను ఇప్పుడే వస్తానమ్మ....ఇక్కడే ఉండు....."
అని చెప్పి.... అమ్మను అనాథాశ్రమానికి అప్పగించి తిరిగారాకపోవడం తో పిచ్చిపట్టి, రోజు ఆ బస్టాప్ కి వచ్చి....రోజంతా అక్కడే ఉండి.....
"నా కొడుకు ఇప్పుడే వస్తానని వెళ్ళాడు...."
అని ఆ అమ్మ జీవితమంతా బస్టాప్ లోనే దీనంగా జీవించడానికి కారణమైన మూర్ఖుడి గురించి మీరు వినలేదా....??
3. "ఈ ఆధునిక యుగంలో కూడా.....
ఈ దేవుడు, పూజలు, శాస్త్రము, పద్ధతులు, ఆచారాలు అని ఏంటి మీ చాదస్తపు జీవితం....
జీవితమంటే తినడం, తాగడం, తిరగడం ఎంజాయ్ చేయడం.....
అవన్ని వదిలేసి ఈ పాతకాలపు జీవితం ఏంటి...."
అని...,
త్రికాల గాయత్రితో జీవితాన్ని సుసంపన్నం చేసుకునే కుటుంబంలో జన్మించిన ఒక సద్బ్రాహ్మణోత్తముడిని
పెళ్ళిచేసుకొని,
ఆతని జీవితాన్ని మొత్తం భ్రష్టుపట్టించి
తాగుబోతు, తిరుగుబోతు గా మార్చి,
ఆఖరికి తన తల్లితండ్రులు గతించినప్పుడు వారికి కర్మకాండలు ఎందుకులే అని పట్టించుకోని హీనమైన స్థితికి అతడు దిగజారిపోయేలా చేసిన మూర్ఖురాలైన భార్య గురించి మీరు వినలేదా...??
ఇలా ఎందరెందరో వారి తీవ్రమైన మూర్ఖత్వంతో చక్కగా ఉండాల్సిన జీవితాలను అలా నశించిపోడానికి కారణంగా అవ్వడం మీరు వినేఉంటారు కద......
ఇక్కడ చెప్పబడిన మూర్ఖులు చదువుకోని వారా...??
సంపన్నులు కారా...?
బాగా ఇంగ్లీష్ వచ్చిన వారు కారా...?
మరి వారికి అంతటి మూర్ఖత్వం ఎక్కడిది....
అలా ఎలా తమవారి జీవితాలను తామే నశింపజేసారు....?
అంటే దానికి సమాధానం ఒక్కటే....
ఈశ్వరుడిని విస్మరించి బ్రతకడం అనే జాఢ్యం అంతటి మూర్ఖత్వానికి హేతువు....
సూర్యుడికి దూరమైన ప్రాంతం సహజంగానే
సకల అనారోగ్యాలకు నిలయంగా తయారవుతుంది...
అట్లే ఈశ్వరుడిని విస్మరించి బ్రతికే వారికి సహజంగానే
అన్ని జాఢ్యాలు ఎక్కువై చివరికి హద్దెరగని మూర్ఖత్వంతో అలా తాము బాధపడుతుంటారు.....
ఇతరులను బాధపెడుతుంటారు....
అదొక బ్రతుకా..... అనే అలోచన కూడా వారికి ఎన్నడు రానంతగా బ్రతికేస్తుంటారు.....
( ఇక్కడ నేను ఎవ్వరిని కూడా పర్సనల్ గా ఉద్దేశ్యించట్లేదని చదువరులకు మనవి.... అది వారి గ్రహగతుల ప్రభావమో....గృహగతి ప్రభావమో....మరెదైనా అయ్యుండొచ్చు......
కాని వారి మూర్ఖత్వం ఇతరుల జీవితాలను ఏవిధంగా గాయపరిచిందో చెప్పడం మాత్రమే నా
ఉద్దేశ్యం.....)
కొందరికి, కూతుళ్ల పెళ్ళి ఎట్లా అనే బాధలు.....
కొందరికి, ఎన్నో లక్షల ఫీజులు కట్టి చదివించినా సరే కొడుకులు తాగుబోతులు, తిరుగుబోతులై చేతికిరాకుండా పోయారే అనే బాధలు.....
కొందరికి, ఎంతో సంపద ఉన్నా తిన్న పట్టెడు మెతుకులు అరిగించుకోలేని బాధలు.....
కొందరికి తినడానికి పట్టెడు మెతుకులు దొరకట్లేదని బాధలు.....
ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బాధలు.....
కాని ఒక్కొక్కరు చూడండి.....పైన పేర్కొన్న ఎటువంటి బాధలు కూడా లేకున్నా సరే.....
హాయిగా కొడుకు చేతికి వచ్చి 3 పూటలా తినడానికి, ఉండడానికి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవించడానికి కావలసిన సకలసదుపాయాలు సమకూర్చిపెట్టినా సరే,
" అయ్యో....ఇంతమందికి ఇన్ని రకాల బాధలున్నాయే.....
ఈశ్వరుడి దయ వల్ల నాకు హాయిగా మూడుపూటలు తిని అది అరగడానికి అలా వాకింగ్ కెళ్ళి, వీలైన తేలికైన ఇంటి పనులు చేస్కుంటూ ఇంట్లోవారికి చేదోడు గా ఉండేలా బ్రతకాలి కాని.....
వాళ్ళకు నచ్చని విధంగా, పొగరుతో, అహంకారంతో, అతి వాగుడుతో, ఆరోగ్యాన్ని హరించే వ్యసనాలతో,
ప్రతి చిన్న విషయానికి కూడా కయ్యిమని ఎగబడుతు,
నిరంతరం అగ్గిమీద గుగ్గిలంలా విజ్ఞ్యులు మెచ్చని రీతిలో బ్రతుకుతూ,
60 ఏళ్ళకు దెగ్గరవుతున్న వయసుకు తగ్గట్టుగా నలుగురికి పెద్దమనిషిలా నాలుగు మంచి మాటలు సున్నితంగా చెప్తూ,
ఏ పూజలు చేయకపోయినా సరే రోజుకు కనీసం 3 సార్లు శ్రీరామ అని స్మరించి,
ఉన్నన్ని రోజులు చిరాకు కలిగించే ప్రవర్తనతో పిల్లలకు మానసిక అశాంతి కలిగిస్తు భారం కాకూడదనే ఇంగిత జ్ఞ్యానం కూడా లేకుండా మూర్ఖత్వంతో బ్రతుకును భారంగా ఈడ్చే వారు లేరని మీరు అనుకుంటున్నారా...?
ఇంతమందిని ఇన్ని రకాలుగా బాధించడానికి కారణమైన వారి మూర్ఖత్వానికి అసలు కారణం ఏంటి...??
ఈశ్వరుడి విస్మృతి.....!
ఈశ్వరుడి స్మరణమే జీవనం....
ఈశ్వరుడి విస్మరణయే మరణం....
కాబట్టి ఈశ్వరుడిని జ్ఞ్యానం కొరకు ప్రార్ధించవలసిన ఆవశ్యకత 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనిషికి మాత్రమే ఉంది......
"దుర్లభం మానుష జన్మం...." అని మన పెద్దలు చెప్పేది ఇందుకోసమే .....
అంతే తప్ప మనిషి జన్మ ఎత్తినంత మాత్రాన ఏదో గొప్పకార్యం సాధించినట్టు కాదు..
ఆ మనుష్య జన్మ వ్యర్ధమై పోకుండా ఉండడానికి ఈశ్వరుడిని జ్ఞ్యానం కొరకు నిరంతరం ప్రార్ధించవలసిందే.....!
మాతాచపార్వతీదేవి.....
పితాదేవోమహేశ్వరః......
బాంధవాః శివభక్తాశ్చ...
స్వదేశోభువనత్రయం.....
ఓం శాంతిః శాంతిః శాంతిః.....🙏
No comments:
Post a Comment