శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు.....
తెలుగు సిని జగత్తులో ఆ పేరు తెలియని వారు ఉండరనేది ఎల్లరికి తెలిసిన విషయమే.....
అది వారి కలం నుండి జాలువారిన సాహితీ ఝరిని పాటల రూపంలో ఆరాధించే ప్రేక్షకులైనా సరే....
వారితో ఆ పాటలు రాయించి తమ సినిమాలను ఈ సినిసంగీతసాహిత్య లోకంలో అజరామరంగా
నిలిపిన సంగీత / సినిమా దర్శకులైనా సరే.....
నిలిపిన సంగీత / సినిమా దర్శకులైనా సరే.....
అక్షరం అంటే శాశ్వతమైన శక్తి అనడానికి చక్కని ఉదాహరణగా, శాశ్వతంగా అభిమానలోకానికి అందిన అమరసాహితీ రసగులికలు శ్రీ వేటూరి గారి కవనకలికలు....
తెలుగు సినిసాహితీజగత్తును 3 తరాలుగా విభాగించాలంటే,
నెనైతే వాటిని....,
వేటూరి గారి ముందు ఉన్న సాహిత్య ఒరవడి...
వేటూరి గారి సాహిత్య ఒరవడి....
వేటూరి గారి తర్వాత ఉన్న సాహిత్య ఒరవడి...
అని అంటాను......
అంతటి ఘనమైన రీతిలో తమ సాహిత్య నృత్యం అనే బృహత్ యజ్ఞ్యాన్ని సల్పిన సారస్వతమూర్తులు శ్రీ వేటూరి గారు....
వారి గొప్పదనం గురించి ఒకే ఒక్కమాటలో చెప్పాలంటే అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువులు, వేటూరి గారు రచించిన
"శంకరా నాదశరీరాపరా...."
అనే గీతం గురించి ఎంతో గొప్పగా వారి ప్రవచనాల్లో చాలా సార్లు ఉటంకించారు.....
"శంకరా నాదశరీరాపరా...."
అనే గీతం గురించి ఎంతో గొప్పగా వారి ప్రవచనాల్లో చాలా సార్లు ఉటంకించారు.....
ఇదొక్కటి చాలు శ్రీ వేటూరి గారి గంభీరమైన అనన్యసామాన్యమైన సాహిత్య ప్రతిభ గురించి ఏదైనా మాట్లాడాలంటే.....
మరియు శ్రీ సిరివెన్నెల గారు తమను ' పద్మశ్రీ ' పురస్కారం వరించినప్పుడు ఎంతో వినమ్రంగా
" ఈ పురస్కారం ఎప్పుడో శ్రీ వేటూరి గారికి దక్కవలసినది....
వారి అనుగ్రహంతో ఇప్పుడు నాకు లభించింది...."
అని పలకడంలో, తెలుగు సినిసాహితీ జగత్తును ఒక సద్గురువుల స్థానంలో ఉండి అనుగ్రహించిన అపర వాచస్పతి శ్రీ వేటూరి గారు అని ఈ లోకానికి చాటి చెప్పారు ఇప్పటి సాహితీ సార్వభౌములైన సిరివెన్నెల గారు....

ఈ సాహితీ లోకాన్ని ఏలిన మకుటం లేని మహారాజులు ఎందరెందరో గలరు....మరియు ఇంకా ఎందరెందరో వస్తూనే ఉంటారు.....
కాని వారందరికి కూడా ఎప్పటికీ ఆరాధ్యదైవమై, తెలుగు సినిసాహితీ లోకానికి శాశ్వతమైన చక్రవర్తులు గా అలరారే అనుపమ మేరుశిఖరాగ్ర స్థిత
సాహితీస్రష్ట శ్రీ వేటూరి గారు.....!
సాహితీస్రష్ట శ్రీ వేటూరి గారు.....!
వారి హస్తంలోకి ఆ సిద్ధ కలం అలా ఒదిగిందా....లేదా వారి సిద్ధ హస్తంలోకి ఒదిగిన కలం అలా సాటిలేని పదునైన పదగుంభనప్రభంజనంతో దూసుకువెళ్ళిందా అని చెప్పడం కష్టమే.....
ఎందుకంటే వారి కలం నుండి జాలువారిన ఆ అక్షరఝరులు నవరసాల్లో ఒలికించని రసంలేదు....
ఆ నవరసభరిత సాహితీ గులికళను వీణులవిందుగా
సేవించి వాటి సాహిత్య సుమ సౌరభాలను ఆస్వాదించిన ప్రేక్షకుల హృదయ సీమలను స్పృశించని గీతం లేదు.....
సేవించి వాటి సాహిత్య సుమ సౌరభాలను ఆస్వాదించిన ప్రేక్షకుల హృదయ సీమలను స్పృశించని గీతం లేదు.....
ఇలాంటి పుంభావసరస్వతీ స్వరూపుల సాహిత్య భరిత సరాగాలను విన్నప్పుడు నేనైతే అప్పుడప్పుడు అనుకుంటాను....
" లలిత ప్రవచనాలలో లో శ్రీ చాగంటి సద్గురువులు అమ్మవారి వాగ్వైభవం గురించి వివరిస్తూ......ఒక మాట చెప్పారు కద..
' శ్రీ లలితాపరమేశ్వరి అమ్మవారు ఒక్క మాట మాట్లాడగానే, సరస్వతి అమ్మవారు వెంటనే కచ్ఛపి అనే తన వీణని...
' ఇక నువ్వు మోగింది చాల్లే...అక్కడ ఆదిపరాశక్తి యొక్క వాగ్వైభవం ముందు నువ్వు మ్రోగడం ఎందుకు....'
అని ఆ వీణని కాసేపు పక్కనపెట్టడంతో....
' ఇక నువ్వు మోగింది చాల్లే...అక్కడ ఆదిపరాశక్తి యొక్క వాగ్వైభవం ముందు నువ్వు మ్రోగడం ఎందుకు....'
అని ఆ వీణని కాసేపు పక్కనపెట్టడంతో....
ఆ వీణ సూక్ష్మరూపాన్ని ధరించి భూలోకంలో కొద్ది సేపు నా సంగీత శక్తిని సాహిత్య శక్తిగా ప్రకటించి ఆ సాహితీ సరగాలు చిరకాలం భూలోక వాసుల హృదయాల్లో నిరంతరం ప్రతిధ్వనించేలా నా శక్తిని మర్త్యలోకవాసులకు అందించి వస్తాను అని శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారి రూపంలో వచ్చి వెళ్ళిందేమో......"
అని
అని
వారి అమరసాహితీ ఝరిని అరాధించే వారెవరైనా సరే అట్లే భావిస్తారు అనడం కద్దు....కద...😊
" మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..
శంకరా... నాదశరీరా పరా...వేదవిహారా హరా జీవేశ్వరా..."

అని సాటిలేని విధంగా భక్తి రసాన్ని ఒలికించినా అది వేటూరి గారికే చెల్లింది...
" కడలికి అలలకు కథకళి కళలిడు - శశికిరణము వలె చలించవా........
ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున. "
ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున. "
అని సుమధురంగా శృంగార రసాన్ని ఒలికించినా అది వేటూరి గారికే చెల్లింది...
"అనగల రాగమై తొలుత వీనులలరించి.. అనలేని రాగమై మరలా వినిపించి మరులే కురిపించి..
జీవన రాగమై బృందావన గీతమై.. ఆ.. జీవన రాగమై బౄందావన గీతమై..
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి.. ఇదేనా.. ఇదేనా ఆ.. మురళి..
వ్రేపల్లియ యెదఝల్లున పొంగిన రవళి.. నవరస మురళి.. ఆ నందన మురళి...
ఇదేనా.. ఇదేనా ఆ మురళి.. మోహన మురళి....."

అని ఎంతో గంభీరమైన భావుకతతో శాంత రసాన్ని ఒలికించినా అది వేటూరి గారికే చెల్లింది...
" ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
నేను మేననుకుంటె ఎద చీకటే హరీ.....
వేణువై వచ్చాను భువనానికి......
గాలినై పోతాను గగనానికి....."
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
నేను మేననుకుంటె ఎద చీకటే హరీ.....
వేణువై వచ్చాను భువనానికి......
గాలినై పోతాను గగనానికి....."
అని ఎంతో తీవ్రమైన వైరాగ్య భావనను ఒలికించినా అది వేటూరి గారికే చెల్లింది...
" వెన్నెల్లో గోదారి అందం
నది కన్నుల్లో కన్నీటి దీపం
అది నిరుపేద నా గుండెలో
చలి నిట్టూర్పు సుడిగుండమై
నాలో సాగే మౌన గీతం...."
నది కన్నుల్లో కన్నీటి దీపం
అది నిరుపేద నా గుండెలో
చలి నిట్టూర్పు సుడిగుండమై
నాలో సాగే మౌన గీతం...."
అని ఎంతో లోతైన నిర్వేదంతో శోకరసాన్ని ఒలికించినా సరే అది వేటూరి గారికే చెల్లింది...
ఇలా వందలకొలది గీతాల్లో వారు ఉపయోగించినన్ని అసాధరణ ఉపమాన ఉపమేయాలు
మరెవ్వరికి తట్టి ఉండవని నా అభిప్రాయం.....
మరెవ్వరికి తట్టి ఉండవని నా అభిప్రాయం.....
అందుకే వారు శ్రీ వేటూరి గారి గా సుప్రసిద్దినొంది,
వేవేల హృదయాల్లో కొలువైన సాహితీసీమలను నిరంతరం తమ అసామాన్యమైన గీత లహరుల్లో ఒలలాడిస్తూ ఎల్లరికీ ఎంతో గౌరవభావనతో ప్రీతిపాత్రులైన రసహృదయ రచయితలైనారు.....
వేవేల హృదయాల్లో కొలువైన సాహితీసీమలను నిరంతరం తమ అసామాన్యమైన గీత లహరుల్లో ఒలలాడిస్తూ ఎల్లరికీ ఎంతో గౌరవభావనతో ప్రీతిపాత్రులైన రసహృదయ రచయితలైనారు.....
వారి సాహిత్యం ఈ లోకంలో వినిపిస్తున్నంతవరకు,
తెలుగు భాష యొక్క వైభవం దశదిశలా విహరిస్తూనే ఉంటుందనడం వారి అభిమానులందరి హృదయమౌన గీతం....😊
తెలుగు భాష యొక్క వైభవం దశదిశలా విహరిస్తూనే ఉంటుందనడం వారి అభిమానులందరి హృదయమౌన గీతం....😊
దశాబ్ద క్రితం మనందరిని వదిలి అమరలోకానికి తరలిన ఇంతటి అపర వైరించి శక్తి మళ్ళీ ఏదో ఒక నామరూపంతో ఈ తెలుగునేలపై ప్రభవించి తెలుగు భాషా భారతికి నిరుపమాన సాహితీ సుమార్చన గావించి ఎల్లరికీ ఆనందం కలిగించుగాక....😊
ఓం శాంతిః....శాంతిః....శాంతిః... ! 🙏
No comments:
Post a Comment