దశహర / దసర....
దశ అనే శబ్దానికి రెండు అర్ధాలు ఉన్నాయి...
10 మరియు స్థితి...
"దశదిక్కులు అనగా పది దిక్కులు...."
అన్నప్పుడు అది సంఖ్యను సూచిస్తుంది....
"ఇది ప్రాజెక్ట్ యొక్క తొలిదశ...
మలిదశ గురించిన విషయాలు త్వరలో చర్చిస్తాము..."
అన్నప్పుడు అది స్థితిని సూచిస్తుంది....
కాబట్టి దసర / దశహర అనే పండగలోని అసలైన ఆంతర్యమేమి...?
అనే దిశగా జిజ్ఞ్యాసువులకు ఎప్పుడో ఒకప్పుడు సందేహం వచ్చే ఉంటది...
దశహర అనగా దశ ను హరించునది...
అనగా ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి
జీవుడి గమనాన్ని వ్యవస్థీకరించునది అని సామాన్యార్ధం....
మన జీవితాన్ని సరిగా గమనిస్తే అది కేవలం దశ ఇంద్రియాల ఆట....
5 కర్మేంద్రియాలు+5 జ్ఞ్యానేంద్రియాలు=10 ఇంద్రియాలు
వీటితో నిత్యం అనుసంధానం చెందే
మనసు మరియు వీటన్నిటిని తన అధీనంలో ఉంచుకునే బుద్ధి...
ఫర్ ఎగ్సాంపుల్.....
నోరు / నాలుక అనే ఇంద్రియం తో...
ఒక వ్యక్తి అధికశాతం దైవ నామస్మరణ గావిస్తూ లేక చక్కని ఉపయుక్తకరమైన విషయాల గురించి ప్రస్తావిస్తు దైవప్రసాదం, మరియు శుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం తింటూ
ఒక పద్ధతిగా జీవిస్తూ, ఇతరుల జీవితాలకు ఆదర్శమైన జీవనం సాగించడంతో ఆ భగవద్ ప్రసాదితమైన ఇంద్రియాన్ని చక్కగా వినియోగించుకొని తరిస్తున్నాడు.....
ఒక నికృష్టుడు, నిత్యం దరిద్రాన్ని తాగుతూ, దరిద్రపు పొట్లాలు నములుతూ, తన శరీరాన్ని, జీవితాన్ని, తానే పాడుచేసుకుంటూ, చుట్టూ ఉండే ఇతరుల జీవితాలకు ఇబ్బందికరంగా జీవిస్తూ, ఎప్పుడూ దరిద్రపు సొల్లువాగుడు వాగుతూ, పనికిరాని విషయాల గురించిన వాటితో కాలాన్ని వృధా గావిస్తూ, భూమికి భారంగా ఉండే వీడు ఎప్పుడు సస్తడో ఏమో అనేలా ఇతరులచే నిత్యం దూషింపబడుతూ జీవించడం...
సొ ఇక్కడ గమనిస్తే, ఈశ్వరుడు ఇద్దరికీ ఇచ్చింది కూడా ఒకేలా ఉండే నోరు/నాలుక అనే ఇంద్రియం...
ఒకరు ఆ ఇంద్రియంతో యావద్ జన్మపరంపర తరించే దిశగా జీవితాన్ని సార్ధకపరుచుకుంటున్నారు..
ఒకడు తా చెడి ఇతరులను కూడా చెడగొట్టేలా బ్రతుకును తద్వారా యావద్ జన్మపరంపరను పాడుచేసుకుంటూ జీవిస్తున్నాడు...
సొ ఒకే ఇంద్రియం ఒకరు ఒకలా వాడి తరిస్తునారు...
ఇంకొకరు ఇంకొకలా వాడి చెడి సస్తున్నారు...
కాబట్టి ఇంద్రియం ఒక్కటే...కాని
ఒకరికి జీవితంలోని అలక్ష్మిని హరించింది....
ఇంకొకడి జీవితంలోని లక్ష్మిని హరించింది....
ఇవ్విధంగా
దశ ఇంద్రియాలు ఒక వ్యక్తి యొక్క యావద్ జీవితంలోని అలక్ష్మిని హరించడమా...లేక లక్ష్మిని హరించడమా...అనేది సదరు వ్యక్తికి ఆ ఇంద్రియం యొక్క వాడుకపై గల అదుపాజ్ఞ్యలపై ఆధారపడిఉండే విషయం....
శ్రీ చాగంటి సద్గురువులు వివిధ ప్రవచనాల్లో వివరించినట్టుగా ...
ఒక వ్యక్తికి ఒక ఫలం ( మామిడి పండో, జాంపండో, అలా ఏదో ఒకటి)
తినడం అంటే చాలా ఇష్టం.....
కాని అతిగా తింటే శరీరానికి ఇబ్బంది...
సొ మొత్తం పండు తిని వాయ్యొ వామ్మో అంటూ ఆతరువాత గుండెలు బాదుకోవడమా లేక ఒక చిన్న ముక్క తిని మొత్తం పండులో ఉన్నది కూడా ఇదే పదార్ధం కద....కాబట్టి ఈ చిన్న ముక్క తినేసి మొత్తం పండు తిన్నట్టే అనుకుంటే సరిపోతది కద....
అనే స్థాయిలో జిహ్వేంద్రియం పై పట్టు గల వ్యక్తి తనపై తాను సంపూర్ణ ఆజమాయిషితో జీవించగలిగే స్థితప్రజ్ఞ్యుడై జీవించి తరిస్తున్నాడు...
కాబటి దశేంద్రియాలను మన అధీనంలో ఉండేలా జీవిస్తూ వాటి ఉద్ధతిని హరిస్తూ మనం తరిస్తున్నామా...
లేదా దశేంద్రియాలు మనల్ని వాటి అధీనంలోకి తీసుకొని మన జీవితాన్ని అవి హరిస్తున్నాయా...
అనేదే ఎవ్వరికైనా జీవితసారం...
దసర / దశహర పండగకు ఆదిపరాశక్తి దుర్గమ్మ పూజ గావించడం అంటే...
దుర్గతిని భంజించునది దుర్గ..
అనగా దుర్గమ్మ వారి ఆరాధనానుగ్రహంతో ఇంద్రియాలను ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు ఎంత వరకు ఉపయోగించుకోవాలో అలా వాటిని నియత్రించగలిగి ఉండే శక్తియుక్తులను కటాక్షించే
ఈశ్వరానుగ్రహమును ప్రసాదించే పర్వదినము ఈ దసర / దశహర శరన్నవరాత్రోత్సవ సమయం...
అమ్మవారికి " నియంత్రి నిఖిలేశ్వరి "
అనే పేర్లు లలితాపారాయణంలో చదివే వుంటారు కద...
ఇవ్వాళ విజయదశమి / 10 వ రోజున, శ్రీరాజరాజేశ్వరి అలంకారంతో రాజాధిరాజులపై కూడా ఆధిపత్యాన్ని కలిగిఉండే నిఖిలేశ్వరి తత్త్వం తో అమ్మవారు దేదీప్యమానంగా వెలిగే రోజు....
అని చెప్పడం లౌకికం...
దశేంద్రియాలను తమ తమ నిర్నీత లౌకిక / వర్ణాశ్రమానుగుణమైన కార్యకలాపాలు నిర్వహించేలా వాటిపై సదరు వ్యక్తికి సంపూర్ణ ఆజమాయిషిని అనుగ్రహించి తద్వారా
తన శరీరాన్ని / అనగా దశేంద్రియాలను తాను ఒక రాజులా శాసించుకోగలిగే పరిణతను, దక్షతను, ప్రసాదించే ఆంతరమైన ఈశ్వరి అధ్యాత్మ తత్త్వమే శ్రీరాజరాజేశ్వరి తత్త్వం....
అని చెప్పడం ఆధ్యాత్మికం...
తనని తాను రాజు లా శాసించుకోగలిగిన వ్యక్తి ఏనాటికైనా లోకాన్ని సైతం శాసించే వ్యక్తిగా ఉన్నతిని పొందగలడు అనేది జగద్విదితమైన సత్యం....
ఈ దసరా / దశహర పండగ, ఎల్లరి జీవితాలను ఈశ్వరనుగ్రహంగా చక్కని దశపొందే దిశగా సార్థకపరిచి, సంతోషదాయకమైన ఉత్సవం గా శోభిల్లు గాక అని...
వేములవాడ శ్రీరాజరాజేశ్వరి సమేత శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఎల్లరికీ 2021-దసరా శుభాభినందనలు......😊💐🍨🍕
No comments:
Post a Comment