1. మీరు నాముందు ఎంత అమాయకంగా నటిస్తున్నారో నేను కూడా అంతే అమాయకంగా నటించగల దిట్టను...
2. మీ ఓర్వలేని తనంతో నా కుటుంబ సభ్యులను ఎన్ని కష్టాలకు గురిచేసారో మీకు తెలుసు.. నాకు తెలుసు.. ఆ దేవుడికి కూడా తెలుసు...
ఇంత చేసి ఇప్పుడు మళ్ళీ నాకు భగవద్ ప్రసాదంగా లభించే సొమ్ముపై కన్నేసి మింగుదామని చూస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదు...
3. వయసు మీరుతున్న పెద్దవాళ్ళను అడ్డుపెట్టుకొని వారికి ప్రశాంతత లేకుండా చేస్తూ నా సొమ్మును దోచి పెట్టమని వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఆపండి...
4. నా సొమ్మును మీరు మింగినట్టుగా నాకు తెలిస్తే మాత్రం తర్వాత పరిణామాలు చాల తీవ్రంగా ఉంటాయి...అది మీ దినాల కూడు మీరే మెక్కినదానితో సమానమై పరిణమించి తీరుతుంది....ఇది తథ్యం...
5. నా అంతరంగాన్ని వేధించే ప్రశ్నలకు సమాధానం లభించేంత వరకు, లభించిన తదుపరి నన్ను ఓర్వలేని వారి పీడ వదిలించుకునేంతవరకు, ఎవ్వరితోనైనా మౌనంగా ఉండే హక్కు నాకు కలదు.....
మాటల కంటే ఎంతో గొప్పదైన మౌనం లోనే నా ప్రశ్నలన్నింటికీ నేను సమాధనాం వెతుక్కుంటా....
నా మౌనాన్ని ప్రశ్నించే అవసరం కాని, అర్హత కాని, అధికారం కాని ఎవ్వరికి ఉండవు...ఉండబోవు....
6. మీ పసిపిల్లలను ఎవరైనా హింసిస్తే మీరు ఊకుంటరా..?
మరి నేనెందుకు ఊకుంటననుకుంటున్రు...??
కాబట్టి అతితెలివి తగ్గించుకొని
నా సొమ్ముకు, నా వారికి, నా అభివృద్దికి దూరంగా ఉండి సావండి...
శత్రువులపైకి మిస్సైల్ ని సంధించి వారిని సమూలంగా హరించి వేయడానికి పెద్దగా ఆలోచించనవసరం లేదు...
కాని ఆ దాడిలో, గురి ఎగ్సాక్ట్ గా లక్ష్యాన్ని మాత్రమే ఛేదించి, ఇతరులు ఇబ్బందికి గురికాకుండా సంధించగలగడమే ముఖ్యమైన విషయం...
లేనిచో ఎంతో విలువైన శస్త్రాస్త్ర సంపద వ్యర్ధమైపోవడం మరియు అమాయకులు ఇబ్బందులకు గురికావడం అనే అవాంఛనీయమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఆ యోద్ధుడి లక్ష్యం గురితప్పినట్టే అవుతుంది....
అందుకే నేను చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ నా ఎగ్సాక్ట్ టార్గెట్స్ ఎవరెవరు అనే స్పష్టత నాకు రూఢంగా లభించినతదుపరి మాత్రమే నా సమాధానం ఇవ్వడానికి నేను మౌనాన్ని ఆశ్రయించి ఉండడం...
నా మౌనాన్ని నా తక్కువతనంగా భావిస్తే మాత్రం మీరు భవిష్యత్తులో భారిగా భంగపడడం తథ్యం...
గొప్ప గొప్ప సదువులు సదవడం, కొలువులు జేయడం గొప్ప కాదు....
సంస్కారవంతమైన మనిషిగా జీవించడమే మనిషిజన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం....
అడవిలోని కౄర మృగాలలా
పసిపిల్లల ఉసురు పోసుకొనే పాపిష్టి బద్మాష్ బాడ్ఖవ్లను, మృగాలను ఎట్ల డీల్ చేయ్యాలో అట్లనే డీల్ చేస్తరు....
రెండు కోతులు, ఒక పిల్లి, ఒక చపాతిని కోతులకు పంచడంలో ఎక్కువ తక్కువలు ఉన్నయంటూ మెల్లమెల్లగా మొత్తం చెపాతి ఆ దొంగ పిల్లే నొక్కి తినడం... అనే చిన్ననాటి కథ ఒకటి గుర్తుండే ఉంటుంది....
అట్లాగ, నాకు సహాయం చేసే వారి వద్దకు పిల్లిలా దూరి నా సొమ్మును మింగాలని చూస్తే మాత్రం బద్మాష్ నకరాల దొంగ పిల్లిలాంటి మీ జీవితాలపైకి ఎప్పుడు ఏ సమయంలో కాలభైరవుడి లాంటి జెర్మన్ షెప్పర్డ్ ని ఉసిగొల్పాలో అట్లే చేసి మీకు తగు సమాధానం ఇచ్చి తీరుతా...
నా ఆగ్రహజ్వాలల్లో ఆహుతవ్వడానికి
అగ్నిపర్వతం లాంటి నన్ను అనవసరంగా
ఇబ్బంది పెట్టకండి....మనుషులుగా బ్రతికి సావండి...
( నేను ఇక్కడ ఎవ్వరినీ కూడా స్పెసిఫిక్ గా సంబోధించలేదు / ట్యాగ్ చెయ్యలేదు కాబట్టి ఇక్కడ నన్ను ప్రశించే / విమర్శించే అవసరం ఎవ్వరికీ ఉండదు...)
No comments:
Post a Comment