(కేరళ శ్రీధర్మశాస్తా అయ్యప్ప స్వామి వారి ఆలయం ఇంక్లూడ్ చేయడం మరిచారు అనుకుంటా...)
ఇన్ని చోట్ల ఇన్ని వింతలతో విశేషాలతో దైవం కొలువై ఉన్నా దేవుడెక్కడ ఉన్నాడు అని అనే కొందరి మౌఢ్యానికి ఎన్ని సమాధానాలు ఇచ్చినా అవి బుర్రకెక్కవు...
ఎందుకంటే
"నేను సూర్యోదయం నుండి చూస్తూనే ఉన్నా...నాకు సూర్యుడు తప్ప ఆకాశంలో మరే తారాలు కనిపించడంలేదు...కాబట్టి అసలు వివిధ రీతుల వెలుగే తారలు అనేవి లేనే లేవు...."
అని అనే మూర్ఖుడికి....తారల అద్భుతాలను దర్శించవలసింది చంద్రోదయం నుండి అని తెలియదు కాబట్టి ఏదో అట్లా వాగుతాడు....
అత్యంత బలీయమైన సూర్యుడు వెలిగే సమయంలో తారలను దర్శింపలేము అనే సత్యాన్ని ఇంకా ఎరుకలోకి తెచ్చుకోలేదు కాబట్టి సదరు వ్యక్తికి తారాలను దర్శించే రీతి సరిగ్గా తెలియదు అని సరిపెట్టుకోవాలి కాని అటువంటి వాడు వాగినవి విజ్ఞ్యాన భాష్యాలు, హేతువాద సందేశాలు అంటూ వంతపాడడం మూర్ఖుడితో వాదించడం వంటిది...
"నిప్పు మెరుస్తుంది కాని ముట్టుకుంటే ఏం కాదు తెలుసా...కావాలంటే ఇద్దరం ముట్టుకొని చూద్దాం ఓకేనా..? "
అని వాదించే మూర్ఖుడితో బుద్ధిగలవాడైతే ఏమనాలి..?
"ముందు నువ్వు ముట్టుకోరా...నీకు కాలకుంటే చెప్పు..అప్పుడు నేను కూడా ముట్టుకుంటా ఓకే నా.." అని అనాలి..
అంతే కాని గంగిరెద్దులా తలూపి మూర్ఖుడితో కలిసి నిప్పుల్లో చెయ్యి పెడితే ఎమైతది..??
ఏమవ్వాలో అదే ఐతది..కద...
అదే విధంగా....
"తారలను దర్శించగల శక్తి మనకు సూర్యుడు అస్తమించిన తదుపరి మాత్రమే సమకూరుతుంది... కాబట్టి అప్పటి వరకు ఎన్నెన్నో రీతుల వెలిగే తారలు ఉంటాయి అని చెప్పిన మన సద్వర్తనులైన పెద్దల మాటను విశ్వసించు...
ఆ తర్వాత సమయం అసన్నమైన తదుపరి వినువీధిలో సంభ్రమాశ్చర్యకరమైన ఖగోళ వింతల్లో ఒకటైన తారల తళుకులను కళ్ళారా దర్శించి తరించు....."
అని చెప్పవలసి ఉంటుంది....
ఇదే విధంగా ఒక్కో చోట ఒక్కోలా ఆశ్చర్యకరమైన రీతిలో దైవం తన ఉనికిని వ్యక్తపరుస్తూ అనుగ్రహిస్తుంటుంది...
1. అని త్రికరణశుద్ధిగా విశ్వసించడం ఉపాసనలోని మొదటి స్థాయి...
2. మన విశ్వాసాన్ని భక్తిగా, ప్రపత్తిగా, శరణాగతిగా మలిచి ఆ విశ్వసించిన దైవం యొక్క అనుగ్రహానికి పాత్రతను సమకూర్చుకోవడం రెండో స్థాయి.....
3. సదరు జీవుడిలో సర్వేసర్వత్రా పరివ్యాప్తమై ఉండే సహజమైన, బలీయమైన అజ్ఞ్యాన లంపటం క్రమక్రమంగా లయించిన తదుపరి ఉదయించే జ్ఞ్యాన భూమికపై ఆ భగవద్ దర్శనం, అనుగ్రహం లభించి తరించడం మూడవ స్థాయి...
4. లభించిన భగవద్ అనుగ్రహాన్ని, అనుభూతులను ప్రోదిగావిస్తూ ఉన్నతమైన జన్మలవైపునకు జీవుడి గమనం సాగేలా ఈశ్వరుడి నిరంతర కృపను అపేక్షిస్తూ జీవించడం నాలుగవ స్థాయి..
5. అటువంటి ఈశ్వరచింతనాభరిత జీవితంలో ఏదో ఒక జన్మలో ఏదో ఒక సమయంలో ఆ ఈశ్వరుడు మనల్ని తనలోకి స్వాగతించి మన ఇష్టానుగుణంగా
సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య
మోక్షాన్ని అనుగ్రహించి మన జీవపరంపరకు శుభంకార్డు ప్రసాదిస్తాడు...అనే సత్యాన్ని దర్శించేంతటి స్థాయికి చేరుకోవడం 5వ స్థాయి...
" పంచాద్రీశ్వర మంగళం
హరిహర ప్రేమాకృతే మంగళం
పింఛాలంకృత మంగళం
ప్రణమతాం చింతామణే మంగళం
పంచాస్యధ్వజ మంగళం
త్రిజగదాం ఆద్య ప్రభో మంగళం
పంచాస్త్రోపమ మంగళం
శృతిశిరోలంకార సన్మంగళం "
అని ఈ కలియుగ వరిష్ఠ వరదైవం అయ్యప్ప స్వామివారి 'హరివరాసనం' చివర్లో యేసుదాసు గారి అమృతగళంలో ఆలపించబడే మంగళవచనాలను గమనిస్తే...
5 జ్ఞ్యానేంద్రియాలు + 5 కర్మేంద్రియాలు
+ 5 తన్మాత్రలు + మనసు + బుద్ధి + అహంభావము = 18
( 'అహంభావమూ అనగా అహం స్ఫురణ అనగా జీవ భావము.. అంతే గాని మనం సాధారణంగా ఇతరులను మాటలు అనడానికి ఉపయోగించే 'అహంకారం/అహంభావం' అనే పదం ఇక్కడ అన్వయం అవ్వదు...
( ఫర్ ఎగ్సాంపుల్
" ఒరెయ్ వాడికెంత అహంభావమో/అహంకారమో తెలుసారా...నేను ఇంత తోప్ అయినా నన్ను దేకడు వాడు..." ) అనేలా వాడుకలో మనం ఉపయోగించే అర్ధం కాదని ఇక్కడ నా అభిమతం...😊)
"ఈ 18 సహజమైన ప్రాకృతిక అంశాలను, నా పదునెట్టాంపడి / 18 బంగారు మెట్లను అధిరోహించే సమయంలో వాటివద్ద ఒక్కొకటిగా లయింపజేస్తూ,
శిరస్సుపై ధరించిన ఇరుముడులను పదిలంగా నా వద్దకు చేర్చు....
అనగా నీ మస్తిష్క మండలంలోని
జీవాత్మ / పరమాత్మ అనే ఇరు తత్త్వాలను నాలో ఐక్యం గావించి నీ యాత్రను పరిపూర్ణం గావించు....
"
అని భక్తులకు తన అనుగ్రహ సందేశాన్ని ప్రసాదించే అయ్యప్ప స్వామి వారి ఆరాధనా / పడిపూజను మీరెప్పుడైనా గమనించి ఉండిఉంటే.....
5 కొండలపై కొలువైన అయ్యప్పస్వామిని దర్శించడం అనేది భౌతిక సందేశం....
ఈ 5 స్థాయిల్లో సాధన సాగిన నాడు
ఒకనాడు నిజంగా ఆ హరిహరాత్మజం లోకి మన ఆత్మ గమించి మన జీవ యాత్ర పరిపూర్ణమై
"న ఇతి...న ఇతి...నేతి...నేతి..."
అని శ్రీచాగంటి సద్గురువులు వివరించే పరమాత్మ తత్త్వం ఒకనాడు
" " తత్ త్వం అసి " / "అది నీవై ఉన్నావు" " అని మనకు ఆ పరంజ్యోతి తత్త్వం ఎరుకలోకి వస్తుంది అనేది నా విశ్వాసం....
శబరిమలై లో ఆ యోగపట్టవిరాజిత హరిహర తేజోమూర్తి ఎవ్విధంగా భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తాడో తెలియదు కాని....
మా కూకట్పల్లి ఏరియాలోని
కీ.శే. || శ్రీ వడ్డేపల్లి నరసింగ్రావ్ గారు నెలకొల్పిన అయ్యప్ప స్వామివారి దేవాలయంలో కార్తీకమాసం లో జరిగే పడిపూజా మహోత్సవంలో
ఒక్కొక్క పడిమెట్టుపై వెలిగించే కర్పూర వెలుగుజిలుగులు అన్నీ ఏకమై 18 వ మెట్టు పైగల కర్పూర జ్యోతి వెలిగిన మరుక్షణం "స్వామియేయ్ శరణమయ్యప్ప....హరిహరసుతనేయ్ శరణమయ్యప్ప..." అనే భక్తుల శరణుఘోషల మధ్య దర్శనం ప్రసాదించే ఆ జ్యోతిస్వరూపుణ్ణి దర్శించడంలో ఉండే తన్మయత్వం ఎంత వర్ణించినా చెప్పనలవికానిది....
ఇరు శ్రీగిరులనుండి ( తిరుమల, శ్రీశైలం ) హరిహర తేజస్సులు ఒక్కసారిగా ఈ అయ్యప్పస్వామివారి లోకి ప్రవేశించి దర్శనం ప్రసాదిస్తున్నాయా అనేంతటి అలౌకిక ఆధ్యాత్మిక ఆనందామృతఝరిలో మనసు లయమై దివ్యమణిసంఘాతకాంతి పుంజంలా ధగ ధగ మెరుస్తూ ఉండే ఇక్కడి శ్రీశబరీగిరీషుడి దర్శనం
మాటలకందని మౌనయోగం...!!
ఈ కరోనా పూర్తిగ ఎప్పుడు పోతదో ఏమో...
కార్తీక మండలపూజల్లో ఆ మోహినీ సుతుడి మహోజ్జ్వల సందర్శనాభాగ్యం ఈసారి ప్లవనామ సంవత్సర
పాండ్య రాజకుమారుడి పడిపూజల్లో భక్తులకు లభించుగాక..!
*******
https://www.facebook.com/141931433127089/posts/638110500175844/
*సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు*:
=================================
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.
*నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:*
=================================
1. మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా
*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు*.
=================================
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,
3. మంజునాథ్.
*శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్
సముద్రమే వెనక్కివెళ్లే*
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్,
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.
*స్త్రీవలె నెలసరి అయ్యే*
==================
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,
2. కేరళ దుర్గామాత.
*రంగులు మారే ఆలయం*
====================
1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.
*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు*
==========================
1. కాణిపాకం,
2. యాగంటి బసవన్న,
3. కాశీ తిలభండేశ్వర్,
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి
*స్వయంభువుగా
సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.*
=================================
ఆరునెలలకు ఒకసారి తెరిచే
1. బదరీనాథ్,
2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
3. గుహ్యకాళీమందిరం.
సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు
హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.
12 ఏళ్లకు ఒకసారి
పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.
స్వయంగా ప్రసాదం
1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం
ఒంటి స్తంభంతో
యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.
*రూపాలు మారే*
==================
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.
నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు*
=======================
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి
మనిషి వలె గుటకలు
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.
అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.
*ఛాయా విశేషం*
================
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం
నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ), నేపాల్
ఇంకా...
తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్, కంచి,
చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం etc
పూరీ
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.
🙏🙏🙏
*******
No comments:
Post a Comment