Thursday, October 14, 2021

ఇతరులను " విశ్లేషించుకోండి " అని సార్కాస్టిక్ గా కౌంటర్ వేయడం కాకుండా వారు కూడా కొంత " విశ్లేషించుకుంటే " బాగుంటది....

శ్రీ ***, ఒక అసొసియేషన్ ఎన్నికల ఫలితాల సమీక్షాంతర్భాగంగా ఒక పొగరుబోతు
" విశ్లేషించుకోండి " అంటూ సేటైర్ వేసినందుకు కౌంటర్....
(తెలుగు సరిగ్గా అర్ధం కకాపోతే ఎవరితోనైనా అనువాదం చేయించుకొని విను..)

నేను ఎవరి పేర్లను స్పెసిఫిక్ గా పాయింట్ అవుట్ చేయట్లేదు కాబట్టి ఎవ్వరూ వీటి గురించి కామెంట్ చేయనవసరం లేదు....

1. ' ఎన్నికలు ' అనే పదానికి అర్ధం ఏంటి...? ఒక వ్యక్తిని ఒక పదవికి ఎన్నుకోవడం...
కాబట్టి సభ్యులందరూ ఎవరికి ఇష్టమున్న వారికి వారు వోటేసి ఎన్నుకుంటారు...

2. ప్రాంతీయవాదం / జాతీయవాదం / ఆ వాదం / 
ఈ వాదం అనేవి ఏ ఎన్నికల్లోను ప్రస్తుతించవలసిన అంశం కానేరదు....అవన్నీ వ్యక్తిగతమైనవి....
శాంతిభద్రతలు, అభివృద్ధి, సంక్షేమం, అనేవి మాత్రమే ఎవ్వరైనా కామన్ గా ఉటంకించే అజెండా...

3. ఒక చోట తింటూ, ఒక చోట ఉంటూ, 
తినేటప్పుడు ఉండే చోటిని ఆక్షేపించడం,
ఉండేటప్పుడు తినే చోటిని ఆక్షేపించడం, 
ఇలా రెండు పడవల్లో ప్రయాణం చేసే వ్యక్తి 
తాను సుఖంగా ఉండలేడు...
ఇతరులను సుఖంగా ఉండనివ్వడు....

4. కాబట్టి అట్టి వ్యక్తికి మరియు ఒక స్థిరమైన, స్పష్టమైన, అవగాహన గల వ్యక్తికి గల భేదాన్ని గుర్తించలేనంత మైకంలో విజ్ఞ్యులెవరు ఉండరు, ఉండాలనుకోరు..

5. మనకంటే వయసులో పెద్ద కదా అని ఒకరి యందు గౌరవభావనతో, మరియాదతో ప్రవర్తించిన వ్యక్తిని....
చూడ్డానికి ఏదో కాలేజ్ పోరగాడిలా ఉన్నడు కదా అని తక్కువ చేసి చూసిన నాడు అది ఎప్పటికైనా గౌరవలేమిగా సదరు సొ కాల్డ్ పెద్దమనిషికి ఏదో ఒకనాడు పరిణమిస్తుంది...
ఇది తెలుసుకొని మసులుకొనేవాడు స్థితప్రజ్ఞ్యుడు మరియు ధీమంతుడు....

6. అవతలి వ్యక్తిని తక్కువ అంచన వేసి భంగపడడం లో భంగపడిన వారి వివేకరాహిత్యమే లోకానికి వారి యొక్క అవగాహనా రాహిత్యాన్ని సూచించే కొలమానం... దానికోసం పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉండాలని ఏం లేదు....
చిన్న చిన్న విషయాల్లోనే విషయమంతా పసిగట్టే పరిణత, విజ్ఞ్యత ఉంటే చాలు...

7. వ్యక్తిగతమైన విషయాలు ఎవరివైనా సరే వారి వారి వ్యక్తిగతమైనవి....
పరిధి దాటి ఇతరుల వ్యక్తిగత జీవితంలో కలగజేసుకొని వాటిని చిలువలుపలువలు గా చేసి వాటితో రాజకీయాలు చేసి ఏదో సాధించేద్దాం అనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుందే కాని
తెలివి అనిపించుకోదు...

8. తెలివి అనేది ఎవడబ్బా సొమ్ము కాదు....ఎవరి కృషితో వారు ఆర్జించుకునే విభూతి....

9. ఎదుటి వారి గౌరవాన్ని తక్కువ చేసి అవమానించడంలో తాత్కాలికంగా ఏదో సాధించేసామనే భ్రమ కలిగినా....
ఉత్తరోత్తరా సత్యం అనే శాశ్వతత్త్వం
ఎదుట ఆ భ్రమ తన ఉనికిని కోల్పోకతప్పదు....
ఒక్కోసారి అతితెలివి ఎక్కువైతే భ్రమించిన వ్యక్తి కూడా ఆ భ్రమతో పాటుగా లయించిపోవడం అనేది వాస్తవం...

ఇతరులను " విశ్లేషించుకోండి " 
అని సార్కాస్టిక్ గా కౌంటర్ వేయడం కాకుండా వారు కూడా కొంత " విశ్లేషించుకుంటే " బాగుంటది....

సినిమాల్లో అంటే ఎన్నైనా డైలాగులు వేసుకొవచ్చు కాని
నిజ జీవితంలో అట్లుండడం వీలుకాదు కాబట్టి...

"దేవుడా ఓ మంచి దేవుడా..." అని
ఏదో ఒక సిమిమాలో నిన్ను పిలిచాడు కాబట్టి.. నోరే కాకుండా అప్పుడప్పుడు కొంత బుర్ర కూడా ఉపయోగించి మాట్లాడేలా కొందరికి తెలియజేయవయ్య దేవుడా...

నువ్వు సీ.బీ.ఐ లెవెల్లో కౌంటర్ వేస్తే...
ఎదుటి వ్యక్తి ఎఫ్.బి.ఐ లెవెల్లో ఎదురు కౌంటర్ వేయగల దిట్ట కావచ్చు...

కాబట్టి బాగా " విశ్లేషించుకొని "
విషయాన్ని గుర్తించి గౌరవించేలా నడవడిని సరిదిద్దుకోవడంలోనే పెద్దరికం మరియు హుందాతనం ఉంటుందనేది సత్యం...

No comments:

Post a Comment