Monday, October 11, 2021

శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం.... .శ్రితచేతనమందారం శ్రీనివాసం అహంభజేత్.....🍕🍨😊🙏💐🌸

శ్రితచేతనమందారం శ్రీనివాసం అహంభజేత్....😊🌸💐🙏🍨🍕

అంటూ కోట్లాది భక్తులు నిత్యం ఏ స్వామివారి క్రీగంటి చూపులకై పరితపిస్తారో ఆ శ్రీవేంకటాచలసార్వభౌముడు
సర్వభూపాలవాహనసేవలో కొలువుదీరిన శుభవేళ...!😊

" నాహంవసామి వైకుంఠే నయోగిహృదయేరవౌ...
యత్రమత్భక్తాఃమమగాయంతి తత్రతిష్ఠ్యామహం నారద.... "

అని స్వామివారు సాక్షాత్ నారదమునీంద్రులకు సెలవివ్వడం గురించి మన పెద్దలు పలువ్యాఖ్యానాల్లో ఉటంకించడం వినే ఉంటారు....

మరి ఈ నారద మహర్షి వారు ఎంతటి ఘనులో శ్రీచాగంటి సద్గురువులు మనకు బోధించిఉన్నారు కదా...

"నారం దదాతి ఇతి నారదః..."

అనగా జ్ఞ్యానాన్ని ప్రసాదించేవారు అని వ్యుత్పత్తి....

మరి ఇంతటి జ్ఞ్యానరాశి గా కొనియాడబడే నారదుమునీంద్రులవారికే ఒకసారి తమకు కలిగిన కించిత్ అతిశయం వల్ల ఏకంగా భూలోకంలో ఒక స్త్రీగా జన్మనెత్తవలసిన వృత్తాంతం గురించి, మరియు ఎట్లు ఆ శ్రీహరి కరుణతో మళ్ళీ నారదులవారు తిరిగి తమ పూర్వవైభవాన్ని సంతరించుకున్నారో తెలియజేసే వృత్తాంతం ఇప్పటికీ మనం కాకినాడ దెగ్గర్లోని సర్పవరంలోని ప్రాచీనమైన శ్రీభావనారాయణ స్వామివారి ఆలయపరిసరాల్లో చూడవచ్చు.....

అనగా భక్తి లుప్తమైననాడు, భగవద్ స్మరణ మరుగైన నాడు ఎంతటి ఉన్నతమైన పదవినుండైనా సరే జీవుడు పుణ్యక్షయంతో ఈ భూలోక గతుడై ఎంతో ప్రయాసతో కూడిన జీవితం తో మళ్ళీ పుణ్యాన్ని సముపార్జించిన తదుపరి ఈశ్వారానుగ్రహంగా మాత్రమే తిరిగి తన స్వస్వరూపస్థితికి చేరుకోగలడు...

'చక్కగా భగవంతుడు ఇచ్చిన జన్మను తిని తిరిగి ఎంజాయ్ చేసి ఏదో ఒకనాడు పొయ్యేదానికి
ఎప్పుడు చూసినా భక్తి భక్తి అంటూ ఎంటో ఈ గోల...'
అని కొందరికి అనిపించవచ్చు....

భక్తి యొక్క ప్రాముఖ్యత ఏంటో ఒక చిన్న ఎగ్సాంపుల్తో వివరిస్తా...

ఏ.సీ.లో ఉండడం ఫస్ట్ బానే ఉంటది...కొంత కాలం తర్వాత ఏదో కొంచెం గాలి యొక్క స్వచ్ఛతలో మార్పు అనిపించి అందవలసినంత ఆక్సిజన్ అందట్లేదు అని అనిపించడం ప్రారంభమవుతుంది....ఇంకొద్ది కాలం తర్వాత ఊపిరితిత్తులకు గల సహజ వాయుప్రాశన శక్తి లుప్తమవ్వడం తెలిసివస్తుంది...ఆ తరువాత ఊపిరిమీద ఆధారపడి ఉండే యావద్ శరీరజీవక్రియాసామర్ధ్యంలో హెచ్చుతగ్గులు తెలిసివస్తాయి...
ఆ తర్వాత మొత్తం శరీరమే రోగగ్రస్తమై శిధిలమై క్షయించిపోతుంది....

మంచి డాక్టర్లను మీరు సంప్రదిస్తే
" అత్యవసరమైతే తప్ప ఏ.సి ల జోలికి వెళ్ళకుండా ఉండడమే మంచిదండి....
కూలర్లు, ఫాన్లతో చక్కగా ఉండే శరీరాన్ని ఏ.సి లకు అలవాటు చేసి కోరి కోరి ఇబ్బందులు కొనితెచ్చుకోకండి.."
అనే సత్యాన్ని స్పష్టంగా తెలియచెప్తారు....

అట్లే భక్తి లేకుండా బ్రతికే జీవితం, అనగా మనం ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఆ భగవద్ స్మరణ
లేకుండా ఉండే జీవితం కూడా ఘొరంగా పతనమై,
వేలల్లో ఉండే స్టాక్ మార్కెట్ సూచీలు
ఒక్కసారిగా పతనమై వందల్లోకి, పదుల్లోకి పడిపోయే రీతిలో, ఈ జన్మ ఎంత ఘనంగా విలాసవంతంగా భౌతిక సుఖలాలసతో మాత్రమే జీవిస్తామో వచ్చే జన్మలు తద్విరుద్ధమైన విధంగా కనీసం అన్నపానీయాలకు కూడా నోచుకోని దుర్భరమైన రీతిలో ఉండే జన్మల్లోకి జీవుడు పతమైపోతాడు అనేది వాస్తవం...

అయితే కేవలం పుణ్యం ఉంటే సరిపోతది కద...ఉత్తర జన్మలు కూడా మంచి ఐశ్వర్యభరితులై జీవించేందుకు అనే సందేహం రావచ్చు కొందరికి....

మరి భక్తి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఈశ్వరానుగ్రహంగా కొంత వివరిస్తా...

1. భగవద్ నామస్మరణ నుండి దూరమైన చక్కని జీవితం తెగిన గాలిపటం వంటిది. అది త్వరలోనే పుణ్యక్షయమై ఎప్పుడు ఎక్కడ ఎలా తన ప్రస్థానం ముగించునో ఎవ్వరికీ తెలియదు...తిరిగి లభించే జన్మ ఎట్టిదో కూడా తెలియదు కాబట్టి వచ్చే జన్మల్లో భక్తిగా ఉండే ముచ్చట అసల్ అన్వయంకాదు....

2. ఈశ్వరుడి స్పృహలేకుండా జీవించే బ్రతుకు తైలం లేని దీపం వంటిది...
అది కేవలం మండిపోతూ పుణ్యం అనే వత్తి తొందరగా కాలిపోవడం తప్ప దీపం వెలగడం అనే అర్ధం అన్వయంకాదు...

సంకల్పంలో చెప్పబడేలా ధర్మార్ధకామ్యమోక్షములు అనే చతుర్విధ పురుషార్ధాలను సాధించడంలోనే ఎల్లరూ తమ తమ జీవితాలను జీవుంచేస్తుంటారు..

శ్రీ చాగంటి సద్గురువులు బోధించినట్టుగా,
ధర్మము, మోక్షము తో ముడిపడని అర్ధకామములు అర్ధరహితమైనవి...ఒక్కోసారి అనర్ధదాయకమైనవి కూడాను....

1. ధర్మ చింతనతో భక్తి ముడిపడిననాడు....ఆ జీవితాన్ని ఈశ్వరుడు మెచ్చి, వచ్చే జన్మల్లో వారిని
శ్రీచాగంటి సద్గురువుల వంటి మహనీయులు, యతీశ్వరులు/పీఠాధిపతులు/జగద్గురువులు వంటి మహనీయుల సమక్షంలో ఉండేలా వారి ఆంతరంగిక పరివారం లో ఉండే జన్మలను ప్రసాదిస్తాడు....
తద్వారా ధర్మపరిరక్షకులుగా ఉండే  ఉపాధుల్లోకి ఉత్తర జన్మల ఉన్నతి భక్తి ద్వారా సమకూరింది.....

2. కేవలం అర్ధ చింతనతో భక్తి ముడిపడిననాడు....
అంత్యమున అర్ధసముపార్జనపైనే మనసు ఉండిపోయింది కాబట్టి
మన భక్తితో సమకూర్చుకున్న పుణ్యానికి తగ్గ రీతిలో ఒక సంపన్న కుటుంబంలో ఉత్తర జన్మలను అనుగ్రహిస్తాడు....

అనగ ఐశ్వర్యదిగ్గజమైన ఏ రాజకీయవేత్త ఇంట్లోనో / బిజినెస్మాన్ ఇంట్లోనో / సినిమా హీరో ఇంట్లోనో / జన్మించడంతో ఆ భక్తి ప్రసాదించే పుణ్య ఫలం అక్కడితో సరి....

బెంజ్ కార్లల్లో బయటికి వెళ్ళి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే లక్షల్లో ఖర్చుచేసే అపరకుబేరుల ఇంట్లో జన్మించిన వ్యక్తికి భక్తి అంత సులువుగా అలవడుతుందని చెప్పడానికి ఏల్లవేళలా కుదరదు కద....

కాబట్టి సంచిత పుణ్యమంతా ఫ్రీజర్ నుండి తీసిన ఐస్క్యూబ్స్ లా కరిగిపోయే..

జీవితంలోకి మళ్ళీ ఈశ్వరుడు / భక్తి / భాగవతులు రావాలంటే ఎన్ని జన్మలు పడుతుందో ఎవరికెరుక....

3. కేవలం కామ్య చింతనతో భక్తి ముడిపడిననాడు....అనగా ఏదో ఒక కోరికతో మాత్రమే భక్తి ముడిపడిన నాడు అంత్యమున ఆ కోరిక తీరే జన్మలోకి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు...

అనగా నేను వాళ్ళలా గొప్ప సింగర్ / డాన్సర్ / డాక్టర్ / యాక్టర్ / ఇత్యాదిగా అవ్వాలి...
ఇలా ఏదో ఒకకోరికతో మాత్రమే ​ఈశ్వరభక్తి ముడిపడిననాడు ఆ కోరిక తీరడంతో ఆ కామ్య భక్తి యొక్క ఫలము అంతటితో సరి....
ఉత్తర జన్మల్లో భక్తి అలవడుతుందని గ్యారెంటి ఇవ్వలేము కద ....

కాబట్టి జీవితంలోకి మళ్ళీ ఈశ్వరుడు / భక్తి / భాగవతులు రావాలంటే ఎన్ని జన్మలు పడుతుందో ఎవరికెరుక....

4. ఇక లాస్ట్ ది అనగా 4వ పురుషార్ధం అనగా మోక్షం పొందడమే కోరికగా భగవద్ భక్తి అలవడటం చాలా అరుదు మరియు గొప్ప విషయం..

ఆ భక్తికి ఈశ్వరుడు మెచ్చి
సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య మనే చతుర్విధమోక్షాల్లో వారికి ఇష్టమైనది కటాక్షించి
మోక్షాన్ని ఇచ్చి తీరుతాడు కాబట్టి
ఇక భూలోకంలో భక్తి, పునర్జన్మ, అనే కాన్సెప్ట్స్ వారికి అన్వయం కావు కాబట్టి ఇక్కడ డిస్కస్ చేయడానికి ఏమి ఉండదు...

ఇలాంటి వారిని ఒక్కొసారి పిచ్చివారిగా కూడా ఈ లోకం ముద్రవేసి అపహాస్యం చేస్తుంది....
కాని వీరు మాత్రం
" ఆ ఏముందిలే ఈ వెర్రి లోకానికి అంతకంటే ఏం పని ఉంటుంది కనుక....
శ్రీ చాగంటి సద్గురువులు నుడువినట్టుగా ఈ లోకం ఈశ్వరుడినే పిచ్చివాడు అని పిలుస్తుంది....
( ఓం ఉన్మత్తశేఖరాయనమః )....
కాబట్టి మనం కూడా వీరికి వెర్రివారిలానే కనిపిస్తాం..."
అని లోకంపోకడలను లైట్ తీసుకునేవారు ఈ కోవకు చెందిన వారు....)

నేను కొన్ని సంవత్సరాల క్రితం
" తెలుగు భక్తి పేజెస్ " అనే యాహూ గ్రూప్స్ స్పిరిటూల్ గ్రూప్ నిర్వహించిన ఆధ్యాత్మిక సత్సంగంలో భాగంగా అమీర్పేట్ లో ఒకనాడు జరిగిన సత్సంగ్ కి హాజరు అయినప్ప్పుడు అక్కడ బోర్డుపై

" మోక్షగాములకు స్వాగతం.."

అని రాసి ఉండడం.....మరియు అలా ఎందుకు రాసారో అక్కడికి విచ్చేసిన
శ్రీ పరిటాల గోపికృష్ణ గారు,
ఇత్యాది భాగవతులు వివరించినప్పుడు
విన్న కొన్ని మాటలకు అర్ధపరమార్ధాలను వెతుకుతూ సాగిన అధ్యవసాయంతో ఇన్ని సంవత్సరాలు గా  ఈశ్వరుడికి ఎంతో కొంత దెగ్గరగా సాగిన జీవితంలో శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల ప్రభావంతో
అది ఒక ఆధ్యాత్మిక రిసర్చ్ సబ్జెక్ట్ లా అలవడి నాలో తట్టి లేపిన గతజన్మస్మృతులెన్నో ఎన్నెన్నో...

కనీసం శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం
అంటే ఏంటో కూడా తెలియని అత్యంత సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి జీవించే వ్యక్తికి
భక్తి/భగవంతుడు/ఆధ్యాత్మికత/భక్తభాగవతులు అంత సులువుగా అలవడి ఈశ్వరుడి వైపుగా జీవిత గమనం సాగుతుందని మీరనుకుంటే అది పొరపాటు...

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు
( మరీ ముఖ్యంగా వారి సంపూర్ణరామాయణం+శ్రీమద్భాగవతం+శ్రీవేంకటేశ్వరవైభవం+అరుణాచలవైభవం ప్రవచనాలు )

మరియు తిరుమల " శ్రీవారిసేవ " కార్యక్రమం

ఈ రెండు జీవితంలో ఈశ్వరుడి కృపగా లభించిన తదుపరి మాత్రమే ఎన్నెన్నో ఈతిబాధల ఉత్థానపతనాల మధ్య సాగిన నా దాదాపు 35 సంవత్సరముల జీవితం అర్ధవంతమైన ప్రయాణంలోకి కుదురుకుంది.....

వేట్ చేసి చేసి ఎంతకీ ఆర్.టీ.సీ
బస్ ఒక్కోసారి గంటైనా సరే రాకపోతే 5 రూపాయలు షేర్ ఆటో కి ఇప్పుడు పెడితే ఇంటర్నల్ ఎగ్సాంస్ అప్పుడు పాకెట్ మని లేకపోతే ఎట్లా అని అలోచిస్తూ ఐ.డీ.పీ.ఎల్ నుండి ఆస్బెస్టాస్ కాలని వరకు నడుచుకుంటూనే వచ్చిన నా ఇంజనీరింగ్ డేస్ నుండి ఈనాటి వరకు కూడా.....

ఎద్దు కాడి కింద నలుగుతూ దుక్కి దున్నుతుంటే...
అడ్డగాడిదలు అరవడం...
నిలువుగాడిదలు నిట్టూర్చడం....
అన్నట్టుగా చుట్టూ ఉండే పెసిమిస్టిక్ ప్రపంచం నా కష్టాన్ని అపహాస్యం చేసినా, నన్నూ, నా భక్తిని హేలన చేసినా, ​తూలనాడినా, ఎకసెక్కాలాడినా, వెర్రి కూతలు కూసినా....

నేను ఏనాడు వాటిని పెద్దగా పట్టించుకోలేదు...
వారికి పెద్దగా విలువివ్వలేదు....

ఈశ్వరుడిని వహించుటకై మావటి యొక్క అదుపాజ్ఞ్యలలో ప్రయాణిస్తున్న ఏనుగులను చూస్తు ఒక్కో కుక్క ఒక్కోలా మొరుగుతుంటాడు....
అవన్నీ పట్టించుకుంటూ పోతే ఈశ్వరుడిమీద ఉండే ధ్యాస తగ్గి కుక్కలను హడి హడి అంటూ ఉండడంలోనే టైం అంతా అయిపోతే ఇక ఈశ్వరుడిని వహించేదెప్పుడు.....

ఈశ్వరుడిని వహించిన తదుపరి ఆ ప్రాంతంలోకి ఏ కుక్కా రాదు / రానివ్వరు కాబట్టి ఏదో ఒకనాడు మొరిగిన కుక్కలందరూ నోరుమూస్కుంటారులే....
అని అనుకుంటూ ముందుకు సాగడమే నా లక్ష్యంగా సాగిన ప్రయాణంలో లభించిన ఈశ్వరానుగ్రహంతో చేరుకున్న మజిలీలెన్నో.....

కాబట్టి భక్తి యొక్క ఆవశ్యకత ప్రతి
వ్యక్తికి ఇంకా సరిగ్గా చెప్పాలంటే ప్రతి జీవుడికి ఉంది...

అందుకే ఆ పరమాత్మ తన వద్దకు రాలేని జీవులకోసం దూరమునుండైనా అనుగ్రహాన్ని ప్రసాదించడానికి ఊరేగింపుగా వస్తాడు...
( చాలామంది అనేలా అది ఈశ్వరుడి
' ఊరేగింపు ' కాదు... అది ఈశ్వరుడి
' ఊరెరిగింపు ' అనే శ్రీచాగంటి సద్గురువుల సవరణ చదువరులు గమనించవలె...)

సొ...ఆ అత్యంత ఆవశ్యకమైన భక్తికి మూలం...??

భగవద్ నామగుణగానం / శ్రవణం...
భగవద్ సంకీర్తనం...
భక్తభాగవత ఆరాధన...
భగవద్ చింతనం...
భగవద్ స్మరణం మననం నిధిధ్యాసనం స్వాధ్యాయం...
ఇత్యాదిగా ఉండే ఈశ్వర సంబంధమైన వ్యాపకం...

వీటిలో
"భగవద్ నామగుణగాన శ్రవణం / సంకీర్తనం..."
తనను అందుకోవడానికి రాచబాటగా ఈశ్వరుడు ఎందుకు నిర్దేశించాడు అనేది ఆ బాటలో ప్రయాణించిన వారికి మాత్రమే అర్ధమయ్యే సత్యశ్రేష్ఠం...

ఒక రోడ్డు ఎంత స్మూత్ గా ఉందో చెప్పాలంటే స్కేట్స్ వేస్కొని రై రై అని సాగిపోవడంలో మాత్రమే అది తెలిసివస్తుంది....

అట్లే భగవద్ నామ సంకీర్తనం / కథాశ్రవణం యొక్క వైభవం కూడా ఆ బాటలో సాగిన నాడే ఎరుకలోకి వస్తుంది అనునది నా ప్రగాఢ విశ్వాసం.....

లౌకికమైన వాటిపై / లోకులపై పెట్టుకున్న విశ్వాసం ఫలిస్తుందో లేదో చెప్పలేమేమో కాని
భగవంతుడిపై గల విశ్వాసం ఏనాటికైనా ఫలించి తీరుతుంది.... అని శ్రీహరిభక్తి యొక్క వైభవాన్ని ఎంతో ఘనంగా శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు ఈ క్రింది సంకీర్తనలో సెలవిచ్చారు కద..

ప|| ఏ పురాణముల నెంత వెదికినా | శ్రీపతి దాసులు చెడరెన్నడును ||

చ|| హరి విరహితములు అవిగొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలిచిటు నమ్మిన వరములు | నిరతము లెన్నడు నెలవులు చెడవు ||

చ|| కమలాక్షుని మతిగానని చదువులు | కుమతంబులు బహు కుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు | విమలములేకాని వితథముగావు ||

చ|| శ్రీవల్లభుగతి జేరనిపదవులు | దావతులు కపట ధర్మములు |
శ్రీవేంకటపతి సేవించు సేవలు | పావనము లధిక భాగ్యపు సిరులు ||

http://annamayya-u.blogspot.com/2009/05/e-puranamula-entha.html?m=1


No comments:

Post a Comment