శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు గరుడధ్వజావరోహనం తో దిగ్విజయంగా పరిసమాప్తి చెందడం తో స్వామివారి ఆర్జిత సేవలు యథావిధిగా పునః ప్రారంభమైనవి...
భక్తులు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా ఆన్లైన్ బుకింగ్ సదుపయాన్ని వినియోగించుకొని వారి వారి తిరుమల యాత్రను / స్వామి వారి దర్శనాన్ని ప్లాన్ చేసుకోవలసిందిగా తెలియజేయడమైనది.....
అనే విధంగా ఉండేలా న్యూస్ ని వినే ఉంటారు...
రెబెల్ స్టార్ యొక్క అభిమాని ఎవరో అందించిన ఎంతో చక్కనైన ఈ చిత్రలేఖనంలో వివిధ సినిమాల్లోని వివిధ పాత్రల్లో మన ప్రభాస్ డార్లింగ్ కనిపించే వివిధ గెటప్స్, ఒక బేస్ ఫ్రేం పై వివిధ సూపరింపోస్డ్ ఫ్రేంస్ తో కూర్చబడిన ఈ చిత్రమంజరిలో మనకు జ్యోతకమైనట్టుగా...
శ్రీ వేంకటేశ్వర వైభవం (1971) సీమాలోని ఆత్రేయ గారి రచనలో చివరి చరణంలో తెలపబడినట్టుగా...
*****
శ్రీ వేంకటేశ్వర వైభవం (1971)
రచయత: శ్రీ ఆత్రేయ గారు
గాయకులు: పద్మ విభూషణ్ డా. బాలమురళీకృష్ణ గారు
తెర తీయరా తిరుపతి దేవరా
తెర తీసి నీ వెలుగు కిరణాలు ప్రసరించి
మా లోని తిమిరాలు హరియించి మము బ్రోవరా మా భూవరా
సంపంగి చంపక పూగ పున్నాగ
పూలంగి సేవలో పొద్దంత (ప్రొద్దంత) చూడగ
నీపైని మోహము నిత్యమూ సత్యమై
అహము పోదోలురా ఇహము చేదౌనురా ఆ ఆ ఆహా …
ఏలా లవంగాలు పచ్చ కర్పూరాలు
కలిపిన ఆకాశ గంగా జలముతో
అభిషేక మొనరించు అపురూప (పు) సమయాన
నేత్ర దర్శన మొసఁగ రా, మా కళ్ళు తెరిపించరా
హారతి ఇచ్చే వేళ ఆశ్చర్యమున మేము ఎన్నెన్నొ
రూపాలు నీలోన చూతుము -
శివుడవూ (వో), భవుడవూ(వో) మాధవుడవూ(వో) నీవు
పరతత్వమును తెలుపరా , పరమ పదమును చూపరా
*****
హరిహరవిరించి తత్త్వాల సమ్మేళనంగా శ్రీవేంకటపరదైవాన్ని కీర్తిస్తూ రచింపబడిన ఈ పాటలో ఉన్న విధంగా ఆ శ్రీవేంకటపరతత్త్వంలో ఒక్కో భక్తుడికి ఒక్కోలా, వారి వారి అంతరంగంలో ఆరాధింపబడే దేవతాస్వరూపం ఆ శ్రీశ్రీనివాస పరదైవంలో జ్యోతకమై శ్రీవారి సందర్శనానందాన్ని పొంది తరించడం కద్దు....
అందుకే అది ఈ కలియుగ ప్రత్యక్ష వరదైవమైన శ్రీవేంకటపరబ్రహ్మమై, ఎవరు ఎట్లు ఆరాధిస్తే వారికి అట్లు దేవతానుగ్రహాన్ని ఒసగే పరతత్త్వమై భాసిల్లుతోంది....
శ్రీమద్భాగవతంలోని ఈ క్రింది ప్రహ్లాదోపాఖ్యానంలోని
పద్యాన్ని శ్రీచాగంటి సద్గురువులు ఎంతో హృద్యంగా వివరించడం చాలామంది శిష్యులు వినేఉంటారు...
కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్,
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి; మెట్లైన ను
ద్ధామ ధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!
ఎవరు ఏ భావంతో ఏ నామరూపాత్మకంగా భావిస్తే వారికి ఆ నామరూపాత్మక భావంతో ఆ శ్రీవేంకటపరదైవం అనుగ్రహాన్ని వర్షించి కరుణిస్తుంది....
ఎందుకంటే శ్రీ కంచి మహాస్వామి వారు సెలవిచ్చినట్టుగా , అది సకల దేవతాత్మకమైన శ్రీవేంకటపరబ్రహ్మము కనుక...
ఆ దేవుడు వేరు...ఈ దేవుడు వేరు..అంటూ వేరు వేరు గా వివిధ రీతుల్లో పూజించడం...
మళ్ళీ అంతా ఒక్కటే....అని అనడంలో
శ్రీఆదిశంకరాచార్యుల వారు తరించమని అందించిన
" అద్వైత తత్త్వం " అనే కాన్కెప్ట్ ని
మరింత కాంప్లెక్స్ చేస్తున్నామా లేదా
సింప్లిఫైడ్ గా ఆకళింపుజేసుకుంటున్నామా అనేది
వారు వారు ఆశ్రయించి ఉండే గురుస్వరూపుల బోధానుగ్రహం పై ఆధారపడి ఉండే విషయం....
అస్మద్ గురుదేవులు, శ్రీచాగంటి సద్గురువులు ఈ క్రింది విధంగా అత్యంత సింపుల్ గా నుడివిన అద్వైత తత్త్వాన్ని అంతే సింపుల్ గా కొంత ఎక్స్ప్లేన్ చేసే ప్రయత్నం గావిస్తాను...
( శ్రీఆదిశంకరులు పరమాత్మ తత్త్వాన్ని " ఏకం " అని అనిఉండి ఉంటే....
మళ్ళీ ఆ ఒకటి...ఈ ఒకటి...అంటూ ఎన్నో ఒకట్లు బయల్దేరి మళ్ళీ కాంప్లెక్స్ ఐపోతుందని...ఎంతో కట్టుదిట్టంగా " రెండు కానిది.." అనగా " అద్వయం / అద్వైతం " అని స్థిరీకరించారు....." )
శ్రీవేంకటాచల సార్వభౌముడు ధ్వజారోహనం నుండి ధ్వజావరోహనం వరకు సాగిన తిరుమాడవీధుల్లోని వాహనసేవల్లో పెద్ద శేషవాహనం తో మొదలై హయవాహనం వరకు వివిధ వాహనసేవల్లో వివిధ
అలంకారాలతో దర్శనమిస్తూ భక్తులను అలరించి అనుగ్రహించారు...
ఎందుకని...??
ప్రతీ రోజు అదే శ్రీభూసమేతమలయప్ప స్వామి వారు ఒకే పల్లకిపై ఒకేలా అలంకరించుకొని వచ్చినా సరే...
లేదా వివిధ పల్లకీల్లో వివిధ రీతుల్లో అలంకరించుకొని వచ్చినా సరే...
ఊరెరిగింపుగా వచ్చి అనుగ్రహించింది ఎవరు...??
అదే శ్రీశ్రీనివాసుడు కదా...
మరి.,
ఒకరోజు పెద్దశేష / చిన్నశేష వాహానం పై వచ్చినప్పుడు ఆయనను యోగకారకుడని..
హంస వాహనారూఢుడై వచ్చినప్పుడు
సరస్వతీ మూర్తి యని...
ఇలా ఒక్కో వాహనంపై ఒక్కోలా అలకరించుకొని ఒక్కో ప్రయోజనార్ధమై...ఒక్కో ప్రత్యేక అనుగ్రహప్రదాతగా విచ్చేసినా సరే....వచ్చింది ఎవరు..??
ఆ ఒక్క శ్రీభూ సమేత మలయప్ప స్వామి వారే కద...??
సొ ఇక్కడ శ్రీభగవద్రామానుజార్యులవారిచే ప్రతిపాదితమైన విశిష్ఠాద్వైత ప్రతిపాదిత శ్రీవైష్ణవ పరతత్త్వం తన వైవిద్యభరిత వాహనసేవాంతర్భాగంగా అద్వైత తత్త్వాన్ని ప్రతిపాదిస్తూ ఆ ఒకటి ఈ ఒకటి అనబడేలా ఎన్నో ఒకట్లుగా సాగిన వివిధ వాహనసేవల్లో / అలంకరణల్లో అంతర్నిహితమై ఉన్న తన ఏకత్వాన్ని అనగా తన అద్వైత సామ్యమును ప్రదర్శిస్తూ భక్తులను అనుగ్రహించిన వైనంలో ఆ అద్వైత సిద్ధాంతాన్ని మనకు అందించినట్టే కద....
ఇంకా సింపుల్ గా చెప్పాలంటే,
అప్పుడూ, ఇప్పుడూ మరియు ఎల్లప్పుడూ వెండితెరపై రాజులకే రారాజైన హీరో గా ఉండే మన డార్లింగ్ సినిమానే ఎగ్సాంపుల్ గా తీస్కుందాం...
ఆ రోజుల్లో " వర్షం " సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకలోకాన్ని ఒక్క ఊపు ఊపిందో అందరికీ తెలిసిందే....
ఇప్పుడు శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారి సంకీర్తనలు వందలసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ అవే సంకీర్తనలు విని ఆనందించినట్టుగా....
" నీటి ముల్లై నన్ను గిల్లి
వెళ్ళిపోకే మల్లె వానా
జంటనల్లే అందమల్లే
ఉండిపోవే వెండి వానా
తేనెల చినుకులు చవిచూపించి
కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి
కనుమరుగై కరిగావ సిరివానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా..."
సిరివెన్నెల గారి కలం నుండి జాలువారిన ఈ హృద్యమైన కవనం ఆరోజుల్లో ఎందుకొ ఏమో అంతగా నన్ను ఆకట్టుకుంది...
ఆ రోజుల్లో ప్రత్యేకించి ఈ సాంగ్ బిట్ ఎన్నో సార్లు వినే వాడిని..
సరె ఇక మన అసల్ టాపిక్ కి వస్తే,
వర్షం అనేది ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఒకేలా ఉండే నీటి జల్లు...
" మామా..ఎట్లున్నరు...ఏంది సంగతి....
ఇక్కడ మాకు వారం నుండి ఫుల్ వర్షం...మీకు అక్కడెట్లుంది....?"
అని అడిగితే...అవతలి వ్యక్తి సాధారణంగా ఇచ్చే సమాధానం ఏంటి...?
" ఆ బావుణ్ణం అల్లుడు...మాక్కూడా ఇక్కడ రెండు వారాల నుండి ఫుల్ వర్షం...గోదారి వరదలకు పోటెత్తి రాములోరి ఆలయం వరకు నీళ్ళు రావడం తో భక్తులను గుళ్ళోకి రానివ్వట్లేదంట..."
అంటూ ఏదో అలా ఉంటుంది సాధారణంగా సమాధానం...
అంతే కాని...
"
మీకు వర్షం ఎట్లుంది అక్కడ....?
మీక్కూడా నీళ్ళే కురుస్తున్నాయా..?
ఏ రంగులో నీళ్ళు కురుస్తున్నాయి..?
నీళ్ళ చుక్కలు మీకు ఏ సైజ్ లో ఉన్నాయి..?
వాటి బరువు, అందులోని ఉదజని/ప్రాణవాయువు శాతం ఎంతుంది..?
మీ ఇంటి ముందు కురిసే వర్షం మరియు
ఆ వెనక లైన్లో వాళ్ళింట్లో కురిసే వర్షం ఒకేలా ఉందా...??
"
అని సాధారణంగా ఎవ్వరూ అడగరు...అవునా...?
ఎందుకు...??
ఎందుకంటే..వర్షం ఎక్కడైనా వర్షమే కాబట్టి....
కురిసేది నీరే కాబట్టి....
( ఆసిడ్ రేన్స్...కలర్ వాటర్ రేన్స్....మొదలైన స్పెషల్ కేసెస్ పక్కనపెట్టండి...)
అన్ని చోట్లా ఒకేలా కురిసినా..
( అనగా కురిసే వేగంలో, కురిసిన సాంద్రతలో భేదాలుండొచ్చు కాని....ఎక్కడైనా కురిసేది ఒకేలా ఉండే నీటి జల్లుల వర్షమే...)
దివి నుండి భువిపైకి ఒకేలా కురిసిన వర్షంలో / వర్షం నీటిలో భేదాలు ఎప్పటినుండి, ఎక్కడినుండి వచ్చి చేరినట్టు...??
మన ఇంటి అవరణలో ఒక శుభ్రమైన పాత్రలో ఆ వర్షం నీటిని ఒడిసిపట్టినప్పుడు...
అది స్వచ్ఛమైన ఆకాశ గంగాజలం అని అంటున్నాము...గృహావసరాలకు వినియోగిస్తున్నాము....
మన ఇంటి బయట మట్టిలో పడిన వర్షం నీటిని బురద నీరు అని అంటున్నాము...
అదే బురద నీరు భూమిలోకి ఇంకి, బోర్వెల్ ద్వారా మళ్ళీ బహిర్గతమైనప్పుడు స్వచ్ఛమైన పాతాళ గంగాజలం అంటున్నాము...
అదే వర్షం నీరు పంట పోలాల్లోని బావులను / ఊర్లోని నీటి కుంటలను నిండు కుండలుగా చేసినప్పుడు...
అహా ఎంత చక్కని వర్షం నీరు....
రెండు పంటల సేద్యానికి సరిపడా కురిసిందని అభినందిస్తున్నాము...
అదే వర్షం నీరు చేతికంది వచ్చిన పైరును పాడుచేస్తే, ఆరబెట్టిన ధాన్యాన్ని / పంటను తడిపేస్తే,
దిక్కుమాలిన వర్షం నీరు...మొత్తం పంటను మింగేసింది అని తిట్టిపోస్తున్నాము...
అదే వర్షం నీరు గోదావరిని తరగని జలసిరిగా మార్చి డ్యాములను ఫుల్ గా నింపేస్తే అహా ఓహో అని ఎంత ఆనందదాయకమైన వర్షం అని అంటున్నాము...
అదే వర్షం నీరు గోదావరిని వరదగోదారి గా మార్చి
ఊర్లకు ఊర్లను, రహదారులను, వంతెనలను,
మింగేసే ఉగ్రగోదావరిగా మారితే, మళ్ళీ మనమే...
దిక్కు మాలిన వర్షాలు, వరదలు అని తిట్టి పోస్తున్నాము....
సొ ఇక్కడ గమనిస్తే...
భూమిని, భూలోక వాసులను చేరేంతవరకు మేఘమండలం నుండి భూ ఉపరితలం వరకు అది అన్ని చోట్లా ఒకేలా ఉండే వర్షం నీరు...
పైన పేర్కొన్న వివిధ భేదాలు, భావాలు అన్నీ కూడా మనం నివసించే ప్రాంతాల్లో, మనం ఒడిసిపట్టిన విధానాల్లో, మనం స్వీకరించిన పద్ధతుల్లో ఏర్పడినవే కాని అవన్నీ కూడా భూమిని చేరేంతవరకు
వర్షం అని అనబడే ఒకే జలతత్త్వంలో భాగమైన జలం...
భూమికి చేరుకున్న తదుపరి మాత్రమే మనచే గ్రహింపబడినదానికనుగుణంగా ఆ వర్షం / వర్షం నీరు వివిధ నామాలతో, భేదభావాలతో గుర్తింపబడుతుందే కాని నిజానికి అది వర్షం అనబడే ఒకేఒక నిర్గుణ నిరాకార నిర్మల జలతత్త్వం.....
అచ్చం ఇదే విధంగా, సర్వే సర్వత్రా పరివ్యాప్తమై పరిఢవిలే ఒకే ఒక పరమాత్మ తత్త్వం.....
( "తజ్జలాన్...." అని ఆ పరతత్త్వాన్ని జలతత్త్వంగా శ్రీ చాగంటి సద్గురువులు వివరించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది.....)
ఈ భూలోక వాసులకు, వివిధ చోట్ల, వివిధ రీతుల, వివిధ తత్త్వప్రతిపాదనల, వివిధ సిద్ధాంతాల, వివిధ ఆచారవ్యవహారాల, వివిధ విశ్వాసాల / నమ్మకాల, కు అనుగుణంగా స్వీకరింపబడినప్పుడు / గ్రహింపబడినప్పుడు.
ఆ నిర్గుణ నిరాకార నిర్మల పరమాత్మ తత్త్వమే...
ఈ భువిపై సగుణ సాకార గుణాత్మక తత్త్వం గా వివిధ గౌణములతో ఆరాధింపబడి గ్రహింపబడుతున్నది...
కాబట్టి
" అగ్రాహ్యః శాశ్వతః " అని శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం లో నిత్యం ఎల్లరి లోగిళ్ళలో స్తుతింపబడే ఆ పరమాత్మ తత్త్వం గ్రహింపబడని శాశ్వతమైన ఏకత్వమైన / ఒక్కటే అయిన అద్వైతం అనబడే పరమాత్మ తత్త్వమా....?
లేదా
ఎన్నో విధాలా ఎందరెందరో వారి వారి నిర్దేశిత మార్గాల్లో స్వీకరింపబడే ఒకటి కానిది అనగా వివిధత్వమైన భిన్నత్వమా...??
దానికి సమాధానం ..
"ఏకం సత్ విప్రాః బహుధా వదంతి..."
యద్ భావం...తద్ భవతి...."
అందుకే అన్నమాచార్యులవారు
ఆ బహురీతుల వెలిగే వైశ్విక బృహత్ పరబ్రహ్మతత్వాన్ని ఎంతో ఘనమైన రీతిలో
" ఆతడే బ్రహ్మణ్యదైవము...ఆదిమూలమైనవాడు..."
అంటూ ఒక చక్కని సంకీర్తనలో ఎవ్వరికీ ఎప్పటికీ పూర్తిగా చిక్కని చక్కనైన స్వామి యొక్క సత్ చిత్ ఆనందమయమైన తత్త్వ స్వరూపాన్ని కొనియాడినారు....
ఆతడే బ్రహ్మణ్యదైవము ఆది మూలమైన వాడు
ఆతని మానుటలెల్ల అవిథిపూర్వకము
ఎవ్వని పేర పిలుతురు ఇల పుట్టిన జీవుల
నవ్వుచు మాస నక్షత్ర నామముల
అవ్వల ఎవ్వని కేశవాది నామములే
రవ్వగా ఆచమనాలు రచియింతురు
అచ్చ మేదేవుని నారాయణ నామమే గతి
చచ్చేటి వారికి సన్యాసము వారికి
ఇచ్చ నెవ్వరి తలచి యిత్తురు పితాళ్ళాకు
ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము
నారదుడు తలచేటినామ మది యెవ్వనిది
గౌరినుడిగేటినామకథ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరి నామకు
యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వడిచ్చీ వరము
in english:
AtaDE brahmaNyadaivamu Adi mUlamaina vADu
Atani mAnuTalella avithipUrvakamu
evvani pEra piluturu ila puTTina jIvula
navvuchu mAsa nakshatra nAmamula
avvala evvani kESavAdi nAmamulE
ravvagA AchamanAlu rachiyiMturu
achcha mEdEvuni nArAyaNa nAmamE gati
chachchETi vAriki sanyAsamu vAriki
ichcha nevvari talachi yitturu pitALLAku
muchchaTa nevvani nAmamulanE saMkalpamu
nAradudu talachETinAma madi yevvanidi
gaurinuDigETinAmakatha yEDadi
tArakamai brahmarudratati kevvari nAmaku
yIrIti SrIvEMkaTAdri nevvaDichchI varamu
No comments:
Post a Comment