Thursday, March 16, 2023

శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2023 మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి / భానుసప్తమి పర్వదిన శుభాభినందనలు....😊🍨🍎🎂💐🍕✨🎇


" మాఘపంచకం " అనే 5 నెలల
( మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం) ఉత్తరాయణపుణ్యకాలం లోని ప్రహృష్టమైన ముహుర్తాల కోసం ఎంతో మంది ఎదురుచూడడం గురించి వినేఉంటారు.... 
సూర్యకాంతి అధికంగా లభ్యమయ్యే మన రోజువారి లౌకిక 06.00 AM thru 04.00 PM అనే పట్ట పగలు సమయం లో ఎవ్విధంగా ఐతే మనం మన విహిత కర్తవ్యాలను నిర్వహించుకునేలా ఉద్యుక్తులమౌతామో అవ్విధంగా "దేవతలకు పగటి సమయం" అనబడే ఈ మాఘపంచక సమయంలో వీలైనన్ని ఎక్కువ శుభకార్యాల ముహుర్తములు మన పెద్దలు సెలవివ్వడానికి గల కారణం, 
లౌకికంగా ఆత్మశక్తికి ప్రతీకగా చెప్పబడే సూర్య శక్తి మెండుగా ఉండే సమయం.....
మరియు అలౌకికంగా "ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తి నారాయణః సరసిజాసనః....." అంటూ స్తుతింపబడే ప్రత్యక్ష పరమాత్మ అయిన సూర్యనారాయణుడే

"బ్రహ్మస్వరూప ఉదయే.... 
మధ్యాహ్నేతు మహేశ్వరః...
అస్తకాలే స్వయం విష్ణుః....
త్రయీమూర్తిర్దివాకరః...."

అని స్తుతింపబడినట్టుగా, త్రిమూర్త్యత్మక ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు..... 

ఈ భూలోకానికి సంబంధించని సూర్యుడు అనబడే ఒకానొక గొప్ప స్వప్రకాశక నక్షత్రం, ఈ భూలోకాన్ని ఏ విధంగా తరింపజేస్తున్నది, అనగా సూర్యశక్తి యొక్క గొప్పదనం గురించి చాలా సింపుల్ ఉదాహరణతో చెప్పాలంటే..... 

శ్రీచాగంటి సద్గురువుల బోధలో చెప్పబడినట్టుగా..... బ్రహ్మగారి సృష్టికి చెందనటువంటి ఒక గొప్ప ప్రాణి అయిన గోవును ఎగ్సాంపుల్ గా తీసుకుందాము..... 

అక్కడక్కడా పెరిగే ఎవ్వరికీ పెద్దగా ఉపయోగపడని గడ్డిని ఆహారంగా స్వీకరిస్తూ, ఎక్కడ ఏ వాహినుల్లో ఏ నీరున్నా సరే తాగుతూ.....
ఈ భూలోకంలోని ఏ సైంటిస్టూ కూడా తయారు చేయలేనటువంటి అమృతతుల్యమైన పాలను తద్వారా పెరుగును, వెన్నను, నెయ్యిని.....
మరియు సూక్ష్మ రూపంలోని బంగారు అణువులతో ఉండే సకల బాహ్యాంతర క్రిమినిర్మూలక ప్రాచీన ఔషధం గా అనాదిగా వినుతికెక్కిన గోపంచకం మరియు సువాసన తో కూడి ఉండి శ్రీమహాలక్ష్మికి ఆవాస స్థానమైన గోమయాన్ని.....
ఈ భూలోక వాసులకు ప్రసాదించే మహిమాన్వితమైన ఏకైక దైవిక జీవి, భారతీయ సనాతన ధర్మ వైభవానికి ఉనికిపట్టైన గోవు....!

ఆ పాలను, పెరుగును, వెన్నను, నెయ్యిని  మనం ఆరగించి లౌకిక శారీరక స్వస్థత / లబ్ధి ని పొందుతామా.....
లేక వేదోక్త నిత్యపూజ/హోమ/యజ్ఞ్య/యాగాది కృతువుల్లో కూడా వాటిని వినియోగించి దేవతానుగ్రహాన్ని బడసి తరిస్తామా అనేది వారి వారి విచక్షణకు వివేకానికి సంబంధించిన వ్యక్తిగత అంశం...... 

అచ్చం అదే విధంగా..... 

పాపడాలు, వడియాలు, మామిడి ఒరుగులు, 
ఊరగయలు, ఇత్యాది వాటికి సాధారణంగా అందరూ వినియోగించే....,
మరియు సోలార్ ఎనర్జి గా వివిధ సాంకేతిక ఉపలబ్ధి కొరకు శాస్త్రజ్ఞ్యులు ఓడిసిపట్టే ఆ సూర్యమండలజనిత సౌరశక్తిని,
ఉదయాద్రి నుండి అస్తాద్రి వరకు అవిరామంగా సంచరిస్తూ ఒక్కో సమయంలో ఒక్కోవిధమైన దైవిక తేజస్సును వర్షించే ఆ సూర్యకిరణాలను మానవ మేధోకమలం యొక్క నిత్యవికసిత చైతన్య శక్తి కొరకు కూడా ఆరాధించి అందుకుంటామా అనేది వారి వారి విచక్షణకు వివేకానికి సంబంధించిన వ్యక్తిగత అంశం...... 

శ్రీచాగంటి సద్గురువులు ఈ దైవిక వైజ్ఞ్యానిక అంశాన్ని
" ధియోయోనః ప్రచోదయాత్.... "
అనే వేదవాక్యసమన్వయంతో ఎంతో గొప్పగా వివరించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది..... 

అంత గొప్ప సూర్యభగవానుడు ఎంతటి సులభుడంటే....
త్రికరణశుద్ధిగా గావించే ఒక్క నమస్కారానికే వరాలను అనుగ్రహించే దయాస్వరూపుడు....!
( అభిషేకప్రియో శివః...,అలంకారప్రియోర్విష్ణుః...,
నమస్కారప్రియో సూర్యః... అని కద మన ఆర్యోక్తి )

ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ (సప్తగిరి వారి సౌజన్యం) ఆస్తికులెల్లరూ ఇవ్వాళ్టి మాఘ శుద్ధ సప్తమి / రథసప్తమి పర్వసమయ ఆరాధన గావించి తరించే ఉంటారు... 

సూర్యభగవానుడు ప్రత్యక్షంగా కనిపించకపోయినా వృద్ధభానుడి, అనగా సాయాహ్నసంధ్యా సమయంలోని సూర్య బింబాన్ని ధ్యానిస్తూ ఆదిత్య స్తోత్రాన్ని పారాయణ గావించడం గురించి కూడా శ్రీచాగంటి సద్గురువులు బోధించి ఉన్నారు....

ప్రత్యక్ష సూర్య పరమాత్మను పరబ్రహ్మంగా శ్రీవేంకటపరతత్త్వంగా భావిస్తూ శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు ఈ క్రింది చక్కని సంకీర్తనను
అనుగ్రహించినారు.....

http://annamacharya-lyrics.blogspot.com/2010/05/700nityatmumdai-yumdi-nityumdai.html?m=1

ప : నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు - సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుఁ డీతిరువేంకటాద్రివిభుఁడు

చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-
డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁ- డేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁ గాఁడు - యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతఁ-
డేమూర్తి సర్వాతుఁ డేమూర్తి పరమాత్ముఁ- డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు

చ : యేదేవుదేహమున నిన్ని యును జన్మించె - నేదేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును - యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు - నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుంఁ- డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు

చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు - యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము - యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ- డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు

No comments:

Post a Comment