Thursday, March 16, 2023

ప్రియం బ్రూయాత్....!

శ్రీకరమైన దైవసన్నిధిలో పెద్దలుగా ఉంటూ కూడా, మనకంటే చిన్నవారికి ఏదైనా విషయం చెప్పవలసివస్తే ఏవిధంగా చెప్పాలో తెలియని గర్వులై ఉండేవారిని అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు.....

'నువ్వోపెద్ద పండితుడివి కద ఈ విషయం కూడ తెల్వదా...."
అని అందరిముందు ఎంతో కఠినంగా, నిష్టూరంగా పలికే విషయాన్నే....

"అలా కాదండి...ఇలా చేయడం ఉత్తమం..." అని తీర్థానికి / దక్షిణసమర్పణకు వచ్చినప్పుడో లేక ఒక్కడికే వినపడేలా చెప్పొచ్చు కదా అనే లౌక్యం తెలుసుకోరు....

మనం ఇంత నిష్టూరంగా పలికేముందు ఒక్కసారి అలోచించుకొని.....
ఆ వ్యక్తి / భక్తుడు మనల్ని ఎప్పుడైనా......

" మీరు గొప్ప పండితులు కద......
భక్తులతో పూజలు / అభిషేకాలు చేయిస్తున్నప్పుడు నందీశ్వరుడికి గర్భాలయస్థిత పరమేశ్వర లింగమూర్తికి మధ్యలో అంతంత సమయంపాటు నందీశ్వరుడికి పృష్ఠభాగాన్ని చూపిస్తూ నిల్చోరాదనే విషయం కూడ తెల్వదా....."
అని ఎప్పుడైనా అన్నాడా....?

" మీరు గొప్ప పండితులు కద......
అమ్మవారి ముందు శ్రీచక్రార్చన జరిగేలా ఆలయ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ పరమపవిత్రమైన శక్తివంతమైన శ్రీచక్రానికి కాళ్ళు చూపిస్తూ కూర్చొని భక్తులతో వెటకారంగా ముచ్చట్లు పెట్టకూడదు అనే విషయం కూడ తెల్వదా....."
అని ఎప్పుడైనా అన్నాడా....?

" మీరు గొప్ప పండితులు కద......
కుర్చి పై కూర్చొని ఉంటేనే భక్తులకు తీర్థం, శఠారి ఇవ్వడానికి అనువుగా ఉంటుంది అనేదే మీ సమాధానమైతే.....
అలా కూర్చునప్పుడు కాళ్ళు శ్రీచక్రయంత్రవ్యవస్థకు చూపకుండా ఎదురుగా వేసుకున్న బల్లకు / టేబుల్ కు కట్టబడిన ఒక ధోవతి లేక ఏదైనా వస్త్రం తో ఆఛ్చాదన / అడ్డు / తెర ఉండేలా ఏర్పాటు గావించుకొని అప్పుడు తీరిగ్గా కుర్చిపై కూర్చొని కాళ్ళు చాపుకొని వెటకారపు డైలాగ్స్ కొట్టొచ్చు...
అనే విషయం కూడ తెల్వదా....."
అని ఎప్పుడైనా అన్నాడా....?

" మీరు గొప్ప పండితులు కద......
ఎట్టి పరిస్థితుల్లోను శ్రీచక్రయంత్రవ్యవస్థకు పృష్ఠభాగాన్ని చూపేలా ఆలయంలో భక్తుల సంచారం ఉండకూడదు.....
అనే నియమానికి ఇబ్బంది కలిగేలా ఉండే
ప్రదక్షిణ మార్గం / వ్యవస్థలో ఎవ్విధంగా భక్తులు ఒకే స్లాబ్ క్రింద పక్కపక్కనే ఉన్న ఇరుమందిరాల్లో కొలువైన పార్వతీపరమేశ్వరుల మధ్యలోకి వెళ్ళి ఉత్తరభాగంలోని చండీశ్వరుని వద్ద సోమప్రదక్షిణం గావించడానికి సోమసూత్రాన్ని దాటకుండ తిరిగిరావడం కుదురుతుంది....?
శ్రీచక్రయంత్రవ్యవస్థకు పృష్ఠభాగాన్ని చూపిస్తూ రౌండ్ టర్న్ తీసుకొని పార్వతీపరమేశ్వరుల మధ్యలో వామభాగంలో (ఎడమదిక్కుకు) శ్రీచక్రం ఉండేలా నిల్చొని ఒక భక్తుడు ఎవ్విధంగా కేవల శివలింగ గర్భాలయ ప్రదక్షిణం కావించగలడు....??
అనే విషయం కూడ తెల్వదా....."
అని ఎప్పుడైనా అన్నాడా....?

" మీరు గొప్ప పండితులు కద......
'సంతోషోహి ద్విజన్మనాం.....'
అనే సూక్తి గురించి ఎప్పుడూ వినలేదా.....
ఒక్కసారైనా సంతోషంగా సంపూర్ణ స్వరాన్ని ఉదాత్త, అనుదాత్త, స్వరితమనబడే ముఖ్యమైన వేదస్వర స్థానాలు చక్కగా ఉచ్ఛరింపబడేలా 
సత్బ్రాహ్మణోత్తములకు నిజమైన అలంకరణగా భాసిల్లే సుస్వరాన్ని వినియోగించి రుద్రమంత్ర పఠనం గావిస్తూ రుద్రాభిషేక క్రతువును భక్తులచే నిర్వహింపజేసారా....?"
అని ఎప్పుడైనా అన్నాడా....?

మనతో కనీసం హెచ్చు స్వరంతోనైనా ఎన్నడూ మాట్లాడని వారితో, అందరిలో ఒకడిగా వచ్చిపోయే ఒక సామాన్య భక్తుడిని మనమెందుకు పనిగట్టుకొని అందరిముందు 
" నువ్వోపెద్ద పండితుడివి కద...." అని
నిష్టూరవచనాలు పలకాలి......
అనే అంతర్వివేచన కావించని వారికి,
అవతలి వ్యక్తి కొంచెం పద్ధతిగా పంచెకట్టు కట్టి సంప్రదాయరీతిలో అభిషేకానికి వస్తే ఓర్వలేని తనంతో ఉండేవారికి.......
ఏమిచెప్పినా పెద్దగా ఒంటపట్టవులే కాని ఏదో అలాంటి  వ్యక్తిత్త్వాలను కొన్ని సినిమాల్లో చూసినప్పుడు ఇలా ప్రశ్నించాలనిపించడం ఒక సగటు సామాన్య కవికి సహజమే కద.......

" సత్యం బ్రూయాత్
ప్రియం బ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం
ప్రియమపినబ్రూయాత్ అసత్యం "

అనే ఆర్షవాంజ్గ్మయం లోని రెండవ లైన్ ను బహుషహ ఇటువంటి గొప్ప పండితులు ఎప్పుడూ వినిఉండకపోవచ్చు....

ఓం శాంతిః శాంతిః శాంతి.....

No comments:

Post a Comment