జీవామృతసారం
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం॥
దధిక్షీరమ్ములకన్నా ఎంతో
మధుర మధుర నామం
సదా శివుడు ఆ రజతాచలమున
సదా జపించే నామం
కరకుబోయ తిరగేసి పలికినా
కవిగా మలచిన నామం....
"శ్రీ రామాంజనేయ యుద్ధం(1975)" చిత్రం లోని
ఆరుద్ర గారి అద్భుతమైన రచనకు కె.వి.మహదేవన్ గారు సమకూర్చిన సంగీతానికి పి.సుశీల, బి.వసంత గార్ల గానంతో ఎంతో ప్రఖ్యాతి పొందిన ఈ పాటను ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు కద.....
తనలో సగభామైన శక్తికి మరో పార్శ్వంగా అలరారే శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన
"ఓం నమోనారాయణాయ" అనే అష్టాక్షరి మహామంత్రం లోని " రా " బీజక్షరాన్ని మరియు తనను ప్రసన్నం గావించే
" ఓం నమఃశివాయ " అనే పంచాక్షరి మహామంత్రం నుండి
" మ " అనే బీజాక్షరాన్ని సంగ్రహించి " రామ " అనే నామధేయాన్ని శ్రీవశిష్ఠ మహర్షులవారు కౌసల్యా దశరథమహారాజు యొక్క పెద్దకుమారిడికి నామకరణం గావించిన వృత్తాంతాన్ని కూడ వినేఉంటారు....
ఆ శ్రీరామ తారకమంత్రాన్నే గౌరీశంకరులు కైలాసంలో నిత్యం జపించడం....మరియు ఆ పరమేశ్వరుడి అరూపరూపమైన శివలింగాన్ని పలు చోట్ల శ్రీరాములవారే స్వయంగా ప్రతిష్ఠించిన వృత్తాంతాలు కూడా ఎల్లరికీ ఎరుకే..... (శ్రీశైలం, రామేశ్వరం, కీసరగుట్ట, ఇత్యాది ఎన్నో పుణ్యక్షేత్రాల ఐతిహ్యంలో వినే ఉంటారు కద)
కాబట్టి శివకేశవులెప్పుడూ కూడా పరస్పర సంఘటిత దైవికతత్త్వాలుగా ఉంటూ పరిపూర్ణులై ఒక్కటిగా అలరారే అద్వయమైన పరమాత్మ తత్త్వం......
సూర్యచంద్రులు వేరువేరుగా కనిపిస్తున్నా సరే వారిరువురు కూడా పరస్పర సంఘటిత శక్తి పుంజాలుగా అలరారుతూ....దివారాత్రములకు అధిపతులై మనిషికి ఆత్మ శక్తిని, మనో శక్తిని ప్రసాదిస్తూ ఉండే మన లౌకిక వ్యవస్థనే ఎగ్సాంపుల్ గా తీసుకుంటే.......
ఆత్మ శక్తి బాగా ఉన్నా సరే మనో శక్తి క్షీణించిన నాడు మనిషి లుప్తచేతనావస్థలో ఉండే ఒక జడంలా ఉండే జీవి గా కనిపిస్తాడు....
ఫర్ ఎగ్సాంపుల్ తపస్సులో ఉన్న ఒక యొగి ని దర్శిస్తే ఈ స్థితి ఎట్లుంటదో అవగతమౌతుంది....
సకలేంద్రియ పటాటోపం ప్రయత్నపూర్వకంగా లుప్తమై,
మనోశక్తి అంతర్ధానమై, చిత్తవృత్తులన్నీ కూడా సమసి విశ్వవ్యాపకమైన ఆత్మతత్త్వమునందు చిత్తముస్థిరీకరింపబడి తదేక సాధనతో అంతర్ముఖుడై ఉన్న ఒక యోగి బయటకు ఒకరకమైన నిద్రాస్థితిలో ఉన్న ఒక పిచ్చివాడిలా కనిపించవచ్చు......
ఎందుకంటే ఇక్కడ ఆ యోగి ని దర్శిస్తున్న అవతలి వ్యక్తి యొక్క బహిర్ముఖస్థితికి ఆ యోగి యొక్క అంతర్ముఖ స్థితి ఎవ్విధంగానూ ఇంద్రియగ్రాహ్యం కానిది....కాబట్టి తన మనోపరిధికి అందని ఒకానొక ఉన్నతమైన ఆంతర స్థితిని తన బుద్ధి ఏమని వర్నించగలదు....?
"ఫలాన స్థితి అని వర్నించశక్యం అవ్వట్లేదు కాబట్టి మామూలుగా ఏదో ఒకటి అనాలి కాబట్టి ఏదో శూన్యంలోకి జారుకొని నిద్రపోయినట్టున్నాడు....."
అని అనలేని సగటు సామాన్యుడు
" ఏదో పిచ్చోడిలా కనిపిస్తున్నాడు...." అని అనేయడం కామన్ గా సినిమాల్లో వినేఉంటారు.......
అదే యోగి కొంతకాలానికి బహిర్ముఖుడై
తను ఆర్జించుకున్న తపోశక్తిని వివిధ రూపాల్లో తన మనసు.... తద్వార తన ఇంద్రియాల ద్వరా అవతలి వ్యక్తికి ఇంద్రియగ్రాహ్యమయ్యే శక్తిగా ప్రకటనం గావిస్తున్నప్పుడు అతని ఉన్నతమైన ఆత్మశక్తిలో ఇన్నిరోజులు కూడా స్థితిశక్తి రూపంలో గుప్తంగా సంక్షిప్తమై ఉన్న సూక్ష్మ రూప గతిశక్తి ఇప్పుడు స్థూల ప్రపంచానికి మనుష్య ఇంద్రియగ్రాహ్య గతి శక్తిగా ప్రకటనం గావింపబడుతున్నది అనేది ఇక్కడ ఎల్లరూ గమనించగలిగే సత్యం....
కాబట్టి ఎవ్విధంగానైతే సూర్యుడి నుండి ప్రభవించే ఆత్మశక్తి, మరియు సూర్యుడి నుండి పరావర్తన శక్తిగా షోడశ కళలరూపంలో సమకూరే చంద్రశక్తి జనిత మనో శక్తి, మనిషి యొక్క జీవితాన్ని పరిపూర్ణం గావిస్తున్నాయో.....
అచ్చం అదేవిధంగా శ్రీమహావిష్ణువు యొక్క స్థితి,
రుద్రుడి యొక్క లయ ప్రక్రియలు పరస్పర సంఘటిత పరిపూర్ణతత్త్వాలే కాని రెండూ సంబంధం లేని రెండూ వివిధ తత్త్వాలు అని భావించడం ఒక భ్రమ....
పగలు ఉండే జాగ్రత్ అవస్థకు గల ప్రాముఖ్యతే రాత్రి ఉండే సుషుప్తి అవస్థకు కూడా కలదు......
పరిశుద్ధమైన గాలిని పీల్చి ప్రాణవాయువును (O2) అందుకోవడం ఎంత ముఖ్యమో.....
ఆ ప్రక్రియ యొక్క పర్యవసానముగా
ఆంతరజనితమైన బొగ్గుపులుసువాయువును (CO2)
నిశ్వాస గా బయటికి వినిర్ముక్తపరచడం కూడా అంతే ముఖ్యం.....
ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించడం ఎంత ముఖ్యమో......
ఆంతరజనిత వ్యర్ధాలను విసర్జించడం కూడా అంతే ముఖ్యం......
సృష్టిలో ప్రభవించిన ప్రతీప్రాణిలోను ఈ స్థితిలయలు అనే ప్రక్రియలు ఎల్లప్పుడూ కూడా పరస్పర సంఘటిత అద్వయ తత్త్వాలుగా పరిణమిస్తూనే ఉంటాయ్......
మనిషికి వాటిని సరిగా అర్ధం చేసుకోవడం రాదు కాబట్టే స్థితి వేరు... లయ వేరు.....స్థితికారుడు వేరు లయకారుడు వేరు అనే ఒకానొక భేదభావంతో వాటిని వేరుచేసి కొందరు వర్నిస్తూ ఉంటారు........
సనాతనమైన సత్యమైన సార్వకాలికమైన సార్వజనీనమైన అద్వైత తత్త్వాన్నే....
బహువిశేషంగా ఆరాధించే విశిష్టాద్వైత తత్త్వంగా,
పరమాత్మ తత్త్వాన్ని సులభంగా అందుకొని రసభావరాగరంజితమైన సంకీర్తనల్లోకి రంగరించి లోకాన్ని అనుగ్రహించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు అందుకే భూగత శ్రీవేంకటశైలస్థిత అప్రాకృత పరతత్త్వాన్ని...
"ఈతడే హరుడు...ఈతడే అజుడు....."
అనే ఈ క్రింది హృద్యమైన సంకీర్తనతో స్తుతించారు.....
P : ఈతడే హరుడు యీతడే యజుడు
ఈతనికి నీ చేతలెంత ఘనమటుగాన
C1 : కడుపెక్కు బ్రహ్మాండ
కటకములు సుడివడిన
కడుపులో నిడుకొన్న ఘనుడు
వెడలి పూతకిచంటి
విషము తాగిన యంత
వడి తనకు నేమాయ వట్టిబూమెలుగాక
C2: ఎల్లజలధులు మిగిలి యేకమై పబ్బినపు-
డుల్లసిల్లుచు నీతడుండు
మల్లాడి యొక రెండు మద్దులు విరచినట్టి
బల్లిదుడవని నిన్ను పరిణమింతురు గాన
C3: తిరువేంకటేశ్వరుడు దేవ దేవోత్తముడు
పరిపూర్ణుడచ్యుతుడభవుడు
శరణాగతుల రక్షసేయు వాడనుమాట
గురుతుగా తలపోసి కొనియాడాగా వలసె
[ http://annamacharya-lyrics.blogspot.com/2008/03/434itade-harudu-yitade-yajudu.html?m=1 ]
శ్రీపోతనామాత్యుల వారు ఈ క్రింది శ్రీమద్భాగవత కంద పద్యంలో స్తుతించింది కూడా పైన అన్నమాచార్యుల వారు 2వ చరణంలో పేర్కొన్న శివకేశవ అభేద తత్త్వంగా అలరారే వటపత్రశాయి పరతత్త్వాన్నే...
8-75-క.
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.
భావము:
లోకాలు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం, ఆ కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను.
[ http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=13&Padyam=75.0 ]
శివకేశవ అభేద భావంతో పరమాత్మను స్తుతించే ఒక అద్భుతమైన స్తోత్రాన్ని మరియు ఆర్షవాంగ్మయంలోని శ్లోకాలను క్రింద జతపరిచాను....
ఓం నమో అరుణాచలేశ్వరాయ
అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా....
అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా....
" అరుణాచలశివ " అనే శివ సప్తాక్షరి ప్రయుక్త శ్లోక మంత్రం అత్యంత శీఘ్రంగా భక్తులకు ఆ లయకర్తయొక్క అనుగ్రహాన్ని మరియు మనోలయాన్ని ప్రసాదించే సాధనం అని విజ్ఞ్యుల ఉవాచ.....
ఇల్లు, పెళ్ళి, పిల్లలు, సంసార బాధ్యతలు, ఉద్యోగం, వ్యాపారం, వ్యాపకం, జీవితాభ్యున్నతి, పిల్లల పెళ్ళిళ్ళు, మనవలు మనవరాళ్ళ పెళ్ళిళ్ళ వరకు
అలోచిస్తూ జీవించే సగటు సామాన్య మనిషికి
నిత్యం మనోలయమౌతూ శూన్యంగా భావించబడే పూర్ణమైన పరమాత్మ తత్త్వంలోకి మనిషి యొక్క మనసు నిమగ్నమై ఉండిపోవడం గృహస్తాశ్రమధర్మాన్ని
స్వీకరించిన వారికి కుదరదు కనక....
ప్రతి సంవత్సరం మాఘబహుళ చతుర్దశి అనగా మహాశివరాత్రి పర్వ మధ్యరాత్రి లింగోద్భవ సమయంలో నా శివలింగస్వరూపాన్ని విశేషంగా అభిషేకించి ధ్యానించి ఆరాధించి సేవించి సంవత్సర కాలానికి సరిపడే విశేషమైన లయకర్త అనుగ్రహాన్ని సముపార్జించుకోండి అని సెలవిస్తూ ఎంతో ఉదారుడు ఆశుతోషుడు భక్తసులభుడు గా అలారారే ఆ రుద్రుడు శైవాగమోక్త ఎన్నెన్నో దేవాలయాల్లో దేశమంతటా కొలువైఉండి అనుగ్రహహించడం మన భాగ్యవిశేషం....
ఈ క్రింది శ్రీరుద్రనమకమంత్రపఠన విభాగంలో
శ్రీశివపంచాక్షరి నిక్షిప్తమై ఉన్న విశేషం గురించి శ్రీచాగంటి సద్గురువుల వివరణ చలామంది భక్తులకు ఎరుకే అనుకుంటా.....
नमः॒ सोमा॑य च रु॒द्राय॑ च॒ नम॑स्ता॒म्राय॑ चारु॒णाय॑ च॒ नमः॑ श॒ङ्गाय॑ च पशु॒पत॑ये च॒ नम॑ उ॒ग्राय॑ च भी॒माय॑ च॒ नमो॑ अग्रेव॒धाय॑ च दूरेव॒धाय॑ च॒ नमो॑ ह॒न्त्रे च॒ हनी॑यसे च॒ नमो॑ वृ॒क्षेभ्यो॒ हरि॑केशेभ्यो॒ नम॑स्ता॒राय॒ नम॑श्श॒म्भवे॑ च मयो॒भवे॑ च॒ नमः॑ शङ्क॒राय॑ च मयस्क॒राय॑ च॒ नमः॑ शि॒वाय॑ च शि॒वत॑राय च॒ नम॒स्तीर्थ्या॑य च॒ कूल्या॑य च॒ नमः॑ पा॒र्या॑य चावा॒र्या॑य च॒ नमः॑ प्र॒तर॑णाय चो॒त्तर॑णाय च॒ नम॑ आता॒र्या॑य चाला॒द्या॑य च॒ नमः॒ शष्प्या॑य च॒ फेन्या॑य च॒ नमः॑ सिक॒त्या॑य च प्रवा॒ह्या॑य च ॥ 8 ॥
ఆ సాంబసదాశివుడు హరుడిగా మన దురితాలను సదా హరిస్తూ, శంకరుడిగా సదా శుభపరంపరలను అనుగ్రహిస్తూ మన భక్తిప్రపత్తులకు అనుగుణంగా జీవితాలను తరింపజేయుగాక అని ప్రార్ధిస్తూ....
హరనమఃపార్వతీపతయే
హరహరమహాదేవశంభోశంకర.....
సర్వం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి శ్రీచరణారవిందార్పణమస్తు...🙏🙏🙏🙏🙏
☺️💐
No comments:
Post a Comment