Thursday, March 16, 2023

ఈశ్వరానుగ్రహమైన స్వాధ్యాయంతో పైన పేర్కొనబడిన నా అభిప్రాయంపై ఎవరైనా విజ్ఞ్యులు...,( అనగా ఈశ్వరానుగ్రహమైన శాస్త్రాన్ని సద్వర్తనులైన ఎవ్వరైననూ పరిశీలన, అధ్యయనం గావించవచ్చు అనే ఉన్నతమైన మనస్తత్త్వం, హృదయవైశాల్యం, భావపరిణత గల మాన్యులు....)ఎట్టివివాదాలకు కూడా తావివ్వని ప్రత్యక్ష సంభాషణ కానటువంటి......(అనగా మౌనసూచన, చిత్రలేఖనం, పరోక్ష సూచితమైన వాక్యాంతర్గతంగా నిక్షిప్తమై ఉండే క్రోడీకృత సంభాషణ, ఇత్యాదిగా ఉండే ఎన్నో మాధ్యమాల ద్వారా) వారి వారి అభిప్రాయం, విలువైన సూచనలను, తెలియజేయగలరని మనవి....

2.గురుశుక్రమౌఢ్యములను త్యజించిన....
3. ముఖ్యమైన కుజబుధగురుశుక్రశని గ్రహ ఖగోళ సంచారముల వక్రగమన కాలాన్ని త్యజించిన....
4. పంచకరహితమైన.....
5. దగ్ధతిధివార కూటములను త్యజించిన....
6. చి, అను, ధ, ఉత్తర, ఉ.ఆ, ఉ.భా, రే, శ, రో, మృ, పుష్యమి అనే 11 స్థిర, సాధు, సౌమ్య, స్వభావ నక్షత్రములలో యజమానికి నైధన, విపత్, ప్రత్యక్, జన్మ తారలను త్యజించి....
7. వృషభ, సిమ్హ, వృశ్చిక, కుంభమనబడే ఏదేని ఒక స్థిర లగ్నమునందు....
8. తారాబలచంద్రబలమును కలిగి
9. అన్నివిధాలా త్యజనీయమైన యోగకరణాలు కానటువంటి శుభయోగకరణములందు.....
గృహప్రవేశం కావించడం ఉత్తమం అనేది పంచాంగశాస్త్ర ముఖ్య అభిప్రాయం.....

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణమనే 5 అంగములు కూడా మనకు కావలసిన విధంగా సమకూరి, వృషభచక్రశుద్ధి, కలశచక్రశుద్ధి ని గడించిన ముహూర్త లభ్యత అనేది ఎవ్వరికైననూ దుర్లభము కావున, ఇందులో శ్రేష్ఠమైన నక్షత్ర, యోగముల ఎన్నికకు అధిక ప్రాధాన్యత ఉండేలా సామాన్య, మధ్యస్తమైన ముహూర్తములు కూడా స్వీకరింపయోగ్యమే అనేది నా అభిప్రాయం....

ఈశ్వరానుగ్రహమైన స్వాధ్యాయంతో పైన పేర్కొనబడిన నా అభిప్రాయంపై ఎవరైనా విజ్ఞ్యులు...,
( అనగా ఈశ్వరానుగ్రహమైన శాస్త్రాన్ని సద్వర్తనులైన ఎవ్వరైననూ పరిశీలన, అధ్యయనం గావించవచ్చు అనే ఉన్నతమైన మనస్తత్త్వం, హృదయవైశాల్యం, భావపరిణత గల మాన్యులు....)
ఎట్టివివాదాలకు కూడా తావివ్వని ప్రత్యక్ష సంభాషణ కానటువంటి......(అనగా మౌనసూచన, చిత్రలేఖనం, పరోక్ష సూచితమైన వాక్యాంతర్గతంగా నిక్షిప్తమై ఉండే క్రోడీకృత సంభాషణ, ఇత్యాదిగా ఉండే ఎన్నో మాధ్యమాల ద్వారా) వారి వారి అభిప్రాయం, విలువైన సూచనలను, తెలియజేయగలరని మనవి....

శ్రీశారదాంబ నమోస్తుతే.....🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment