ఈ పెద్దాయన పేరు వినగానే ఎంతో మంది తెలుగు సినీ పరిశ్రమవర్గాలవారే కాదు....ఎంతో మంది తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా చెప్పనలవి కాని ఒక గొప్ప గౌరవ భావం....
ఈ లోకంలోని ఎన్నో కళలను ఒక్కో వ్యక్తి ఒక్కో సృజనాత్మక శైలిలో అందిపుచ్చుకుంటూ తరిస్తూ ఉంటారు....
అట్టి ఎన్నో కళలను కళ్ళకుకట్టినట్టుగా సినిమా అనే ఒక దృశ్యమంజరి మాధ్యమం ద్వారా ఆవిష్కరించిన ఒక గొప్ప "కళాతపస్వి" గా వినుతికెక్కిన విశ్వనాథ్ గారి దర్శకత్వవైభవం ఎందరెందరో సినీసంగీతసాహిత్యాభిమానులకు విదితమే....
తెలుగు సినీదర్శకజగత్తుకు మకుటంలేని మహారాజుగా పేర్గాంచి ఎన్నెన్మో వైవిధ్యభరిత చిత్రాలను రూపొందించి ఆపాతమధురాలుగా రాబోయే ఎన్ని తరాలకైనా గుర్తుండిపోయే గొప్ప గొప్ప నాణ్యమైన కథాంశాలతో వెలువడిన వారి చిత్రాలు వీక్షకులకు ఎప్పటికీ నిత్యనూతన మందారమకరందాలే.....
గంపెడు గడ్డిపూల కన్న గుప్పెడు మల్లెపువ్వులు మిన్న...
అన్న చందంగా....
నాణ్యమైన కథాంశాలు, నవరసభరిత అభినయం, వినసొంపైన సంగీతం, ఆలోచనాత్మక సాహిత్యం, తో రంగరింపబడిన చిత్రాలకే ప్రజాదరణ కలకాలం ఉంటుంది అని నమ్మిన వారిలో శ్రీ కే.విశ్వనాథ్ గారు అగ్రగణ్యులు......
"ఝుమ్మంది నాదం...." అని వారి మొట్టమొదటి సినిమాలోని సంగీతఝరి నుండి మొదలై,
"పరవశానశిరసూగంగా ధరకుజారెనా శివగంగా...." అనే అత్యత్భుతమైన భావమంజరిని ఆవిష్కరించిన శంకరాభరణం తో జగద్విఖ్యాతమైన ఖ్యాతిని గడిస్తూ సాగిన వారి దర్శకత్వ వైచిత్రి కళాభిమానులందరికి ప్రసాదించిన హృద్యమైన జ్ఞ్యాపకాలు ఎన్నో ఎన్నెన్నో....!
అటువంటి ఒక గొప్ప మహనీయుని నిర్యాణం సినీజగత్తుకు తీరని లోటు.....
92 వత్సరముల ఐహిక కళాత్మక జీవితానికి స్వస్తి పలికి
శ్రీకైవల్యపదాన్ని అధిరోహించే పయనంలో ఉన్న వారి దివ్యదేహం ఆ పరమాత్మను చేరి విశ్రమించుగాక అని ప్రార్ధిస్తు.....
వారికి ఒక సుసంగీతసాహిత్యాభిమాని యొక్క చిరు అక్షరనివాళి....🙏💐
https://www.thehindu.com/news/national/telangana/filmmaker-par-excellence-kalatapasvi-viswanath-no-more/article66464730.ece
No comments:
Post a Comment