శ్రీకరమైన వారి వారి జీవితపయనంలో ప్రారబ్ధరీత్యా ఒక్కొక్కరికి ఒక్కో ఇబ్బంది / అలర్జి / ఫోబియ / టర్న్ ఆఫ్ / చిరాకు ఇత్యాదిగా వ్యవహరించబడే దుఃఖ కారణం అనేది ఉండడం మనం సమాజంలో గమనించవచ్చు.....
"ఫలానా వస్తువులు / విషయాలంటే నాకు అస్సలు పడవండి...."
అనే మాటతో ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని సాధారణంగా మనం అంటూఉంటాం......
అది శారీరకమైన చిరాకు కావొచ్చు....మానసికమైన చిరాకు కావొచ్చు.....కారణాలు ఏవైనా కావొచ్చు......
అవి అర్ధం చేసుకొని సాటిమనిషి పట్ల మానవతా దృక్పథంతో వారి వారి ప్రశాంతతకు ఇబ్బంది కలిగించకుండ ఉండడం అనేది మానవత్వం అనిపించుకుంటుంది......లేనిచో ఒక మనిషికి మరియు ఒక పిచ్చి కుక్కకు తేడా ఏముంటుంది....?
కొందరికి పాలు/పెరుగు పడవు.....
కొందరికి పసుపు పడదు....
కొందరికి హోళి రంగులు పడవు....
కొందరికి కొన్ని రకాల పానియాలు పడవు....
కొందరికి కొన్ని రకాల పువ్వులు పడవు....
కొందరికి కొన్ని రకాల పండ్లు పడవు....
కొందరికి బస్ ప్రయాణం పడదు.....
కొందరికి ట్రైన్ ప్రయాణం పడదు....
కొందరికి పడవ ప్రయాణం పడదు....
కొందరికి ఎత్తైన ప్రదేశాలంటే పడవు...
కొందరికి లోతైన ప్రదేశాలు / గుహలు అంటే పడవు...
కొందరికి కుక్కలంటే పడవు.....
కొందరికి కుక్కల అరుపులంటే పడవు.....
కొందరికి పక్షులంటే పడవు.....
కొందరికి పక్షుల / జంతువుల వాసనలంటే పడవు...
కొందరికి దుమ్ము/ధూళి/ పడవు...
కొందరికి తాగడం, తాగుబోతులు, తాగినతర్వాత వారు కొనసాగించే చిల్లర అరుపులు, సొల్లు, లొల్లి, వాగడం, ఇత్యాది సకల దరిద్రం పడదు......
ఇత్యాదిగా ఈ సమాజంలో కొంత మందికి
కొన్ని రకాల వస్తువులు / విషయాలు ఇబ్బందికరమైన
దుఃఖ కారణం అని వారు చెప్పినప్పుడు, వారికి ఆ ఇబ్బంది కలిగించకుండా మెలగడం అనేది కనీస మనుష్యధర్మం......
ఫర్ ఎగ్సాంపుల్......కొన్ని సీరియల్స్ లో చూసేఉంటారు......
ఒకరికి పాలు/పెరుగు అంటే బాగా ఇష్టమైతే అవి పడని వారికి దూరంగా వెళ్ళి స్వీకరించాలి..అంతే కాని వారి పరిసరాల్లో పాల వాసన కూడా కొందరు భరించలేరు అని తెలిసి కూడా వారికి ఆ ఇబ్బంది కలిగిస్తుంటే......
"నీకు మెంటల్ ఆ.... చెప్తే అర్ధం కాదా..నాకు పాలవాసన వస్తే చాలు తలనొప్పి, వాంతులు, ఇత్యాదిగా మొత్తం మనిషిని డిస్టర్బ్ ఐపోతాను....." అంటూ సదరు వ్యక్తి నోరుపారేసుకోవడం చూసేఉంటారు.....
అదే విధంగా పైన పేర్కొన్న ప్రతి పాయింట్ కు కూడా ఇదే రకమైన వాదప్రతివాదాలు ఉండడం......ఇక లాస్ట్ పాయింట్ గురించి.....
ఒకరికి తాగితూలడం అంటే బాగా ఇష్టమైతే అవి పడని వారికి దూరంగా వెళ్ళి స్వీకరించాలి.....దూరంగా ఉండాలి... .అంతే కాని వారి పరిసరాల్లో మందు వాసన కూడా కొందరు భరించలేరు అని తెలిసి కూడా వారికి ఆ ఇబ్బంది కలిగిస్తుంటే......
"నీకు మెంటలారా తాగుబోతు లుచ్చ బాడ్ఖావ్... చెప్తే అర్ధమై సావదా......మందు వాసన వస్తే చాలు తలనొప్పి, వాంతులు, ఇత్యాదిగా మొత్తం మనిషిని డిస్టర్బ్ ఐపోతాను.....నా బీపీ కట్టలు తెగి ఏంచేస్తనో నాకేతెల్వదు...." అంటూ సదరు వ్యక్తి నోరుపారేసుకోవడం చూసేఉంటారు....
ఇవ్విధంగా కలహానికి, కష్టానికి కారణమయ్యే వస్తువులను / విషయాలను / పదార్ధాలను అవి పడని వారికి దూరంగా ఉండేలా వ్యవహరించడం
అనేది కనీస మానవత్వం అనిపించుకుంటుంది......
అది గౌరవింపబడని నాడు జీవితం ఎల్లరికీ కూడా కలహాలమయమై అశాంతిభరితమై మనిషి మానసికంగా శారీరకంగా ఆరోగ్యం దెబ్బతిని కృంగికృశించిపోతాడు అనేది ఎవ్వరికైనా తెలిసిఉండవలసిన కనీస విజ్ఞ్యత......
లేని నాడు ఒక పిచ్చి కుక్కతో వ్యవహరించినట్టే సదరు మూర్ఖుడితో కూడా వ్యవహరించడం అనేది అనివార్యమైన ప్రయాసేవుతుంది...
No comments:
Post a Comment