Friday, March 17, 2023

విదురుల వంటి మహాత్ములు ఈ కలియుగంలో కూడా ఉంటారని భావించడంలోనే విజ్ఞ్యత ఉంటుంది.......


ఎల్లప్పుడూ కూడా ప్రజల హృదయాన్ని గెలిచే వ్యక్తిగా ఉండడంలోనే అసలైన విజయం ఉంటుందని భావించాడు కాబట్టి రాముడు రాజారాముడైనాడు....
అనగా ఒక గొప్ప నేత గా గుర్తింపబడినాడు.....

ప్రజలు కేవలం తమ బానిసలుగా మాత్రమే ఉండాలని భావించారు కాబట్టి రావణుడు, దుర్యోధనుడు అసురులుగా...అనగా నియంతలుగా, రాక్షసాధములుగా చరిత్రలో మిగిలిపోయారు.....

విజ్ఞ్యులైన ప్రజలు వారికి ఏఏ వస్తువులు మంచివని భావించి కొనుక్కోవాలనుకుంటే, తమ ఏలుబడిలో ఉన్నందుకు, వాటిని అమోదించి ప్రజలకు అందించేవారు రాజారాముడిలాంటి నేతలుగా గుర్తింపబడతారు.....

ఫలానా వస్తువే నువ్వు తీసుకోవాలి అనేలా ఒక నియంతవైఖరిని ఎవరైనా అవలంబిస్తే.....
అది పాండవులను లాక్షాగృహంలోకి వెళ్ళమని చెప్పిన దుర్యోధనుడి వైఖరిలా ఉంటుంది అని గ్రహించడం వివేకం అనిపించుకుంటుంది.......

విదురుల వంటి మహాత్ములు ఈ కలియుగంలో కూడా ఉంటారని భావించడంలోనే విజ్ఞ్యత ఉంటుంది.......

No comments:

Post a Comment