Friday, March 17, 2023

The depth of the knowledge and the vastness of the wisdom does make a huge difference to the perspective...

ఇంగితం, విచక్షణ, మరియాద, గౌరవం, స్వాభిమానం, అనే పదాలకు సరిగ్గా అర్ధం, భేదం తెలియక కొందరు తరచూ కన్ ఫ్యూస్ అవుతూ ఉంటారు...తద్వారా భంగపాటుకు గురై అసూయతో రగిలిపోతుంటారు....

ఒక చిన్న ఎగ్సాంపుల్ తో వీటి మధ్యన ఉండే అంతరాన్ని, వీటిలోని ఆంతర్యాన్ని వివరించే ప్రయత్నం గావిస్తాను......

ఫర్ ఎగ్సాంపుల్......
ఒక వ్యక్తి తన హ్యాపి బర్త్డే నో లేక మరేదో ఫంక్షన్ కేవలం ఒక 10 మంది ఇంటి సభ్యులతో మరియు ఒక 10 మంది సహృదయులైన మితృలతో/శ్రేయోభిలాషులతో మాత్రమే జరుపుకోవడానికి నిశ్చయించుకొని...
తరువాత వచ్చే ఏదో ఒక ఆదివారం నాడు మిగతా ఇతర వంద మందిని కూడా ఆహ్వానించి లంచ్ / డిన్నర్ విందును ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాడని అనుకుంటే గనక.....

1. ఇంగితం : అనగా...
"అతను మనల్ని పిలవట్లేదు అంటే మన మనసులో ఉన్న అసూయ అనే విషమంతా కూడా ఒక నిపుణుడైన డాక్టర్ గారిచే స్కాన్ చేయబడి చదవబడిన X రే ఫిల్మ్ లా అతడు చదివేసాడన్నమాట....."
అనే విషయాన్ని గ్రహించి నోరు, ఒళ్ళు దెగ్గరపెట్టుకొని మసులుకోవడం......

2. విచక్షణ : అనగా....
వారిని కూడా పిలువు అని ఎవరో పదేపదే నసపెడితే చెప్పి చెప్పన్నట్టుగా చెప్పాడు కాబట్టి శుభమాని అతను హ్యాపి బర్త్డే ఫంక్షన్ చేస్కుంటుంటే మనం వెళ్ళి అతడి సాడ్ ఫేస్ కి కారణం కావడం ఎందుకులే అనే లౌక్యం తో అలోచించి అతడు ఏదో పెడసరిగా పిలిచాడు కాబట్టి, తర్వాత లంచ్ పార్టీకి వస్తాంలే, అని చెప్పి రాకుండా ఉండగలగడం.....

3: మరియాద...అనగా....
" అతని హ్యాపి బర్త్డే ఫంక్షన్ అతని ఇష్టం...
మనం ఎందుకు వాళ్ళని పిలవవా...వీళ్ళని పిలవవా...
అంటూ అతణ్ణి చిరాకుపెట్టడం....
మనల్ని పిలిస్తే వెళ్ళిరావడం అనేది మన విహిత ధర్మం కాబట్టి హుందాగా వెళ్ళిరావడం వరకే మన పరిధి.....
ఎవరెవరు ఆహ్వానింపబడతారు అనేది మనకి సంబంధించని అతని స్వవిషయం...."
అని అలోచించగలగడం....

4. గౌరవం : అనగా....
"ఎంతో మరియాదతో ఆహ్వానింపబడగా అతని హ్యాపి బర్డే ఫంక్షన్ కి వచ్చాం కాబట్టి....
హాయ్....హలో...హవ్ ఆర్ యు...ఎట్లున్నావ్...అంటూ ఏవో క్యాజువల్ టాపిక్స్ మాత్రమే మాట్లాడి అతడికి చిరాకు కలిగించే వివాదభరిత అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకుండా.....
తిన్నామా....ఫొటోలు దిగామా....కాసేపు సేదతీరామా.....
ఏవో కాలక్షేపకబుర్లు చెప్పుకున్నామా....తిరిగొచ్చామా...."
అన్నట్టుగా నడుచుకోవడం.....

5. స్వాభిమానం : అనగా....
పైన పేర్కొనబడిన 4 విభాగాలను కూడా క్షుణ్ణంగా తర్కించి....
కాలచక్రాన్ని ఓ 30 సంవత్సరాల వరకు వెనక్కి తిప్పి,
అతడిపట్ల మన గౌరవం, సంస్కారం, పరస్పరమరియాదాభరిత వైఖరి ఎవ్విధంగా ఉండెను....
అనే అంతర్వివేచనను సలిపి..... 
మనం అతడి హ్యాపి బర్త్డే ఫంక్షన్ కి వెళ్తే అతడి చిరునవ్వుకి కారణం అవుతామా....లేక...
అతడి మాడ్పుమొహానికి కారణం అవుతామా.....
అనే విషయం గురించి అవగాహన కలిగి ఉండి లౌక్యంతో వ్యవహరించగలగడం....

క్లుప్తంగా ఇదన్నమాట వీటి మధ్యన ఉండే అంతరం...మరియు వీటిలోని ఆంతర్యం....
ఇది ఆకళింపుజేసుకున్న వారు మాత్రమే విజ్ఞ్యులు అని అనబడుదురు....

No comments:

Post a Comment