Thursday, March 16, 2023

ఆనాటి కల నాదే....ఈశ్వరానుగ్రహమైన శాశ్వతమైన కళ నాదే....నా కళతో నా కలను నిజం గావించుకునే కళాత్మక జీవితం నాదే....ఆదరించి గౌరవించే ఉత్తములకు మనస్పూర్తిగా నమస్కరిస్తాను....అడ్డుపడే అడ్డగాడిదలకు వారి భాషలోనే సమాధానం ఇస్తాను.....

""శ్రీకరమైన పరమేశ్వరుడికి వివిధ పండ్లు, పంచామృతాలు, డైఫ్రూట్స్, అన్నీ కలగలిపిన పదార్ధమొత్తం తో అభిషేకం  గావిస్తే....,
[[ 288.58658136 + 138.079704 = 426.66628536 ]] కిలోల వరకు ఫ్రూట్సలాడ్ అభిషేక ప్రసాదం  ఈశ్వరానుగ్రహంగా లభించింది...
ఈశ్వరానుగ్రహంగా పలు రెట్లు హెచ్చింపబడవచ్చును...
పరమేశ్వర సంకల్పానికి సమకూరనివి ఏముంటాయ్ గనక....! ) ""
అనే ఒక భావనాత్మక తురీయావస్థలో ఉన్న ఒక భక్తుడు.....
"ఈశ్వరానుగ్రహం తో సమకూరిన ఈ అభిషేక ప్రసాదం, చిటికెల చండీశ్వరుని అనుమతితో, మొత్తం నేనే ఆరగిస్తాను.....
నా నిజమైన శ్రేయోభిలాషులకు మాత్రమే అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇస్తాను....",
అని అనుకోవడం అతనికి దైవప్రసాదితమైన, 
రాజ్యాంగబద్ధమైన హక్కు.....కాదని ఓర్వలేని ఏ గుంటనక్క కూడా అనడానికి వీల్లేదు.....

అభిషేకం చేయించిన మహనీయులకు లేని బాధ.......
అభిషేకం చేసిన భక్తుడికి లేని బాధ.......
అభిషేక ద్రవ్యాలు దానంగా ఇచ్చిన గొప్ప గొప్ప దాతలకు లేని బాధ.......,
భారతదేశంలో జన్మించడం ఒక గొప్ప భాగ్యంగా భావించి, సద్గురువుల అనుగ్రహంతో సవైదిక సశాస్త్రీయ అభిషేక ప్రక్రియ గురించి సరిగ్గా తెలుసుకొని జీవితంలో ఒక్కసారైనా సరిగ్గా అభిషేకం చేయని ఔలగాళ్ళకెందుకు ఇతరుల ఉన్నతి గురించిన బాధ.....

ఇతరుల్లోని ఏఒక్క గొప్పదనం కూడా గుర్తించి మనస్పూర్తిగా నమస్కరించలేని పొగరుబోతులకు......

ఇతరులు మనకంటే ఎన్నో విషయాల్లో ఉన్నతంగా ఉండగలరు అనే భావవైశాల్యం, మేధోపరిణత లేని అధములకు......

మనం ఏ ఉన్నతిని కల్పించకపోయినా సదరు వ్యక్తికి ఇతర మాన్యులు కల్పించే ఉన్నతికి అడ్డుపడరాదు అనే ఇంగితం లేని కుళ్ళుబోతులకు......

జీవితంలో ఉత్తమమైన జీవనప్రమాణాల పట్ల అవగాహన మరియు అభివృద్ధి పట్ల దూరదృష్టి లేని మందబుద్ధులకు......

ఇతరులు స్వాధ్యాయం తో సముపార్జించుకున్న వివిధ దైవికమైన, ఉన్నతమైన అంశాల పట్ల కనీస ఆదరభావం కూడా లేని అడ్డగాడిదలకు.....

ఇప్పుడు బానే గుర్తొస్తాయి అనవసరమైన సలహాలు, సూచనలు.......

కొందరు కుళ్ళుబోతు వెధవలు పందికొక్కుల్లా పడిదోచుకోవడంకోసం,
గంగా తీర్థస్నానానికి కాశి క్షేత్రానికి విమానంలో ప్రయాణించవలసిన ఒక భక్తుడిని, ఎర్రబస్సు/ఊరుబస్సులో వెళ్ళమని సలహా ఇవ్వడంలోని ఆంతర్యం కూడా అర్ధంచేసుకోలేనంతటి అవగాహనా రాహిత్యంతో ఉంటడా సదరు విజ్ఞ్యుడైన భక్తుడు...?

ఆనాటి కల నాదే....
ఈశ్వరానుగ్రహమైన శాశ్వతమైన కళ నాదే....
నా కళతో నా కలను నిజం గావించుకునే కళాత్మక జీవితం నాదే....
ఆదరించి గౌరవించే ఉత్తములకు మనస్పూర్తిగా నమస్కరిస్తాను....
అడ్డుపడే అడ్డగాడిదలకు వారి భాషలోనే సమాధానం ఇస్తాను.....

క్రింద గోతులు తీసి పైన ఎండుగడ్డి పరచి ఒక ఏనుగును రారా...అంటూ పిలిస్తే అది చదువుకోని ఎడ్డి ఏనుగైతే వచ్చి మీ గోతిలో పడ్తదేమో కాని.....
రోజుకు 90 కిలోమీటర్లు ఒళ్ళు హూనమయ్యే ఊరుబస్సుల్లో ప్రయాణించి,
21వ ప్రాయంలోనే 3 బహుళజాతీయ సంస్థల 
(టీసీఎస్, అక్సెంచర్, కంప్యూటర్ అస్సొసియేట్స్)
నుండి ఆహ్వానపత్రములను అందుకొన్న ఇంజనీరింగ్ గ్రాడ్యూయెట్ ఇన్ డిస్టింక్షన్ (80.99%) గా గౌరవింపబడి, 
వివిధ సాంకేతిక విద్యలను అభ్యసించడం కోసం
సహృదయులైన ఉన్నతాధికారులచే ఒక్కడే అమెరికాకు పంపించబడి, జీవితంలో ఎంతో పరిశ్రమించి అభ్యున్నతిని సాధించిన శ్రామికజీవిగా బ్రతికిన ఏనుగు కూడా మీ సంకుచిత స్వభావ గోతుల్లో వచ్చి పడాలి అని అనుకోవడం మీ మూర్ఖత్వమే అవుతుంది......

No comments:

Post a Comment