Monday, December 22, 2025

శ్రీ క్రోధి నామ 2024 సంవత్సర మార్గశిర మాస విశేష ఆర్ద్ర శ్రీరుద్రాభిషేక శుభాభినందనలు....💐🙂మరియుచాంద్రమాన మార్గశిర మాసాంతర్గత సౌరమాన ధనుర్మాస / మార్గళి శ్రీవ్రతం / తిరుప్పావై ఆరాధనోత్సవ శుభాభినందనలు...💐😊

మరియు
చాంద్రమాన మార్గశిర మాసాంతర్గత సౌరమాన ధనుర్మాస / మార్గళి శ్రీవ్రతం / తిరుప్పావై ఆరాధనోత్సవ శుభాభినందనలు...💐😊

1.రామేశ్వరం శ్రీరామనాథస్వామి
2. శ్రీశైల శ్రీమల్లికార్జున 
3. భీమశంకర
4. ఘృష్ణేశ్వర
5. త్రయంబకేశ్వర
6. సోమనాథ
7. ద్వారక నాగేశ్వర
8. ఓంకారేశ్వర-అమలేశ్వర
9. ఉజ్జయిని మహాకాళ
10. దేవఘర్ వైద్యనాథ
11. వారణాశి విశ్వేశ్వర
12. కేదార్‌నాథ్‌ కేదారేశ్వర

అనే 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను, మరియు

1. చిదంబర ఆకాశలింగం
2. శ్రీకాళహస్తి వాయులింగం
3. అరుణాచల/తిరువణ్ణామలై అగ్నిలింగం
4. జంబుకేశ్వర/తిరువానైకోవిల్ జలలింగం
5. కాంచీపుర ఏకామ్రేశ్వర పృథ్వీలింగం
6. కోణార్క్ సూర్యలింగం
7. సీతాకుండ్ చంద్రలింగం
8. నేపాల్ పశుపతినాథ్ యాజమానలింగం

అనే (5+3=8) పంచభూత / అష్టమూర్తిత్త్వ లింగాలను,

దర్శించి ఈశ్వరుణ్ణి సేవించడం ఎంతో అరుదైన జన్మాంతర పుణ్యదాయక విశేషం అని మన సనాతన విజ్ఞ్యుల ఉవాచ...

శ్రీచాగంటి సద్గురువుల ప్రహృష్టవచనాల్లో ఈ పుణ్యక్షేత్రాల వైభవాన్ని మరింత ఘనంగా అందుకొని తరించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా...

జీవితపర్యంతమూ కొనసాగే ఉపాసనలో భాగంగా,
10 సంవత్సరాలతో ఆరంభమయ్యే కౌమారదశలో,
20 సంవత్సరాలతో ఆరంభమయ్యే యవ్వనదశలో,
30 సంవత్సరాలతో ఆరంభమయ్యే ప్రౌఢదశలో,
40 సంవత్సరాలతో ఆరంభమయ్యే చత్వారదశలో,
50 సంవత్సరాలతో సంపూర్ణమయ్యే ఆరోగ్యజీవితదశలో,
60 సంవత్సరాలతో మొదలయ్యే అనారోగ్యజీవితదశలో,
70 సంవత్సరాలతో మొదలయ్యే జీవిత చరమదశలో,
80 సంవత్సరాలతో మొదలయ్యే వార్ధక్య దశలో,
90 నుండి జీవితం సంపూర్ణంగా సమాప్తమై ఈశ్వరసాయుజ్యంతో సార్ధక్యం చెందవలసిన చిట్టచివరిదశవరకు....,

వారివారి చిత్తశుద్ధిభరిత సాధనకు అనుగుణంగా ఈశ్వరుడు మనతో మౌనంలో ఎంతగానో మమేకమై తన పరమాత్మ తత్త్వాన్ని ఎరుకపరుస్తూనే ఉంటాడు...

కాని మనకు జీవితంలో తగినంత తీరిక దొరక్క,
చదువులని, వ్యవసాయ ఉద్యోగ వృత్తి వ్యపారాలని, పెళ్ళి, పిల్లలు గృహస్థాశ్రమ ధర్మాలని, ఆల్మోస్ట్ జీవితం మొత్తం కూడా మనకోసం మరియు మనవారనుకున్న వారికోసం, 
ఎంతో బిజిబిజిగా గడిచిపోతూ ఉంటుంది....

విచిత్రం ఏంటంటే మనకు అందరికంటే కూడా ఎంతగానో ఆప్తుడైన ఈశ్వరుడికోసం అలోచించే తీరికలేని జీవిత ప్రయాణంలో మన పాపపుణ్యాలు దుఃఖలేముల సుఖసంపదల  రూపంలో మరుగౌతూ, ఆగామిరూపంలో సంచితకర్మల లెక్కలు సవరింపబడుతూ తుదిలేని పయనంలా సాగే జీవయాత్రలో సంభవించే జన్మలగురించి ఏ అలోచనాలేకుండా జీవితాన్ని కేవలం జీవించడం....
అంటే మన మసులో ఉండవలసిన ఆర్ద్రత / తడిలేని కారణంగా పొడిబారిన జీవితంలో, ఈశ్వరచింతన గురించి ఏనాడు కూడా ఒక ఎరుక అన్నది కలగడంలేదు అని అర్ధం...

వృత్తిప్రవృత్తులు వేరైనా, వేశదేశభాషలు వేరైనా,
జనులందరి జీవిత ప్రయాణాలు దాదాపుగా ఒకేవిధంగా ఉండేవే...
మీరు జాగ్రత్తగా గమనిస్తే...
మెలకువ, పరిశ్రమ, సంపాదన, వినిమయం, శరీరపోషణతోషణ, విశ్రాంతి, జిజ్ఞ్యాస, నిద్ర 
అనే ఈ 8 అంశాల్లో ఎల్లరిజీవితం మొత్తం ముగిసిపోతూ ఉంటుంది....
కేవలం ఈశ్వరానుగ్రహం వల్ల, భక్తభాగవతానుగ్రహంవల్ల మాత్రమే సంభవించే విశేషం ఏంటంటే...
జీవితంలోని 'జిజ్ఞ్యాస' అనే ప్రక్రియ భగవంతుడివైపుగా కూడా కొనసాగడం...
ఈ ఒక్క అంశం మాత్రమే మనిషి యొక్క ఉన్నతిని సమూలంగా ప్రభావితంచేసే అంశం అని అనడం అతిశయోక్తి కానేరదు.... అది కేవలం అధ్యాత్మమార్గంలో విచారణసాగించే విజ్ఞ్యులకుమాత్రమే బాగా అర్ధమయ్యే అంశం...

అట్టి అధ్యాత్మమార్గంలో విచారణసాగించి జీవితంలో నలుగురికి ఆదర్శంగా నిలిచి, తరించిన మాన్యులను స్ఫూర్తిగా గావించి ఒక సామాన్యుడు కూడా అట్లే మాన్యుడై తరించడం అనేది అధ్యాత్మమార్గంలోని వైభవం...

అది ఇతర మార్గాల్లో అంతగా అన్వయమవ్వని అంశం...
అనగా...

'ఫలాన వ్యక్తిలా నేను కూడా జీవితం మొత్తం సినిమాల గురించిన వ్యాపకంతోనే ప్రయాణించాను...
ఇప్పుడు నేనొక సినిమాహీరో గా తరించి ఎందరినో తరింపజేస్తున్నాను...'
అని అనడం అందరికీ అన్నివేళలా కుదరదు...

'ఫలాన వ్యక్తిలా నేను కూడా జీవితం మొత్తం ఫలాన వృత్తి, ప్రవృత్తి, వ్యాపారాల, గురించిన వ్యాపకంతోనే ప్రయాణించాను...
ఇప్పుడు నేను తరించి ఎందరినో తరింపజేస్తున్నాను...'
అని అనడం అందరికీ అన్నివేళలా కుదరదు...

'ఫలాన వ్యక్తిలా నేను కూడా జీవితం మొత్తం ఊరపందిలాతింటూ, రోడ్లమీద తిరుగుతూ, అడ్డమైన పొట్లాలను నమిలి ఉమ్ముతూ, ఎందుకూ పనికిరాని వాటి గురించిన వ్యాపకంతోనే ప్రయాణించాను...
ఇప్పుడు నేను తరించి ఎందరినో తరింపజేస్తున్నాను...'
అని అనడం అస్సలు కుదరదు...

కాని...

'ఫలాన వ్యక్తిలా నేను కూడా జీవితం మొత్తం భక్తభాగవతుల పట్ల గౌరవమరియాదలతో మసులుకుంటూ ఈశ్వరుడి వైభవం గురించి తెలుసుకోవడం, అందులో భాగంగా ఎన్నో గొప్పగొప్ప ఉపయుక్తమైన విజ్ఞ్యానవిషయాలను నేర్చుకొని, జీవితానికి అన్వయించుకొని తరించి, మరెందరో విజ్ఞ్యులు తరించేందుకు కారణమై చక్కని పుణ్యార్జనతో, ఈశ్వరానుగ్రహంతో సార్ధక్యంచెంది, ఇతర మాన్యుల సార్ధక్యానికి ఇతోధికంగా సహయసహాకారాన్ని అందించి తరిస్తున్నాను...'
అని...అనడం.. అధ్యాత్మవిజ్ఞ్యులందరికీ కూడా అన్నివేళలా కుదిరేపనే....
అదే అధ్యాత్మమార్గం యొక్క విశేషం...!

శ్రీచాగంటి సద్గురువుల ఎంతో రసరమ్యమైన మాటల్లో అధ్యాత్మమార్గంలోని గొప్పదనం గురించి చెప్పాలంటే...

"ఒక సాధారణ భక్తుడు, ఈశ్వరుడి యొక్క మహత్తును తెలుసుకోవాలని, ఈశ్వరచింతనతో ప్రయాణించి, 
ఈశ్వరచింతనలో మనసు లయించి, ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరత్వాన్ని అందుకొని సోహం అనే స్థితిలో 
' తత్ త్వం అసి ' గా రూపాంతరంచెంది, అద్వైతసిద్ధిని గడించి 
ఈశ్వరుడిలోకి లయించి కైవల్యంచెందడం..."

అనేది...

"ఒక ఉప్పు బొమ్మ, సముద్రం యొక్క లోతును తెలుసుకోవాలని, సముద్రంలో ప్రయాణించి, 
సముద్రంలో కరిగి, సముద్రమే అయినవిధంగా సముద్రంలో లయించడం..."

అందుకే మన అధ్యాత్మ విజ్ఞ్యులు అన్నారు....
"మోక్షసాధనాసామాగ్ర్యాం భక్తిరేవగరీయసి..." అని....
మరి
"జ్ఞ్యానాత్ ఏవతు కైవల్యం..." 
"భక్తి జ్ఞ్యాన మార్గాలు రెండూ కూడా సమాంతర మార్గములు..."
అని కూడా అన్నారు కదా మన అధ్యాత్మ విజ్ఞ్యులు అని కొందరు అనొచ్చు....

ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే...
భక్తి జ్ఞ్యాన మార్గములు రెండూ కూడా భగవద్ తత్త్వ సన్నిధికి సమాంతర మార్గములే....
కాని అవి హారిజాంటల్ గా ఉండే ప్యారలెల్ / సమాంతర పాత్స్ కావు...
అవి వర్టికల్ గా ఉండే ప్యారలెల్ / సమాంతర పాత్స్....
అనగా, భక్తి మార్గము అనేది రోడ్డుపై మీరు, నేను ప్రయాణించే బైక్ ట్రావెల్ లాంటిది...ఎవరైనా కొంతపరిశ్రమతో భక్తి మార్గాన్ని అందుకొని తరించవచ్చు...
జ్ఞ్యాన మార్గము అనేది ఆకాశంలో ప్రయాణించే ఏర్ ట్రావెల్ లాంటిది...ఎంతోపరిశ్రమతో మాత్రమే జ్ఞ్యాన మార్గాన్ని అందుకొని తరించగలిగేది....

శ్రీ మల్లాది వారు, వారి అమృతమయమైన ప్రవచనాల్లో ఒకసారి చెప్పినట్టుగా...

భక్తిమార్గంలో భగవంతుడి పట్ల భక్తుడికి ఉండవలసిన సర్వోన్నతమైన భావనను,
శ్రీఆదిశంకరాచార్యులవారంతటివారే మనకు వారి షట్పదీ స్తోత్రంలో ఈ విధంగా అనుగ్రహించారు.....

..........................................................................
సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వమ్
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః 

ఓ నాథ, పరమ సత్యమును గ్రహించి నీకు నాకు భేదములేదు అను భావన కలిగినా కూడా, నేను నీకు చెందిన వాడినే కానీ నీవు నాకు చెందిన వాడవు కాదు.....
ఎలాగంటే సముద్రము తరంగముల లాగా......
తరంగములు సముద్రమునకు చెందినవి కానీ సముద్రము తరంగమునకు చెందదు కదా...
..........................................................................

కాబట్టి నిత్యం సముద్రంతో అనుసంధానమై ఉండి ఉవ్వెత్తున ఎగిసేఅలలా, భక్తి అనేది నిత్యం భగవంతుడిని ఆశ్రయించి ఉండగా ఉవ్వెత్తున ఎగిసే భగవద్ తత్త్వ భావనా విశేషం...

అందుకే సాక్షాత్తు శ్రీవిళ్ళిపుత్తూరులో, భూదేవి అంశలో, ఈ కలియుగంలో ప్రత్యక్ష శ్రీమహాలక్ష్మిగా ప్రభవించిన ఆండాళ్ / గోదాదేవి, పన్నిద్దరాళ్వార్లలో ఒకరిగా కీర్తినిగడించి అట్టి సర్వోన్నతమైన భగవద్భక్తిభావనతో వచించిన ముప్పది పాశురాలు, తిరుప్పావై / శ్రీవ్రతం అనే పేరుతో
లోకంలో విశేషంగా ప్రాచుర్యం పొందగా, ఇప్పటికీ "మాసానాం మార్గశీర్శోహం" అని గీతాచార్యుడై వచించిన పరమాత్మ, తన కలియుగ సన్నిధి అయిన శ్రీవేంకటాచల ఆనందనిలయంలో, తిరుప్పావై పాశురనివేదనాకైంకర్యంగా స్వీకరించి, సంతసించి భక్తులను విశేషంగా అనుగ్రహిస్తున్నాడు మన గోవిందుడు....

మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రం నాడు గావించే విశేష శ్రీరుద్రాభిషేకం గురించి శ్రీచాగంటి సదురువుల ప్రవచనాల్లో శ్రద్ధగా విని నేటి ఆర్ద్రాభిషేకంలో విశేషంగా తరించిన భక్తభాగవతులకు...మరియు ఇవ్వాళ ధనుర్మాసప్రారంభ సమయం కూడా అవ్వడం మరింత విశేషం కాబట్టి తిరుప్పావై పాశురాలను కూడా శక్తిమేర తెలుగు ముద్రణలో పఠించి తరించిన భక్తభాగవతులకు ధనుర్మాస పర్వసమయ 
శుభాభినందనలు తెలుపుతూ...

గోశాల ప్రయుక్త బిల్వవృక్ష ఛాయలలో కొలువైన శ్రీశ్రీనివాసుడి విశేష మహిమ్నతా వైభవంతో అలరారే...
హైదరాబాద్ కూకట్పల్లి వివేకానందనగర్ లోని 
శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేషమైన ధనుర్మాసారాధనోత్సవాలతో అలరారే గోదమ్మ సన్నిధిని దర్శించి నమస్కరించడం...,
మరియు
పరమేశ్వరపంచాస్యస్వరూపవైభవాన్ని దర్శింపజేసేవిధంగా నలువైపులా ద్వారాలతో అలరారుతూ, ఏకపానవట్టం పై ద్వాదశజ్యోతిర్లింగాలు కొలువై అభిషేకింపబడడం,
స్వామివారి వామభాగశక్తిగా అమ్మవారు శ్రీచక్రానికి అభిముఖంగా కొలువైఉండడం,
స్వామివారి దక్షిణభాగాన త్రిమూర్తులు కొలువైఉండడం, 
అనే విశేషాలతో అలరారే....
హైదరాబాద్ కూకట్పల్లి శ్రీచైతన్య జూనియర్ కళాశాల శ్రీనివాస కాంప్లెక్స్ సమీపంలోగల,
శ్రీభువనేశ్వరి సమేత ద్వాదశజ్యోతిర్లింగేశ్వరస్వామి వారి సన్నిధిలో ఆర్ద్రాభిషేకంతో తరించడం నా జన్మాంతర విశేషపుణ్యసౌభాగ్య హేతువు...🙂💐

ఓం నమఃశివాయ...🙏🙂💐
ఓం శ్రీవేంకటపరబ్రహ్మణేనమః...🙏🙂💐

No comments:

Post a Comment