Sunday, December 21, 2025

శ్రీ 2025 విశ్వావసు మార్గశిర శుద్ధషష్ఠి శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి పర్వసమయ శుభాభినందనలు...💐


మీలో ఎవరికైనా శ్రీసుబ్రహ్మణ్యవైభవం గురించి తెలుసుకోవాలంటే, కర్ణాటకలోని కుక్కే / కుక్షి శ్రీసుబ్రహ్మణ్యక్షేత్రాన్ని దర్శించండి......
(కుక్కే ఆదిశ్రీసుబ్రహ్మణ్య ఆలయాన్ని ముందుగా దర్శించండి).

స్ఫటికసదృశమైన స్వచ్ఛని కుమారధార నదిలో తీర్థస్నానం గావించి ఇప్పటికీ స్వామివారు మయూరవాహనారూఢులై
విహరించే అక్కడి కుమారపర్వతసానువుల్లో కొంతదూరం పాదయాత్ర గావించండి......
అక్కడి ప్రకృతిమొత్తం "ఓంశరవణభవ" అని నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది......
షట్కోణాకార రాళ్ళతో అలరారే అక్కడి రమణీయమైన ప్రకృతితో మమేకం అయ్యి ధ్యానించండి......

కేవలం శివపుత్రుడి చేతిలో మాత్రమే నిహతుడయ్యేలా వరాన్ని పొందిన తారకాసురుడి సమ్హారానంతరం చాలా అలసిఉన్న దండాయుధపాణిని సేదతీర్చిన అక్కడి ప్రకృతి ఒక పురివిప్పిన నెమలి విన్యాసంలా ఉండి మయూరారూఢ సాకార సుబ్రహ్మణ్యమూర్తిగా ఆ కుమారపర్వతం శ్రద్ధాపూర్వక విజ్ఞ్యతగల భక్తులకు గోచరించును......

సర్పాన్ని తన పాదముల క్రింద దమించిన నెమలిని అధిరోహించే కార్తికేయ స్వరూపాన్ని ధ్యానించండి......
నెమలి అతిలోకసౌందర్యానికి ఆలవాలమైన భూగతపక్షిజాతికి చెందిన ప్రాణి...
(కోడి, పావురం, పిట్ట, నెమలి, ఇత్యాదివి ఎప్పుడూ భూమికి దెగ్గరగా మాత్రమే విహరించే పక్షిజాతి ప్రాణులు... 
అనగా లోవర్ ట్రోపోస్ఫియర్ ని దాటి వెళ్ళని పక్షులు...)

వీటన్నిట్లోకి నెమలి పెద్దది మరియు అత్యంత ఆకర్షణాత్మక పక్షి....
అటువంటి నెమలి ఎంతో అందమైన నిత్యవికసిత భూలోక
ప్రకృతికి ప్రతీక....
సర్పం ప్రాకృతిక దోషానికి ప్రతీకగా ఉటంకింపబడే సరీసృప ప్రాణి...

ఫర్ ఎగ్సాంపుల్...,
"సదరు వ్యక్తికి జాతకంలో కాలసర్పదోషం ఉందండి...ఫలాన పూజ చేస్తే నివారింపబడును...
ఓ 2000 పూజకు మరియు ఓ 500 పూజా సామాగ్రికి అవుతాయ్....."

అనే క్యాజువల్ డైలాగ్స్ విని ఉంటారు గాని...

ఫర్ ఎగ్సాంపుల్...,
"సదరు వ్యక్తికి జాతకంలో కోడి, పావురం, పిట్ట, ఎలుక, దోషాలు ఉన్నాయ్...ఫలాన పూజ చేస్తే నివారింపబడును..."
అనే క్యాజువల్ డైలాగ్స్ ఎవ్వరూ అనరు...

ప్రాకృతిక దోషాలకు నివారణ కూడా ప్రకృతినుండే లభించును...
అనగా ఫలాన చోట తిరుగుతుండగా ఫాలాన కలుపు మొక్క తగలడంతో ఒళ్ళంతా దురదతో ఇబ్బందిగా ఉంది...
అనే ప్రాకృతిక సమస్యకు...
ఫాలాన మొక్క ఆకులని నూరగా వచ్చే లేపనంతో ఉపశమనం లభించును...
అనే సమాధాన్ని జాగ్రత్తగా పరికిస్తే....

సమస్యకు కారణం ఒకవిధమైన ప్రకృతి...
సమస్యకు పరిష్కారం మరోవిధమైన ప్రకృతి...
అనగా ప్రకృతితో పొటమరించే సమస్యకు ప్రకృతిలోనే పరిష్కారం లభించును....
అనేది సాధారణ లౌకిక ప్రకృతిధర్మానికి సంబంధించిన అంశం...

ఇదే అంశాన్ని అధ్యాత్మకోణంలో పరికిస్తే...
దోషకారకమైన సకల తత్త్వములకు సర్పం ప్రతీక అయితే....
తత్ దోషాలను దమించి, లయించి, హరించే శక్తికి ప్రతీక నెమలి...
అట్టి మయూరాన్ని అధిరోహించి ఉండేది శక్తి అనే ఆయుధాన్ని ధరించిన శివపుత్రుడైన కార్తికేయస్వామి...
ఎవ్విధంగా కృత్తికా నక్షత్రం అగ్ని తత్త్వంతో అలరారుతూ ఉండునో......
అవ్విధంగా మయూరారూఢ కార్తికేయస్వామి కూడా అగ్ని తత్త్వంతో అలరారుతూ ఉండే పరబ్రహ్మస్వరూపం....
అనగా కార్తికేయస్వామి యొక్క ఆరాధన అగ్ని ఆరాధన యొక్క ఫలితాన్నే ఒసగును...
సకల అశుభాలను హరిస్తూ, శుభాలను ఒనరిస్తూ ఉండేదే మన సనాతనధర్మానికి జీవగర్రగా భాసిల్లే అగ్ని ఆరాధన....

అగ్నితత్త్వం / అగ్ని అరాధన యొక్క ప్రత్యేకతకు ఆలవాలమైన గౌణములతో ఉండే ఈ క్రింది నామములను మీరు
శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిలో గమనించవచ్చు...

ఓం అగ్నిజన్మనే నమః
ఓం పావకాత్మజాయ నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం తేజోనిధయే నమః
ఓం రోగనాశనాయ నమః

https://vignanam.org/telugu/subrahmanya-ashtottara-sata-namavali.html

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా, ఈ లోకంలో సనాతనవిజ్ఞ్యులెల్లరూ నిత్యం శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారిని పరోక్షంగా ఆరాధిస్తూనే ఉంటారు....

ఎందుకంటే...
1.గాణాపత్య
2.శైవ
3.శ్రీవైష్ణవ
4.శాక్తేయ
5.సౌర
మనబడే షణ్విధ దేవతారాధనా సంప్రదాయాన్ని అనుగ్రహించి షణ్మతస్థాపనాచార్య గా బిరుదాంకితులైన శ్రీఆదిశంకరాచార్యులు వ్యవస్థీకరించి అనుహ్రహించిన పంచాయతన దేవతామూర్తులు కొలువై ఉండే పూజగది సిమ్హాసనం ముందు ప్రతిఒక్కరూ దీపారాధనలో వెలిగించే త్రివర్తిసమ్యుక్త దీపం 6వ సంప్రదాయమైన కౌమారసంప్రదాయాధిదైవమైన కార్తికేయ స్వరూపమే కాబట్టి...

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా, శ్రీఅరుణాచలేశ్వరుడి నిత్యాంతరారాధనతో మూర్తీభవించిన చరరూప శ్రీఅరుణగిరి స్వరూపంగా ప్రభవించిన శ్రీ అరుణాచల రమణమహర్షి గారు కుమారస్వామి అంశతో ఈ కలియుగంలో ప్రభవించి వారి విహితకర్తవ్యాచరణను ఆచరించి వారి అంత్యకాలమున తనువుచాలించిన సమయంలో ఒక దేదీప్యజ్యోతిశిఖ వారినుండి వెలువడి పంచభూత అగ్నిలింగక్షేత్రమైన అరుణాచలేశ్వరుడి ఆలయం మీదుగా పయనించి అరుణగిరిశిఖరంలో ఐక్యమైన సంఘటనను దర్శించిన ఎందరో తిరువణ్ణామలై వాసులకు తెలిసినట్టుగా శ్రీఅరుణాచల పర్వతం మొత్తం కార్తికేయస్వరూపమైన అగ్నితత్త్వకారకపర్వతం....
ఈ కలియుగంలో ఈశ్వరానుగ్రహంగా జ్ఞ్యానాగ్నిగిరిగా శ్రీఅరుణాచలం భాసిల్లుతూ భక్తులకు విశేషమైన
అధ్యాత్మజ్ఞ్యానాన్ని ఆత్మజ్ఞ్యానంగా ఒసగుతూ "అరుణాచల గిరిప్రదక్షిణం" అనే అత్యంత అరుదైన అనుగ్రహంతో ఎందరో భక్తుల జీవితాల్లో అఘనాశక అనుగ్రహాన్ని ఒనరిస్తూ,
"స్మరణాత్ అరుణాచలే" అనే ఘనమైన నానుడితో ఎల్లరినీ విశేషంగా అనుగ్రహించే వరదైవం శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారు.......

మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ ।
మహీదేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలమ్ ॥ 

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేతశ్రీసుబ్రహ్మణ్యస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు......💐🙂🙏

No comments:

Post a Comment