Sunday, December 21, 2025

శ్రీకరమైన నవగ్రహాల వైభవం గిరించి కొంత పరికిద్దాం...


1.
గ్రహం : సూర్య
గ్రహదేవత : శ్రీసూర్యనారాయణుడు
అధిదేవత : అగ్నిదేవుడు 
ప్రత్యధిదేవత : శివుడు

2.
గ్రహం : చంద్ర
గ్రహదేవత : సోముడు 
అధిదేవత :  వరుణదేవుడు 
ప్రత్యధిదేవత : గౌరీదేవి

3.
గ్రహం : అంగారక
గ్రహదేవత : కుజుడు 
అధిదేవత :  పృథ్వీ 
ప్రత్యధిదేవత : క్షేత్రపాలుడు

4.
గ్రహం : బుధ
గ్రహదేవత :  బుధుడు 
అధిదేవత : శ్రీవిష్ణుదేవుడు 
ప్రత్యధిదేవత : శ్రీమన్నారాయణుడు

5.
గ్రహం : గురు
గ్రహదేవత : దేవగురు బృహస్పతి 
అధిదేవత : దేవేంద్రుడు 
ప్రత్యధిదేవత : చతుర్ముఖ బ్రహ్మగారు

6.
గ్రహం : శుక్ర 
గ్రహదేవత : శుక్రుడు 
అధిదేవత : శచీదేవి 
ప్రత్యధిదేవత : దేవేంద్రుడు

7.
గ్రహం : శని 
గ్రహదేవత : శనైశ్చరుడు 
అధిదేవత : ప్రజాపతి 
ప్రత్యధిదేవత : ధర్మదేవత, సమవర్తి, శ్రీ యమధర్మరాజుగారు

8.
గ్రహం : రాహు 
గ్రహదేవత : రాహువు 
అధిదేవత : పితృదేవతలు 
ప్రత్యధిదేవత : దుర్గామాత

9.
గ్రహం : కేతు 
గ్రహదేవత : కేతువు 
అధిదేవత : చతుర్ముఖ బ్రహ్మగారు 
ప్రత్యధిదేవత : న్యాయదేవుడైన శ్రీచిత్రగుప్తులవారు

ఏ నాయనా... ఇతఃపూర్వం ఒక పోస్ట్లో 
"శ్రీచాగంటి సద్గురువులు గ్రహాలకు ఈశ్వరత్వం లేదని నుడివారు...."
అని అన్నావ్ కద....మళ్ళీ ఇవన్నీ ఏంటి..?
అని అనుకునే కొందరికి..చిన్న వివరణ ఏంటంటే....

గ్రహాలకు ఈశ్వరత్వం లేదనేది వాస్తవమే....
ఈశ్వరానుగ్రహం వివిధ గ్రహాలకు వివిధ రీతుల సమకూరిఉండును అనేది కూడా వాస్తవం..., 
నవగ్రహ దేవతలను వివిధ రీతుల ఆరాధించే విజ్ఞ్యులకు, ఆయా గ్రహాలకు అమరే అట్టి వివిధ ఈశ్వరానుగ్రహ వైభవాలు వర్షింపబడును అనేది కూడా వాస్తవం...

ఫర్ ఎగ్సాంపుల్, ప్రతీరోజు అగ్ని ఆరాధన గావించే వారికి అగ్నిహోత్రులు గా వర్ధిల్లే అనుగ్రహం లభించును....
సూర్యగ్రహానికి అధిదేవత అగ్నిదేవుడు కాబట్టి, వివిధ రీతుల సూర్యోపాసన గావించే విజ్ఞ్యులు అగ్నిదేవుడి ఆరాధన యొక్క ఫలితమే అందుకొని తరింతురు అని అర్ధం....
అందుకే...
రామరావణ యుద్ధం తిలకించడానికి దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్య అగస్త్య మహర్షి వారు శ్రీరాముని సమీపించి నుడివిన సకల ఆరోగ్యదాయకమైన శ్రీఆదిత్యహృదయం లోని 23 వ శ్లోకంలో, 

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః !
ఏష ఏవాగ్ని హోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణాం !!

అని చెప్పబడింది...

రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియ (RBI)కి తప్ప, మరే బ్యాంకుకు కూడా కరెన్సి నోట్లను ముద్రించే అధికారం లేదు...అనేది వాస్తవమే.....
కాని వివిధ బ్యాంకులు వివిధ రీతుల అర్.బి.ఐ వారిచే ముద్రించి అందించబడిన కరెన్సి నోట్లను ఋణాలు, లోన్స్ రూపంలో వారివారి కస్టమర్లకు అందించుకునే వీలున్నది అనేది వాస్తవం...

అది బైక్ లోన్ అయినా, కార్ లోన్ అయినా, హోం లోన్ అయినా, పర్సనల్ లోన్ అయినా, మరే ఇతర విధమైన లోన్ అయినా, అది ఏ బ్యాంక్ నుండి లభించినా కూడా,
ఆ లోన్స్ తాలూకా ధనం అంతా కూడా ఆర్.బి.ఐ వారు ముద్రించే అధికారిక కరెన్సి నోట్ల ధనమే అని అర్ధం...

అందరూ అన్ని సేవలకు ఆర్.బి.ఐ వారి దెగ్గరికే వెళ్ళడం అన్ని వేళలా కుదరకపోవచ్చు.....
మనకు సమీపంలో ఉన్న బ్యాంక్ కు వెళ్ళి, ఆర్.బి.ఐ వారి ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించే సదరు బ్యాంక్ లో మనం లావదేవీలు గావించి వివిధ రీతుల తరించడం ఎవ్విధంగా ఒక లౌకిక వ్యవస్థో...,
అవ్విధంగానే, వివిధ గ్రహాలు వివిధ ఈశ్వరానుగ్రహన్ని సాధికారికంగా భక్తులకు అందించే మాధ్యమాలు గా వర్ధిల్లడం అనేది ఒక అలౌకిక ఖగోళ వ్యవస్థ యొక్క విశేషం.....అని విజ్ఞ్యులకు విదితమే..... 

అందుకే నవగ్రహహోమం, నవగ్రహశాంతి, నవగ్రహ నమస్కార ప్రార్ధనా శ్లోకాలు, నవగ్రహసంబంధిత నవధాన్యాలు, నవగ్రహసంబంధిత విలువైన రంగురాళ్ళు, ఇత్యాదిగా ఈ లోకంలో వివిధ రీతుల నవగ్రహారాధాన అనేది అనాదిగా ఆచరింపబడుతున్న ఒక అధ్యాత్మవిశేషం....

అట్టి గౌరవనీయ నవగ్రాహాలు, కొన్ని ఖగోళ విశేష అమరిక కారణాల రీత్యా భూలోక వాసులకు అప్పుడప్పుడు ప్రత్యక్షంగా వినువీధిలో దర్శనీయమైన రీతిలో ప్రకాశిస్తుండగా, వాటిని దర్శించి, నమస్కరించి తరించడం అనేది విజ్ఞ్యులకు ఈశ్వరానుగ్రహకారకమైన హర్షదాయక వ్యాపకం...

మనం శ్రీరమాసమేతసత్యనారాయణస్వామి వారి వ్రతాన్ని ఆచరించే ముందు, నవగ్రహాలను ఆరాధించడంలో ఆంతర్యం ఏంటంటే, ఆ క్రతువులో అప్పుడు అక్కడ మనం గావించిన కల్పోక్త ప్రకారేన ఈశ్వరారాధన, స్వామివారి అనుగ్రహంగా, నిత్యం మన కళ్ళెదుట ఆకాశంలో ప్రకాశించే నవగ్రహానుగ్రహంగా వర్షింపబడేందుకు కావలసిన ఈశ్వరానుగ్రహవైభవప్రోది అని అర్ధం....

సర్వం శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత,
శ్రీభూసహితశ్రీశ్రీనివాస శ్రీచరణారవిందార్పణమస్తు....🙏🙂💐

సూర్యేందు భౌమ బుధ వాక్-పతి కావ్య-సౌరి
స్వర్భానుకేతు దివిస్సత్-పరిశత్-ప్రధానాః ।
త్వద్దాసదాస చరమావధి దాసదాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥

అర్థం:

1.సూర్యుడు (సూర్యుడు), 
2.ఇందు (చంద్రుడు), 
3.భౌముడు (కుజుడు), 
4.బుధుడు (బుధుడు), 
5.వాక్పతి (వాక్కుల ప్రభువు లేదా బృహస్పతి ), 
6.కావ్యుడు (శుక్రుడు), 
7.సౌరి (శని)

8.రాహువు
9.కేతువు
(ఛాయాగ్రహాలుగా రూపాంతరం చెందిన అమృతాశనుడైన స్వర్భాను.)

అనబడే నవగ్రహాలు / దేవసభాసభ్యులు
నీకు దాసానుదాసూలై నమస్కరించుచున్నారూ...
ఓ గోవిందా, శ్రీవేంకటాచలప్రభు....
ఈ అందమైన ఉదయకాలంలో నీకు నమస్కారం....

No comments:

Post a Comment