Sunday, December 21, 2025

శ్రీ విశ్వావసు 2025 కార్తీక మాస బహుళత్రయోదశి పూర్వక ఇందువాసర ఈశ్వరారాధనాశుభాభినందనలు...🙂

ఈనాటి నాల్గవ కార్తీక సోమవారం నాడు,
చతుర్విధపురుషార్ధములను ఘనమైన రీతిలో అనుగ్రహించే
దేవేంద్రప్రతిష్టిత, సోమప్రతిష్టిత, శ్రీ సోమేశ్వరాలయం, కోటిఫలి (కాలక్రమంలో కోటిపల్లి), శివాలయ వైభవాన్ని కొంత పరికిద్దాం...
https://en.wikipedia.org/wiki/Kotipalli

4 అమెరిక డాలర్ కాసులు ఖర్చు పెడితే అక్కడ ఒక్క స్టార్ బక్స్ కాఫీ వస్తుంది.....
అవే 4 అమెరిక డాలర్ కాసులు ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకొని మన ఇండియన్ కరెన్సి లోకి మార్చుకుంటే, రమారమి 350 రూపాయలతో ఫుల్ ప్లేట్ అరటాకు బ్రాహ్మణ భోజనం తో పాటుగా ఓ 10 కాఫీలు కూడా వస్తాయ్......
దీన్నే దేశకాలవైభవం అని వచింతురు....
అనగా ఏ భూలోకప్రాంతంలో, ఏ కాలంలో ఎట్టి శక్తియుక్తివిత్త వినిమయం ఎట్టి ఫలితాలను అనుగ్రహించును....
అనే అంశంలో ఆరితేరిన ప్రజ్ఞ్యను ఈశ్వరానుగ్రహంగా కలిగిఉండడం....

శ్రీ చాగంటి సద్గురువులు వివరించినట్టుగా,
మన ఇంటిదెగ్గర ఉన్న శివాలయంలో చేసుకున్న సదరు పుణ్యం మనకు 100 మార్కుల పుణ్యసంచయాన్ని అనుగ్రహిస్తే...
అదే పుణ్యకర్మాచరణ కోటిఫలి శ్రీసోమేశ్వరాలయంలో గావిస్తే అందుకు కోటిరెట్ల ఫలితాన్ని ఈశ్వరుడు అనుగ్రహించడం అనేది ఈ మహిమాన్వితమైన కోటిఫలి తీర్థక్షేత్రవైభవం...

ఏ నాయన నీకు ఎక్కువగా అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆలయాల గురించి మాత్రమే దర్శనాలు, వ్యాఖ్యానాలు, జ్యోతకమౌతూ ఉంటాయా ఏంటి....అని కొందరు అనుకోవచ్చు....

దానికి గల కొన్ని కారణాలను కొంత వివరిస్తాను....

1. శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు శ్రద్దగా విన్నవారికి గుర్తున్నట్టుగా,
దక్షిణభారతావనిలో జీవనదులు సముద్రసంగమానికి దెగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఉండే ఆలయాలు బహువిశేషమైన మహిమ్నతతో వర్ధిల్లుతూ ఉంటాయ్..
ఉత్తరభారతావనిలో జీవనదుల ఉద్భవప్రదేశాల్లో ఉన్న ఆలయాలు బహువిశేషమైన మహిమ్నతతో వర్ధిల్లుతూ ఉంటాయ్..
అందుకే ఎక్కువగా అందరూ ఉత్తరాన చార్ ధాం యాత్ర అని గంగోత్రి, యమునోత్రి, బదరి, కేదార పుణ్యక్షేత్రాలను దర్శించడం....
మరియు దక్షిణాన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, లో ప్రవహించే జీవనదులైన, గోదావరి, కావేరి, నదుల సముద్రసంగమానికి దెగ్గరగా ఉండే పుణ్యక్షేత్రాలను దర్శించడం పారిపాటి...

2. అసంఖ్యాక పూర్వజన్మల స్మృతులు, వాసనలు, అనుగ్రహాలు, ప్రయాణాలు అట్టే ఎవ్వరినైనా లాగుతూ ఉంటాయ్ కద...
[
నాగార్జున గారు, విజయశాంతి గారు, నటించిన ఆనాటి ఆల్ టైం హిట్ మూవి "జానకిరాముడు" సినిమాలోని ఒకపాటలో ఉన్న ఈ క్రింది చరణపంక్తులహృదయంగా....

"కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలనీ
పాడవే (పాడవే) కోయిలా పాడుతూ పరవశించు జన్మజన్మలా
నా గొంతు శృతిలోనా (నా గుండె లయలోనా)"

3. భోక్త ఎవ్వరైనా, ఏ రాష్ట్రంవారైనా సరే...,
సంధ్యవార్చే సత్బ్రాహ్మణపాచకబృందం వండివార్చిన సన్నబియ్యం, బాస్మతి బియ్యం, తో అమృతమయమైన షడ్రసోపేత భోజనం చేసిన వారికి, ఇతర బియ్యం వంగడాలు అంతగా రుచించవు కద...
అందుకే, గోదావరి జీవనదీపరీవాహక ప్రాంతాల్లో, మరియు
గోదావరి జీవనది యొక్క సముద్రసంగమానికి దెగ్గరగా ఉండే ప్రాంతాల్లో, నెలకొన్న మహిమాన్విత స్వయంభూ ఆలయాలంటే విజ్ఞ్యులకు బహుప్రీతి....

ఈ కోటిఫలి క్షేత్రంలో, శివలింగాభిషేకానికి నిత్యం గంగ ఊరుతూ ఉండడం, ఎంత గంగాజలం బయటకు తీస్తే మళ్ళీ అంత గంగాజలం ఊరుతూ ఉండడం ఒక విశేషం...!

ప్రారబ్ధం తో పాటుగా సాగే విహితకర్మాచరణ ఆగామి కర్మసంచయరూపంలో నిత్యం మన సంచితకర్మసూచీని సవరిస్తూ ఉండును...
అనగా చేసుకున్న పుణ్యపాపాలకు ఫలితంగా సుఖదుఃఖాలు అనుభవించడానికి నిత్యం వివిధ జన్మలను ఎత్తుతూ ఉండే ప్రాణికోటి యొక్క కర్మచట్రవైభవాన్ని మనకు ఈ నిత్యం ఊరే గంగాజలం తెలియజేయును...

అలా ఎన్నోజన్మల్లో చేసుకున్న పుణ్యపాపాల ఫలితంగా ఈ జన్మలో, ఒక సంపన్నుడి ఇంట్లో ఉన్న ఒక కుక్క కూడా రాజభోగాలను అనుభవిస్తూ తన గత జన్మల పుణ్యాన్ని అనుభవించేస్తున్నది....
కాని కొత్తగా పుణ్యకర్మాచరణ గావించేందుకు వీలులేని జంతుజన్మలో ఆ జీవుడు ఉన్నది...

అట్టి స్థితి కలగకుండా, అనగా పుణ్యపాపముల ఫలితాలను అనుభవించడానికి ఎట్టి ఉపాధి లభించినా కూడా, కొత్తగా పుణ్యకర్మాచరణ గావించడానికి ఎల్లప్పుడూ వెసులుబాటు ఉండేలా, తగిన ఉన్నతమైన జన్మలను అనుగ్రహించేందుకు, శ్రీ సోమేశ్వరుడిగా పక్కనే గర్భాలయంలో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు....

ఏ మంచికార్యం నిర్వహించాలన్నా, ఏ పుణ్యకార్యం గావించాలన్నా అందుకు అత్యంత ఆవశ్యకమైనది మంచి మనసు...
"చంద్రమా మనసో జాతః..."
అని వేదవాక్కు...
అందుకే ఈశ్వరుణ్ణి సోమేశ్వరుడిగా ఆరాధించే వారికి, సోమవారం నాడు ఆరాధించే వారికి, సోమసంబంధమైన పుణ్యక్షేత్రాల్లో ఆరాధించేవారికి, విశేషమైన మంచి మనసు లభించడం, తద్వారా ఎన్నో మంచి కార్యాలకు వారి శక్తియుక్తివిత్తములు వినియోగమౌతూ ఉండును.....

ఎన్నో మంచి కార్యాలను నిర్వహించేందుకు మంచి మనస్సును, మనోబలాన్ని అనుగ్రహించే ఈశ్వరుడే మన ఏదో ఒక మంచి పుణ్యకర్మాచరణయందు గల చిత్తశుద్ధిని పరికించి,
సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య, మనెడి చతుర్విధ మోక్షాల్లో మనకు నచ్చే, తను మెచ్చే అత్యంత దుర్లభమైన మోక్షానుగ్రహాన్ని కూడా ఆ సోమేశ్వరుడు అనుగ్రహించును....
అని విజ్ఞ్యుల ఉవాచ...!

అందుకే, ఎన్నో నిగూఢమైన గహనమైన శక్తివంతమైన గౌణముల సమూహంగా ఉండే శ్రీరుద్రనమకఅష్టమానువాకం "నమః సోమాయచ" అనే ప్రారంభమయ్యేది....!!

నమః॒ సోమా॑య చ రు॒ద్రాయ॑ చ॒
నమ॑స్తా॒మ్రాయ॑ చారు॒ణాయ॑ చ॒
నమః॑ శం॒గాయ॑ చ పశు॒పత॑యే చ॒
నమ॑ ఉ॒గ్రాయ॑ చ భీ॒మాయ॑ చ॒
నమో॑ అగ్రేవ॒ధాయ॑ చ దూరేవ॒ధాయ॑ చ॒
నమో॑ హం॒త్రే చ॒ హనీ॑యసే చ॒
నమో॑ వృ॒క్షేభ్యో॒ హరి॑కేశేభ్యో॒
నమ॑స్తా॒రాయ॒
నమ॑శ్శం॒భవే॑ చ మయో॒భవే॑ చ॒
నమః॑ శంక॒రాయ॑ చ మయస్క॒రాయ॑ చ॒
నమః॑ శి॒వాయ॑ చ శి॒వత॑రాయ చ॒
నమ॒స్తీర్థ్యా॑య చ॒ కూల్యా॑య చ॒
నమః॑ పా॒ర్యా॑య చావా॒ర్యా॑య చ॒
నమః॑ ప్ర॒తర॑ణాయ చో॒త్తర॑ణాయ చ॒
నమ॑ ఆతా॒ర్యా॑య చాలా॒ద్యా॑య చ॒
నమః॒ శష్ప్యా॑య చ॒ ఫేన్యా॑య చ॒
నమః॑ సిక॒త్యా॑య చ ప్రవా॒హ్యా॑య చ ॥ 8 ॥

ఎన్నో పుణ్యక్షేత్రాల్లో సోమసంబంధంగా కొలువైన 
శ్రీసోమేశ్వరుడి అనుగ్రహంతో, 
ఈ నాల్గవ కార్తీక సోమవారం నాడు విజ్ఞ్యులెల్లరూ విశేషంగా అనుగ్రహింపబడి తరించెదరు గాక అని అభిలషిస్తూ,
ఓం నమఃశివాయ.....🙏💐🙂

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ ।
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 5 ॥

సర్వం శ్రీసోమేశ్వర, శ్రీరాజరాజేశ్వర స్వామి శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙂🙏


No comments:

Post a Comment