వింటే భారతం వినాలి...
అనే పాతకాలం నాటి సామెతకు అర్ధం...,
ఊరికే గారెలు తింటూ బొర్రలు పెంచుకుంటూ బ్రతకమని....,
మహాభారతంలో వారు అలా అన్నారు.....,
వీరు ఇలా అన్నారు....,
అనే మాటలతో బ్రతకమని కాదు అర్ధం....
గారెల్లో ఉండే మినుములతో గట్టి ఆరోగ్యాన్ని గడించి...
మహాభారతంలో ఉండే పాత్రల జీవితకథనంలో జరిగిన సంఘటనల్లో ఉండే ఘనమైన లౌక్యాన్ని గడించి జీవితంలో తరించమని....ఆ సామెతకు అసలైన అర్ధం...
అందుకే సంపూర్ణ శ్రీమద్భాగవత ప్రవచనాలను అనుగ్రహించి, ఆ సమయంలో ప్రవచనకర్తలవిహితగౌరవార్ధమై బహూకరింపబడిన ఒక పంచెలచాపు స్వీకరించడానికి కూడా ఎంతో బిడియపడిన బ్రహ్మవేత్తలుగా వర్ధిల్లే బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువులు అట్టి శ్రీమద్భాగవతకథాసుధామృతాస్మరణమననలహరుల్లోనే ఉండిపోకుండా....,
ఈ ఆధునిక కాలంలో కూడా ఎంతగానో వర్తించే భారత ఇతిహాస విజ్ఞ్యానం ఈతరం విజ్ఞ్యులకు కూడా అంది తరించాలని, శ్రీమహాభారతం ప్రవచనాలు కూడా అనుగ్రహించి, ఎంతో మంది అమాయకులుగా ఉండి మందిని ముంచి బ్రతికే ఆధునిక ధనబకాసుర వెధవల చేతిలో పరిహసింపబడకుండా గొప్ప మేలును ఒనరించారు...
నరనారాయణుల వృత్తాంతం, సహస్రకవచుడు, ఘటోత్ఖచుడు, శల్యుడు, కర్ణుడు, సైంధవుడు, గాంధారి, కుంతీదేవి, విరాటపర్వ ఉత్తరగోగ్రహణసమయౌచిత్యం, ఇత్యాదిగా ఎందరో / ఎన్నో మహాభారత వృత్తాంతాల నుండి అందుకొని తరించవలసిన విజ్ఞ్యానాంశములను శ్రీచాగంటి సద్గురువుల శ్రీమహాభారత ప్రవచనాల నుండి అందుకోవడం నా పురాకృత సుకృతం...
దూరం నుండి అగపడే సదరు పువ్వులను కొందరు మల్లెలు, జాజులు అని అనుకోవచ్చు...
ఇంకొందరు నందివర్ధనాలు, కాగడమల్లెలు అని అనుకోవచ్చు...
అది వారువారు పరికించే తీరు, పరికింపబడే దూరంపై ఆధారపడి ఉండే అంశం...
అదే విధంగా...
దూరంగా ఉండే సదరు వ్యక్తిత్వాలను కొందరు శ్రీకృష్ణార్జునులు అని అనుకోవచ్చు....
ఇంకొందరు దుర్యోధనకర్ణులు అని అనుకోవచ్చు....
అది వారువారు వివేచించే తీరు, విశ్లేషించే శైలిపై ఆధారపడి ఉండే అంశం...
సదరు వ్యక్తిత్వాలు శ్రీకృష్ణార్జునులుగా భావింపబడినా,
దుర్యోధనకర్ణులుగా భావింపబడినా..,
ఈ లోకంలో గుర్తించవసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, కర్ణశల్య వృత్తాంతం విన్నవారెవ్వరూ కూడా వారివారి జీవితాలకు శల్యుడి వంటి తోడేలు వ్యక్తిత్వాన్ని సారధిగా ఉండడానికి ససేమిరా అంగీకరించరు...
ఎందుకంటే....
సూర్యుడికి ఎదురుగా నిలవడం ఎంత దుస్సహమో....
సహజ స్వర్ణకవచకుండలధారి అయిన సూర్యపుత్ర కర్ణుడికి ఎదురుగా రణభూమిలో నిలవడం కూడా అంతటి దుస్సహమైన అంశం...
అప్రతిహత వీరుడైన కర్ణుడికే చిరాకు తెప్పించి రణభూమిలో రథచక్రాలు భూమిలో ఇరుక్కోవడంతో పరాభవం, అపజయం, నిధనం కలగడానికి కారణమైన శల్యసారధ్యంలో ఉండే వారి జీవితప్రయాణం మొత్తం పక్కలోబల్లెంలా ఉండే మూర్ఖప్రయాసే అగును...
శ్రీకృష్ణపరమాత్మ యొక్క సారధ్యంలో ఉండే పార్థునకు, విజ్ఞ్యులెల్లరినీ గౌరవించే ఫల్గుణుడికి, తన నీడను కూడా నమ్మని సవ్యసాచికి / అర్జునుడికి, దేవతలందరి అనుగ్రహం ఎల్లప్పుడూ వెంటే ఉండును...
అందుకే అర్జునుడికి గల వివిధ పేర్లను స్మరించినంతమాత్రాన ఉరిమే పిడుగులు కూడా తమంతతాముగా శాంతించును లేక మరోచోట ఉరుమును...
కాబట్టి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు ఎక్కడ ఉండాలో, ఏం తినాలో, మొదలైనవి కాదు...
ఎవరితో / ఎవరెవరి సారధ్యంలో ఉండాలో, ఏఏ విజ్ఞ్యానాంశాలతో ఏ సందర్భాన్ని ఎట్లు అధ్యయనం గావించి విజయపథంలో మున్ముందుకు సాగాలో....ఇత్యాదివి....
No comments:
Post a Comment