Manam Telugu Vaallam మనం తెలుగు వాళ్ళం
మహా భారతంలోని భీష్ముని జీవితానికి ప్రజా రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితానికి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. అవేమిటంటే..
1.ఇద్దరూ ఆజన్మ బ్రహ్మచర్యం పాటించినవారు.
2.భీష్ముడు శౌర్యం, అస్త్ర శస్త్రాల వల్ల ఎవరూ కురు రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కలాం కూడా మన శత్రు దేశాలు భయపడే ఆయుధ సంపత్తి ని మన దేశానికి ఇచ్చారు.
3.ఇద్దరూ పరోక్షంగా రాజ్యభారం మోసినవాళ్ళే. భీష్ముడు రాజ్యానికి సర్వసైన్యాధిపతి లాంటివాడు. కలాం కూడా రాష్ట్రపతి హోదాలో త్రివిధ దళాధిపతి గా వ్యవహరించారు.
4.ఇద్దరూ ఆచార్యులే. భీష్ముడు కురుపాండవులకు ఓ తాతగానే కాక గురువుగా కూడా వ్యవహరించాడు. అందుకే భీష్మాచార్యులు అని పిలిచేవారు. కలాం కూడా నిరంతర బోధకుడుగానే జీవించారు.
5.ఇద్దరూ తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే మరణించారు. భీష్ముడు యుద్ధం లో, కలాం విద్యార్థులకు బోధిస్తూ మరణించారు.
6.ఇద్దరు మరణించింది శుద్ధ ఏకాదశి రోజునే.
ఇలా పోలికలు ఉండడం యాధృచ్చికమే కావచ్చు, ఎందుకంటే కలాం ఎప్పుడూ తనకి భీష్ముడు ఆదర్శం అని చెప్పలేదు
No comments:
Post a Comment