Thursday, September 27, 2018

Jayamantram...!

Shree Raam Lakshman Jaanaki ... Jai Bolo Hanuman Ki !!
Paritala Gopi Krishna
వాల్మీక రామాయణం సుందరకాండలో 42వ సర్గలో 32 నుండి 36 వరకు గల నాలుగు శ్లోకాలు 'జయ మంత్ర'ముగా పేర్కొన్నారు పెద్దలు. ఆ శ్లోకములు మరియు అర్థము (విద్వాన్ డా. పమిడికాల్వ చెంచు సుబ్బయ్య)
33.
జయ త్యతిబలో రామో లక్ష్మణ శ్చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ||
34.
దాసో2హం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
35.
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ |
శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ సహస్రశః ||
36.
అర్దయిత్వా పురీం లంకామ్ అభివాద్య చ మైథిలీమ్ |
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
"మహాబల సంపన్నుడైన శ్రీరామునికి జయం! మహా పరాక్రమ సంపన్నుడైన లక్ష్మణుకి జయం! శ్రీరామునికి విధేయుడుగా ఉంటూ కిష్కింధారాజ్య ప్రభువైన సుగ్రీవునికి జయం! అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునికి నేను దాసుణ్ణి. వాయుపుత్రుణ్ణి. శత్రుసైన్యాలను హతమార్చేవాణ్ణి. నా పేరు హనుమంతుడు. వేయిమంది రావణులైన నన్ను ఎదిరించి, నిల్వలేరు. వేలకొలదీ శిలలతో, వృక్షాలతో రాక్షసులందరినీ, లంకాపురాన్నీ నాశనం చేస్తాను. నా కార్యం ముగించుకొని, సీతాదేవికి నమస్కరించి వెళ్తాను, చూస్తుండండి."
ఇక్కడ హనుమంతుని ఉత్సాహ వాక్కులు 'జయతి' అనే మాటతో మొదలయ్యాయి. ఇందులో రామ-లక్ష్మణ-సుగ్రీవులకు జయాన్ని కోరడం జరిగింది. జయమహామంత్రమైన ఈ నాలుగు శ్లోకాలను నిత్యం భక్తి-శ్రద్ధలతో పారాయణం (జపం) చేస్తే, సర్వత్రా జయం, బాహ్య-అంత-శత్రుత్వం మీద విజయం మరియు సకల కార్య సిద్ధి కల్గి, బౌతికంగా, ఆధ్యాత్మికంగా ఆనందజీవనులవుతారని పెద్దల సూచన.

No comments:

Post a Comment